హామీలను విస్మరించిన ప్రభుత్వం
హామీలను విస్మరించిన ప్రభుత్వం
Published Wed, Sep 21 2016 7:41 PM | Last Updated on Wed, Aug 29 2018 4:18 PM
నల్లగొండ టౌన్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టుల పేరుతో 5లక్షల ఎకరాల పేదల భూములను లాక్కునేందకు కుట్ర పన్నుతోందని అఖిల భారత వ్యవసాయకార్మిక సంఘం జాతీయ కౌన్సిల్ సమావేశాల ఆహ్వాన సంఘం చైర్మన్, సీపీఎం జిల్లా కార్యదర్శి జూలకంటి రంగారెడ్డి ఆరోపించారు. బుధవారం స్థానికంగా ప్రారంభమైన వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ కౌన్సిల్ సమావేశాలలో ఆయన ప్రారంభోపాన్యాసం చేశారు. సమావేశాలను వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ అధ్యక్షుడు తిరునావక్కరసు జెండాను ఆవిష్కరించి ప్రారంభించారు. ఈ సందర్భంగా రంగారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ సాయుధపోరాటంలో 4వేల మంది అమరులయ్యారని.. పది లక్షల ఎకరాల భూముల పేదలకు పంచినట్లు తెలిపారు. దళితులకు మూడెకరాల భూమి, డబుల్‌బెడ్‌రూం ఇళ్లు, కేజీ టు పీజీ వరకు ఉచిత నిర్బంధ విద్య అమలు చేయలేదని విమర్శించారు. ప్రజా సమస్యల పరిస్కారం కోసం అక్టోబర్ మాసంలో మహాజన పాదయాత్రను నిర్వహిస్తామని తెలిపారు. అనంతరం సంఘం జాతీయ అధ్యక్షుడు ఎ.విజయరాఘవన్ ఎజెండాను ప్రవేశపెట్టారు. ఈ సమావేశంలో జాతీయ నాయకులు సునిల్‌చోప్రా, కిసాన్ సభ నాయకులు హన్నమొల్లా, జాతీయ ఉపా«ధ్యక్షుడు బి.వెంకట్, రాష్ట్ర నాయకులు కొండూరు వీరయ్య, బి.ప్రసాద్, టి.వెంకట్రాములు, మచ్చా వెంకటేశ్వర్లు, నారి అయిలయ్య, బి.పద్మ, ఎం.రాములు, 15 రాష్ట్రాలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు.
Advertisement