Kalva kuntla kavitha
-
రేపు ఢిల్లీకి కేటీఆర్, హరీశ్‌రావు.. ఎమ్మెల్సీ కవితతో భేటీ
సాక్షి,న్యూఢిల్లీ: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు ఆదివారం(ఆగస్టు 4) ఢిల్లీ వెళ్లనున్నారు. తీహార్ జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కవితతో ఇద్దరు భేటీ అయ్యే అవకాశం ఉంది. సుప్రీంకోర్టులో బెయిల్ దరఖాస్తుకు ఏర్పాట్లు చేయనున్నారు.మరోపక్క సుప్రీంకోర్టులో పార్టీ మారిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ కూడా వేసే అవకాశం ఉంది. ఇరువురు మూడు రోజులు ఢిల్లీలోనే ఉండనున్నారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసలో ఎమ్మెల్సీ కవిత అరెస్టయి తీహార్ జైలులో జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న విషయం తెలిసిందే. -
నేడు రౌస్ అవెన్యూ కోర్టులో కవిత కేసు విచారణ
సాక్షి,న్యూఢిల్లీ : నేడు లిక్కర్ స్కాంలో సీబీఐ కేసుపై రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరగనుంది. సీబీఐ కేసులో కవితపై దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌ను పరిగణలోకి తీసుకునే అంశంపై ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు కేసు విచారణకు రానుంది. సీబీఐ దాఖలు చేసిన చార్జ్‌షీట్‌లో ఏముందిఢిల్లీ మద్యం పాలసీలో మార్చి 15న ,2024న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్ట్ చేసింది. అదే కేసులో ఏప్రిల్ 11న సీబీఐ అరెస్ట్ చేసింది. ఆ సమయంలో మద్యం కేసులో కవిత ప్రమేయం ఉందని ఆరోపిస్తూ పలు ఆధారాలతో కూడిన ప్రిలిమినరీ ఛార్జ్‌షీట్‌ను సీబీఐ దాఖలు చేసింది. అయితే ఈ కేసు విచారణ కొనసాగుతున్న సమయంలో సీబీఐ, ఈడీ కేసుల్లో తనకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ కవిత పిటిషన్లు దాఖలు చేస్తున్నారు.ఈడీ,సీబీఐ ఆధారాల్ని తోసిపుచ్చలేంకోర్టు విచారణ సమయంలో సీబీఐ, ఈడీలు కొత్త ఆధారాల్ని వెలికితీయడం, కోర్టు జ్యుడీషియల్ కస్టడీ విధించడం వంటి కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ తరుణంలో ఢిల్లీ హైకోర్టులో బెయిల్ కోరుతూ బెయిల్ పిటిషన్ దాఖలు చేసింది. ఆ పిటిషన్లపై విచారణ చేపట్టిన హైకోర్టు.. మద్యం పాలసీ కేసులో కవిత ప్రమేయం ఉందని నిరూపించేలా ఈడీ,సీబీఐ ఆధారాలు సేకరించిందని, వాటిని తోసిపుచ్చలేమని స్పష్టం చేసింది. బెయిల్ ఇచ్చేందుకు తిరస్కరించింది.మరిన్ని ఆధారాలు ఉన్నాయంటూఈ నేపథ్యంలో ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో సీబీఐ సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. పాలసీ కేసుకు సంబంధించి తమ వద్ద మరిన్ని ఆధారాలు ఉన్నాయని, మరోసారి విచారించేందుకు అనుమతి కావాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్లో తెలిపింది. ఈ పిటిషన్‌పై మధ్యాహ్నం 2 గంటలకు విచారణ జరగనుంది. ఒకవేళ సీబీఐ దాఖలు చేసిన ఛార్జిషీట్‌పై కోర్టు సానుకూలంగా స్పందిస్తే.. దానికి అనుబంధ ఛార్జిషీట్ దాఖలు చేసి.. కేసుకు సంబంధిత కొత్త ఆధారాల్ని కోర్టుకు అందజేయాల్సి ఉంటుంది. -
ఎంపీ అర్వింద్ ఇప్పటికీ మభ్యపెడుతూనే ఉన్నాడు: ఎమ్మెల్సీ కవిత
సాక్షి, నిజామాబాద్ : బీజేపీ ఎంపీ అరవింద్‌పై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బుధవారం మీడియాతో మాట్లాడుతూ..‘‘కరవుతో అల్లాడిన తెలంగాణ రాష్ట్రం ఇవాళ సుభిక్షంగా ఉంది. కేంద్రంతో కొట్లాడినా ధాన్యం కొనకుంటే రాష్ట్రమే కొంటోంది. మరోవైపు ఉద్యోగాల కల్పన, పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, మహిళల అభివృద్ధి వంటి ఎన్నో పథకాలను టీఆర్ఎస్ తీసుకువచ్చింది. ఈ జిల్లాలో అబద్ధాలు చెప్పి.. ఒట్టును గట్టుమీద పెట్టిన బీజేపీ నాయకులున్నారు. ఎంపీ అరవింద్‌పై ఇప్పటివరకు నేను ఏమీ మాట్లాడలేదు. కానీ, ఇప్పటికీ ఆయన మభ్యపెడుతూనే ఉన్నాడు. పసుపు బోర్దు ఏర్పాటు కోసం ప్రధాని మోదీ, నిర్మలా సీతారామన్‌కు లేఖ కూడా రాశాం. పసుపు బోర్డు ఏర్పాటు కోసం ఇతర ముఖ్యమంత్రుల మద్దతు కూడా తీసుకున్నాము. బాబా రాందేవ్, బాలకిషన్ వంటివాళ్లను కూడా తీసుకువచ్చి వారితో కూడా ఇక్కడ పసుపు బోర్డు ఆవశ్యకతను చెప్పించాం. 2015లో రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రాన్ని కోరింది. ఇలా పలుమార్లు విన్నవించినా కేంద్రంలో చలనం లేదు. 2017లో స్పైస్ బోర్డ్ ఆఫీస్, ఫీల్డ్ ఆఫీస్, డివిజన్ ఆఫీస్ ఇన్ని తీసుకొచ్చినా.. బీజేపీ మాత్రం సాయమందించలేదు. తానే పసుపు రైతులకు అంతా చేసినట్టు అరవింద్ చెబుతున్నాడు. అరవింద్‌వి పసుపు రైతులకు ఉచిత సలహాలు. 90 వేల మందికి పైగా రైతులు పసుపు పండిస్తే.. ఆయన తీసుకొచ్చిన నిధులు 2 కోట్లు కూడా కాదు. అదే ఈ ఐదేళ్లలో తెలంగాణ ప్రభుత్వం రైతులకు 50 వేల కోట్లు కేటాయించింది. తెలంగాణ ప్రజలకు నిజమైన సంరక్షణ అందించేది టీఆర్ఎస్ ప్రభుత్వమే. ఉత్తరమే రాయలేదంటున్న అరవింద్‌కు మీడియా ముఖంగా మా ప్రభుత్వం రాసిన ఉత్తరాన్ని చూపిస్తున్నా. ఈ మూడేళ్ళలో నాలుకకు మడత లేకుండా అరవింద్ అబద్ధాలు ఆడాడు. అన్ని భాషల్లో హైస్పీడ్ అబద్ధాలు చెప్పడం తప్పితే బీజేపీ చేసిందేమీలేదు. కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టడం తప్ప బీజేపీ ఏమీచేయదు. కావాలంటే కేంద్రంలో బీజేపీ పాలన.. ఇక్కడ టీఆర్ఎస్ పాలనను ప్రజలు పోల్చి చూసుకోవాలి. అబద్ధాలకోరులను ప్రజలు తరిమికొట్టాలి. ఇంకా రెండేళ్ల పదవీకాలం ఉన్న అరవింద్.. ఎప్పుడు పసుపు బోర్డు తెస్తాడు.. ఎప్పుడు మద్దతు ధర సాధిస్తాడో చెప్పాలి. మోకాళ్ళ యాత్ర చేస్తారో.. మోకరిల్లుతారోగానీ పసుపు బోర్డు తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నాం.. లేకుంటే రైతులే అడుగడుగునా అడ్డుకుంటారు. గ్రూప్ వన్ ఉర్దూ మీడియం పేరిట కొత్త వివాదం లేపకుండా.. కేంద్రం ఎన్ని ఉద్యోగాలు కల్పిస్తుందో చెప్పాలి. వరికి సంబంధించి మాట్లాడమంటే.. మాట్లాడని రాహుల్.. ఇక్కడ తెలంగాణాలో రైతు సంఘర్షణ సభ పెట్టడంలో అర్థం లేదు. 2014 నుంచి తెలంగాణకు సంబంధించి రాహుల్ గాంధీ ఒక్కమాట కూడా మాట్లాడలేదు’’ అని విమర్శించారు. ఇది కూడా చదవండి: తడిసి ముద్దయిన ధాన్యం.. రైతుల్లో ఆందోళన -
కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్.. ఆ డబ్బు ఏమైందో చెప్పాలి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఏడేళ్ల టీఆర్ఎస్ పాలనలో విశ్వనగరం.. విష నగరంగా మారిందని కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ గౌడ్ అన్నారు. గాంధీ భవన్లో శుక్రవారం మధు యాష్కీ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ తెలంగాణ రాష్ట్రం డ్రగ్స్‌కి అడ్డాగా మారింది. ఏడేళ్ల తెలంగాణ టీఆర్ఎస్ పాలనలో విశ్వనగరం.. విష నగరంగా మారింది. 50 ఏండ్లలో కాంగ్రెస్ ఏం చేసిందని అంటున్నావు కేటీఆర్.. ఐటీకి హైదరాబాద్‌ని హబ్‌గా చేసింది. నీ హయంలో హైదరాబాద్ డ్రగ్స్‌కి క్యాపిటల్ సిటీగా మారింది. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్.. సోనియా వల్లే స్వరాష్ట్రం వచ్చింది. ఏడేళ్లలో విద్యార్థులను మత్తుకు బానిసగా మార్చేశారు.. హైదరాబాద్‌ను విష నగరం చేశారు. రాష్ట్రంలో అన్ని ఛార్జీలు పెంచుతూ జనాన్ని ఏప్రిల్ ఫూల్ చేశారు. విద్యుత్ ఛార్జీలు పెరిగాయి. ఆర్టీసీ ఛార్జీలు పెంచారు. ఆసుపత్రుల్లో రోగులను ఎలుకలు కొరుకుతుంటే సిగ్గుగా అనిపించడం లేదా?. కేసీఆర్‌కు పంటి నొప్పి వస్తే ఢిల్లీకి పోతారు.. టెస్టుల కోసం యశోద ఆసుపత్రికి వెళ్తారు. ప్రత్యేక విమానానికి పెట్టిన ఖర్చుతో ఒక ఐసీయూ ఏర్పాటు చేయొచ్చు. ప్రతీ గింజా కొంటా అని చెప్పిన కేసీఆర్... కల్లబొల్లి మాటలు ఆపి కల్లాల్లో ఉన్న ధాన్యాన్ని కొనాలి. రైతులను నట్టేట ముంచి రైస్ మిల్లర్లతో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులు కుమ్మక్కు అయ్యారు. నిజామాబాద్‌లో రైస్ మిల్లర్లతో కల్వకుంట్ల కవిత కుమ్మక్కు అయ్యింది. బీజేపీకి చిత్తశుద్ది ఉంటే సీబీఐతో విచారణ జరిపించాలి. ఆత్మహత్య చేసుకున్న రైతులకు డబ్బులు ఇస్తా అని కవిత కోట్లు వసూలు చేసింది. ఆ డబ్బులు ఏమయ్యాయో చెప్పాలి. పోలీసులు ట్రాఫిక్ చాలన్ల పేరుతో 250 కోట్లు వసూలు చేశారు. పబ్బుల కట్టడిని ఎందుకు పట్టించుకోవడం లేదు. కమిషనర్ సీవీ ఆనంద్ నిజాయితీ గల అధికారి.. ప్రభుత్వం ఒత్తిడికి లొంగకుండా పబ్‌లలో డ్రగ్స్ మాఫియాను కట్టడి చేయాలి. కేసీఆర్ తెలంగాణను మత్తులో ముంచతూ విద్యుత్ ఛార్జీలు పెంచారు. నిరుద్యోగులను టీఆర్ఎస్ ప్రభుత్వం నిండా ముంచింది. అటు భద్రాచలం రాముడికి కేసీఆర్ టోపీ పెట్టాడు. భద్రాద్రి రాముడికి పట్టు బట్టలు కోసం కూడా డబ్బులు ఇవ్వడం లేదు. అధికారంలో ఉన్నవాళ్లు చేయాల్సింది ఆందోళన కాదు.. పరిష్కారం చూపాలి. కొట్లాడి తెలంగాణ తెచ్చిన అని చెప్పుకునే కేసీఆర్.. నువ్వు అంత మొనగాడివి అయితే కేంద్రం చేత వడ్లు ఎందుకు కొనిపించడం లేదు’’ అని ప్రశ్నించారు. ఇది చదవండి: కమలంలో ముసలం.. పార్టీలో గ్రూపు రాజకీయాలు.. -
వార్ వన్ సైడే: ఎంపీ కవిత
నిజామాబాద్: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో వార్ వన్ సైడేనని ఎంపీ కవిత ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో 16 పార్లమెంట్ స్థానాలను టీఆర్ఎస్ కైవసం చేసుకుంటుందని ఆమె పేర్కొన్నారు. మరొక సీటు ఎంఐఎం గెలుచుకుంటుందన్నారు. ‘తెలంగాణలోని 16 ఎంపీ సీట్లలో టీఆర్ఎస్దే విజయం. సెక్రటేరియట్లో కోసం డిఫెన్స్ ల్యాండ్ విషయంలో కేంద్రం సహకరించడం లేదు. ఇవ్వాళ ఢిల్లీకి వెళ్తున్నాం. పార్లమెంట్లో టీఆర్ఎస్ ఎంపీలంతా పోరాటం చేస్తాం. ప్రధాని మోదీని కూడా కలిసి నిలదీస్తాం. గరీబీ హఠావో లాంటి కాంగ్రెస్ నినాదాలు స్లోగన్స్ వరకే మిగిలిపోతున్నాయి. ప్రియాంక గాంధీ వచ్చినా దేశానికి ఒరిగిదేమీ లేదు. బీజేపీ-కాంగ్రెసేతర పార్టీలు కేంద్రంలో రావాలి. గల్ఫ్ బాధితుల విషయంలో ఏజెంట్లపై చర్యలు తీసుకునే ప్రక్రియ చేపడుతున్నాం’ అని కవిత పేర్కొన్నారు. -
నోరు విప్పిన డీఎస్; కేసీఆర్ కోర్టులో బంతి!
సాక్షి, హైదరాబాద్: అధికార టీఆర్ఎస్ పార్టీలో తన పాత్ర చుట్టూ చోటుచేసుకుంటోన్న వ్యవహారాలపై ధర్మపురి శ్రీనివాస్(డీఎస్) ఎట్టకేలకు నోరు విప్పారు. జరుగుతున్న పరిణామాలు దురదృష్టకరమని, క్రమశిక్షణ గురించి ఎవరో తనకు చెప్పాల్సిన అవసరంలేదని వ్యాఖ్యానించారు. బుధవారం ఉదయం తనను కలిసిన విలేకరులతో ‘‘నో కామెంట్.. నన్నేమీ అడగొద్దు..’’ అన్న డీఎస్... సాయంత్రానికి హైదరాబాద్‌లో మీడియాతో చిట్‌చాట్ చేశారు. ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ చీఫ్ కె.చంద్రశేఖర్‌రావును డీఎస్ కలవాల్సిఉన్నా, అంతకుముందే ఆయన మీడియాతో మాట్లాడటం, అదే సమయంలో ‘కేసీఆర్‌తో డీఎస్ అపాయింట్మెంట్ రద్దు’ వార్తలు రావడం గమనార్హం. నాతో మాట్లాడితే సరిపోయేది: ‘‘నేను ఏ పార్టీలో ఉన్నా ఒక పద్ధతి ప్రకారం పనిచేస్తాను. క్రమశిక్షణ గురించి ఒకరు నాకు చెప్పాల్సిన పనిలేదు. నిజామాబాద్‌లో జరుగుతోన్న పరిణామాలు దురదృష్టకరం. ఏవైనా తేడాలుంటే నాతో మాట్లాడాల్సింది. కానీ ఏకంగా ఫిర్యాదు లేఖ రాయాల్సిన అవసరం ఏమొచ్చిందో ఎంపీ కవితను, ఎమ్మెల్యేలనే అడగండి. సరే, ఏది ఏమైనా ముఖ్యమంత్రి కేసీఆర్ ఎలా చెబితే అలా. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా నాకు ఓకే. అది ఆయన చేతుల్లోనే ఉంది. సీఎం అపాయింట్మెంట్ అడిగాను కానీ అటు నుంచి స్పందన ఏదీ రాలేదు’’ అని డీఎస్ చెప్పారు. ఢిల్లీకి వెళ్లాను కానీ.. అది అబద్ధం: తాను ఢిల్లీకి వెళ్లినమాట వాస్తవమేనని అయితే వ్యక్తిగత పనుల కోసమే తప్ప రాజకీయాల కోసం కాదని డీఎస్ స్పష్టం చేశారు. ‘‘ఢిల్లీలోని నా క్వార్టర్ రిపేర్ పనులు జరుగుతున్నాయి. ఆ పని చూసుకుని తిరిగొచ్చేశాను. అక్కడ నేను కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్‌ను కలిశానని చెప్పడం పచ్చి అబద్ధం. టీఆర్ఎస్లో చేరిన తర్వాత ఇతర పార్టీ నేతలను కలవడమే మానేశా. అయినా, ఢిల్లీ వెళ్తే కాంగ్రెస్ నేతలు తప్ప ఇంకెవరు కనిపిస్తారు?’’ అని డీఎస్ పేర్కొన్నారు. కొడుకు అరవింద్ గురించి: ‘‘పెద్దాయన ఒక పార్టీలో ఉంటూ కార్యకర్తలను మాత్రం ఇంకో పార్టీలో చేరమని ప్రోత్సహిస్తున్నారు..’’అన్న ఎంపీ కవిత వ్యాఖ్యలకు డీఎస్ వివరణ ఇచ్చారు. ‘‘మా అబ్బాయి ఇండిపెండెంట్. తనకు తాను స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటాడు. వాటితో నాకు సంబంధంలేదు. అతని వ్యవహారాల్లో నేను తలదూర్చను’’ అని డీఎస్ చెప్పుకొచ్చారు. డీఎస్‌పై చర్యలు తీసుకోండి: మూడేళ్ల కిందట కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లోకి వచ్చిన డి.శ్రీనివాస్.. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఎంపీ కవిత నేతృత్వంలోని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నాయకుల బృందం సీఎం కేసీఆర్‌కు లేఖ రాసిన సంగతి తెలిసిందే. గత మూడు రోజులుగా డీఎస్ ఢిల్లీలో ఉన్నారని, అక్కడ కాంగ్రెస్ ముఖ్య నేతలతో ఆయన మంతనాలు జరిపాలరని నేతలు ఆరోపించారు. -
టీఆర్ఎస్తోనే తెలంగాణ అభివృద్ధి
చంద్రశేఖర్‌కాలనీ,న్యూస్‌లైన్: టీఆర్ఎస్తోనే తెలంగాణ రాష్ట్ర వికాసం సాధ్యపడుతుందని నిజామాబాద్ లోక్‌సభ టీఆర్ఎస్ అభ్యర్థిని కల్వకుంట్ల కవి త అన్నారు. కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఆమె కోరారు. జిల్లా కేం ద్రంలోని కంఠేశ్వర్ న్యూ హౌసింగ్‌బోర్డులో గల ఆమె నివాసంలో మంగళవా రం వేల్పూర్ మండలం వాడి,కుకునూ ర్, వెంకటాపూర్, అంక్సాపూర్ గ్రామ సర్పంచులతోపాటు పలువురు గ్రామస్తులు టీఆర్ఎస్లో చేరారు. అనంతరం ఆమె మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సా దన కోసం టీఆర్ఎస్ పార్టీ చేసిన పో రాట ఫలితంగా, వందలాది మంది యువకులు, విద్యార్థుల ఆత్మబలిదానాలతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నా రు. గత పాలకుల వివక్షతో తెలంగాణ అన్నిరంగాల్లో వెనుకబడిందన్నారు. అ భివృద్ధిలో వెనుకబడిన తెలంగాణను అన్నిరంగాల్లో అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ ఏర్పాటుకు పాటుపడిన పార్టీ అభ్యర్థులను గెలిపించి బం గారు తెలంగాణను నిర్మించుకుందామన్నారు. -
దశమి రోజు
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: టికెట్ ఖాయమని తెలిసినా పీసీసీ మాజీ చీఫ్ డి.శ్రీనివాస్, మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితతో పాటు కాంగ్రెస్, టీఆర్ ఎస్, టీడీపీ, వైఎస్ఆర్ సీపీ, బీజేపీ తది తర పార్టీల నేతలు ముహూర్తం కోసం ఆగారు. బుధవారం దశమి, అందులో శ్రీరామ పట్టాభిషేకం జరిగిన ముహూర్తం కావడంతో ప్రధాన పార్టీల నేతలందరూ నామినేషన్లు దాఖలు చేయనున్నారు. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా నామినేషన్ల కేంద్రాల వద్ద జిల్లా యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. అంతా సిద్ధం లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల నామినేషన్లకు బుధవారం తెరపడుతుంది. 10న నామినేషన్ల పరిశీలన ఉంటుం ది. 12 తేదీ నామినేషన్ల ఉప సంహరణకు గడువు కా గా, ఈనెల 30న పోలింగు ఉంటుంది. ఈ నేపథ్యం లో ఈనెల 13 నుంచి ఎన్నికల ప్రచారం హోరెత్తనుం ది. ఎన్నికల సంఘం ఇప్పటికే ప్రచారసరళిపై నిఘా ముమ్మరం చేసింది. వచ్చే నెల 16న ఓట్ల లెక్కింపు, ఫలితాలు ఉంటాయి. నిన్నటి వరకు టికెట్ల కోసం ఢిల్లీ, హైదరాబాద్‌లో ‘క్యూ’ కట్టిన నేతలు, నేడు జిల్లాలోని తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో బా రులు తీరనున్నారు. పార్లమెంట్ అభ్యర్థులు జిల్లా ఎన్నికల అధికారి కార్యాలయంలో, ఎమ్మెల్యే అభ్యర్థులు నియోజకవర్గం కేంద్రంలో తహశీల్దారు/ఆర్డీఓ కార్యాలయాల్లో నామినేషన్లు దాఖలు చేస్తారు. నేడు నామినేషన్ వేసేది వీరే నిజామాబాద్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి టీ ఆర్ఎస్ అభ్యర్థిగా కల్వకుంట్ల కవిత, కాంగ్రెస్ నుం చి మధుయాష్కీ గౌడ్, వైఎస్ఆర్ సీపీ అభ్యర్థిగా సింగిరెడ్డి రవీందర్‌రెడ్డి, బీజేపీ నుంచి పొద్దుటూరి సదానందరెడ్డి, యెండల లక్ష్మీనారాయణ, పీఆర్ సోమాని నామినేషన్ వే యనున్నట్లు ప్రకటించారు. నిజామాబాద్ రూరల్ అభ్యర్థులుగా కాంగ్రెస్ నుంచి ధర్మపురి శ్రీనివాస్ (డీఎస్), బాజిరెడ్డి గోవర్ధన్ (టీఆర్ ఎస్), గడ్డం ఆనంద్‌రెడ్డి (బీజేపీ), బొడ్డు గంగారెడ్డి(వైఎస్ఆర్ సీపీ)లు నామినేషన్ వేయనున్నారు. నిజామాబాద్ అర్బన్ నుంచి వైఎస్ఆర్ సీపీ అభ్యర్థిగా అంతిరెడ్డి శ్రీధర్‌రెడ్డి, బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ (కాంగ్రెస్), బిగాల గణేశ్ గుప్తా (టీఆర్ఎస్), మీర్ మ జాజ్ అలీ (ఎంఐఎం), బీజేపీ అభ్యర్థులుగా డాక్టర్ బాపురెడ్డి, ధన్పాల్ సూర్యనారాయణ గుప్తాలు వేయనున్నారు. బోధన్‌లో మాజీ మంత్రి పొద్దుటూరి సుదర్శన్‌రెడ్డి (కాంగ్రెస్), మహమ్మద్ షకీల్ (టీఆర్ఎస్), మేడపాటి ప్రకాశ్‌రెడ్డి (టీడీపీ), బీజేపీ, వైఎస్ఆర్ సీపీల నుంచి కెప్టెన్ కరుణాకర్‌రెడ్డి, తూము శరత్‌రెడ్డిలు నామినేషన్ వేయనున్నట్లు పేర్కొన్నారు. కామారెడ్డిలో మాజీ మంత్రి, కాంగ్రెస్ అభ్యర్థి షబ్బీర్ అలీ నామినేషన్ వేయనున్నారు. వైఎస్ఆర్ సీపీ నుంచి చిల్కూరు కృష్ణారెడ్డి, టీఆర్ఎస్ అభ్యర్థి గంప గోవర్ధన్‌లు కూడ నామినేషన్లు వేస్తారు. ఆర్మూర్ నియోజకవర్గంలో కేఆర్ సురేశ్‌రెడ్డి (కాంగ్రెస్), రాజారాం యాదవ్ (టీడీపీ), ఆశన్నగారి జీవన్‌రెడ్డి (టీఆర్ఎస్), మార చంద్రమోహన్లు నామినేషన్ వేయనున్నట్లు ప్రకటించారు. బాల్కొండ నుంచి ఈరవత్రి అనిల్ (కాంగ్రెస్), డాక్టర్ ఏలేటి మల్లికార్జున్‌రెడ్డి (టీడీపీ), వేముల ప్రశాంత్‌రెడ్డి (టీఆర్ఎస్)లు నామినేషన్లు వేయనున్నారు. జుక్కల్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా సౌదాగర్ గంగారాం, హన్మంత్ సింధే(టీఆర్ఎస్), వైఎస్ఆర్ సీపీ అభ్యర్థిగా నాయుడు ప్రకాశ్‌లు నామినేషన్ వేయనున్నారు. అయితే కాంగ్రెస్ రెబల్‌గా అరుణతార, ఎమ్మెల్సీ రాజేశ్వర్‌లు కూడ నామినేషన్ వేసే అవకాశం ఉంది. బాన్సువాడకు కాసుల బాలరాజు (కాంగ్రెస్), పోచారం శ్రీనివాస్‌రెడ్డి (టీఆర్ఎస్), టీడీపీ, వైఎస్సార్సీల నుంచి బద్యానాయక్, రాంమోహన్‌లు నామినేషన్ వేయనున్నారు. ఎల్లారెడ్డి నుంచి పటోళ్ల సిద్దార్థరెడ్డి (వైఎస్సార్సీపీ), నల్లమడుగు సురేందర్ (కాంగ్రెస్ ), ఏనుగు రవీందర్‌రెడ్డి (టీఆర్ఎస్), బాణాల లక్ష్మారెడ్డి (బీజేపీ)లు నామినేషన్ వేయనున్నట్లు ప్రకటించారు. -
నవ తెలంగాణ నిర్మాణానికి పునాదులు వేయాలి
కథలాపూర్, న్యూస్‌లైన్: స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించి, నవ తెలంగాణ నిర్మాణానికి పునాదులు వేయాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. గురువారం రాత్రి ఆమె మండలంలోని తక్కళ్లపల్లిలో టీఆర్ఎస్ జెడ్పీటీసీ అభ్యర్థి తుల ఉమకు మద్దతుగా ప్రచారం చేశారు. ఈ సందర్భం గా గ్రామంలో నిర్వహించిన బహిరంగసభలో ఆమె మా ట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన టీఆర్ఎస్తోనే రాష్ట్ర పునర్నిర్మాణం సాధ్యమవుతుందన్నారు. అందుకే స్థా నిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించి బలం పెంచాలన్నారు. మాజీ మంత్రి శ్రీధర్‌బాబు సొంత జిల్లాలోనే యువతకు ఉపాధి చూపించలేకపోయారని, జిల్లా లో పరిశ్రమలు నెలకొల్పితే ఇక్కడి యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడుతాయనే ధ్యాస కూడా ఆయనకు లేకుండాపోయిందని విమర్శించారు. టీఆర్ఎస్ అధికారం లోకి వస్తే తెలంగాణ రాష్ట్రంలో రైతులు పండించిన పం టలకు మద్దతు ధర కల్పించి బోనస్ ఇస్తామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు రమేశ్‌బాబు, విద్యాసాగర్‌రావు, కథలాపూర్ జెడ్పీటీసీ అ భ్యర్థి తుల ఉమ, నాయకులు లోక బాపురెడ్డి, నాగం భూమయ్య, కల్లెడ శంకర్, నాగేశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు.