సాక్షి,న్యూఢిల్లీ : నేడు లిక్కర్ స్కాంలో సీబీఐ కేసుపై రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరగనుంది. సీబీఐ కేసులో కవితపై దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌ను పరిగణలోకి తీసుకునే అంశంపై ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు కేసు విచారణకు రానుంది.
సీబీఐ దాఖలు చేసిన చార్జ్‌షీట్‌లో ఏముంది
ఢిల్లీ మద్యం పాలసీలో మార్చి 15న ,2024న బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్ట్ చేసింది. అదే కేసులో ఏప్రిల్ 11న సీబీఐ అరెస్ట్ చేసింది. ఆ సమయంలో మద్యం కేసులో కవిత ప్రమేయం ఉందని ఆరోపిస్తూ పలు ఆధారాలతో కూడిన ప్రిలిమినరీ ఛార్జ్‌షీట్‌ను సీబీఐ దాఖలు చేసింది. అయితే ఈ కేసు విచారణ కొనసాగుతున్న సమయంలో సీబీఐ, ఈడీ కేసుల్లో తనకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ కవిత పిటిషన్లు దాఖలు చేస్తున్నారు.
ఈడీ,సీబీఐ ఆధారాల్ని తోసిపుచ్చలేం
కోర్టు విచారణ సమయంలో సీబీఐ, ఈడీలు కొత్త ఆధారాల్ని వెలికితీయడం, కోర్టు జ్యుడీషియల్ కస్టడీ విధించడం వంటి కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ తరుణంలో ఢిల్లీ హైకోర్టులో బెయిల్ కోరుతూ బెయిల్ పిటిషన్ దాఖలు చేసింది. ఆ పిటిషన్లపై విచారణ చేపట్టిన హైకోర్టు.. మద్యం పాలసీ కేసులో కవిత ప్రమేయం ఉందని నిరూపించేలా ఈడీ,సీబీఐ ఆధారాలు సేకరించిందని, వాటిని తోసిపుచ్చలేమని స్పష్టం చేసింది. బెయిల్ ఇచ్చేందుకు తిరస్కరించింది.
మరిన్ని ఆధారాలు ఉన్నాయంటూ
ఈ నేపథ్యంలో ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో సీబీఐ సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. పాలసీ కేసుకు సంబంధించి తమ వద్ద మరిన్ని ఆధారాలు ఉన్నాయని, మరోసారి విచారించేందుకు అనుమతి కావాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌లో తెలిపింది. ఈ పిటిషన్‌పై మధ్యాహ్నం 2 గంటలకు విచారణ జరగనుంది. ఒకవేళ సీబీఐ దాఖలు చేసిన ఛార్జిషీట్‌పై కోర్టు సానుకూలంగా స్పందిస్తే.. దానికి అనుబంధ ఛార్జిషీట్ దాఖలు చేసి.. కేసుకు సంబంధిత కొత్త ఆధారాల్ని కోర్టుకు అందజేయాల్సి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment