
సాక్షి,న్యూఢిల్లీ: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు ఆదివారం(ఆగస్టు 4) ఢిల్లీ వెళ్లనున్నారు. తీహార్ జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కవితతో ఇద్దరు భేటీ అయ్యే అవకాశం ఉంది. సుప్రీంకోర్టులో బెయిల్ దరఖాస్తుకు ఏర్పాట్లు చేయనున్నారు.
మరోపక్క సుప్రీంకోర్టులో పార్టీ మారిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ కూడా వేసే అవకాశం ఉంది. ఇరువురు మూడు రోజులు ఢిల్లీలోనే ఉండనున్నారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసలో ఎమ్మెల్సీ కవిత అరెస్టయి తీహార్ జైలులో జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment