సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ కస్టడీలోకి తీసుకున్న నేపథ్యంలో మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, ప్రశాంరెడ్డి తదితరులు ఆదివారం ఢిల్లీకి వెళ్లారు. సాయంత్రం ఈడీ కార్యాలయానికి హరీష్ రావు, కేటీఆర్, కవిత భర్త అనిల్, అడ్వకేట్ మోహిత్ రావు చేరుకున్నారు. వీరంతా కవితతో గంటపాటు భేటీ కానున్నారు. కాగా ఈడీ కస్టడీలో ఉన్న సమయంలో ప్రతిరోజూ సాయంత్రం 6 గంటల నుంచి 7గంటల వరకు కుటుంబ సభ్యులను కలిసేందుకు కోర్టు అనుమతిచ్చింది.
కవితతో భేటీ అనంతరం న్యాయవాదులు, నిపుణులతో కూడా మాట్లాడుతారు. తదుపరి చేపట్టాల్సిన చర్యలపై ఒక నిర్ణయానికి వస్తారని తెలుస్తోంది. న్యాయపరంగా ఎలా ఎదుర్కోవాలన్నదానిపైనే వీరు ప్రధానంగా దృష్టిసారించనున్నారు. ఇక కాగా ఢిల్లీ మద్యం పాలసీ మనీలాండరింగ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను శుక్రవారం సాయంత్రం ఈడీ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
శనివారం ఉదయం ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో ఆమెను హాజరుపరిచారు. ప్రత్యేక న్యాయమూర్తి ఎంకే నాగ్ పాల్ ఎదుట హజరు పరిచారు. కవిత తరపు న్యాయవాదులు, ఈడీ తరపు న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. వాదనల అనంతరం ఈనెల 23వరకు కోర్టు ఈడీ కస్టడీ విధించింది. ఆరోజు మధ్యాహ్నం తిరిగి కవితను కోర్టులో హాజరుపర్చాలని అధికారులను కోర్టు ఆదేశించింది. కోర్టు తీర్పుతో కవితను కస్టడీలోకి తీసుకున్న ఈడీ అధికారులు.. తమ కేంద్ర కార్యాలయంలోని ప్రత్యేక సెల్‌లో ఆమెను ఉంచారు. నేటి నుంచి సీసీటీవీల పర్యవేక్షణలో కవితను ఈడీ అధికారులు విచారిస్తున్నారు.
చదవండి: వంద రోజుల్లో.. వంద తప్పులు.. కేటీఆర్ ట్వీట్
Comments
Please login to add a commentAdd a comment