టెన్త్ ఫలితాల్లో.. స్కూళ్ల హవా ! | Telangana schools creats record of passing tenth students | Sakshi
Sakshi News home page

టెన్త్ ఫలితాల్లో.. స్కూళ్ల హవా !

Published Mon, May 18 2015 3:46 AM | Last Updated on Sun, Sep 3 2017 2:14 AM

Telangana schools creats record of passing tenth students

సగానికి తగ్గిన ‘వంద శాతం’ స్కూళ్లు
 సాక్షి, హైదరాబాద్: వంద శాతం ఉత్తీర్ణత సాధించిన పాఠశాలల సంఖ్య గతేడాదితో పోలిస్తే ఈసారి దాదాపు సగానికి పడిపోయింది. గతేడాది తెలంగాణలోని 2,434 పాఠశాలలు 100 శాతం ఉత్తీర్ణత సాధించగా, ఈసారి 1,491 పాఠశాలలు మాత్రమే ఈ ఫలితాలను సాధించాయి. వందశాతం ఉత్తీర్ణత సాధించిన వాటిలో అత్యధికంగా (944) ప్రైవేటు పాఠశాలలే ఉన్నాయి. ఆ తరువాత స్థానంలో జిల్లా పరిషత్తు పాఠశాలలు (385) నిలిచాయి. మరోవైపు గతేడాది 27 పాఠశాలల్లో సున్నా ఫలితలు రాగా ఈసారి 28 పాఠశాలల్లో ఈ ఫలితాలు వచ్చాయి.

 రవీంద్రభారతికి తిరుగులేని ఆధిక్యం
 సాక్షి, హైదరాబాద్: టెన్త్ ఫలితాల్లో రవీంద్రభారతి స్కూల్ హవా కొనసాగింది. తన రికార్డులను తానే తిరగరాస్తూ తనకు తానే సాటిగా నిరూపించుకుంది. ఈసారి ఫలితాల్లో 606 మంది విద్యార్థులకు అన్ని సబ్టెక్టుల్లోనూ 10కి 10 గ్రేడ్ పాయింట్లు లభించాయి. అలాగే 2244 మంది ఏ1, ఏ2 గ్రేడ్లు సాధించారు. కేవలం పదిలోనే కాకుండా రాష్ర్ట, జాతీయ, అంతర్జాతీయ పోటీ పరీక్షల్లో అద్భుత ఫలితాలను సాధిస్తూ రవీంద్రభారతి అగ్రగామిగా నిలుస్తోందని విద్యాసంస్థల చైర్మన్ ఎం.ఎస్.మణి పేర్కొన్నారు.
 
 బ్రిలియంట్ గ్రామర్ హైస్కూల్స్ జైత్రయాత్ర
 సాక్షి, హైదరాబాద్: పది ఫలితాల్లో బ్రిలియంట్ గ్రామర్ హైస్కూల్స్ అత్యుత్తమ ఫలితాలు సాధించి తన ఆధిపత్యాన్ని మరోసారి చాటుకుంది. 12 ఏళ్లుగా రాష్ర్ట స్థాయి ర్యాంకులు సాధిస్తూ వస్తున్న బ్రిలియంట్ విద్యార్థులు ఇప్పుడు కూడా అద్భుత ప్రతిభ కనబరిచారు. ఈసారి పరీక్షలకు 2533 మంది విద్యార్థులు హాజరుకాగా, వారిలో 98 శాతం మంది ఉత్తీర్ణత సాధించి రికార్డు సృష్టించారు. 27 మంది విద్యార్థులు 10/10 జీపీఏ సాధించారు. 85 శాతం మంది విద్యార్థులు 10/9 జీపీఏను పొంది బ్రిలియంట్ విద్యాసంస్థలను రాష్ర్టంలో అగ్రగామిగా నిలబెట్టారు. విద్యార్థులు, అధ్యాపకుల సమష్టి కృషి వల్లే ఈ ఫలితాలు వచ్చాయని విద్యాసంస్థల చైర్మన్ కె. నారాయణరెడ్డి తెలిపారు.
 
 దిల్‌సుఖ్‌నగర్ పబ్లిక్ స్కూల్స్ ఘన విజయం
 సాక్షి, హైదరాబాద్: టెన్త్ పరీక్షల్లో దిల్‌సుఖ్‌నగర్ పబ్లిక్ స్కూల్ విద్యాసంస్థలు అత్యుత్తమ ఫలితాలను సాధించాయి. సంస్థకున్న ఐదు బ్రాంచీల నుంచి 1080 మంది విద్యార్థులు ఈసారి పరీక్షలకు హాజర వగా 97.4 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. 20 మంది విద్యార్థులకు 10/10 జీపీఏ లభించింది. వీరికి రుద్రా మెమోరియల్ మెరిట్ అవార్డు పేరిట రూ. 20 వేల నగదు బహుమతి అందించనున్నట్లు దిల్‌సుఖ్‌నగర్ విద్యాసంస్థల చైర్మన్ ఏవీఎన్ రెడ్డి తెలిపారు.  
 
 నంబర్ వన్ త్రివేణి
 సాక్షి, హైదరాబాద్: పదో తర గతి ఫలితాల్లో త్రివేణి టాలెంట్ స్కూల్స్ విద్యార్థులు విజయఢంకా మోగించారు. త్రివేణి విద్యా సంస్థల్లోని 20 మంది విద్యార్థులు ఏకంగా 10కి 10 గ్రేడ్ పాయింట్లు సాధించి అగ్రస్థానంలో నిలిచారు. అలాగే 61 మంది విద్యార్థులకు 9.8 పాయింట్లకుపైగా, 115 మందికి 9.7 పాయింట్లకుపైగా, 173 మందికి 9.5 పాయింట్లకుపైగా, 243 మందికి 9.3 పాయింట్లకుపైగా, 339 మందికి 9.2 పాయింట్లకుపైగా, 455 మందికి 9.0 పాయింట్లకుపైగా, 1072 మందికి 8 పాయింట్లకుపైగా సాధించినట్లు విద్యా సంస్థల డెరైక్టర్ డాక్టర్ గొల్లపూడి వీరేంద్రచౌదరి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 1563 మంది విద్యార్థులు అన్ని సబ్జెక్టుల్లో ఏ1 గ్రేడ్ సాధించి రాష్ర్టంలోనే ఎదురులేకుండా నిలిచారని చెప్పారు.
 
 డాక్టర్ కేకేఆర్ విద్యార్థుల ప్రభంజనం
 సాక్షి, హైదరాబాద్: పది ఫలితాల్లో డాక్టర్ కేకేఆర్ గౌతమ్ విద్యాసంస్థల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. విద్యాసంస్థలకు చెందిన కుషాయిగూడ బ్రాంచిలో 13 మందికి 10/10 గ్రేడ్ పాయింట్లు, కూకట్‌పల్లి బ్రాంచిలో ఆరుగురికి, దిల్‌సుఖ్‌నగర్ బ్రాంచిలో ఇద్దరికి, సత్తుపల్లి(ఖమ్మం జిల్లా) బ్రాంచిలో ఇద్దరికి కూడా 10కి 10 పాయింట్లు వచ్చాయి. డాక్టర్ కేకేఆర్ విద్యా సంస్థల్లోని 50 శాతానికిపైగా విద్యార్థులు 9.8 గ్రేడ్ పాయింట్లు పొంది తమ ప్రతిభను కనబరిచారు. తమ మొత్తం సరాసరి 8.9గా నమోదైందని డాక్టర్ కేకేఆర్ గౌతమ్ విద్యాసంస్థల చైర్మన్ కె.కోటేశ్వరరావు తెలిపారు.
 
 శ్రీచైతన్య స్కూల్ ఆల్‌టైమ్ రికార్డ్
 సాక్షి, హైదరాబాద్: టెన్త్ ఫలితాల్లో శ్రీచైతన్య స్కూల్-టెక్నో కరిక్యులమ్ రికార్డు సృష్టించింది. రాష్ర్టంలోనే అత్యధికంగా 158 మంది విద్యార్థులు జీపీఏ 10కి 10 సాధించారు. 448 మందికి 9.8 ఆపైన, 1297 మంది విద్యార్థులకు 9.5కిపైగా గ్రేడ్ పాయింట్లు లభించాయి. అంతేకాకుండా అన్ని సబ్జెక్టుల్లోనూ రాష్ర్టంలోనే అత్యధిక మంది విద్యార్థులకు ఏ1, ఏ2 గ్రేడ్లు సాధించి శ్రీచైతన్య స్కూల్-టెక్నో కరిక్యులమ్ సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టినట్లు అకడమిక్ డెరైక్టర్ సీమ వెల్లడించారు. ఇంటిగ్రేటెడ్ టెక్నో సిలబస్, టార్గెట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామ్స్ వల్లే ఇంతటి అద్భుత విజయం సాధించినట్లు పేర్కొన్నారు.
 
 కృష్ణవేణి టాలెంట్ స్కూల్ హవా
 సాక్షి, హైదరాబాద్: పదో తరగతి ఫలితాల్లో ఎప్పటిలాగే ఈసారి కూడా కృష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారు. 23 మంది విద్యార్థులు 10కి 10 గ్రేడ్ పాయింట్లు సాధించారు. ఈ సందర్భంగా మంచి ఫలితాలు సాధించిన విద్యార్థులకు కృష్ణవేణి విద్యాసంస్థల వ్యవస్థాపకులు ఎం.ఎం. షరీఫ్, రాజు అభినందనలు తెలిపారు.
 
 భాష్యం ధూమ్ ధామ్
 సాక్షి, హైదరాబాద్: ఎస్‌ఎస్‌సీ-2015 ఫలితాల్లో భాష్యం విద్యాసంస్థల విద్యార్థులు సత్తా చాటారు. రాష్ర్టంలోనే అత్యధికంగా ఒక్క హైదరాబాద్ నుంచే భాష్యం విద్యార్థులు 51 మంది 10/10 జీపీఏ సాధించి అత్యుత్తమ ఫలితాలు నమోదు చేశారు. రాష్ర్టంలో విడుదలైన తొలి ఎస్‌ఎస్‌సీ ఫలితాల్లో భాష్యం చరిత్ర సృష్టించిందని విద్యాసంస్థల అధినేత భాష్యం రామకృష్ణ తెలిపారు. విద్యార్థుల శ్రమ, ఉపాధ్యాయుల కృషితోనే ఇది సాధ్యమైందన్నారు.
 
 నారాయణ స్కూల్స్ విజయకేతనం
 సాక్షి, హైదరాబాద్: పదో తరగతి ఫలితాల్లో నారాయణ విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారు. 10కి 10 జీపీఏ సాధనలో రెండేళ్లుగా 400శాతం వృద్ధితో నారాయణ విద్యాసంస్థలు ప్రభంజనం సృష్టిస్తున్నాయి. ఈసారి రాష్ర్టవ్యాప్తంగా 11 నారాయణ స్కూల్స్‌లో వంద శాతం ఉత్తీర్ణత సాధించినట్లు నారాయణ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ఎండీ పి.సింధూర నారాయణ తెలిపారు. 112 మందికి 10కి 10 గ్రేడ్ పాయింట్లు, 301 మందికి 9.8కిపైగా జీపీఏ వచ్చినట్లు చెప్పారు.
 
 సత్తా చాటిన ‘ఎస్‌ఆర్’
 10/10 గ్రేడ్ సాధించిన 26 మంది విద్యార్థులు
 హన్మకొండ చౌరస్తా: పదో తరగతి వార్షిక ఫలితాల్లో వరంగల్, హన్మకొండలోని ఎస్‌ఆర్ పాఠశాల విద్యార్థులు సత్తా చాటారు. ఆదివారం ప్రకటించిన ఫలితాల్లో తమ విద్యార్థులు రాష్ట్రస్థాయిలో అత్యుత్తమ ఫలితాలు సాధించారని ఎస్‌ఆర్ విద్యాసంస్థల చైర్మన్ వరదారెడ్డి వెల్లడించారు.  హన్మకొండ పద్మాక్షికాలనీలోని ఎస్‌ఆర్ కళాశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తమ పాఠశాల నుంచి 26 మంది విద్యార్థులు 10/10 గ్రేడ్ పాయింట్లు, 76 మంది 9.8 పాయింట్లు, 72 మంది 9.7 పాయింట్లు, 112 మంది విద్యార్థులు 9.5 గ్రేడ్ పాయింట్లు సాధించారని వివరించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement