sandhyarani
-
తీరికలేనప్పుడు ఎందుకొచ్చారు?
(విజయవాడ వరద ప్రాంతం నుంచి ‘సాక్షి’ బృందం) ముంపు ప్రాంతాల పర్యటనలో భాగంగా కండ్రిక, రాజీవ్‌నగర్ కాలనీలను పరిశీలించేందుకు వచ్చిన మంత్రులు సంధ్యారాణి, వంగలపూడి అనితలకు స్థానికుల నుంచి చేదు అనుభవం ఎదురైంది. వారిని చూడగానే ముంపు బాధితులు ఒక్కసారిగా ఫైర్ అయ్యారు. మూడ్రోజులుగా వరద నీటిలో అవస్థలు పడుతుంటే ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదని, కనీసం తాగునీరు, భోజన వసతులు కల్పించడంలో పూర్తి విఫలమయ్యారని మండిపడ్డారు. అనారోగ్యంతో ఉన్నవారిని సురక్షిత ప్రాంతానికి తరలించడానికి నానా అగచాట్లు పడుతున్నామని విరుచుకుపడ్డారు. రాజీవ్ నగర్, కండ్రిక, గుణదల వంద అడుగుల రోడ్డు, గుణదల ఫ్లిప్‌కార్ట్ గోదాము, బ్రిటానియా గోదాములతో పాటు గుణదల రోడ్డు వంటి ప్రాంతాల్లో సహాయక చర్యలులేక ఇబ్బందులు పడుతున్నామన్నారు. తీరికలేనప్పుడు రావడమెందుకు? మంత్రి సంధ్యారాణితో వచ్చిన ఆహార పొట్లాల వాహనాన్ని ఆమె చేతుల మీదుగా ఇప్పించేందుకు టీడీపీ శ్రేణులు యతి్నంచారు. అయితే, బాధితులు అప్పటికి భోజనంలేక మూడ్రోజులుగా ఇబ్బందులు పడుతుండటంతో ఆహార పొట్లాల వాహనం వద్దకు గుంపులుగా చేరుకున్నారు. దీంతో టీడీపీ వారు ఆహార పొట్లాలను గాలిలోకి ఎగరేయడంతో తీవ్ర విమర్శలపాలయ్యారు. ఇలా మంత్రులు కొద్దిదూరం ట్రాక్టర్‌పై వెళ్లి ఆ తర్వాత వెనుదిరిగారు. -
గిరిజనులకు ఇంటి వద్ద రేషన్ పంపిణీ నిలిపివేత
సాక్షి, అమరావతి: గిరిజన ప్రాంతాల్లో ఇకపై ఇంటి వద్దకు రేషన్ సరకులు రావు. గిరిజనులు రేషన్ షాపులకు వెళ్లి తెచ్చుకోవాల్సిందే. రాష్ట్ర గిరిజన, మహిళా, శిశు సంక్షేమ శాఖల మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఈ విషయం వెల్లడించారు. మంత్రి మంగళవారం గిరిజన సంక్షేమ శాఖపై సమీక్ష చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఇంటింటికీ రేషన్ పంపిణీ కార్యక్రమాన్ని నిలిపివేస్తామని, ఇకపై రేషన్ షాపుల ద్వారానే సరుకులు పంపిణీ చేస్తామని చెప్పారు. గిరిజన ప్రాంతాల్లో ఇంటింటికి రేషన్ అందించే మొబైల్ డిస్పెన్సరీ వాహనాలు (ఎండీయూ) వల్ల సమస్యలు ఉన్నాయన్నారు.అందువల్ల గిరిజనుల సౌలభ్యం కోసం ఏజెన్సీలోని 962 రేషన్ డిపోల ద్వారానే సరుకులు అందిస్తామని చెప్పారు. అంతర్జాతీయ గుర్తింపు కలిగిన అరకు కాఫీ అవుట్లెట్లను పెద్ద ఎత్తున విస్తరించి, డిమాండ్‌ను మరింతగా పెంచుతామన్నారు. గిరిజన సహకార సంస్థ (జీసీసీ) అందించే తేనె, ఇతర ఉత్పత్తుల నాణ్యతపై దృష్టి పెడతామని చెప్పారు. జీసీసీ పరిధిలోని 16 పెట్రోల్ బంకులు, 18 గ్యాస్ డిపోలు, 12 సూపర్ మార్కెట్ల ద్వారా మరింత మెరుగైన సేవలు అందిస్తామన్నారు. మెగా డీఎస్సీతో 16,347 టీచర్ పోస్టులు వస్తున్నాయని, వాటిలో 2 వేలకుపైగా పోస్టులు గిరిజన ప్రాంతాల్లో భర్తీ అవుతాయని చెప్పారు. దీంతో గిరిజన ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత తీరుతుందన్నారు. గిరిజన పాఠశాలల్లో విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణ కోసం 554 ఏఎన్ఎంలను డిప్యుటేషన్‌పై నియమిస్తున్నట్టు తెలిపారు. గిరిజన వసతి గృహాల్లో స్డడీ అవర్స్ పెడతామన్నారు. గిరిజన విద్యాలయాల్లో బాలికల రక్షణ కోసం ఫిర్యాదుల బాక్స్ పెడతామన్నారు. ఫిర్యాదు చేసిన విద్యారి్థని పేరు గోప్యంగా ఉంచుతామని, వేరే ప్రాంత అధికారులతో విచారణ చేయిస్తామని చెప్పారు. గిరి శిఖర గ్రామాల ప్రజలకు తక్షణ వైద్య సేవల కోసం ఫీడర్ అంబులెన్స్‌లు, ప్రసవం అనంతరం సురక్షితంగా గమ్యానికి చేర్చేందుకు తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌లను ఏర్పాటు చేస్తామన్నారు. వంద రోజుల్లో గంజాయికి చెక్ పెట్టేందుకు కృషి చేస్తామని మంత్రి చెప్పారు. -
భంగపడ్డ మహిళా నేత ‘రాఖీ’ అస్త్రం.. వర్క్‌వుట్ అవుతుందా?
ప్రతీ పండుగా ఓ సెంటిమెంటే.. ఎన్నికల కాలంలో ప్రతీ సెంటిమెంటూ ఓ రాజకీయాస్త్రమే. అలాంటి ఆసక్తికర సెంటిమెంట్ రాజకీయాలకు ఇప్పుడు రాఖీ పండుగా ఓ అస్త్రంగా మారుతోందక్కడ. బీఆర్ఎస్ టిక్కెట్ ఆశించి భంగపడటంతో పాటు.. సిట్టింగ్‌పై తిరుగుబావుటా ఎగరేసిన ఆ మహిళా నేత.. అవసరమైతే బీఆర్ఎస్ రెబల్‌గా.. ఇండిపెండెంట్‌గా బరిలో నిలవాలని యోచిస్తున్నారట. అందుకే.. ఇప్పుడక్కడ రాఖీలు కడుతూ.. కార్మిక క్షేత్రంలో సోదరభావాన్ని పెంచే యత్నం చేస్తోంది ఆ మహిళామణి. రామగుండంలో రాజకీయాలు చాలాకాలంగా హాట్ హాట్‌గా సాగుతున్నాయి. ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే చందర్‌కు టిక్కెట్ ఇవ్వొద్దని కొందరు అసమ్మతి నేతలు తిరుగుబాటు ప్రకటించినా.. మంత్రి కేటీఆర్ ఆశీస్సులతో గులాబీ బాస్ చందర్‌కే టిక్కెట్ కన్ఫర్మ్ చేశారు. అయితే, మంత్రుల బుజ్జగింపులతో కొంత సద్దుమణిగినట్టు తాత్కాలికంగా కనిపించినా.. అసమ్మతి నేతల్లో ఆ జ్వాలలు మాత్రం ఆరడం లేదు. అందులో పాలకుర్తి జెడ్పీటీసీ, బీఆర్ఎస్ ఆశావహ నేత కందుల సంధ్యారాణిది కూడా కీలకపాత్రే. అయితే, చందర్‌కు టిక్కెట్ కేటాయించాక.. ఆయన అనుచరులు ఆమెను కించపర్చే విధంగా పోస్టులు పెడుతున్నారంటూ వారం క్రితం సోషల్ మీడియాలో తన ఆవేదన వ్యక్తం చేస్తూ వీడియోస్ కూడా పోస్ట్ చేసిన సంధ్యారాణి.. ఇప్పుడు రామగుండంలో బీఆర్ఎస్ రెబల్‌గా బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యారు. ( ఫైల్ ఫోటో ) అవసరమైతే ఇండిపెండెంట్‌గా కూడా బరిలో ఉండేందుకు సిద్ధపడుతున్న నేపథ్యంలో.. సంధ్యారాణి ఇప్పుడు రాఖీపండుగ సెంటిమెంట్‌ను ఉపయోగించుకుంటోంది. కార్మిక క్షేత్రమైన సింగరేణిలో వివిధ సంఘాలకు సంబంధించిన నాయకులతో పాటు.. ప్రతీ గనిలో పర్యటిస్తూ తనకు మద్దతు ప్రకటించాలంటూ రాఖీ కడుతూ సోదరభావంతో కూడిన సెంటిమెంట్ ను వారిలో తీసుకొస్తున్నారు సంధ్యారాణి. చదవండి: అత్తమీద కోపం.. అల్లుడిపై ప్రతాపం మొత్తంగా ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయాలు రంజుగా మారుతున్న క్రమంలో.. కొంత అసమ్మతి జ్వాలలు ఎగిసిపడుతున్న చోట అవి మరింత రక్తి కట్టిస్తున్నాయి. మరోవైపు నేతలు ఎవరికివారు ప్రజల మద్దతును కూడగట్టి వాటిని ఓట్లుగా మల్చుకునే క్రమంలో ప్రతీ అంశాన్నీ తమకనుకూలమైన అస్త్రంగా మల్చుకునే యత్నాలు చేస్తూనే ఉన్నారు. పైగా ఇండిపెండెంట్లకు కూడా పెద్దపీట వేస్తూ.. ఎమ్మెల్యేలను మార్చే సంప్రదాయాన్ని కొనసాగిస్తున్న కోల్ బెల్ట్ ఏరియా రామగుండంలో ఆ సెంటిమెంట్‌ను అందిపుచ్చుకునేందుకు.. ఇప్పుడు రాఖీ సెంటిమెంట్‌తో ముందుకొచ్చారు కందుల సంధ్యారాణి. -
ఏపీ టెన్త్ ఫలితాలు విడుదల
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సంధ్యారాణి ఈ ఫలితాలను విడుదల చేశారు. మార్చి 18 నుంచి ఏప్రిల్ మూడో తేదీ వరకు 2,839 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా 6,21,634మంది విద్యార్థులు పదోతరగతి చదవగా వీరిలో 99.5 శాతం మంది పరీక్షలకు హాజరయ్యారు. మొత్తం 94.88 శాతం ఉత్తీర్ణత సాధించగా, బాలికలు (95.09), బాలుర(94.68)పై పైచేయి సాధించారు. తూర్పు గోదావరి జిల్లా (98.19) టాప్‌లో నిలువగా నెల్లూరు (83.19) జిల్లా చివరిస్థానంలో నిలిచింది. రాష్ట్ర వ్యాప్తంగా 11,690 పాఠశాలలకు చెందిన విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా, వారిలో 5,464 పాఠశాలల విద్యార్థులు నూరుశాతం ఉత్తీర్ణత సాధించారు. మూడు పాఠశాలల్లో సున్నాశాతం ఫలితాలు నమోదయ్యాయి. జీపీఏ 10 పాయింట్లతో 33,972 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. జూన్ 17 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. పదో తరగతి పరీక్ష ఫలితాలను కింది వెబ్సైట్లో చూసుకోవచ్చు... https://www.sakshieducation.com వీడియో: ఏపీ పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదల -
నేడు టెన్త్ ఫలితాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు మంగళవారం ఉదయం 11 గంటలకు విడుదల కానున్నాయి. పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సంధ్యారాణి ఈ ఫలితాలను విడుదల చేయనున్నారు. ఫలితాలను ఆయా పాఠశాల తమకు కేటాయించిన లాగిన్ ద్వారా కూడా తెలుసుకోవచ్చునని ప్రభుత్వ పరీక్షల డైరక్టర్ ఏ.సుబ్బారెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఫలితాలను గ్రేడ్లు, గ్రేడ్ పాయింట్లు, జీపీఏల్లో బోర్డు ప్రకటించనుంది. టెన్త్ ఫలితాలు ‘సాక్షిఎడ్యుకేషన్.కామ్’లో కూడా అందుబాటులో ఉంటాయి. -
‘కొత్తపల్లి’ కులంపై సంధ్యారాణి యూటర్న్
హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ఉపసంహరణ సాలూరు: అరకు ఎంపీ కొత్తపల్లి గీత గిరిజన మహిళ కాదని, గిరిజనులకు కేటాయించిన ఎంపీ స్థానంలో ఆమె తప్పుడు కులధ్రువీకరణ పత్రంతో పోటీచేసి గెలుపొందారని, ఆమె ఎన్నిక చెల్లదంటూ హైకోర్టులో కేసు దాఖలు చేసిన అప్పటి ఆమె ప్రత్యర్ది, ప్రస్తుత ఎంఎల్సీ గుమ్మడి సంధ్యారాణి తన పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు. రాజకీయ కారణంగా తలెత్తిన ఈ పరిణామంతో గిరిజన సంఘాల నాయకులు మండిపడుతున్నారు. గిరిజనులపట్ల తెలుగుదేశం పార్టీకి, ఆ నాయకులకు ఏమాత్రం గౌరవం, ఆదరాభిమానాలు లేవని, అందుకే లాబీయింగ్‌కే ప్రాధాన్యమిచ్చారనీ విమర్శిస్తున్నారు. ఈ విషయమై ఎంఎల్సీ సంధ్యారాణిని విలేకరులు ప్రశ్నించగా కేసు వాపసు తీసుకుంటున్న విషయం వాస్తవమేనని చెప్పారు. ముఖ్యమంత్రి ఆదేశాలతోనే ఈ నిర్ణయం తీసుకున్నారా అన్నదానికి మాత్రం ఆమె సమాధానం దాటవేశారు. -
అవయవదాన కుటుంబానికి ఆర్థిక సహాయం
- జగన్ పిలుపు మేరకు స్పందించిన ప్రవాస భారతీయులు - సాయం అందజేసిన జగన్ సాక్షి, హైదరాబాద్ : రోడ్డు ప్రమాదంలో గాయపడి మృతి చెందగా ఆయన అవయవాలను దానం చేసి ఐదుగురికి పునర్జన్మనిచ్చిన వ్యక్తి కుటుంబానికి అమెరికాలో ఉంటున్న ప్రవాస భారతీయులు కొందరు ఆర్థిక సాయం చేశారు. ప్రకాశం జిల్లా ఉలవపాడు గ్రామానికి చెందిన పెల్లేటి సుబ్బారెడ్డి (35) గత అక్టోబర్ 2వ తేదీన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. ఆయనను నారాయణ ఆసుపత్రిలో చేర్పించగా బ్రెరుున్‌డెడ్‌గా వైద్యులు ప్రకటించారు. నిరుపేద కుటుంబీకులైనప్పటికీ ఎంతో ఔదార్యంతో సుబ్బారెడ్డి అవయవాలను వారు దానం చేశారు. అయితే చిన్నపాటి పనులు చేసుకుంటూ జీవిస్తున్న సుబ్బారెడ్డికి భార్య శివకుమారి, తల్లి సుబ్బమ్మ, పిల్లలు సమీర (9 ఏళ్లు), జశ్వంత్ (7) ఉన్నారు. వారిది నిరుపేద కుటుంబం కావ డం, ఇంటిపెద్ద చనిపోవడంతో దిక్కుతోచని పరిస్థితిలో ఉండిపోయారు. ప్రభుత్వం లేదా ఇతరుల నుంచి వారికి ఎలాంటి సాయం అందలేదు. ఈ విషయం తెలిసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరగా... కొందరు పార్టీ నేతలు, అమెరికాలోని ప్రవాసాంధ్రులు ముందుకు వచ్చారు. సుబ్బారెడ్డి పిల్లలిద్దరి పేరిట చెరో రూ.లక్ష , ఆయన తల్లి పేరిట రూ .60 వేలు మొత్తం రూ 2.6 లక్షలు ఆర్థిక సాయం చేశారు. వర్జీనియాకు చెందిన పాటిల్ సత్యారెడ్డి పిల్లల చదువులకయ్యే ఫీజులు చెల్లించడానికి అంగీకరించారు. వర్జీనియాకే చెందిన రాంప్రసాద్‌రెడ్డి బయ్యపరెడ్డి ఆ కుటుంబానికి అయ్యే ఖర్చును భరిస్తామని ప్రకటించారు. పార్లమెంటులో వైఎస్సార్ కాంగ్రెస్ పక్షం నేత మేకపాటి రాజమోహన్‌రెడ్డి రూ.50 వేలు ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. తాను కూడా ఆ కుటుంబానికి చేయూతనందిస్తానని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.ఈ ఆర్థిక సాయాన్ని శనివారం జగన్ తన క్యాంపు కార్యాలయంలో ఆ కుటుంబానికి అందజేశారు. ఆదుకున్న వారందరినీ జగన్ అభినందించారు. కార్యక్రమంలో పుట్టపర్తి వైఎస్సార్ కాంగ్రెస్ నేత డాక్టర్ హరికృష్ణతో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు. తమను ఆదుకున్నందుకు సుబ్బారెడ్డి సతీమ ణి శివకుమారి జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. సంధ్యారాణి కుటుంబానికి జగన్ హామీ వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న మెడికల్ విద్యార్థిని బి.సంధ్యారాణి తల్లిదండ్రులకు వైఎస్సార్సీపీ అన్ని విధాలా అండగా ఉంటుందని జగన్ హామీ ఇచ్చారు. సంధ్యారాణి తల్లిదండ్రులు బాల సత్తయ్య, ప్రమీల, అన్న రవికుమార్‌లు శనివారం జగన్‌ను కలిసి తమ ఆవేదనను వ్యక్తం చేశారు. తన కుమార్తె చావుకు కారణం అరుున ప్రొఫెసర్ లక్ష్మిపై ప్రభుత్వం ఇప్పటివరకూ ఎలాంటి చర్య తీసుకోలేదని వారు జగన్ దృష్టికి తీసుకువచ్చారు.లక్ష్మిని సస్పెండ్ చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామన్నారు. జగన్‌ను కలిసిన వారిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ విద్యార్థి విభాగం అధ్యక్షులు సలామ్‌బాబు, కో- కన్వీనర్ సీవీ సారుునాథ్‌రెడ్డిలు కూడా ఉన్నారు. -
ప్రొఫెసర్ వేధింపులు.. కుటుంబం చిన్నాభిన్నం
-
ప్రియుడే హంతకుడు
– వీడిన సంధ్యారాణి కేసు మిస్టరీ - పెళ్లికి పట్టుబట్టడంతో కడతేర్చారు - కుటుంబీకులతో కలసి గొంతునిలిమి చంపేసిన విద్యాశాఖ ఉద్యోగి - కేసును ఛేదించి నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు కర్నూలు: పెళ్లి చేసుకోవాలని పట్టుబట్టడంతోనే ఆళ్లగడ్డకు చెందిన సంధ్యారాణిని ప్రియుడే హత్య చేసినట్లు పోలీసులు విచారణలో తేలింది. 13 రోజుల్లో పోలీసులు కేసును ఛేదించి నిందితులను అరెస్ట్ చేశారు. గురువారం మృతదేహాన్ని పూడ్చిన చోట జేసీబీ సహాయంతో వెలికి తీశారు. డీఈఓ కార్యాలయంలోని సర్వశిక్ష అభియాన్ విభాగంలో సీనియర్ అసిస్టెంటుగా పని చేస్తున్న నూర్ అహ్మద్ 2011లో ఆళ్లగడ్డలో విద్యాశాఖలో జూనియర్ అసిస్టెంటుగా పని చేసేవాడు. అదే సమయంలో ఆళ్లగడ్డలో సరస్వతి స్కూలు కూడా నిర్వహించే వాడు. ఇందులో నర్సరీ టీచర్‌గా సంధ్యారాణి పని చేసేది. అప్పటి నుంచి అతనితో పరిచయం ఉంది. 2013లో నూర్‌అహ్మద్ సీనియర్ అసిస్టెంటుగా కర్నూలుకు బదిలీపై వచ్చాడు. బుధవారపేటలోని గట్టప్ప స్కూలు వద్ద ఓ రూము అద్దెకు తీసుకొని ఉండేవాడు. మృతురాలు తరచూ అతని రూమ్‌కు వచ్చివెళ్లేది. వీరి మధ్య ఉన్న సాన్నిహిత్యాన్ని అతని భార్య పర్వీన్‌భాను వ్యతిరేకిస్తూ తరచూ గొడవపడేది. హతురాలు తనకు తెలిసిన వారి వద్ద రూ.3 లక్షలు నూర్అహ్మద్కు అప్పుగా ఇప్పించింది. వడ్డీతో పాటు డబ్బులు తిరిగి చెల్లించాలని ఒత్తిడి చేయడంతో పాటు, పెళ్లి చేసుకోవాలని, లేకుంటే పోలీస్ స్టేషన్లో కేసు పెడతానంటూ బెదిరించింది. ఈ విషయం తెలుసుకున్న భార్య, ఇతర కుటుంబ సభ్యులు కూడబలుక్కొని హత్య చేసేందుకు పథకం వేశారు. నెల క్రితమే హత్యకు పథకం సంధ్యారాణిని పెళ్లి చేసుకుంటే ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందని, చంపేస్తే ఎటువంటి అడ్డు ఉండదని నూర్‌అహ్మద్‌ను అతని కుటుంబీకులు ఒప్పించారు. ఈ మేరకు నెల క్రితమే పథకం వేశారు. ఎక్కడైన చంపేసి మృతదేహాన్ని దూరంగా తరలించి పూడ్చి వేయాలని కుట్ర పన్నారు. ఇందులో భాగంగా పథకం ప్రకారం గతనెల 2వ తేదీన కర్నూలులోని బట్టల దుకాణం యజమాని ఇమ్రాన్ నుంచి ఓమినీ వాహనం కొనుగోలు చేసి దాన్ని రిపేరు చేయించి, బాలాజీ నగర్లో ఉన్న మేనల్లుడు మున్నా ఇంటి వద్ద పెట్టుకున్నారు. ఈనెల 7వ తేదీన సంధ్యారాణిని కర్నూలుకు రప్పించుకున్నారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఆమెను నూర్‌అహ్మద్ రూమ్‌కు తీసుకెళ్లాడు. అప్పటికే మేనల్లుడు మున్నా, బామర్ది చాంద్‌బాషా, భార్య ఫర్వీన్ బాను తదితరులు మాటు వేసి ఉండి, గదిలోకి వెళ్లి అందరూ కలిసి గొంతు నులిమి, ముక్కుమూసి, ఊపిరి ఆడకుండా చేసి హత్య చేశారు. కర్నూలు మండలం పంచలింగాల గ్రామానికి చెందిన రాజశేఖర్ రెడ్డి పొలాన్ని నూర్‌అహ్మద్ కౌలుకు తీసుకొని డయిరీ ఫామ్ నిర్వహిస్తున్నాడు. అందులో అప్పటికే పెద్ద గుంత తీసి సిద్ధం చేశారు. సంధ్యారాణి మృతదేహాన్ని గోనెసంచిలో మూటగట్టి ఓమినీ వాహనంలో అక్కడికి తీసుకెళ్లి పూడ్చిపెట్టారు. మరుసటి రోజు జేసీబీ సహాయంతో పేడ, మట్టితో కప్పిపెట్టారు. మృతురాలి సోదరి నాగలక్ష్మమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేసి మిస్టరీని ఛేదించారు. నూర్అహ్మద్తో పాటు మున్నాను అరెస్టు చేశారు. ఎస్పీ సమక్షంలో మృతదేహం వెలికితీత: నిందితుడు నూర్‌అహ్మద్ ఇచ్చిన సమాచారం మేరకు గురువారం ఉదయం కర్నూలు డీఎస్పీ రమణమూర్తి, సీఐలు మధుసూదన్‌రావు, మహేశ్వరరెడ్డి, ఎస్ఐ జయన్న, కర్నూలు తహశీల్దారు రమేష్‌బాబు తదితరులు సంఘటన స్థలానికి చేరుకొని ఎస్పీ ఆకె రవికృష్ణ సమక్షంలో మృతదేహాన్ని జేసీబీ సహాయంతో వెలికి తీశారు. మృతదేహం గుర్తుపట్టని విధంగా పూర్తిగా కుళ్లిపోయి ఉంది. దీంతో ఫోరెన్సిక్ ప్రొఫెసర్ డాక్టర్ రాజశేఖర్‌ను అక్కడికే రప్పించి, పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం సాయిగురుదత్త వారి సహాయంతో మృతదేహాన్ని పాతబస్తీలోని జమ్మిచెట్టు ప్రాంతంలోని శ్మశాన వాటికకు తరలించి అంత్యక్రియలు నిర్వహించారు. ఈ కేసులో నూర్అహ్మద్భార్య పర్వీన్‌భాను, బామర్ది చాంద్‌బాషా పరారీలో ఉన్నారు. హతురాలి సోదరికి బెదిరింపులు: నూర్ అహ్మద్ దగ్గరి బంధువు రహంతులా్ల ప్రకాష్‌నగర్‌లో నివాసం ఉంటున్నాడు. సంఘటన జరిగిన తర్వాత నిందితుడు అతన్ని ఆశ్రయించాడు. కేసు నుంచి ఎలాగైనా తప్పించాలని వేడుకోవడంతో ఎంఆర్పీఎస్ నాయకులు వెంకటేశ్వర్లు మాదిగ, నాగన్న మాదిగలకు రూ.2 లక్షలు డబ్బులు చెల్లించి, హతురాలు నాగలక్ష్మమ్మను బెదిరించి కేసు పెట్టకుండా బెదిరించారు. హత్య జరిగిన తర్వాత వరుసగా మూడు రోజుల పాటు బెదిరించడంతో ఆమె పోలీసులకు సమాచారం ఇచ్చింది. దర్యాప్తులో భాగంగా రెవెన్యూ కాలనీలోని ఆమె ఇంటిలో పోలీసులు సోదా చేయగా, రహంతుల్లా, వెంకటేశ్వర్లు మాదిగ, నాగన్న మాదిగలు బెదిరించినట్లు సీసీ కెమెరాల్లో నిక్షిప్తమై ఉన్నాయి. ఫోన్ కాల్ డేటాతో పాటు సీసీ పుటేజీల ఆధారంగా వారిపై కూడా కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. హత్యకు ముందు సంధ్యారాణి శరీరంపై బంగారు గొలుసు, కమ్మలు, పట్టీలు ఉన్నాయని, వాటిని కూడా హంతకులు కాజేశారని సోదరి నాగలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసు విషయం పూర్తి స్థాయిలో దర్యాప్తు కోసం కర్నూలు డీఎస్పీ రమణమూర్తి విచారణ అధికారిగా నియమించారు. పరారీలో ఉన్న మిగతా నిందితులను కూడా త్వరలో అరెస్టు చేసి, వారికి కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటామని ఎస్పీ ఆకె రవికృష్ణ వెల్లడించారు. -
నేటినుంచి ఎస్ఐ అభ్యర్థులకు ఉచితశిక్షణ
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): ఎస్ఐ, కానిస్టేబుల్ పోస్టులకు నిర్వహించే పరీక్ష కు దరఖాస్తు చేసుకున్న గిరిజన అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా గిరి జన సంక్షేమాధికారి సంధ్యారాణి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కేంద్రంలోని బీసీ స్టడీ సర్కిల్లో ఈనెల 15 నుంచి 30వ తేదీ వరకు శిక్షణ ఇవ్వనున్నట్లు, వివరాలకు స్థానిక గిరిజన సంక్షేమ శాఖ కార్యాలయంలో సంప్రదించాలని కోరారు. ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం పోలీస్ కానిస్టేబుల్(మెయిన్స్) పరీక్ష కోసం సిద్ధమవుతున్న అభ్యర్థుల కోసం రెండువారాల పాటు ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు బీసీ స్టడీసర్కిల్ డైరెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు. బీసీ అభ్యర్థులు ఈనెల 17వరకు బీఈడీ కళాశాల మైదానంలో ఉన్న బీసీస్టడీ సర్కిల్లో దరఖాస్తులు చేసుకోవాలని, దేహదారుఢ్య పరీక్షల్లో ఉతీర్ణులైన వారు మాత్రమే అర్హులని తెలిపారు. -
అనాథ గువ్వలు
ఆపన్నహస్తాల కోసం ఎదురుచూస్తున్న అక్కాచెల్లెళ్లు ఈ అక్కాచెల్లెళ్లను పసిప్రాయంలో విధి పగబట్టింది. ఆరేళ్ల క్రితం అమ్మా నాన్నలు చనిపోతే.. అనాథలయ్యారు. ఇంతకాలం మేనమామల వద్ద ఆశ్రయం పొందిన బాలికలకు ఇప్పుడు అక్కడా ఆదరణ కరువైంది. దీంతో పెద్దపల్లిలో ఉంటున్న పెద్దమ్మ ఇంటికి చేరుకున్నారు. వారికి కూడా భారమవుతున్నామని బాధపడుతున్నారు. ప్రభుత్వం, మానవ తావాదులు స్పందించి ఆదుకుంటే... చక్కగా చదువుకుంటామని వేడుకుంటున్నారు. పెద్దపల్లి (కరీంనగర్) ‘తల్లిదండ్రులు లేకున్నా.. మేనమామలు ఉంటే చాలు’ అనేది సామెత. కానీ.. ఇది ఓ అనాథలైన అక్కాచెల్లెళ్ల పట్ల తిరగబడింది. తల్లిదండ్రులను కోల్పోయారు. అనాథలైన వారిని ఆదుకోవాల్సిన మేనమామలు ఇక తమవల్ల కాదంటూ వదిలించుకున్నారు. దీంతో అక్కాచెల్లిళ్లు వీధిన పడ్డారు. ప్రస్తుతం పెద్దనాన్న, పెద్దమ్మ వద్ద ఆశ్రయం పొందుతున్నారు. పెద్దపల్లికి చెందిన సామ లక్ష్మీకాంతం, మల్లేశం దంపతులకు నాగజ్యోతి, సంధ్యారాణి కూతుళ్లు. ఆరేళ్లక్రితం తల్లిదండ్రులిద్దరూ చనిపోయూరు. ఆ సమయంలో వీరి బాగోగులు చూసుకుంటామంటూ లక్ష్మీకాంతం సోదరులు హామీ ఇచ్చారు. లక్ష్మీకాంతానికి చెందిన బంగారు ఆభరణాలు, ఇతరత్రా డబ్బును తీసుకెళ్లారు. ఓ మామ హైదరాబాద్‌లో.. మరొకరు గోదావరిఖనిలో ఉంటున్నారు. నాగజ్యోతిని ఒకరు.. సంధ్యారాణిని మరొకరు తీసుకెళ్లారు. అప్పటినుంచి తమను పనిమనుషుల్లాగే చూశారని, ఎప్పుడో ఒకసారి బడికి పంపేవారని, వారి పిల్లలను ఆడించేందుకే అధిక సమయం వెచ్చించేవారమని ఈ అక్కాచెల్లెళ్లు తెలిపారు. తీరా నాలుగు నెలల క్రితం ఇద్దరినీ ఇంటి నుంచి వెళ్లగొట్టారు. కరీంనగర్లో ఇంటర్ పూర్తి చేసిన న్యాగజ్యోతికి ఫీజు పూర్తిగా చెల్లించకపోవడంతో యాజమాన్యం సర్టిఫికెట్ల ఇవ్వలేదు. ఈ విషయం తన మామతో చెబితే పైచదువులు వద్దంటూ ఎంసెట్ కోసం తెచ్చిన దరఖాస్తు ఫామ్ చింపేశాడని నాగజ్యోతి కన్నీటిపర్యంతమంది. పుస్తకాలతో తమ పెద్దనాన్న సామ తిరుపతి, పెద్దమ్మ పద్మ వద్దకు చేరామని పేర్కొన్నారు. తాను తొమ్మిదో తరగతిలోనే చదువు మానేశానని, తన చెల్లికైనా సహాయం చేస్తే చదువుకుని బాగుపడుతుందని సంధ్యారాణి కోరుతోంది. దాతలు స్పందించి తమ కుటుంబాన్ని ఆదుకోవాలని వేడుకుంటోంది. -
స్వైన్‌ఫ్లూ పంజా
హైదరాబాద్‌లో జనగామ వాసి మృతి షాక్‌లో భర్తకు పక్షవాతం అదే వ్యాధితో కుమారుడు ఆస్పత్రి పాలు తెలంగాణలో స్వైన్‌ఫ్లూ స్వైరవిహారం చేస్తోంది.. రాష్ట్రవ్యాప్తంగా వందలాది కేసులు నమోదు కావడం.. పదుల సంఖ్యలో మృతి చెందడంతో జిల్లావాసులు జంకుతున్నారు.. జనగామకు చెందిన ఉప్పల సంధ్యారాణి(35) స్వైన్‌ఫ్లూ వ్యాధి సోకి హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందింది. కాగా, కొన్ని జాగ్రత్తలు పాటిస్తే మేలని వైద్యులు పేర్కొంటున్నారు.- ఎంజీఎం/జనగామ స్వైన్‌ఫ్లూ.. ప్రస్తుతం ఇది రాష్ట్రంలోని ప్రజలందరితోపాటు ముఖ్యంగా వైద్యులను కూడా వణికిస్తున్న వ్యాధి. ఇది గాలి ద్వారా ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే వ్యాధి కావడంతో దీనిని అరికట్టడం కాస్త కష్టతరంగా మారింది. అందుకే స్వైన్‌ప్లూ వ్యాధిపై అప్రమత్తంగా ఉండాలని అధికారులతోపాటు వైద్యులు సూచిస్తున్నారు. వ్యాధులు సామాన్యంగా తిండి, నీళ్ల ద్వారా, తాకడం ద్వారా, సుఖవ్యాధుల ద్వారా వ్యాప్తిచెందుతాయి. తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఈ మూడు రకమైన వ్యాధులను అరికట్టవచ్చు. కానీ గాలి ద్వారా వ్యాపించే స్వైన్‌ఫ్లూను అరికట్టడం కష్టతరంగా మారడంతో ఈ వ్యాధి వ్యాప్తిచెందకుండా జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. - ఎంజీఎం స్వైన్ అంటే పంది. ఫ్లూ అంటే ఇన్‌ప్లుయెంజా విభాగానికి చెందిన వైరస్‌తో వ్యాపించే జలుబు. అయితే ఈ రకమైన వైరస్ తరచూ తనలో ఉన్న జన్యువులను ఇతర వైరస్‌లతో మార్చుకోవడం వల్ల కొత్త రకం వైరస్లు పుట్టుకొచ్చి ఫ్లూ జ్వరం కలుగజేస్తుంటాయి. తొలుత ఈ వైరస్‌ను పరిశీలించినప్పుడు అది పంది శ్వాసకోశ వ్యాధికి కారణమయ్యే ఒక వైరస్‌లోని జన్యువులతో పోలి ఉంది. ఇన్ప్లుయెంజాకు కారణమయ్యే అనేక వైరస్‌ల్లో ఒకటి జన్యుమార్పిడికి లోనైంది. పందుల్లో ఉండే ఈ వైరస్ తన యాంటీ జెనిక్ స్వరూపాన్ని మార్చుకుని మనుషుల్లో వ్యాప్తిచెందడం వల్ల స్వైన్‌ఫ్లూగా పేరు పెట్టారు. ‘ఇన్ఫ్లుయెంజా ఏ’ రకానికి చెందిన వైరస్ కేవలం మనుషుల నుంచి మనుషులకే సంక్రమిస్తుంటుంది. వ్యవహారిక భాషలో స్వైన్‌ఫ్లూ అని పిలుస్తున్నా వైద్యులు మాత్రం దీన్ని తమ పరిభాషలో హెచ్1 ఎన్1 అని అంటారు. రోగి జాగ్రత్తలు తీసుకోకుంటే ఎదుటివారికి వ్యాధి సంక్రమణ ఈ వ్యాధి వ్యాపించినప్పుడు చికిత్స కంటే నివారణ చాలా ముఖ్యం. ఈ వ్యాధి గాలి ద్వారా వ్యాపించే వ్యాధి కాబట్టి తప్పకుండా జాగ్రత్తలు పాటించాల్సిందే. దగ్గు, తుమ్ము వచ్చినప్పుడు ఎదుటివారిపై తుంపర్లు పడకుండా చేతి రుమాలు అడ్డుపెట్టుకోవాలి. ఖాళీ చేతులు అడ్డుపెట్టుకుని దగ్గడం, తుమ్మడం, దగ్గడం చేస్తే చేతుల్ని శుభ్రంగా సబ్బుతో చాలాసేపు కడుక్కోవాలి. జలుబు లేదా ఫ్లూ ఉన్న వ్యక్తుల నుంచి దూరంగా ఉండాలి. ఇలాంటి రోగులు కూడా తమ లక్షణాలు తగ్గిన 24 గంటల వరకు అందరి నుంచి దూరంగా ఉండడం మంచిది. జలుబు లక్షణాలు కనిపించినా అది తగ్గే వరకు పది మంది మెదిలే ప్రదేశాలకు ఆఫీసులకు వెళ్లండా ఇంట్లోనే విశ్రాంతి తీసుకోవాలి. స్వైన్ ఫ్లూను గుర్తించండిలా.. మొదట్లో ఈ జబ్బు అన్ని ఫ్లూ జ్వరంలాగే కనిపిస్తుంది. జ్వరం, దగ్గు, గొంతుల్లో ఇన్ఫెక్షన్, ముక్కు కారడం, ఒంటి నొప్పులు, తలనొప్పి, చలి, అలసట, నీరసం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అంతేగాక విరేచనాలు, వాంతులు కూడా కనిపించినప్పుడు దీనిని స్వైన్‌ఫ్లూగా అనుమానిస్తారు. అయితే ఇది పిల్లలో వేగంగా శ్వాస తీసుకోవడం, చర్మం నీలిరంగుగా మారడం, నీళ్లు, ద్రవపదార్థాలు తీసుకోకపోవడం, త్వరగా నిద్రలేవలేకపోవడం, ప్లూ జ్వరం తగ్గినా, దగ్గు ఒక పట్టాన త్వరగా తగ్గకపోవడం కనిపిస్తుంటాయి. పెద్దల్లో విపరీతమైన అయాసం, చాతి, పొట్టలో నొక్కేస్టున్నట్లు నొప్పి రావడం, నీరసపడిపోవడం, వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. వ్యాక్సిన్‌తో వ్యాధిని అరికట్టలేం వ్యాధుల రాకుండా వ్యాక్సిన్లు ఉన్నప్పటికీ స్వైన్‌ఫ్లూను వ్యాక్సిన్‌తో అరికట్టలేం. జన్యుమార్పిడి వల్ల కలిగేది కాబట్టి ఈ వ్యాధిని అరికట్టలేం. అన్ని రకాల జలుబు, జ్వరాన్ని స్వైన్‌ఫ్లూగా భ్రమించి విరివిగా మందులు వాడడంతో వైరస్‌లపై మందుల ప్రభావం తగ్గిపోయి పనిచేయకుండా పోతాయి. బయట మెడికల్ షాపుల్లో దీనికి సంబంధించిన మందులు దొరకవు. కేవలం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాల యంలో లభిస్తాయి. తప్పనిసరిగా డాక్టర్ వద్దకు పరీక్ష చేయించుకుని వైద్యుడి సూచన మేరకే ఈ మందులు వాడాలి. జిల్లా అధికారులు కూడా ఈ మందులను సంబంధిత వైద్యులకే అందిస్తుంటారు. - డాక్టర్ ఏరుకొండ శ్రీధర్, చెస్ట్ ఫిజీషియన్ స్వైన్‌ఫ్లూతో వివాహిత మృతి అదేవ్యాధితో కుమారుడు ఆస్పత్రిపాలు షాక్‌తో భర్తకు పక్షవాతం జనగామలో విషాదం జనగామ : స్వైన్‌ఫ్లూ వ్యాధి జిల్లాకు చెందిన ఓ మహిళను బలిగొంది. పట్టణానికి ఉప్పల సంధ్యారాణి(35) హెచ్1ఎన్1 వైరస్ బారినపడి సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తుదిశ్వాస విడిచింది. భార్య చ నిపోయిందనే షాక్‌తో సంధ్యారాణి భర్తకు పక్షవాతం రాగా, స్వైన్‌ఫ్లూతో వారి కుమారు డు ఆస్పత్రి పాలయ్యాడు. వివరాలిలా ఉన్నాయి. జనగామ పాతబీటు బజారుకు చెందిన గుండా కేశవులు, రాజ్యలక్ష్మి దంపతుల కుమార్తె సంధ్యారాణిని కొన్నేళ్ల క్రితం హైదరాబాద్ చింతల్‌కు చెందిన ఉప్పల శ్రీనివాస్‌కు ఇచ్చి వివాహం చేశారు. శ్రీనివాస్ కుత్బుల్లాపూర్ మండల డిప్యూటీ తహసీల్దార్‌గా పనిచేస్తుండగా సంధ్యారాణి గృహిణిగా ఉంటోం ది. వారికి కుమారులు రాహుల్, కిట్టూ ఉన్నారు. ఆనందంగా సాగిపోతున్న వారి కుటుంబాన్ని స్వైన్‌ఫ్లూ రక్కసి ఒక్కసారిగా కుదిపేసింది. రెండు రోజుల క్రితమే సంధ్యారాణి అనారోగ్యానికి గురికాగా సోమవారం ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు చికిత్స చేసి మంగళవారం ఉదయం స్వైన్‌ఫ్లూగా నిర్ధారించి గాంధీ ఆస్పత్రికి రెఫర్ చేశారు. అక్కడికి తీసుకెళ్లగా చికిత్సపొందుతూ ఆమె సాయంత్రం కన్నుమూసింది. ఇదిలా ఉండగా మృతురాలి చిన్నకుమారుడు కిట్టూ(10) కూడా స్వైన్‌ఫ్లూతో బాధపడుతూ గాంధీ ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సంధ్యారాణి మృతితో జనగామలోని తల్లిగారింట్లో విషాద ఛాయలు అలముకున్నాయి. షాక్‌తో భర్తకు పక్షవాతం భార్యకు స్వైన్‌ఫ్లూ సోకిందన్న వార్త తెలియగానే సంధ్యారాణి భర్త శ్రీనివాస్ మంగళవారం ఉదయం షాక్‌కు గురయ్యారు. దీంతో ఆయన కుడి చేయి, కుడి కాలు వంకరపోయి పక్షవాతానికి గురయ్యారు. బంధువులు అతడిని సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన ఆ కుటుంబాన్ని పెనువిషాదంలోకి నెట్టింది. పైగా వ్యాధి భయానికి బంధువులు దగ్గరకు రాకుండా అంటీముట్టనట్లు వ్యవహరిస్తుండడంతో వారి గోస వర్ణణాతీతంగా ఉన్నట్లు వారి స్నేహితులు తెలిపారు. -
ఏసీబీ వలలో పంచాయతీ కార్యదర్శి
ధర్పల్లి: లంచం తీసుకుంటూ పంచాయతీ కార్యదర్శి ఏసీబీకి అడ్డంగా దొరికిపోయారు. ఏసీబీ డీఎస్పీ సంజీవరావు కథనం ప్రకారం.. ధర్పల్లి మండల కేంద్రానికి చెందిన అస్రఫ్‌బీ భర్త అజీజ్ జీవనోపాధి కోసం దుబాయి వెళ్లారు. ఆయన తండ్రి గోరేమియా చనిపోవడంతో ముగ్గురు కొడుకులు వేరుపడ్డారు. ఈ క్రమంలో తన భర్త వాటాకు వచ్చిన ఇంటి భాగాన్ని అజీజ్ పేరు మీదికి మార్చేందుకు అతడి భార్య అస్రఫ్‌బీ సెప్టెంబర్ 9న పంచాయతీ కార్యదర్శికి దరఖాస్తు చేసుకుంది. కాగా పేరు మార్పిడి కోసం ఆమెను పంచాయతీ కార్యాలయం చుట్టూ తిప్పించుకున్న కార్యదర్శి సంధ్యారాణి చివరికి రూ. 6 వేలు ఇవ్వాలని డిమాండ్ చేసింది. బాధితురాలు తొలుత రూ. 2 వేలు ఇస్తానంది. ఈ నెల 17న రూ. 4 వేలకు ఇద్దరి మధ్య బేరం కుదిరింది. అయితే బాధితురాలు ఏసీబీని ఆశ్రయించింది. బుధవారం ఉదయం 10.30 గంటల వరకు డబ్బులు ఇవ్వాలని కార్యదర్శి కోరగా ఆ ప్రకారం అస్రఫ్‌బీ రూ.4 వేలు పంచాయతీ కార్యాలయానికి తీసుకెళ్లి ఇచ్చింది. డబ్బులను కార్యదర్శి హ్యాండ్‌బ్యాగ్‌లో పెట్టుకోగా అక్కడే మాటు వేసి ఉన్న ఏసీబీ అధికారులు ఆమెను పట్టుకున్నారు. కార్యదర్శిని అరెస్టు చేసి హైదరాబాద్ ఏసీబీ స్పెషల్ బ్రాంచ్‌కు తరలించనున్నట్లు ఏసీబీ డీఎస్పీ తెలిపారు. దాడిలో ఏసీబీ ఇన్స్పెక్టర్లు చంద్రశేఖర్‌రెడ్డి, రఘునాథ్, ఖుర్షీద్ అలీ, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు. ఉత్త పుణ్యానికి పనులవుతాయా..! ఏసీబీకి పట్టుబడ్డ ధర్పల్లి పంచాయతీ కార్యదర్శి సంధ్యారాణి వ్యవహార శైలిపై పలు ఆరోపణలు వెల్లువెత్తాయి. గ్రామస్తులు ఎవరైనా పనుల కోసం వెళ్తే ముక్కుపిండి డబ్బులు వసూలు చేసేవారని, పైగా ‘ఉత్త పుణ్యానికే పనులవుతాయా..’ అంటూ దబాయించేవారని పలువురు పేర్కొన్నారు. సంధ్యారాణి ఈవోపీఆర్డీగా అదనపు బాధ్యతలతో పాటు సీతాయిపేట్‌కు ఇన్చార్జి పంచాయతీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. మరోవైపు మండలంలో ఏసీబీ దాడులు అధికారుల్లో చర్చనీయాంశగా మారింది. -
కొత్తపల్లి గీతకు కుల వివాదంపై నోటీసు
హైకోర్టులో పిటిషన్ వేసిన టీడీపీ నేత గుమ్మడి సంధ్యారాణి విజయనగరం: అరకు ఎంపీ కొత్తపల్లి గీత కుల వివాద ఉచ్చులో చిక్కుకున్నారు. ఆమె ఎస్టీ కాదని మొన్నటి సాధారణ ఎన్నికల్లో ప్రత్యర్థిగా పోటీ చేసిన టీడీపీ నేత గుమ్మడి సంధ్యారాణి హైకోర్టులో వేసిన పిటిషన్ అడ్మిట్ అయింది. ఈనెల 31న హాజరు కావాలని గీతకు హైకోర్టు బుధవారం నోటీసులు జారీ చేసింది. ఇప్పుడీ పరిణామం టీడీపీని డైలామాలో పడేసింది. అరకు ఎంపీగా ఎన్నికైన తర్వాత కొత్తపల్లి గీత ఎస్టీ కాదని టీడీపీ గట్టిగా వాదించింది. ఆమెకు వ్యతిరేకంగా ఆధారాలను సేకరించింది. ఆమె ప్రత్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేసిన టీడీపీ నేత గుమ్మడి సంధ్యారాణి చేత హైకోర్టులో పిటిషన్ కూడా వేయించింది. అందుకు తగ్గ పూర్తి సహాయ సహకారాలను టీడీపీ నాయకత్వం అందజేసింది. ఇదంతా పసిగట్టో, కుల వివాదం నుంచి బయటపడాలనో ఎన్నికైన కొన్ని నెలల్లోనే కొత్తపల్లి గీత స్వరం మార్చారు. టిక్కెట్ ఇచ్చిన పార్టీకి వ్యతిరేకంగామాట్లాడటం ప్రారంభించారు. టీడీపీ నేతలతో అంటకాగుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో హైకోర్టు నోటీసులు జారీ చేయడంతో టీడీపీ డిఫెన్స్‌లో పడింది. తమ పార్టీ నాయకులతో కలిసి తిరుగుతున్న ఎంపీ గీతపై ఎలా స్పందించాలో తెలియకో, అధిష్టానం డెరైక్షనో తెలియదు గాని పార్టీ సహాయ సహకారాలతో పిటిషన్ వేసిన గుమ్మడి సంధ్యారాణి ఇప్పుడు కనీసం స్పందించలేదు. -
‘నువ్వు కూడా ఉండొచ్చు..కాకుంటే ...’
విజయవాడ : పదేళ్లు ప్రేమాయణం సాగించి పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత బుద్ధి వక్రీకరించి మరో పెళ్లికి సిద్ధమయ్యాడు. ‘నువ్వు కూడా ఉండొచ్చు..కాకుంటే షరతులు వర్తిస్తాయి’ అనడంతో గత్యంతరం లేని స్థితిలో ఆమె న్యాయం కోసం విజయవాడ నగర పోలీసు కమిషనర్‌ను ఆశ్రయించింది. వివరాల్లోకి వెళితే పటమట రామచంద్రానగర్‌కు చెందిన కొప్పురావూరి సంధ్యారాణి తన భర్త నవీన్‌కుమార్ రెండున్నర నెలల కిందట వదిలేసి వెళ్లాడని పోలీసు కమిషనర్ బి.శ్రీనివాసులును కలిసి ఫిర్యాదు చేసింది. భర్త గవర్నరుపేటలోని తన మామ కొప్పురావూరి నటరాజు ఇంట్లో ఉంటున్నాడని, తన రెండున్నరేళ్ల కుమార్తె శ్రీ చిన్విని కూడా అక్కడే ఉంచుకొని చూపించడం లేదని ఆమె పేర్కొంది. రెండో పెళ్లికి సిద్ధపడిన తన భర్త పేరొందిన న్యాయవాది పేరు చెపుతూ తననేమీ చేయలేరంటూ బెదిరిస్తున్నాడని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. కనీసం తన కుమార్తెనైనా చూ పించాలంటూ పోలీస్ కమిషనర్‌ను ఆమె వేడుకుంది. దీనిపై మహిళా పోలీ సు స్టేషన్లో ఫిర్యాదు చేయాలని ఆయన సూచించారు. ఇదీ జరిగింది 2001లో సంధ్యారాణి ఇంటర్మీడియెట్ చదువుతుండగా బియ్యం వ్యాపారి నట రాజు కుమారుడు నవీన్‌కుమార్‌తో స్నే హితుల ద్వారా పరిచయమైంది. తరువాత ప్రేమలో పడిన వీరు 2010లో కులాంతర వివాహం చేసుకున్నారు. అప్పటి నుంచి రామచంద్రానగర్‌లో ఉంటున్నారు. వీరికి రెండున్నరేళ్ల శ్రీ చిన్వి, మూడు నెలల జిజ్ఞేశ్వర్ సం తానం. నవీన్ గత మే 16న కుమార్తెను తీసుకొని తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లాడు. పలుమార్లు వెళ్లి ప్రాథేయపడినా రాకపోగా, కుమార్తెను కూడా చూ పించడం లేదు. ఇందుకు తన మామే కారణమని ఆమె పేర్కొంది. తన మామ బలవంతంతో మరో వివాహం చేసుకునేందుకు నవీన్ ప్రయత్నిస్తున్నాడని ఆమె ఆరోపిస్తోంది. షరతులు పెడుతున్నాడు తన కుమార్తెను చూపించేందుకు భర్త షరతులు పెడుతున్నాడని సంధ్యారాణి ఆరోపిస్తోంది. రెండో వివాహం ఇష్టమేనని, ఆస్తిలో వాటా అడగనని, భవిష్యత్‌లో అత్తమామలపై పోలీసులకు ఏ విధమైన ఫిర్యాదు చేయకూడదంటూ ఒప్పంద పత్రంపై సంతకం పెట్టాలంటున్నట్టు ఆమె పేర్కొంది. ఇది జరిగితే కుటుంబ ఖర్చులు పెట్టుకొని వారంలో ఒకరోజు పాపను తీసుకువచ్చి తన ఇంట్లో గడుపుతానని చెపుతున్నాడని, ఇలా చేయకపోతే పిల్లలు తనకు పుట్టలేదని ప్రచారం చేస్తారని బెదిరిస్తున్నాడని ఆమె కన్నీటి పర్యంతమైంది. -
ఆమెకు టిక్కెట్ ఇస్తే...!
సాలూరు, న్యూస్‌లైన్: సాలూరు టీడీపీ ఎమ్మెల్యే టిక్కెట్ గుమ్మడి సంధ్యారాణికి ఇస్తే ఓటమి తప్పదని ఆ పార్టీ అధిష్ఠా నం చేపట్టిన సర్వేలో తేలినట్టు తెలిసింది. దీంతో అధినాయకత్వం మాజీ ఎమ్మెల్యే ఆర్పీ భంజ్‌దేవ్‌కు టిక్కెట్ ఇచ్చేందుకు మొగ్గు చూపుతోంది. ఈ విషయం తెలిసిన సంధ్యారాణి వర్గీయులు భగ్గుమంటున్నారు.అధిష్ఠానం నిర్ణయంపై మండిపడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హవా ఉం డడంతో టీడీపీ అధిష్ఠానం టిక్కెట్ల కేటాయింపు కో సం నియోజకవర్గాల్లో సర్వేలు నిర్వహిస్తున్న విష యం తెలిసిందే. అందులో భాగంగానే సా లూరు నియోజకవర్గంలో చేపట్టిన సర్వేలో ప్రస్తుత ఎమ్మెల్యే, వైఎ స్సార్ సీపీ నాయకుడు పీడి క రాజన్నదొరపై సంధ్యారాణి పోటీ చేస్తే గెలవలేరని తెలిసింది. నియోజకవర్గ ఇన్చార్జిగా సంధ్యారాణి సమర్థవంతంగా బాధ్యతలు నెరవేర్చలేకపోయారని, ఆశించిన స్థాయిలో పార్టీని అభివృద్ధి చేయలేకపోయారని సర్వేలో తేలింది. ఈ నేపథ్యం లో మాజీ ఎమ్మెల్యే భంజ్‌దేవ్‌కు టిక్కెట్ కేటారుుంచనున్నట్టు సమాచారం. 2006లో హైకోర్టు తీర్పుతో ఎమ్మెల్యే పదవి కోల్పోయిన తాను ఎస్టీ కుల ధ్రువీకరణ పత్రం తెచ్చుకుంటున్నానని, తనకు ఈసారి టి క్కెట్ ఇస్తే గెలిచి తీరుతానని అధిష్ఠానం ఎదుట భం జ్‌దేవ్ నమ్మకంగా చెప్పినట్టు తెలిసింది. ఈ మేరకు పార్టీ అధిష్ఠానం కూడా ఆయనకే టిక్కెట్ ఇచ్చేందు కు ప్రస్తుతానికి నిర్ణయించినట్టు సమాచారం. భంజ్‌దేవ్‌ను నమ్మేదెవరు...? సంధ్యారాణిని పక్కనపెట్టి భంజ్‌దేవ్‌కు టిక్కెట్ ఇ స్తే, ఎస్టీ నియోజకవర్గంలో ఆయనకు గిరిజనులు ఓట్లెలా వేస్తారని సంధ్యారాణి వర్గీయులు ప్రశ్నిస్తున్నారు. భంజ్వేవ్ ఎస్టీ కాదని హైకోర్టు నిర్ధారించినందున ఆయనపై నియోజకవర్గంలోని గిరిజనుల్లో తీవ్ర వ్యతిరేకత ఉం దని, ఇలాంటి పరి స్థితుల్లో ఆయన్ను బరిలో దింపితే ప్రతి కూల ఫలితాన్ని మూటగట్టుకోవడం మినహా మరేమీ ఒనగూరదంటున్నా రు. ఇదే విషయాన్ని నియోజకవర్గంలో రాజకీయ పరిశీలకు ల నుంచి సాధారణ ఓటరు వరకూ చర్చించుకుంటున్నారు. ఇంత చిన్న విషయాన్ని కూడా పార్టీ అధిష్ఠానం గుర్తించలేదా అని ప్రశ్నిస్తున్నారు. భంజ్‌దేవ్ కుల వివాదంలో చిక్కుకున్న తరువాత నుంచి అన్నీతానై పార్టీని నడిపిన సంధ్యారాణిని పక్కన పెట్టడం సరి కాదంటున్నారు. అదేగాని జరిగితే పార్టీ తగిన మూ ల్యం చెల్లించుకోక తప్పదని ఆమె అనుచరులు హెచ్చరిస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే రాజన్నదొరను ఎదుర్కోవడం చిన్న విషయం కాదని గుర్తు చేస్తున్నా రు. కాగా 1994, 1999, 2004 ఎన్నికల్లో వరుసగా ఎమ్మెల్యేగా గెలుపొందిన భంజ్‌దేవ్‌కు తన పాత ఎస్టీ కులధ్రువీకరణ పత్రాన్ని పార్వతీపురం సబ్ కలెక్టర్ పునరుద్ధరించినట్టు తెలుస్తోంది. టిక్కెట్ సంపాదించడానికి సంధ్యారాణి తనదైన శైలిలో భంజ్‌దేవ్‌ను పార్టీలోనే ఎదుర్కొంటూ ముమ్మర యత్నం చేస్తుండగా, భంజ్‌దేవ్ కూడా ఎలాగైనా ఈసారి టిక్కెట్ సాధించి పెద్దన్న పాత్రకు పరిమితం కాకుం డా మళ్లీ క్రియాశీల రాజకీయాల్లోకి రావాలని భావి స్తున్నారు.