సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: టికెట్ ఖాయమని తెలిసినా పీసీసీ మాజీ చీఫ్ డి.శ్రీనివాస్, మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితతో పాటు కాంగ్రెస్, టీఆర్ ఎస్, టీడీపీ, వైఎస్‌ఆర్ సీపీ, బీజేపీ తది తర పార్టీల నేతలు ముహూర్తం కోసం ఆగారు. బుధవారం దశమి, అందులో శ్రీరామ పట్టాభిషేకం జరిగిన ముహూర్తం కావడంతో ప్రధాన పార్టీల నేతలందరూ నామినేషన్లు దాఖలు చేయనున్నారు. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా నామినేషన్ల కేంద్రాల వద్ద జిల్లా యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది.
అంతా సిద్ధం
లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల నామినేషన్లకు బుధవారం తెరపడుతుంది. 10న నామినేషన్ల పరిశీలన ఉంటుం ది. 12 తేదీ నామినేషన్ల ఉప సంహరణకు గడువు కా గా, ఈనెల 30న పోలింగు ఉంటుంది. ఈ నేపథ్యం లో ఈనెల 13 నుంచి ఎన్నికల ప్రచారం హోరెత్తనుం ది. ఎన్నికల సంఘం ఇప్పటికే ప్రచారసరళిపై నిఘా ముమ్మరం చేసింది. వచ్చే నెల 16న ఓట్ల లెక్కింపు, ఫలితాలు ఉంటాయి. నిన్నటి వరకు టికెట్ల కోసం ఢిల్లీ, హైదరాబాద్‌లో ‘క్యూ’ కట్టిన నేతలు, నేడు జిల్లాలోని తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో బా రులు తీరనున్నారు. పార్లమెంట్ అభ్యర్థులు జిల్లా ఎన్నికల అధికారి కార్యాలయంలో, ఎమ్మెల్యే అభ్యర్థులు నియోజకవర్గం కేంద్రంలో తహశీల్‌దారు/ఆర్‌డీఓ కార్యాలయాల్లో నామినేషన్లు దాఖలు చేస్తారు.
నేడు నామినేషన్ వేసేది వీరే
నిజామాబాద్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి టీ ఆర్‌ఎస్ అభ్యర్థిగా కల్వకుంట్ల కవిత, కాంగ్రెస్ నుం చి మధుయాష్కీ గౌడ్, వైఎస్‌ఆర్ సీపీ అభ్యర్థిగా సింగిరెడ్డి రవీందర్‌రెడ్డి, బీజేపీ నుంచి పొద్దుటూరి సదానందరెడ్డి, యెండల లక్ష్మీనారాయణ, పీఆర్ సోమాని నామినేషన్ వే యనున్నట్లు ప్రకటించారు.
నిజామాబాద్ రూరల్ అభ్యర్థులుగా కాంగ్రెస్ నుంచి ధర్మపురి శ్రీనివాస్ (డీఎస్), బాజిరెడ్డి గోవర్ధన్ (టీఆర్ ఎస్), గడ్డం ఆనంద్‌రెడ్డి (బీజేపీ), బొడ్డు గంగారెడ్డి(వైఎస్‌ఆర్ సీపీ)లు నామినేషన్ వేయనున్నారు.
నిజామాబాద్ అర్బన్ నుంచి వైఎస్‌ఆర్ సీపీ అభ్యర్థిగా అంతిరెడ్డి శ్రీధర్‌రెడ్డి, బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ (కాంగ్రెస్), బిగాల గణేశ్ గుప్తా (టీఆర్‌ఎస్), మీర్ మ జాజ్ అలీ (ఎంఐఎం), బీజేపీ అభ్యర్థులుగా డాక్టర్ బాపురెడ్డి, ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తాలు వేయనున్నారు.
బోధన్‌లో మాజీ మంత్రి పొద్దుటూరి సుదర్శన్‌రెడ్డి (కాంగ్రెస్), మహమ్మద్ షకీల్ (టీఆర్‌ఎస్), మేడపాటి ప్రకాశ్‌రెడ్డి (టీడీపీ), బీజేపీ, వైఎస్‌ఆర్ సీపీల నుంచి కెప్టెన్ కరుణాకర్‌రెడ్డి, తూము శరత్‌రెడ్డిలు నామినేషన్ వేయనున్నట్లు పేర్కొన్నారు.
కామారెడ్డిలో మాజీ మంత్రి, కాంగ్రెస్ అభ్యర్థి షబ్బీర్ అలీ నామినేషన్ వేయనున్నారు. వైఎస్‌ఆర్ సీపీ నుంచి చిల్కూరు కృష్ణారెడ్డి, టీఆర్‌ఎస్ అభ్యర్థి గంప గోవర్ధన్‌లు కూడ నామినేషన్లు వేస్తారు.
ఆర్మూర్ నియోజకవర్గంలో కేఆర్ సురేశ్‌రెడ్డి (కాంగ్రెస్), రాజారాం యాదవ్ (టీడీపీ), ఆశన్నగారి జీవన్‌రెడ్డి (టీఆర్‌ఎస్), మార చంద్రమోహన్‌లు నామినేషన్ వేయనున్నట్లు ప్రకటించారు.
బాల్కొండ నుంచి ఈరవత్రి అనిల్ (కాంగ్రెస్), డాక్టర్ ఏలేటి మల్లికార్జున్‌రెడ్డి (టీడీపీ), వేముల ప్రశాంత్‌రెడ్డి (టీఆర్‌ఎస్)లు నామినేషన్లు వేయనున్నారు.
జుక్కల్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా సౌదాగర్ గంగారాం, హన్మంత్ సింధే(టీఆర్‌ఎస్), వైఎస్‌ఆర్ సీపీ అభ్యర్థిగా నాయుడు ప్రకాశ్‌లు నామినేషన్ వేయనున్నారు. అయితే కాంగ్రెస్ రెబల్‌గా అరుణతార, ఎమ్మెల్సీ రాజేశ్వర్‌లు కూడ నామినేషన్ వేసే అవకాశం ఉంది.
బాన్సువాడకు కాసుల బాలరాజు (కాంగ్రెస్), పోచారం శ్రీనివాస్‌రెడ్డి (టీఆర్‌ఎస్), టీడీపీ, వైఎస్సార్సీల నుంచి బద్యానాయక్, రాంమోహన్‌లు నామినేషన్ వేయనున్నారు.
ఎల్లారెడ్డి నుంచి పటోళ్ల సిద్దార్థరెడ్డి (వైఎస్సార్‌సీపీ), నల్లమడుగు సురేందర్ (కాంగ్రెస్ ), ఏనుగు రవీందర్‌రెడ్డి (టీఆర్‌ఎస్), బాణాల లక్ష్మారెడ్డి (బీజేపీ)లు నామినేషన్ వేయనున్నట్లు ప్రకటించారు.
దశమి రోజు
Published Wed, Apr 9 2014 3:15 AM | Last Updated on Sat, Sep 2 2017 5:45 AM
Advertisement
Advertisement