టీఆర్‌ఎస్‌తోనే తెలంగాణ రాష్ట్ర వికాసం సాధ్యపడుతుందని నిజామాబాద్ లోక్‌సభ టీఆర్‌ఎస్ అభ్యర్థిని కల్వకుంట్ల కవిత అన్నారు.
చంద్రశేఖర్‌కాలనీ,న్యూస్‌లైన్: టీఆర్‌ఎస్‌తోనే తెలంగాణ రాష్ట్ర వికాసం సాధ్యపడుతుందని నిజామాబాద్ లోక్‌సభ టీఆర్‌ఎస్ అభ్యర్థిని కల్వకుంట్ల కవి త అన్నారు. కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఆమె కోరారు. జిల్లా కేం ద్రంలోని కంఠేశ్వర్ న్యూ హౌసింగ్‌బోర్డులో గల ఆమె నివాసంలో మంగళవా రం వేల్పూర్ మండలం వాడి,కుకునూ ర్, వెంకటాపూర్, అంక్సాపూర్ గ్రామ సర్పంచులతోపాటు పలువురు గ్రామస్తులు టీఆర్‌ఎస్‌లో చేరారు. అనంతరం ఆమె మాట్లాడారు.
తెలంగాణ రాష్ట్ర సా దన కోసం టీఆర్‌ఎస్ పార్టీ చేసిన పో రాట ఫలితంగా, వందలాది మంది యువకులు, విద్యార్థుల ఆత్మబలిదానాలతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నా రు. గత పాలకుల వివక్షతో తెలంగాణ అన్నిరంగాల్లో వెనుకబడిందన్నారు. అ భివృద్ధిలో వెనుకబడిన తెలంగాణను అన్నిరంగాల్లో అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ ఏర్పాటుకు పాటుపడిన పార్టీ అభ్యర్థులను గెలిపించి బం గారు తెలంగాణను నిర్మించుకుందామన్నారు.