tenth class Results
-
పదో తరగతి ఫలితాలను విడుదల చేసిన మంత్రి సబితా
-
పదో తరగతి ఫలితాలు విడుదల చేసిన మంత్రి బొత్స
-
ఏపీలో పదో తరగతి ఫలితాలు విడుదల
-
వారంలో టెన్త్, ఇంటర్ ఫలితాలివ్వాలి
సాక్షి, అమరావతి: టెన్త్, ఇంటర్ ఫలితాల వెల్లడిపై దృష్టి సారించాలని అధికారులను విద్యా శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ ఆదేశించారు. శనివారం విద్యా శాఖ ఉన్నతాధికారులతో మంత్రి వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టెన్త్, ఇంటర్ ఫలితాల కోసం త్వరితగతిన ఉన్నత స్థాయి నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వారం రోజుల్లో ఫలితాలు ప్రకటించేలా చూడాలని సూచించారు. పాఠశాలలు తెరిచే అంశంపై లోతుగా పరిశీలన చేయాలని ఆదేశించారు. 2021–22 అకడమిక్ క్యాలెండర్ తయారు చేయాలని, పరిస్థితులను అనుసరించి తరగతుల నిర్వహణకు తీసుకోవాల్సిన చర్యలపై ఆలోచించాలని సూచించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. వైద్య ఆరోగ్య శాఖ సూచనల మేరకు తరగతుల నిర్వహణ తేదీని నిర్ణయించాల్సి ఉంటుందన్నారు. ‘సాల్ట్’ పర్యవేక్షణకు ప్రత్యేకాధికారులు రాష్ట్రంలో పాఠశాల విద్యను బలోపేతం చేసేందుకు ‘ఆంధ్రప్రదేశ్ అభ్యసన పరివర్తన’(సపోర్టింగ్ ఆంధ్రాస్ లెర్నింగ్ ట్రాన్స్ఫర్మేషన్–సాల్ట్)’ అనే పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని మంత్రి తెలిపారు. ఐదేళ్ల(2021–22 నుంచి) కాలపరిమితి కలిగిన ఈ పథకానికి ప్రపంచ బ్యాంకు 250 మిలియన్ అమెరికన్ డాలర్లు(రూ.1,860 కోట్లు) ఆర్థిక సహాయంగా అందిస్తోందని తెలిపారు. ఫలితాలే లక్ష్యంగా అమలయ్యే ఈ ప్రాజెక్టును.. నిర్వహణ సామర్థ్యం కలిగిన రాష్ట్రాలకు మాత్రమే ప్రపంచ బ్యాంకు ఇస్తుందని చెప్పారు. రాష్ట్రంలో ఈ పథకం పర్యవేక్షణ కోసం ఒక ఐఏఎస్ అధికారిని, జాయింట్ డైరెక్టర్ స్థాయి అధికారిని నియమిస్తామన్నారు. వైఎస్సార్ జిల్లాలో ఫిజికల్లీ చాలెంజ్డ్(దివ్యాంగ) పిల్లల కోసం ఏర్పాటైన వైఎస్సార్ విజేత స్కూల్ తరహాలో.. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో స్కూళ్లు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి చెప్పారు. ప్రాజెక్టు ఉద్దేశాలు.. సాల్ట్ పథకం ద్వారా బేస్మెంట్ లెర్నింగ్‌ను బలోపేతం చేయడంతో పాటు టీచర్లు, విద్యార్థుల పరస్పర సంబంధాలను, బోధనా నాణ్యతను మెరుగుపరుస్తామని మంత్రి సురేష్ చెప్పారు. అలాగే శిశు సంరక్షణ విద్యను పాఠశాలకు అనుసంధానించడం.. అంగన్వాడీ టీచర్లకు శిక్షణ, ఆటపాటల ఆధారిత టీచింగ్, మరుగుదొడ్లు, తాగునీరు వంటి మౌలిక సౌకర్యాలు కల్పించడం ఈ పథకంలో భాగమన్నారు. రాష్ట్రంలోని పాఠశాలల్లో ‘నాడు–నేడు’ పనులు పూర్తి చేయడంతో పాటు ప్రత్యేక అవసరాలున్న పిల్లల కోసం వనరుల కేంద్రాలను మెరుగుపరచడం, తల్లిదండ్రుల కమిటీలతో స్కూళ్లలో సామాజిక తనిఖీ తదితర కార్యక్రమాలను సమర్థంగా అమలు చేయడం ద్వారా విద్యా రంగంలో ప్రపంచ స్థాయి ప్రమాణాలను సాధించగలుగుతామని మంత్రి చెప్పారు. సమావేశంలో పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి బుడితి రాజశేఖర్, పాఠశాల విద్యా శాఖ సంచాలకులు వాడ్రేవు చినవీరభద్రుడు, సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు కె.వెట్రిసెల్వి, పాఠశాల విద్య సలహాదారు(ఇన్ ఫ్రా) ఎ.మురళి, సీమ్యాట్ డైరెక్టర్ వి.ఎన్.మస్తానయ్య పాల్గొన్నారు. -
వందన వాళ్లబ్బాయి
గ్రేడ్లు..తెలివితేటలను కొలవలేవు. మార్కులు, ర్యాంకులు.. అంటూ పిల్లలను ఊదరగొడుతున్న నేటి పోటీ ప్రపంచంలో ఒక అమ్మగా ఇది నేను నమ్మిన సత్యం. – వందన సూఫియా కటోచ్ డిసెంబర్ దాటిందంటే.. పదో తరగతి పిల్లలకు, వాళ్ల పెద్దవాళ్లకూ ఫైనల్ ఎగ్జామ్స్ మూడ్ (ఫోబియా అనాలేమో!) వచ్చేస్తుంటుంది. ‘కార్పొరేట్ విద్యాసంస్థల మాయాజాలంలో పడవద్దు. పిల్లలను ఒత్తిడికి గురి చేయవద్దు. తెలివితేటలు ర్యాంకుల్లో ఉండవు. పిల్లల్లో మేధాశక్తిని వికసించనివ్వండి. వాళ్లకు ఇష్టమైన కోర్సుల్లో చేరనివ్వండి. పదో తరగతి ఆ తరగతికే కానీ పరీక్ష జీవితానికి కాదు’ అని నెటిజన్లు ఒక పాత పోస్ట్‌ను తెరమీదకు తెచ్చారు. అదిప్పుడు మళ్లీ వైరల్ అవుతోంది! దాని గురించి తెలుసుకోవలసిందే. తనయులు ఆమెర్ (ఎడమ), ఆయాన్లతో వందన. చదువు వ్యాపారమైపోయి దాదాపుగా మూడు దశాబ్దాలవుతోంది. మన పిల్లలు ఏం చదవాలన్నది కార్పొరేట్ స్కూళ్లు నిర్ణయించేస్తున్నాయి. పిల్లల మార్కులు తొంబైకి తగ్గితే పేరెంట్స్‌ని పిలిచి క్లాస్‌లు పీకుతున్నాయి. టెన్త్ క్లాస్, ట్వల్త్ క్లాస్ రిజల్ట్స్ వస్తున్నాయంటే పిల్లల వెన్నులో వణుకు మొదలవుతుంటుంది. తల్లిదండ్రుల్లో ఆందోళన. ఇక రిజల్డ్స్కి ముందు ఇంట్లో ఆందోళనతో కూడిన మౌనం రాజ్యమేలుతుంటుంది. మార్కులు తగ్గితే అమ్మానాన్నలు తన మీద పెట్టుకున్న ఆశలకు విఘాతం కలుగుతుందేమోనని పిల్లలు నలిగిపోతుంటారు. మార్కులు తగ్గితే మంచి కాలేజ్‌లో సీట్ రాదేమో, పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుందో అని అమ్మానాన్నల గుండెలు పల్పిటేషన్కు గురవుతుంటాయి. ఇలాంటి రోజుల్లో... ఢిల్లీకి చెందిన వందన ‘స్ట్రెస్ బస్టర్’ విప్లవాన్ని తెచ్చారు. తల్లిదండ్రులందరూ వందనలాగానే ఆలోచిస్తే పిల్లల్లో చదువు ఒత్తిడి కానే కాదు. రాబోతున్న పరీక్షల సీజన్లో కూడా ఆడుతూ పాడుతూ హాయిగా చదువుకుంటారు. వందన ఏం చేసిందంటే గత ఏడాది (2018–19 విద్యా సంవత్సరం) వందన కొడుకు ఆమెర్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో పదోతరగతి పరీక్షలు రాశాడు. మే నెలలో రిజల్ట్స్ వచ్చాయి. వందనకు తన కొడుకు తొంబైలతో పాస్ కాడని తెలుసు. మొత్తానికైతే పాస్ అయి తీరుతాడనీ తెలుసు. తన కొడుకు తెలివితక్కువ వాడేమీ కాదు. ఎన్ని తెలివితేటలుంటే మాత్రం ‘చేప చెట్టెక్కుతుందా’ అనేది ఆమె ఫిలాసఫీ. ‘తనకు ఇష్టం లేని సబ్జెక్టులన్నీ చదవమంటే ఎన్నింటినని బలవంతంగా బుర్రలో దాచుకుంటాడు’ అని కూడా కొడుకు తరఫున వాదిస్తుంది. టెన్త్ పరీక్షలకు మూడు నెలల ముందు నుంచే ఆమె కొడుకు మీద ప్రత్యేక దృష్టి పెట్టింది. ఫెయిల్ కాకుండా ఉండడానికి మాత్రమే కొడుకు ప్రిపరేషన్ మీద దృష్టి పెట్టిందామె. ఆ పిల్లాడు తన శక్తి కొద్దీ కష్టపడ్డాడు కూడా. అరవై శాతం మార్కులతో పాసయ్యాడు. కొడుకు ముఖం చిన్నబుచ్చుకోకూడదని రిజల్ట్స్ రోజు, రిజల్ట్స్ ప్రకటించే సమయానికి వందన కూడా స్కూల్‌కెళ్లారు. అప్పటికే తొంభైశాతం స్టూడెంట్స్ అంతా ఒకరినొకరు అభినందించుకుంటూ కనిపించారు. తల్లిని చూడగానే వందన వాళ్లబ్బాయి దీనంగా ముఖం పెట్టి ‘‘సిక్స్టీ పర్సెంట్ అమ్మా’’ అన్నాడు. వందన అమాంతం కొడుకుని దగ్గరకు తీసుకుని ‘‘యూ మేడ్ మమ్మా ప్రౌడ్’’ అని ముద్దు పెట్టుకున్నారు! అదే విషయాన్ని ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. ‘‘మా అబ్బాయి సిక్స్టీ పర్సెంట్‌తో టెన్త్‌క్లాస్ పాసయ్యాడు. నాకు చాలా గర్వంగా ఉంది. మీరేమీ పొరబడడం లేదు. 90 పర్సెంట్ అని రాయబోయి ఆ అంకె పొరపాటున 60గా కంపోజ్ కాలేదు. నిజంగా 60 శాతమే. ఇష్టం లేని సబ్జెక్టు కోసం కష్టపడమని పిల్లలను వేధించడం కూడా తప్పే. మన విద్యావిధానంలో పదోతరగతి వరకు ఇష్టం ఉన్నా లేకపోయినా అన్ని సబ్జెక్టులనూ చదవాల్సిందే. టెన్త్ గట్టెక్కడం కోసం మాత్రమే మా అబ్బాయికి ఇష్టంలేని సబ్జెక్టులను కూడా దగ్గరుండి చదివించాను. ఇప్పుడా గండం గట్టెక్కేశాడు. ఇక మా వాడు ఫ్రీ. తనకు ఇష్టమైన సబ్జెక్టుల్లోనే ప్లస్ వన్ చదువుకుంటాడు’’ అని ఆమె పెట్టిన పోస్ట్‌ని దాదాపుగా తొమ్మిది వేల మంది లైక్ చేశారు. పన్నెండు వేల మంది సానుకూలమైన కామెంట్ చేశారు. మరో ఐదు వేల మందికి పైగా ఆ పోస్ట్‌ను షేర్ చేశారు. అరవై శాతం మార్కులను తక్కువగా చూసే వాళ్లకు ఇదో పాఠం అనే కామెంట్లు కూడా వచ్చాయి. – మంజీర -
రేపు టెన్త్ ఫలితాలు
సాక్షి, అమరావతి: పదో తరగతి పరీక్షా ఫలితాలు మంగళవారం ఉదయం విడుదల కానున్నాయి. విజయవాడలో పాఠశాల విద్యా శాఖ కమిషనర్ ఈ ఫలితాలను విడుదల చేయనున్నారు. మార్చి 18వ తేదీ నుంచి ఏప్రిల్ 3వ తేదీ వరకు 2,839 పరీక్షా కేంద్రాల్లో పదో తరగతి పరీక్షలు జరిగాయి. మొత్తం పరీక్ష రాసిన వారిలో 3,18,524 మంది బాలురు 3,03,110 మంది బాలికలు ఉన్నారు. పరీక్షలకు సంబంధించి మూల్యాంకనం ముందుగానే పూర్తి కావాల్సి ఉన్నా ఎన్నికల నేపథ్యంలో కొంత ఆలస్యమైంది. అయినా మూల్యాంకనాన్ని త్వరితగతిన పూర్తి చేసి ఫలితాల విడుదలకు పాఠశాల విద్యాశాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. -
ఉన్నది ఒకటే కిడ్నీ వదల్లేదు చదువుని
బళ్లారి, అర్బన్: ఆత్మ విశ్వాసంతో అనారోగ్యాన్ని సైతం అధిగమించి పదో తరగతిలో మెరుగైన ఫలితం సాధించిన అరుదైన విద్యార్థి సురేష్ అని అభినందనలు అందుకుంటున్నాడు. బళ్లారి నగరం కొళగల్లు రోడ్డులోని ఇందిరానగర్‌లో నివాసముంటున తాపీ మేస్త్రీ నాగరాజ్, నాగరత్నమ్మల ఏకైక కుమారుడు పుట్టుకతోనే అనారోగ్యంతో జన్మించాడని తల్లిదండ్రులు సాక్షితో తెలిపారు. గుగ్గరహట్టిలోని ఆదర్శ విద్యాలయంలో పదో తరగతి చదువుతున్న సురేష్ అక్టోబర్ నుంచి పూర్తిగా అనారోగ్యం బారిన పడడంతో ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స చేయిస్తున్నారు. సురేష్‌కు పుట్టుక నుంచే ఒక మూత్రపిండం లేదని వైద్యులు తేల్చారు. దీంతో మరో కిడ్నీపై అధిక భారం పడటంతో అది కూడా పూర్తి దెబ్బతినిందని వైద్యులు తెలిపారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. అయినప్పటికీ నిత్యం ఔషధాలు తీసుకుంటూ విద్యాభ్యాసంపై ఎంతో ఆసక్తి చూపే తమ కుమారుడు మూడు నెలల పాటు స్కూల్‌కు పోయి మరో 6 నెలలు ఇంట్లోనే ఉండి పూర్తిగా బెడ్ రెస్ట్ తీసుకున్నట్లు తెలిపారు. పదో తరగతిలో 514 మార్కులతో 82.24 శాతం ఉత్తీర్ణత సాధించాడని సంతోషం వ్యక్తం చేశారు. తమ కుమారునికి చికిత్స చేయించే స్తోమత తమకు లేదన్నారు. ఇప్పటికే గత అక్టోబర్ నుంచి ఇంతవరకు లక్ష రూపాయలకు పైగా ఖర్చు పెట్టామని తెలిపారు. సహాయ హస్తం కోసం వినతి తాను 600 మార్కులు సాధించాలనే లక్ష్యంతో పట్టుదలగా చదివానని సురేష్ అన్నాడు. ‘పాలిటెక్నిక్ చదివి ఇంజనీరింగ్ పూర్తి చేయాలన్నది లక్ష్యమన్నాడు. చదువుతో పాటు రైటింగ్, డ్రాయింగ్, మొబైల్ టెక్నాలజీలో చాకచక్యంగా ప్రతిభను చాటుకున్నాడని తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. ఆరోగ్యం బాగై అందరి పిల్లల మాదిరిగానే ఆడుకోవాలని భగవంతుని కోరుతున్నామన్నారు. తమ బిడ్డ వైద్యానికి దయగల దాతలు ఆర్థిక సాయం చేయాలని ఆ తల్లిదండ్రులు కోరారు. వివరాలకు మేస్త్రీ నాగరాజ్–9901142959 నంబరులో సంప్రదించాలని తెలిపారు. -
