సాక్షి, హైదరాబాద్: గోల్కొండలో బోనాల సందడి నెలకొంది. జగదాంబికా అమ్మవారి ఆలయానికి మహిళలు భారీ సంఖ్యలో బోనాలతో వచ్చి.. మొక్కులు చెల్లించుకుంటున్నారు. శివసత్తుల పునకాలతో భాగ్యనగరం మార్మోగుతోంది. గోల్కొండ జగదాంబిక అమ్మవారికి తొలి బొనం సమర్పించారు. డప్పు చప్పుళ్లు, పొతురాజుల విన్యాసాలతో ఆ ప్రాంతమంతా మార్మోగుతోంది.
తొలిపూజ కావడంతో ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ చేతుల మీదుగా అమ్మవారికి పట్టువస్త్రాలను సమర్పించారు. లంగర్ హౌస్ నుంచి ఊరేగింపుగా వెళ్లి... చోటాబజార్‌లోని పూజారి ఇంట్లో ఉన్న అమ్మవారి ఉత్సవ విగ్రహాలకు పట్టు వస్త్రాలు సమర్పించారు. నేటి నుంచి ఆగస్టు 4 వరకు గోల్కొండలో బోనాల ఉత్సవాలు కొనసాగనున్నాయి. అనంతరం ఈ నెల 21, 22 తేదీల్లో సికింద్రాబాద్ ఉజ్జయిని మహాకాళి.. 28, 29 తేదీల్లో లాల్ దర్వాజా బోనాలు జరగనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment