రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి
రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి
Published Fri, Sep 9 2016 6:34 PM | Last Updated on Mon, Oct 1 2018 2:44 PM
నల్లగొండ టౌన్ : జిల్లాలో తీవ్ర కరువు పరిస్థితులు ఎదుర్కొంటున్న రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత రెండేళ్లుగా జిల్లాలో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నా ప్రభుత్వం ఎలాంటి కరువు నివారణ చర్యలు చేపట్టడంలేదని విమర్శించారు. రైతుల పంట రుణాలను రీషెడ్యూల్ చేసి పంట రుణాలను ఏక కాలంలో ఇప్పించాలన్నారు. కొత్తగా ఏర్పాటు చేసే జిల్లాలు, మండలాల విషయంలో ప్రజల ప్రయోజనాలను పరిగణలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈనెల 11 నుంచి 17వ తేదీ వరకు జిల్లాలో వీర తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో పి.అనంతరామశర్మ, తిరందాసు గోపి, రాములు, మల్లు లక్ష్మి, నర్సింహ, బి.శ్రీశైలం, ఎం.సుధాకర్‌రెడ్డి, పి.నర్సింహ, తదితరులున్నారు.
Advertisement
Advertisement