ఈరోజు రాత్రి టెన్త్ ఫలితాలు.. విద్యార్థులకు ఇక్కట్లు!
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ ప్లీనరీ కారణంగా తెలంగాణ పదో తరగతి పరీక్షల ఫలితాలు కాస్త ఆలస్యంగా వెలువడనున్నాయి. వాస్తవానికి శుక్రవారం ఉదయం టెన్త్ ఫలితాలు విడుదల కావాల్సి ఉండగా.. దానిని రాత్రి 7 గంటలకు వాయిదా వేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. శుక్రవారం ఉదయాన్నే టీఆర్ఎస్ ప్లీనరీ జరగనుండటంతో ఉదయం నుంచి సీఎం, మంత్రులు సహా అధికార పార్టీ గణమంతా రోజంతా అక్కడే బిజీగా ఉండనున్నారు. దీంతో ఫలితాలను వెల్లడించేందుకు ఉదయం అనువైన సమయం కాదని వాయిదా వేసినట్లు స్పష్టమవుతోంది. దీంతో శుక్రవారం రాత్రి 7 గంటలకు ఫలితాలను విడు దల చేయనున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం ఒక ప్రకటనలో తెలిపింది. ఫలితాల వెల్లడికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పేర్కొంది. సచివాలయంలోని డీ బ్లాక్‌లో టెన్త్ ఫలితాలను ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి విడుదల చేస్తారని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ సుధాకర్ తెలిపారు. మార్చిలో జరిగిన ఈ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 11,103 పాఠశాలలకు చెందిన 5,38,867 మంది హాజరయ్యారు. ఇందులో బాలురు 2,76,388 మంది కాగా, బాలికలు 2,62,479 మంది ఉన్నారు. సాయంత్రం ఫలితాలతో విద్యార్థులకు ఇక్కట్లు! పదో తరగతి ఫలితాలను రాత్రి విడుదల చేయనుండటంతో విద్యార్థులు ఫలితాలను చూసుకునేందుకు ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడింది. గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఇంటర్నెట్ కోసం తంటాలు పడాల్సిన పరిస్థితి నెలకొంది. టీఆర్ఎస్ ప్లీనరీ ఉన్నందున డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి సూచనల మేరకు అధికారులు ఫలితాల వెల్లడి సమయాన్ని మార్పు చేశారు. పదో తరగతి ఫలితాల కోసం - ఇక్కడ క్లిక్ చేయండి ఫలితాల కోసం.. www.sakshieducation.com www.sakshi.com వెబ్సైట్లను చూడొచ్చు -
రేపు రాత్రి 7గంటలకు టెన్త్ రిజల్ట్స్
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో పదవ తరగతి పరీక్షా ఫలితాలు శుక్రవారం విడుదల కానున్నాయి. అయితే ఉదయం 10 గంటలకు విడుదల కావాల్సిన ఫలితాలు రాత్రి 7 గంటలకు విడుదల చేయనున్నారు. సెక్రటేరియట్ డీ బ్లాక్‌లో రేపు రాత్రి ఏడు గంటలకు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి చేతుల మీదగా ఫలితాలను విడుదల చేయనున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ ఓ ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా మార్చి 15 నుంచి ఏప్రిల్ రెండో తేదీ వరకు జరిగిన పరీక్షలకు మొత్తం 5,38,867 మంది విద్యార్థులు హాజరు కాగా, అందులో 2,62,479 మంది బాలికలు, 2,76,388 మంది బాలురు ఉన్నారు. టెన్త్ ఫలితాలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
నేడు పది ఫలితాలు
సాక్షి, చెన్నై: పదో తరగతి ఫలితాల విడుదలకు రాష్ట్ర పరీక్షల విభాగం సర్వం సిద్ధం చేసింది. బుధవారం ఉదయం సరిగ్గా తొమ్మిదిన్నర గంటలకు ఫలితాలను పరీక్షల విభాగం డెరైక్టర్ వసుంధరా దేవి విడుదల చేయనున్నారు. రాష్ట్రంలోని పదో తరగతి విద్యార్థులకు పబ్లిక్ పరీక్షలు మార్చి పదిహేను నుంచి ఏప్రిల్ 13 వరకు జరిగాయి. పది లక్షల 72 వేల 185 మంది రెగ్యులర్, 48 వేల 564 మంది ప్రైవేటు విద్యార్థులు పరీక్షలు రాశారు. ఈ పరీక్షా ఫలితాల విడుదలకు ఎన్నికలు కాస్త అడ్డంకిగా మారాయి. ప్లస్‌టూ ఫలితాలు గత వారం విడుదల చేయడంతో, తాజాగా పదో తరగతి ఫలితాల విడుదలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. నుంగంబాక్కంలోని డీపీఐ ఆవరణలో ఉన్న పరీక్షల విభాగంలో డెరైక్టర్ వసుంధరా దేవి ఫలితాల విడుదలకు అన్ని చర్యలు తీసుకున్నారు. సరిగ్గా ఉదయం తొమ్మిదిన్నర గంటలకు ఫలితాలు విడుదల చేయనున్నారు. ఫలితాలను తమ నంబర్లతో పాటుగా, పుట్టిన తేదీని టైప్ చేసి ఆన్లైన్లో విద్యార్థులు తెలుసుకోవచ్చు. అలాగే, ఆయా జిల్లాల కలెక్టరేట్ల వద్ద, పాఠశాలల్లోనూ ఫలితాల్ని తెలుసుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఫలితాలను విద్యార్థులు www. tnresults.nic.in, www.dge1tnnic.in, www.dge2tn.nic.in ద్వారా తెలుసుకోవచ్చు. తాత్కాలిక మార్కుల జాబితాను జూన్ ఒకటో తేదీ నుంచి www.dgetn.nic.in నుంచి డౌన్లోడ్ చేసుకుని ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయుల నుంచి సంతకాలు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రత్యేక సప్లిమెంటరీ: ప్లస్‌టూ ఫలితాలు గత వారం విడుదలైన విషయం తెలిసిందే. ఇందులో ఉత్తీర్ణత సాధించని విద్యార్థులకు ఏడాది కాలం వృధా కాకుండా, ప్రత్యేక సప్లిమెంటరీ నిర్వహిస్తున్నారు. ఆ మేరకు జూన్ 22 నుంచి జూలై నాలుగో తేదీ వరకు ఈ పరీక్షలు జరుగుతాయి. ఇందుకు ఆన్లైన్ ద్వారా ఈనెల 27లోపు విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుందని పరీక్షల విభాగం ప్రకటించింది.