ఆమెకు టిక్కెట్ ఇస్తే...!
Published Thu, Apr 10 2014 2:45 AM | Last Updated on Sat, Sep 2 2017 5:48 AM
సాలూరు, న్యూస్‌లైన్: సాలూరు టీడీపీ ఎమ్మెల్యే టిక్కెట్ గుమ్మడి సంధ్యారాణికి ఇస్తే ఓటమి తప్పదని ఆ పార్టీ అధిష్ఠా నం చేపట్టిన సర్వేలో తేలినట్టు తెలిసింది. దీంతో అధినాయకత్వం మాజీ ఎమ్మెల్యే ఆర్‌పీ భంజ్‌దేవ్‌కు టిక్కెట్ ఇచ్చేందుకు మొగ్గు చూపుతోంది. ఈ విషయం తెలిసిన సంధ్యారాణి వర్గీయులు భగ్గుమంటున్నారు.అధిష్ఠానం నిర్ణయంపై మండిపడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హవా ఉం డడంతో టీడీపీ అధిష్ఠానం టిక్కెట్ల కేటాయింపు కో సం నియోజకవర్గాల్లో సర్వేలు నిర్వహిస్తున్న విష యం తెలిసిందే.
అందులో భాగంగానే సా లూరు నియోజకవర్గంలో చేపట్టిన సర్వేలో ప్రస్తుత ఎమ్మెల్యే, వైఎ స్సార్ సీపీ నాయకుడు పీడి క రాజన్నదొరపై సంధ్యారాణి పోటీ చేస్తే గెలవలేరని తెలిసింది. నియోజకవర్గ ఇన్‌చార్జిగా సంధ్యారాణి సమర్థవంతంగా బాధ్యతలు నెరవేర్చలేకపోయారని, ఆశించిన స్థాయిలో పార్టీని అభివృద్ధి చేయలేకపోయారని సర్వేలో తేలింది. ఈ నేపథ్యం లో మాజీ ఎమ్మెల్యే భంజ్‌దేవ్‌కు టిక్కెట్ కేటారుుంచనున్నట్టు సమాచారం. 2006లో హైకోర్టు తీర్పుతో ఎమ్మెల్యే పదవి కోల్పోయిన తాను ఎస్టీ కుల ధ్రువీకరణ పత్రం తెచ్చుకుంటున్నానని, తనకు ఈసారి టి క్కెట్ ఇస్తే గెలిచి తీరుతానని అధిష్ఠానం ఎదుట భం జ్‌దేవ్ నమ్మకంగా చెప్పినట్టు తెలిసింది. ఈ మేరకు పార్టీ అధిష్ఠానం కూడా ఆయనకే టిక్కెట్ ఇచ్చేందు కు ప్రస్తుతానికి నిర్ణయించినట్టు సమాచారం.
భంజ్‌దేవ్‌ను నమ్మేదెవరు...?
సంధ్యారాణిని పక్కనపెట్టి భంజ్‌దేవ్‌కు టిక్కెట్ ఇ స్తే, ఎస్టీ నియోజకవర్గంలో ఆయనకు గిరిజనులు ఓట్లెలా వేస్తారని సంధ్యారాణి వర్గీయులు ప్రశ్నిస్తున్నారు. భంజ్‌వేవ్ ఎస్టీ కాదని హైకోర్టు నిర్ధారించినందున ఆయనపై నియోజకవర్గంలోని గిరిజనుల్లో తీవ్ర వ్యతిరేకత ఉం దని, ఇలాంటి పరి స్థితుల్లో ఆయన్ను బరిలో దింపితే ప్రతి కూల ఫలితాన్ని మూటగట్టుకోవడం మినహా మరేమీ ఒనగూరదంటున్నా రు. ఇదే విషయాన్ని నియోజకవర్గంలో రాజకీయ పరిశీలకు ల నుంచి సాధారణ ఓటరు వరకూ చర్చించుకుంటున్నారు. ఇంత చిన్న విషయాన్ని కూడా పార్టీ అధిష్ఠానం గుర్తించలేదా అని ప్రశ్నిస్తున్నారు. భంజ్‌దేవ్ కుల వివాదంలో చిక్కుకున్న తరువాత నుంచి అన్నీతానై పార్టీని నడిపిన సంధ్యారాణిని పక్కన పెట్టడం సరి కాదంటున్నారు.
అదేగాని జరిగితే పార్టీ తగిన మూ ల్యం చెల్లించుకోక తప్పదని ఆమె అనుచరులు హెచ్చరిస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే రాజన్నదొరను ఎదుర్కోవడం చిన్న విషయం కాదని గుర్తు చేస్తున్నా రు. కాగా 1994, 1999, 2004 ఎన్నికల్లో వరుసగా ఎమ్మెల్యేగా గెలుపొందిన భంజ్‌దేవ్‌కు తన పాత ఎస్టీ కులధ్రువీకరణ పత్రాన్ని పార్వతీపురం సబ్ కలెక్టర్ పునరుద్ధరించినట్టు తెలుస్తోంది. టిక్కెట్ సంపాదించడానికి సంధ్యారాణి తనదైన శైలిలో భంజ్‌దేవ్‌ను పార్టీలోనే ఎదుర్కొంటూ ముమ్మర యత్నం చేస్తుండగా, భంజ్‌దేవ్ కూడా ఎలాగైనా ఈసారి టిక్కెట్ సాధించి పెద్దన్న పాత్రకు పరిమితం కాకుం డా మళ్లీ క్రియాశీల రాజకీయాల్లోకి రావాలని భావి స్తున్నారు.
Advertisement
Advertisement