Golconda Bonalu
-
భాగ్యనగరంలో బోనాల సందడి.. తొలి బోనం సమర్పణ
సాక్షి, హైదరాబాద్: గోల్కొండలో బోనాల సందడి నెలకొంది. జగదాంబికా అమ్మవారి ఆలయానికి మహిళలు భారీ సంఖ్యలో బోనాలతో వచ్చి.. మొక్కులు చెల్లించుకుంటున్నారు. శివసత్తుల పునకాలతో భాగ్యనగరం మార్మోగుతోంది. గోల్కొండ జగదాంబిక అమ్మవారికి తొలి బొనం సమర్పించారు. డప్పు చప్పుళ్లు, పొతురాజుల విన్యాసాలతో ఆ ప్రాంతమంతా మార్మోగుతోంది.తొలిపూజ కావడంతో ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ చేతుల మీదుగా అమ్మవారికి పట్టువస్త్రాలను సమర్పించారు. లంగర్ హౌస్ నుంచి ఊరేగింపుగా వెళ్లి... చోటాబజార్‌లోని పూజారి ఇంట్లో ఉన్న అమ్మవారి ఉత్సవ విగ్రహాలకు పట్టు వస్త్రాలు సమర్పించారు. నేటి నుంచి ఆగస్టు 4 వరకు గోల్కొండలో బోనాల ఉత్సవాలు కొనసాగనున్నాయి. అనంతరం ఈ నెల 21, 22 తేదీల్లో సికింద్రాబాద్ ఉజ్జయిని మహాకాళి.. 28, 29 తేదీల్లో లాల్ దర్వాజా బోనాలు జరగనున్నాయి. -
నేటి నుంచి ఆషాడ మాస బోనాలు.. జగదాంబికకు తొలి బోనం
గోల్కొండ: బోనాలకు వేళైంది. గోల్కొండ కోట ముస్తాబైంది. కోటలో కొలువుదీరిన శ్రీ జగదాంబిక మహంకాళి అమ్మవారి ఆషాఢమాసం బోనాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. గోల్కొండలోని జగదాంబికా అమ్మవారి ఆలయం వద్ద బోనాల సందడి నెలకొంది. మహిళలు పెద్దఎత్తున బోనాలతో అక్కడికి చేరుకున్నారు. అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు. డప్పు చప్పుళ్లు, తీన్మార్ దరువులతో ఆ ప్రాంతమంతా మార్మోగుతోంది. పోతరాజుల వీరంగాలు, శివసత్తుల ఆటలతో జాతర శోభ సంతరించుకుంది.మొత్తం తొమ్మిది పూజలు అందుకునే అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తుల కోసం జలమండలి భారీ ఎత్తున తాగునీటి ఏర్పాట్లు చేస్తోంది. జలమండలి డీజీఎం ఖాజా జవహర్ అలీ సిబ్బందితో తాగునీటి ట్యాంకర్లను పెట్టిస్తున్నారు. మరోవైపు ఆరోగ్య శాఖ అధికారులు ప్రత్యేకంగా హెల్త్ క్యాంప్‌లు ఏర్పాటు చేశారు. అత్యవసర పరిస్థితుల్లో అవసరమైయ్యే అంబులెన్స్‌ను కూడా సిద్ధంగా ఉంచారు. అగ్నిమాపక శాఖ వారు మొబైల్ ఫైర్ ఎస్టింగిషర్‌ను కూడా సిద్ధం చేశారు. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో అమ్మవారి అలంకరణలను పూర్తి చేశారు. పోలీసులు లంగర్‌హౌజ్ నుంచి గోల్కొండ వరకు పికెటింగ్‌లు ఏర్పాటు చేయడంతో పాటు మహిళా పోలీస్ టీమ్‌లను కూడా సిద్ధంగా ఉంచారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా అన్ని చర్యలు తీసుకున్నామని ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీనివాసరాజు తెలిపారు. సప్త మాతృకలకు.. బంగారు బోనాలు.. చార్మినార్: నగరంలో ఆషాఢ మాసం బోనాల ఉత్సవాలను పురస్కరించుకుని విజయవాడలోని కనక దుర్గ అమ్మవారికి బోనాలను సమర్పించనున్నారు. ఇందులో భాగంగా మొదటి బంగారు బోనాన్ని గోల్కొండ జగదాంబ అమ్మవారికి సమర్పించనున్నామని భాగ్యనగర్ మహంకాళి జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ చైర్మన్ గాజుల అంజయ్య తెలిపారు. ఆదివారం ఉదయం 9 గంటలకు పాతబస్తీ మీరాలంమండి మహంకాళేశ్వర దేవాలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం బోనంతో గోల్కొండ కోటకు బయలుదేరుతామన్నారు. లంగర్‌హౌజ్ వద్ద ఏర్పాటు చేసే స్వాగత వేదికపై నుంచి మంత్రులు స్వాగతం పలుకుతారని ఆయన తెలిపారు. కమిటీ ఆధ్వర్యంలో సప్త మాతృకలకు సప్త బంగారు బోనాలను నగరంలోని గోల్కొండ, సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి, బల్కంపేట ఎల్లమ్మ తల్లి, జూబ్లీహిల్స్ పెద్దమ్మ దేవాలయం, చార్మినార్ భాగ్యలక్ష్మి దేవాలయం, లాల్‌దర్వాజా సింహవాహిని దేవాలయం అమ్మవార్లకు బంగారు పాత్రలో సమర్పించనున్నారు. ఇందులో భాగంగా ఆదివారం గోల్కొండ జగదాంబ అమ్మవారికి, 10న బల్కంపేట ఎల్లమ్మ, 12న, జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి, 14న విజయవాడ కనకదుర్గ అమ్మవారికి, 18న సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారికి, 23న చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారికి, 25న లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవార్లకు బంగారు బోనం, పట్టు వ్రస్తాలు, ఒడి బియ్యం సమర్పించనున్నారు. -
బోనమొస్తోంది..
చార్మినార్: నగరంలో ఆషాఢ మాసం బోనాల జాతర సందడి మొదలు కానుంది. వచ్చే నెల 7న గోల్కొండ జగదాంబిక అమ్మవారికి సమర్పించే మొదటి బంగారు బోనంతో పాతబస్తీలో బోనాల ఉత్సవాలు ప్రారంభమవుతాయి. అదే రోజు సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి దేవాలయంలో కలశస్థాపన, ఘట స్థాపనతో బోనాలు షురూ అవుతాయి. ఇందులో భాగంగా భాగ్యనగర్ మహంకాళి జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ నూతన చైర్మన్ గాజుల అంజయ్య బుధవారం ఎంపీ అనిల్‌కుమార్ యాదవ్‌తో కలిసి జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈసారి ఆషాఢ మాసం బోనాల జాతర ఉత్సవాల ఏర్పాట్లు తదితర అంశాలపై చర్చించారు. గతంలో కన్నా మరింత అంగరంగ వైభవంగా బోనాల ఉత్సవాలు నిర్వహించేందుకు ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.జాతర వివరాలిలా...👉 జూలై 7న గోల్కొండ అమ్మవారి బోనాలతో ఉత్సవాలు ప్రారంభం. 👉 ఇదే రోజు సికింద్రాబాద్‌లో బోనాల జాతర ఉత్సవాలు షురూ. 👉 21న, సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారికి బోనాల సమర్పణ. 👉 22న రంగం–భవిష్యవాణి, సామూహిక ఊరేగింపు. సప్త మాత్రుకలకు సప్త బంగారు బోనం కార్యక్రమంలో భాగంగా ఏడు అమ్మవారి దేవాలయాలకు బంగారు పాత్రలో బోనంతో పాటు పట్టు వ్రస్తాలను సమరి్పంచనున్నారు. ఇందులో భాగంగా జూలై 10న, బల్కంపేట్ ఎల్లమ్మ తల్లికి బంగారు బోనంతో పటు పట్టు వ్రస్తాల సమర్పణ. 12న, జూబ్లీహిల్స్‌లోని పెద్దమ్మ తల్లికి.. 14న, ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ బోనాల జాతర ఉత్సవాలుంటాయి. ఇందులో భాగంగా విజయవాడ కనక దుర్గా అమ్మవారికి పట్టు వ్రస్తాలు, బంగారు పాత్రలో బోనం, కృష్ణా నదిలో గంగ తెప్పకు పూజలు నిర్వహించనున్నారు. 👉 8న, సికింద్రాబాద్‌లో నిర్వహించే ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బోనాల సమర్పణ. 👉 19న, పాతబస్తీలో అమ్మవారి కలశ స్థాపన, ధ్వజారోహణం. 👉 21న, పాతబస్తీ శాలిబండలోని కాశీ విశ్వనాథ దేవాలయం నుంచి ఘట స్థాపన ఊరేగింపు. 👉 23న, చారి్మనార్ భాగ్యలక్ష్మి అమ్మవారికి పట్టు వ్రస్తాలు, బోనం సమర్పణ. 👉 25న, లాల్‌దర్వాజా సింహవాహిని అమ్మ వారికి పట్టు వ్రస్తాలు, బంగారు బోనం. 👉 28న నగరంతో పాటు పాతబస్తీలో బోనాల జాతర ఉత్సవాలు. 👉29న పాతబస్తీ ప్రధాన వీధుల్లో అమ్మవారి ఘటాల సామూహిక ఊరేగింపు, తదనంతరం మారు బోనంతో ఆషాడ మాసం బోనాల ఉత్సవాల ముగింపు. -
Golconda Bonalu Photos: గోల్కొండ జగదాంబిక అమ్మవారి బోనాలు (ఫొటోలు)
-
బోనాలకు ముస్తాబవుతున్న గోల్కొండ కోట (ఫొటోలు)
-
బోనమెత్తిన గోల్కొండ కోట.. భక్తులతో జనసంద్రం..
సాక్షి, గోల్కొండ/చార్మినార్/రాంగోపాల్‌పేట్: గోల్కొండ కోట బోనమెత్తింది. భక్తులతో జనసంద్రమైంది. ఆషాఢ మాసం బోనాల జాతర ఉత్సవాలకు ఆదివారం అంగరంగ వైభవంగా అంకురార్పణ జరిగింది. శ్రీ జగదాంబిక మహంకాళి అమ్మవార్లకు బోనాలు సమరి్పంచేందుకు భక్తులు కోట దారిపట్టారు. లంగర్‌హౌస్ చౌరస్తా వద్ద మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇంద్రకరణ్ రెడ్డిలు అమ్మవారి తొట్టెలకు స్వాగతం పలికారు. కోటలోని జగదాంబిక అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టువ్రస్తాలు సమరి్పంచారు. బోనాల జాతరకు వచ్చే భక్తులు కోవిడ్ నిబంధనలను పాటించాలని మంత్రి తలసాని సూచించారు. అమ్మవారికి పట్టు వస్త్రాలు తీసుకువస్తున్న మంత్రులు తలసాని, ఇంద్రకరణ్‌రెడ్డి, బంగారు బోనంతో జోగిని నిశాక్రాంతి ఆకట్టుకున్న ఊరేగింపు.. పోతరాజుల విన్యాసాలు, తెలంగాణ జానపద నృత్యాలతో లంగర్‌హౌస్ నుంచి ఫతే దర్వాజ మీదుగా కోట వరకు జరిగిన ఊరేగింపు అందరినీ ఆకట్టుకుంది. భారీ దేవతా విగ్రహాలు, డప్పు, డోలుపై యువకుల నృత్యాలతో ముందుకు సాగిన ఊరేగింపు ఫతే దర్వాజ వద్ద స్థానిక ముస్లింలు స్వాగతం పలికారు. ఊరేగింపు కోట చౌరస్తా వరకు సాగింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నగర కొత్వాల్ అంజనీ కుమార్ పర్యవేక్షణలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బంగారు బోనం సమర్పణ.. భాగ్యనగర్ శ్రీ మహంకాళి జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ ఆధ్వర్యంలో భక్తులు గోల్కొండకు తరలివెళ్లి జగదాంబ అమ్మవారికి బంగారు బోనంతో పాటు పట్టు వ్రస్తాలు సమరి్పంచారు. లంగర్‌హౌజ్ చౌరస్తా వద్ద బంగారు బోనానికి మంత్రులు దీపం వెలిగించి పూజలు నిర్వహించారు. ఘటాల ఎదుర్కోలు షురూ.. సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి బోనాల జాతరలో తొలి ఘట్టమైన ఘటాల ఎదుర్కోలుకు అంకురార్పణ చేశారు. మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ఘటాల ఎదుర్కోలు కోసం ఊరి పొలిమేరకు వెళ్తున్న అమ్మవారి ఆభరణాలు, ఘట సామగ్రి, పూలు, పసుపు, కుంకుమలకు పూజలు చేశారు. అనంతరం ఘటాన్ని ముస్తాబు చేసేందుకు కర్బలా మైదాన్‌కు తీసుకెళ్లారు. కోట కళకళ భక్తులతో గోల్కొండ కోట కళకళలాడింది. ఆషాఢమాసం బోనాల ఉత్సవాలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. భక్తుల కోలాహలం.. పోతురాజుల సందడితో జాతరలో సందడినెలకొంది. శ్రీ జగదాంబిక మహంకాళి అమ్మవార్లకు బోనం సమర్పించి ప్రత్యేకపూజలు చేశారు. మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇంద్రకరణ్‌రెడ్డి పాల్గొన్నారు. సీపీ అంజనీకుమార్ భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
26 నుంచి ఆషాఢ బోనాలు ప్రారంభం
సాక్షి, యాకుత్‌పురా : ఆషాఢ మాసం బోనాల ఉత్సవాలను కోవిడ్ నిబంధనలు పాటిస్తూ యథావిధిగా ఈ నెల 26వ తేదీ నుంచి ప్రారంభిస్తున్నామని హరిబౌలి శ్రీ అక్కన్న మాదన్న మహంకాళి దేవాలయం కమిటీ అధ్యక్షుడు జి.రాజారత్నం తెలిపారు. ఆలయ 72వ వార్షిక బోనాల నేపథ్యంలో సోమవారం ఆలయ ప్రార్థనా మందిరంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... చారిత్రాత్మకమైన ఈ దేవాలయాన్ని 77 రోజుల లాక్డౌన్ అనంతరం సోమవారం తెరిచామన్నారు. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా భౌతిక దూరాన్ని పాటిస్తూ అమ్మవారిని దర్శించుకునేందుకు వీలు కల్పించామన్నారు. బోనాల పండగ నిర్వహించే 11 రోజులు అన్ని పూజలు నిర్వహించి కరోనా మహమ్మారి నుంచి ప్రజలను రక్షించమని వేడుకుంటామన్నారు. ఈ నెల 26 నుంచి ఐదు శుక్రవారాల పాటు బోనాల వేడుకలు నిర్వహించనున్నామన్నారు. కుంకుమార్చనను ఈ నెల 26న, జూలై 3, 10, 17, 24వ తేదీలతో నిర్వహిస్తామన్నారు. జూలై 10న అమ్మవారి కలశ స్థాపన, మహాభిషేకం నిర్వహించి ధ్వజారోహణతో 11 రోజుల పాటు నిర్వహించే బోనాల జాతరను ప్రారంభిస్తామన్నారు. జూలై 11 నుంచి 18వ తేదీ వరకు అమ్మవారికి వివిధ పూజలు, 19న బోనాల పండగ సందర్భంగా అమ్మవారికి బోనాల సమర్పణ, శాంతి కల్యాణం నిర్వహిస్తామన్నారు. 20న పోతురాజుల స్వాగతం, రంగం, భవిష్యవాణి నిర్వహించి మధ్యాహ్నం 3 గంటలకు అమ్మవారి ఘటాన్ని ఏనుగు అంబారీపై ఊరేగింపు నిర్వహిస్తామన్నారు. ప్రస్తుతం పరిస్థితుల దృష్ట్యా బోనాల పండగ రోజున జిల్లాల నుంచి భక్తులు రావొద్దని విజ్ఞప్తి చేశారు. జూలై 10 నుంచి 17వ తేదీ వరకు భౌతిక దురాన్ని పాటిస్తూ అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులకు వీలు కల్పిస్తున్నామన్నారు. బోనాల ఉత్సవాలకు ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరించాలని... ఇప్పటికే రాష్ట్ర మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, అటవీ, పర్యావరణ శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ రజత్ కుమార్, ఫారెస్ట్ కన్జర్వేటర్ శోభ, దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్‌లకు విజ్ఞప్తి పత్రాలను అందజేశామన్నారు. ఆలయ కమిటీ కార్యదర్శి కె.దత్తాత్రేయ, కోశాధికారి ఎ.సతీష్, సంయుక్త కార్యదర్శి చేతన్ సూరి, కార్య నిర్వాహక కార్యదర్శి ఎస్.పి.క్రాంతి కుమార్, సభ్యులు ఎం.వినోద్, ఎం.ముఖేశ్‌లు పాల్గొన్నారు. -
బోనమెత్తిన భాగ్యనగరం
సాక్షి, హైదరాబాద్ : భాగ్యనగరం బోనమెత్తింది. బోనాల ఉత్సవాల్లో భాగంగా లంగర్‌హౌస్‌లో తొట్టెల ఊరేగింపును రాష్ట్ర మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇంద్రకరణ్‌రెడ్డి ప్రారంభించారు. గోల్కొండ కోటపై కొలువుదీరిన శ్రీ జగదాంబిక అమ్మవారు తొలి పూజ అందుకున్నారు. మంత్రులు అమ్మవారికి బంగారు, వెండి బోనాలు, పట్టు వస్త్రాలు సమర్పించారు. అమ్మవారికి పెద్ద ఎత్తున భక్తులు పూజలు చేస్తున్నారు. మహిళల ప్రత్యేక పూజలు, పోతురాజుల విన్యాసాలు, ఘటాల ఊరేగింపుతో నగరంలో సందడి వాతావరణం నెలకొంది. చారిత్రక ఉత్సవంగా పేరొందిన బోనాల పండగను వైభవంగా నిర్వహించేందుకు అటు ప్రభుత్వం..ఇటు ఆయా ఆలయాల కమిటీలు ఘనంగా ఏర్పాట్లు చేశాయి. గోల్కొండలో నెలరోజులపాటు ప్రతి గురు, ఆదివారాల్లో జగదాంబిక అమ్మవారు 9 పూజలు అందుకోనున్నారు. ఈ సందర్భంగా ఇంద్రకరణ్‌రెడ్డి మాట్లాడుతూ.. బోనాల సందర్భంగా 2,845 దేవాలయాలకు ప్రభుత్వం తరఫున 15 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్టు తెలిపారు. గోల్కొండ దేవాలయానికి 10 లక్షల రూపాయలు కేటాయించామన్నారు. 2 వేల మంది పోలీసులు బందోబస్తులో ఉన్నారని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురవాలని, పంటలు బాగా పడాలని, అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని అన్నారు. -
ఆషాఢ బోనాలకు అంకురార్పణ
* ఘనంగా గోల్కొండ బోనాలు * అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రులు సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సంస్కృతీ సంరంభం ఆషాఢ బోనాలకు అంకురార్పణ జరిగింది. అశేష భక్తజనం మధ్య... మంగళ వాయిద్యాలతో గోల్కొండ కోటపై జగదాంబిక అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన గురువారం వైభవంగా సాగింది. ఉదయం 8 గంటలకు చార్మినార్ సమీపంలోని మురిగీచౌక్ నుంచి బయలుదేరిన తొట్టెల ఊరేగింపుతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. పోతురాజుల నృత్యాలు, డప్పు వాయిద్యాలు, సాంస్కృతిక శాఖ ఏర్పాటు చేసిన గ్రామ దేవతల ప్రదర్శన లంగర్‌హౌస్ వరకు సాగింది. ఉదయం 11 గంటలకు కోటపై అమ్మవారికి నజర్ బోనం సమర్పించారు. రంజాన్ పండుగ కూడా కావడంతో మతసామరస్యం వెల్లివిరిసింది. ఊరేగింపులో ఐక్యతను చాటేలా రెపరెపలాడిన మువ్వన్నెల జెండా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఫతేదర్వాజా వద్ద మైత్రీసంఘం సభ్యులు, ముస్లింలు అమ్మవారికి పూజలు చేశారు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, పశుసంవర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, ఎక్సైజ్‌శాఖ మంత్రి పద్మారావుగౌడ్, నగర మేయర్ బొంతు రామ్మోహన్ వేడుకల్లో పాల్గొన్నారు. ప్రభుత్వం తరఫున అమ్మవారికి బోనాలతో పాటు పట్టు వస్త్రాలు, తలంబ్రాలు, ఒడిబియ్యం సమర్పించారు. వచ్చే నెల 4 వరకు ప్రతి గురు, ఆదివారాల్లో ఇక్కడ ఉత్సవాలు జరుగుతాయి. గతేడాది కంటే ఈసారి మరింత ఘనంగా, ఉత్సాహంగా బోనాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు తలసాని చెప్పారు. రంజాన్, బోనాలు ఒకేసారి రావడం సంతోషంగా ఉందన్నారు. ఇంద్రకరణ్‌రెడ్డి మాట్లాడుతూ... దేవాదాయ శాఖ పరిధిలో లేని ఆలయాలకు సైతం నిధులను కేటాయిస్తున్నామని, గోల్కొండలో ప్రారంభమైన ఆషాఢ బోనాలు తెలంగాణ సంస్కృతికి, సంప్రదాయాలకు నిదర్శనమన్నారు. -
వైభవోపేతంగా గోల్కొండ బోనాలు
హైదరాబాద్ : గోల్కొండ బోనాలు గురువారం అత్యంత వైభవంగా జరిగాయి. అమ్మవారి విగ్రహ ఊరేగింపు, పోతరాజుల ప్రదర్శన, డప్పు వాయిద్యాలు, ఆటపాటలు, భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్త జనసందోహం నడుమ గోల్కొండ కోటపైన అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన వేడుకలు కన్నుల పండువగా నిర్వహించారు. మరోవైపు సర్వత్రా మతసామరస్యం వెల్లివిరిసింది. రంజాన్ వేడుకలతోపాటు, బోనాల ఉత్సవాల్లోనూ అన్ని వర్గాల ప్రజలు పాల్గొన్నారు. ప్రభుత్వ లాంఛనాలతో ఉదయం 11 గంటలకు ప్రారంభమైన వేడుకలు సాయంత్రం 6 గంటలకు అమ్మవారు కోటపైకి చేరుకోవడం వరకు కొనసాగాయి. రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎక్సైజ్ శాఖ మంత్రి పద్మారావు, నగర మేయర్ బొంతు రామ్మోహన్ వేడుకల్లో పాల్గొన్నారు. జగదాంబిక అమ్మవారికి పట్టువస్త్రాలు, తలంబ్రాలు, ఒడి బియ్యం తదితర ప్రభుత్వ లాంఛనాలన్నింటినీ సమర్పించారు. -
బోనమెత్తిన నగరి
ఆధ్యాత్మిక ఝరి.. భక్త జనసిరి.. తెలంగాణ సంప్రదాయ ఉత్సవం బోనాలు ఆదివారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవ ఊరేగింపుతో చారిత్రక గోల్కొండ కోట పులకించింది. కోటకు దారితీసే అన్ని మార్గాల్లో భక్తులు బారులు తీరి జగదాంబికకు మొక్కులు చెల్లించుకున్నారు. నెత్తిన బోనాలతో మహిళలు.. పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాలు, తొట్టెల ఊరేగింపుతో గోల్కొండ ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. విద్యుద్దీపాల కాంతుల్లో కోట దేదీప్యమానంగా వెలుగులీనింది. ఈ సారి ఉత్సవాల తొలిరోజే అమ్మవారి భారీ విగ్రహాల ఊరేగింపు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. - లంగర్‌హౌస్/గోల్కొండ -
గోల్కొండ భోనాలు ప్రారంభం