బంగారం తగ్గిందండోయ్‌.. కొత్త ఏడాదిలో తొలిసారి.. | Today Gold and Silver Price (January 4th 2025) down | Sakshi
Sakshi News home page

బంగారం తగ్గిందండోయ్‌.. కొత్త ఏడాదిలో తొలిసారి..

Published Sat, Jan 4 2025 12:21 PM | Last Updated on Sat, Jan 4 2025 12:34 PM

Today Gold and Silver Price (January 4th 2025) down

కొత్త ఏడాది ప్రారంభం నుంచి వరుసగా పెరుగుతున్న బంగారం ధరలు (Gold Price) తొలిసారి ఈరోజు (January 4) తగ్గాయి. క్రితం రోజున బంగారం ధర 10 గ్రాములకు గరిష్టంగా రూ.870 పెరిగింది. జనవరి 1 నుంచి 3 వరకు రూ.1,640 వరకూ పెరిగింది. దీంతో తులం బంగారం రేటు రూ. 80వేలకు చేరువయింది. ఈ క్రమంలో నేడు పసిడి ధరలు దిగరావడంతో కొనుగోలుదారులకు ఊరట కలిగింది.

బంగారం ధరలు ద్రవ్యోల్బణం , గ్లోబల్ ధరలలో మార్పు, సెంట్రల్ బ్యాంక్ గోల్డ్ రిజర్వ్, హెచ్చుతగ్గుల వడ్డీ రేట్లు, నగల మార్కెట్‌లతో సహా అనేక అంతర్జాతీయ కారకాలపై ఆధారపడి ఉంటాయి. నేటి బంగారం ధరలు ఏయే ప్రాంతంలో ఎలా ఉన్నాయనేది ఈ కథనంలో తెలుసుకుందాం.

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు
ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లోని హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు వంటి ప్రాంతాల్లో ఈరోజు బంగారం 10 గ్రాముల ధరలు రూ.450 (22 క్యారెట్స్), రూ.490 (24 క్యారెట్స్) తగ్గాయి. దీంతో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 72,150కు, 24 క్యారెట్ల పసిడి రేటు రూ. 78,710 వద్దకు దిగి వచ్చాయి.

ఇతర ప్రాంతాల్లో.. 
దేశ రాజధాని ఢిల్లీ ప్రాంతంలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల రేటు రూ.78,860 వద్ద.. 22 క్యారెట్ల పసిడి ధర రూ.72,300 వద్ద ఉంది. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు వరుసగా రూ.450,  రూ.490 చొప్పున తగ్గుదలను నమోదు చేశాయి.

చైన్నైలో బంగారం ధరల విషయానికి వస్తే.. ఇక్కడ 22 క్యారెట్ల పసిడి రేటు 10 గ్రాములకు రూ.450 తగ్గి రూ. 72,150 వద్దకు, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.490 క్షీణించి రూ. 78,710 వద్దకు దిగివచ్చాయి. బెంగళూరు, ముంబై ప్రాంతాల్లోనూ ఇవే ధరలు ఉన్నాయి.

వెండి ధరలు
2025 ఏడాదిలో వెండి ధరలు కూడా నేడు తొలిసారి తగ్గుదలను నమోదు చేశాయి. కొత్త సంవత్సరం ప్రారంభం నుంచి నిలకడగా ఉన్న వెండి ధరలు క్రితం రోజున ఏకంగా రూ. 2000 పెరిగింది. దీంతో నిరాశచెందిన కొనుగోలుదారులకు ఈరోజు ఊరట కలిగింది.

హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో వెండి ధర కేజీకి రూ. 1000 చొప్పున తగ్గి రూ.99,000 వద్దకు దిగివచ్చింది. ఇక ఢిల్లీలో కూడా రూ.1000 క్షీణించి రూ. 91,500 వద్దకు తగ్గింది.

(Disclaimer: పైన పేర్కొన్న బంగారం ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి).

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement