జిల్లాకేంద్రంలో బుధవారం ఉదయం నుంచీ పడుతున్న చినుకులు రాత్రి ఎనిమిది గంటల సమాయానికి ఒక్కసారిగా కుండపోతగా మారింది. ఎడతెరిపి లేకుండా అర్ధరాత్రి దాకా వర్షం కురుస్తూనే ఉంది.
దీంతో జిల్లా కేంద్ర ఆస్పత్రి పరిసరాలన్నీ జలమయమయ్యాయి. వరదనీటితో డ్రెయినేజీలు నిండుకుని చుక్కనీరు కూడా బయటకు వెళ్లని దుస్థితి నెలకొంది. దీంతో కాన్పుల వార్డు, పిల్లలవార్డు, వనజాత శిశు కేంద్రంలోకి ఒక్కసారిగా వరద నీరు వచ్చిపడింది. దీంతో ఆ వార్డుల్లో చికిత్స పొందుతున్న వారంతా ఆందోళనకు లోనయ్యారు. బాలింతలు, చిన్నారులు కిందకు దిగ లేక నానా ఇబ్బందులు పడ్డారు. చివరకు వారి సహాయకులతో ఒక్కొక్కరుగా బయట వచ్చారు.
ఆస్పత్రికి ఇదేమి గండం
Published Thu, Oct 24 2013 3:16 AM | Last Updated on Wed, Aug 29 2018 4:16 PM
Advertisement
Advertisement