ప్రభుత్వ ఆస్పత్రుల్లో కార్పొరేట్ వైద్య సేవలు
ప్రభుత్వ ఆస్పత్రుల్లో కార్పొరేట్ వైద్య సేవలు
Published Sat, Sep 10 2016 7:52 PM | Last Updated on Wed, Aug 29 2018 4:18 PM
నల్లగొండ టౌన్
ప్రభుత్వ ఆస్పత్రుల్లో పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలను అందించేందుకు అన్ని మౌలిక సదుపాయాలను కల్పించే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి. జగదీశ్‌రెడ్డి అన్నారు. శనివారం స్థానిక జిల్లా ప్రభుత్వ కేంద్ర ఆస్పత్రిలో రూ.46 లక్షల వ్యయంతో ఏర్పాటుచేసిన బ్లడ్ కాంపోనెంట్ యూనిట్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఆస్పత్రి ౖÐð ద్యులు, సిబ్బంది నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వైద్య సేవలను అందించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వ ఎన్నకల ముందు ఇచ్చిన హామీలకంటే ఎక్కువ సేవలను ప్రజలకు అందిస్తుందన్నారు. గతంలో డెంగ్యూ బాధితులు వైద్య పరీక్షల కోసం హైదరాబాద్‌కు వెళ్లి వేలాది రూపాయలను ఖర్చు చేయాల్సి వచ్చేదని, కాని ఇప్పటి నుంచి ఆ పరిస్థితి ఉండదని ఫ్రభుత్వ ఆస్పత్రిలోనే పరీక్షలను చేయించుకోవచ్చన్నారు. ప్లెట్‌లెట్ పరీక్షలను చేయడానికే బ్లడ్ కాంపోనెంట్‌ను ఏర్పాటు చేశామని తెలిపారు. యువత పెద్ద ఎత్తున రక్తదానం చేయడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ బాలూనాయక్, కలెక్టర్ పి.సత్యనారాయణరెడ్డి, మిర్యాలగూడ ఎమ్మెల్యే ఎన్.భాస్కర్‌రావు, దుబ్బాక నర్సింహరెడ్డి, డీసీహెచ్‌ఎస్ డాక్టర్ పద్మజ, ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ టి.నర్సింగరావు, యూనిట్ ఇన్‌చార్జి డాక్టర్ ఎం.నర్సింహ, డాక్టర్ పుల్లారావు, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement