నిందితుల ఆటకట్టు
వారికి మనుషుల ప్రాణాలంటే లెక్కలేదు.. వెండి ఆభరణాలను అపహరించేందుకు కూలి పనిచేసే మహిళలను లక్ష్యంగా చేసుకున్న ఓ కిరాతకుడు కేవలం మూడు నెలల్లోనే ఏడుగురి హత్య చేసి పోలీసులను ముచ్చెమటలు పెట్టించాడు.. పక్కా పథకం ప్రకారం ఎవరికీ అంతుబట్టని విధంగా హత్యలకు పాల్పడ్డాడు.. ఇతడిని చివరకు పోలీసులు అతి చాకచక్యంగా వల వేసి పట్టుకున్నారు.. ఈ మానవ మృగం చేసిన అకృత్యాలను బట్టబయలు చేశారు.. మరో సంఘటనలో ఓ మహిళ కుదువపెట్టిన తమ ఇంటిని విడిపించుకోవడానికి ఏకంగా ముగ్గురిని హత్య చేసింది.. ఎట్టకేలకు ఆమె ఆటకట్టించారు పోలీసులు.. అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.. బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ నాగేంద్రకుమార్, అడిషనల్ ఎస్పీ ప్రకాశ్‌రావుతో కలిసి విలేకరుల సమావేశంలో ఈ కేసుల వివరాలను వెల్లడించారు.
- మహబూబ్‌నగర్ క్రైం
మహబూబ్‌నగర్ మండలం కోడూరుకు చెందిన 22ఏళ్ల వడ్డె రాజు ఆటో నడుపుకొంటూ జీవించేవాడు. కొన్ని నెలలక్రితం ఆర్థిక ఇబ్బందులతో హైదరాబాద్ నగరానికి వెళ్లి కొన్ని రోజుల పాటు సెక్యూరిటీ గార్డుగా పని చేశాడు. అదే సమయంలో అక్కడి పద్మతో వివాహేతర సంబంధం ఏర్పరచుకుని తిరిగి స్వగ్రామానికి తీసుకొచ్చాడు. అయితే తల్లిదండ్రులు వారిని ఇంట్లో ఉంచుకునేందుకు నిరాకరించడంతో జిల్లా కేంద్రంలోని టీడీగుట్ట ప్రాంతంలో అద్దె ఇంట్లో నివాసం ఉండసాగారు. కొన్ని రోజుల పాటు తన సోదరుడి కి చెందిన ఆటోను నడిపాడు. తిరిగి అతను వాహనం తీసుకెళ్లడంతో రాజుకు మళ్లీ ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి. దీంతో అతడికి దొంగతనం చేయాలనే ఆలోచ న వచ్చింది. దానిని అప్పటికప్పుడే అమలు చేసేందుకు పక్కా ప్రణాళికలు మొదలు పెట్టాడు. ఇందులో భాగంగానే కూలి పనులకు వచ్చే మహిళలను టార్గెట్ చేసుకున్నాడు.
దీనికి జిల్లా కేంద్రంలోని తిరుమల థియేటర్‌ను ఎంచుకున్నాడు. కూలి పని కోసం అక్కడికి ప్రతిరోజూ వివిధ ప్రాంతాల నుంచి వచ్చే మహిళలను పరిశీలించేవాడు. వారి కాళ్లకు వెండి ఆభరణాలు ఉంటేచాలు నమ్మించి ఆటోలో నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి వారికి మాయమాటలు మద్యం తాగించి బండరాయితో మోది దారుణంగా హత్య చేస్తాడు. ఒంటిపై ఉన్న వెండి ఆభరణాలను దొంగలిచి, మృతదే హాన్ని అడవుల్లో పారవేస్తాడు. ఇలా మూడు నెలల్లోనే ఏడుగురిని హత్య చేశాడు.
మొదటగా గత మార్చి 22న హ న్వాడ మండలం వేపూర్‌కు చెందిన దంతపల్లి నర్సమ్మ (35) ను జిల్లా కేంద్రంలోని తిరుమల టాకీస్ వద నుంచి పని ఉందని నిందితుడు రాజు జీపులో ఎక్కించుకుని కోడూర్ శివారులోకి తీసుకెళ్లి హత్య చేసి రెండు వెండి కడియాలను దొంగిలించాడు.
23న మహబూబ్‌నగర్ మండలం వెంకటాపూర్‌కు చెందిన డోకూర్ వెంకటమ్మ (40) ను జిల్లా కేంద్రంలోని అదే టాకీస్ ప్రాంతం నుంచి ఆర్‌టీసీ బస్సులో మన్యంకొండకు తీసుకెళ్లాడు. అక్కడి గుట్టల్లో మద్యం తాపి రాయితో మోది చంపి నగలను దోచుకున్నాడు.
ఏప్రిల్ 27వ తేదీ మధ్యాహ్నం దొడ్డలోనిపల్లికి చెందిన మంజలి శాంతమ్మ (43) ను తన ఆటోలో ఎక్కించుకుని అప్పాయిపల్లి శివారులోని గుట్టలోకి తీసుకెళ్లి చంపి వెండి కడియాలను అపహరించాడు.
మే1న జైనల్లీపూర్‌కు చెందిన బియ్యన్ని ఎల్లమ్మ (35) ను బండమీదపల్లి శివారులోని రెడ్డి సేవా సమితి బిల్డింగ్ వెనక ఉన్న గుట్టల ప్రాంతంలోకి తీసుకెళ్లి చంపేశాడు.
18న ఓ గుర్తుతెలియని మహిళను ధర్మాపూర్ సమీపంలోని మదీనా బీఈడీ కళాశాల వెనక వైపునకు తీసుకెళ్లి హత్య చేశాడు.
జూన్ 6న నవాబుపేట మండలం చౌడాపూర్‌కు చెందిన చెన్నమ్మ (35) కూలి పనులకు జిల్లా కేంద్రంలోని పాత బస్టాండు వద్దకు వచ్చింది. ఇదే అదనుగా భావించిన నిందితుడు బైక్‌పై భూత్పూర్ మండలం పాత మొల్గర శివారులోని నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి కల్లు తాగించి.. హత్య చేసి వెండి నగలను దొంగిలించాడు.
20న హ న్వాడ మండలం కొత్తపేటకు చెందిన పారుపల్లి యాదమ్మ (42) ను నవాబుపేట మండలం కాకర్లపహాడ్ శివారులోని పర్వతాపూర్ మైసమ్మ అడవుల్లోకి తీసుకెళ్లి దారుణంగా హత్య చేశాడు.
మరో మహిళపై హత్యాయత్నం : గత ఏప్రిల్ 15న హన్వాడ మండలంలోని కొనగట్టుపల్లికి చెందిన గూడెం అలివేలును ఆటోలో ఎక్కించుకుని జమిస్తాపూర్ శివారులోకి తీసుకెళ్లి బండరాయితో మోదాడు. చనిపోయిందని భావిం చిన రాజు అమె కాళ్ల పట్టీలు, కడియాలను తస్కరించాడు. అనంతరం బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. నిందితుడిని బుధవారం రిమాండ్‌కు తరలిచారు. కేసును ఛేదించిన డీఎస్పీ మల్లికార్జున్, రూరల్ సీఐ లక్ష్మీనారాయణ, ఎస్‌ఐ గాంధీనాయక్, ఏఎస్‌ఐ రమేష్‌రెడ్డిని ఎస్పీ అభినందిం రూ.25 వేల క్యాష్ రివార్డును అందజేశారు. నిందితుల వద్ద 320 తులాల వెండి ఆభరణలు ఆటో, బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు.