అవయవదాన కుటుంబానికి ఆర్థిక సహాయం | Jagan financial assistance to the family | Sakshi
Sakshi News home page

అవయవదాన కుటుంబానికి ఆర్థిక సహాయం

Published Sun, Nov 13 2016 1:40 AM | Last Updated on Thu, Aug 30 2018 4:10 PM

అవయవదాన కుటుంబానికి ఆర్థిక సహాయం - Sakshi

అవయవదాన కుటుంబానికి ఆర్థిక సహాయం

- జగన్ పిలుపు మేరకు స్పందించిన ప్రవాస భారతీయులు
- సాయం అందజేసిన జగన్
 
 సాక్షి, హైదరాబాద్ : రోడ్డు ప్రమాదంలో గాయపడి మృతి చెందగా ఆయన అవయవాలను దానం చేసి ఐదుగురికి పునర్జన్మనిచ్చిన వ్యక్తి కుటుంబానికి అమెరికాలో ఉంటున్న ప్రవాస భారతీయులు కొందరు ఆర్థిక సాయం చేశారు. ప్రకాశం జిల్లా ఉలవపాడు గ్రామానికి చెందిన పెల్లేటి సుబ్బారెడ్డి (35) గత అక్టోబర్ 2వ తేదీన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. ఆయనను  నారాయణ ఆసుపత్రిలో చేర్పించగా బ్రెరుున్‌డెడ్‌గా వైద్యులు ప్రకటించారు. నిరుపేద కుటుంబీకులైనప్పటికీ ఎంతో ఔదార్యంతో సుబ్బారెడ్డి అవయవాలను వారు దానం చేశారు. అయితే చిన్నపాటి పనులు చేసుకుంటూ జీవిస్తున్న సుబ్బారెడ్డికి భార్య శివకుమారి, తల్లి సుబ్బమ్మ, పిల్లలు సమీర (9 ఏళ్లు), జశ్వంత్ (7) ఉన్నారు. వారిది నిరుపేద కుటుంబం కావ డం, ఇంటిపెద్ద చనిపోవడంతో దిక్కుతోచని పరిస్థితిలో ఉండిపోయారు. ప్రభుత్వం లేదా ఇతరుల నుంచి వారికి ఎలాంటి సాయం అందలేదు.

ఈ విషయం తెలిసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరగా... కొందరు పార్టీ నేతలు, అమెరికాలోని ప్రవాసాంధ్రులు  ముందుకు వచ్చారు. సుబ్బారెడ్డి పిల్లలిద్దరి పేరిట చెరో రూ.లక్ష , ఆయన తల్లి పేరిట రూ .60 వేలు మొత్తం రూ 2.6 లక్షలు ఆర్థిక సాయం చేశారు. వర్జీనియాకు చెందిన పాటిల్ సత్యారెడ్డి  పిల్లల చదువులకయ్యే ఫీజులు చెల్లించడానికి అంగీకరించారు. వర్జీనియాకే చెందిన రాంప్రసాద్‌రెడ్డి బయ్యపరెడ్డి ఆ కుటుంబానికి అయ్యే ఖర్చును భరిస్తామని ప్రకటించారు. పార్లమెంటులో వైఎస్సార్ కాంగ్రెస్ పక్షం నేత మేకపాటి రాజమోహన్‌రెడ్డి రూ.50 వేలు ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. తాను కూడా ఆ కుటుంబానికి చేయూతనందిస్తానని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.ఈ ఆర్థిక సాయాన్ని శనివారం జగన్ తన క్యాంపు కార్యాలయంలో ఆ కుటుంబానికి అందజేశారు. ఆదుకున్న వారందరినీ జగన్ అభినందించారు. కార్యక్రమంలో పుట్టపర్తి వైఎస్సార్ కాంగ్రెస్ నేత డాక్టర్ హరికృష్ణతో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు. తమను ఆదుకున్నందుకు సుబ్బారెడ్డి సతీమ ణి శివకుమారి జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

 సంధ్యారాణి కుటుంబానికి జగన్ హామీ
 వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న మెడికల్ విద్యార్థిని బి.సంధ్యారాణి తల్లిదండ్రులకు వైఎస్సార్‌సీపీ అన్ని విధాలా అండగా ఉంటుందని జగన్ హామీ ఇచ్చారు. సంధ్యారాణి తల్లిదండ్రులు బాల సత్తయ్య, ప్రమీల, అన్న రవికుమార్‌లు శనివారం జగన్‌ను కలిసి తమ ఆవేదనను వ్యక్తం చేశారు. తన కుమార్తె చావుకు కారణం అరుున ప్రొఫెసర్ లక్ష్మిపై ప్రభుత్వం ఇప్పటివరకూ ఎలాంటి చర్య తీసుకోలేదని వారు జగన్ దృష్టికి తీసుకువచ్చారు.లక్ష్మిని సస్పెండ్ చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామన్నారు. జగన్‌ను కలిసిన వారిలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ విద్యార్థి విభాగం అధ్యక్షులు సలామ్‌బాబు, కో- కన్వీనర్ సీవీ సారుునాథ్‌రెడ్డిలు కూడా ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement