‘రింగ్’ రింగా..!
అర్థబలం, అంగబలం.. ప్రజాప్రతినిధుల కొండంత అండతో కొందరు వ్యాపారులు మద్యం దుకాణాలను దక్కించుకునేందుకు సర్వశక్తులూ ఒడ్డారు. ఎక్సైజ్‌శాఖ కొత్త మద్యం పాలసీలోనూ పాత సిండికేట్ కింగ్‌లే సరికొత్త వ్యూహంతో పాగా వేసేందుకు పావులు కదిపారు. తమకు అనుకూలురు, ఆర్థికంగా పరిపుష్టిగల వారిని చేరదీసి.. రంగంలోకి దించి బంపర్ ఆఫర్ ఇచ్చేశారు..! తమ శక్తియుక్తులను ఉపయోగించి సింగిల్‌టెండర్ పడేలా యత్నించి సఫలమయ్యారు. సోమవారం నిర్వహించే లక్కీ డ్రాలో అదృష్టవంతులెవరో తేలనుంది. ఆ 14 షాపులు వశమయ్యేదెవరికో వెల్లడి కానుంది.
మహబూబ్‌నగర్ క్రైం: మద్యం టెండర్ల ప్రక్రియ ముగిసింది. అదృష్టవంతుల జాబితాను మా త్ర మే ప్రకటించనుంది. నేడు(సోమవారం) లక్కీ డ్రా ప్రక్రియకు జిల్లాకేంద్రంలోని అంబేద్క ర్ క ళాభవన్ వేదికకానుంది. మొత్తం 194 మ ద్యం దుకాణాలకు భారీసంఖ్యలో టెండర్లు దా ఖల య్యాయి. కొన్నిప్రాంతాల్లో వ్యాపారులు రింగ్ అయినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. జిల్లా లో మూడు ఎక్సైజ్ ఎస్‌హెచ్‌ఓ పరిధిలోని మహబూబ్‌నగర్, గద్వాల, నాగర్‌కర్నూల్‌లో మద్యం దుకాణాలకు టెండరుదారులు పోటీపడ్డారు. గతేడాది 1288 దరఖాస్తులు రాగా, ఈ సారి 2028 వచ్చాయి. దీంతో గతేడాది కంటే 40 శా తం పెరిగాయి. టెండర్లలో సిండికేట్ల హవా కొ నసాగింది. ధరావత్తు రూ.25వేలు భరిస్తే షాపు నిర్ధిష్ట ధరలో 10 శాతం సొమ్మును డిపాజిట్ సిండికేట్ కంపెనీ భరించే విధంగా ఒప్పందం కుదుర్చుకుంటున్నారు. అంతేకాకుండా వ్యాపారంలో 10 శాతం వాటా ఇస్తామని హామీ ఇస్తున్నారు.
బొంరాస్‌పేట, దోమలపెంట, మన్ననూర్, గ ట్టు, ఖిల్లాఘనపూర్‌లో రెండు, పెద్దమందడి, అ మరచింత, తుంకిమెట్లలోని మద్యం దుకాణాలను సింగిల్ టెండర్ల దాఖలుదారులు దక్కిం చుకున్నా రు. జిల్లాలో అత్యధిక శాతం షాద్‌నగ ర్ డివిజన్ పరిధిలోని 21 మద్యం దుకాణాలకు భారీసంఖ్యలో 256 టెండర్లు వేశారు. అత్యల్పంగా వనపర్తి పరిధిలోని 8 షాపులకు 38 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. అలాగే జిల్లా కేం ద్రంలోని నాలుగు దుకాణాలతో పాటు వివిధ ప్రాంతాల్లో 9 వైన్స్‌షాపులకు సింగిల్ దరాఖాస్తు మాత్రమే వచ్చింది. దీంతో ఆయా ప్రాంతాల్లోని టెండర్‌దారులు వేసిన షాపులు వారికి హస్తగతమైనట్లే..
194 మద్యం దుకాణాలకు ఎక్సైజ్ అధికారులు టెండర్లు ఆహ్వానించారు. టెండర్ల దరఖాస్తు ఫీజును రూ.25వేలుగా నిర్ణయించారు. ఈ మొత్తం వైన్స్‌షాపులకు 2028 టెండర్లు వ చ్చాయి. దీన్నివల్ల ప్రభుత్వానికి రూ.5.70కోట్ల ఆదాయం సమకూరిందని డిప్యూటీ ఎక్సైజ్‌కమిషనర్ గోపాలకృష్ణ తెలిపారు.
శ్లాబ్ విధానంలో ఇలా..
జిల్లాలో మూడు శ్లాబ్ విధానంలో లెసైన్స్ ఫీజులను నిర్ణయించారు. 10వేల జనభా ఉన్న చోట రూ.32.50లక్షలుగా నిర్ణయించారు. ఈ కేటాగిరిలో మహబూబ్‌నగర్ యూనిట్ పరిధిలోని షాదనగర్, జడ్చర్ల, కొడంగల్‌లో 25 దుకాణాలకు 324 దరఖాస్తులొచ్చాయి.
10 వేల నుంచి 50వేల జనాభా ఉన్న చోట రూ.34 లక్షలుగా నిర్ణయించారు. ఈ విభాగంలో 18 మద్యం దుకాణాలకు 125 టెండర్లు దాఖలయ్యాయి.
50 వేల నుంచి 3 లక్షల జనభా కలిగి ఉన్న ప్రాంతంలో 25 దుకాణాలకు 219 దరాఖాస్తులు వచ్చాయి.
డివిజన్ల వారీగా..
గద్వాల డివిజన్ పరిధిలోని.. గద్వాల యూనిట్ పరిధిలోని గద్వాల, నారాయణపేట, వనపర్తి, కొత్తకోట, అలంపూర్, ఆత్మకూర్‌లో రూ.32.50 లక్షలుగా నిర్ణయించిన ప్రాంతంలో 21 దుకాణాలకు 271 టెండర్లు వచ్చాయి. రూ.34లక్షల కేటాగిరిలో 34 మద్యం దుకాణాలకు 320 దరఖాస్తులొచ్చాయి. రూ.42లక్షల లెసైన్స్‌ఫీజు నిర్ణాయించిన వాటిలో 13 దుకాణాలకు 92 దరఖాస్తులు వచ్చాయి.
నాగర్‌కర్నూల్ డివిజన్.. రూ.32.50లక్షల ఫీజు నిర్ణయించిన ప్రాంతాల్లో 27 దుకాణాలకు 252 దరఖాస్తులు రాగా, 34 లక్షలుగా నిర్ధేశించినచోట 34 వైన్స్‌షాపులకు 326 టెండర్లు దాఖలయ్యాయి.
నేడు లక్కీడిప్‌కు ఏర్పాట్లు
ఇదివరకే టెండర్ల దాఖలు ప్రక్రియ ముగియడంతో నేడు జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ కళాభవన్‌లో లక్కీడిప్ తీసేందుకు సంబంధిత ఎక్సైజ్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. టెండర్ వేసిన వారినే లోపలికి అనుతించనున్నారు. హాల్‌లో మూడు ప్రత్యేకటెండర్ పెట్టెలను ఏర్పాటుచేసి ఏ డివిజన్ వారికి సంబంధించిన టెండర్లను అక్కడే తీసేవిధంగా చర్యలు చేపట్టారు. డ్రాలో విజేతలను కలెక్టర్ ఎం.గిరిజాశంకర్ ఆధ్వర్యంలో ప్రకటిస్తారు. ముందుగా సింగిల్‌టెండర్ వేసినవారికి దుకాణాలను కేటాయిస్తారు. ఒక వ్యక్తికి ఒకే షాప్ కేటాయించనున్నారు.