
ఆషాఢ మాసంలో ఇక సందడే సందడి
జూలై 7న గోల్కొండలో బంగారు బోనంతో షురూ
ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తాం: మంత్రి పొన్నం
చార్మినార్: నగరంలో ఆషాఢ మాసం బోనాల జాతర సందడి మొదలు కానుంది. వచ్చే నెల 7న గోల్కొండ జగదాంబిక అమ్మవారికి సమర్పించే మొదటి బంగారు బోనంతో పాతబస్తీలో బోనాల ఉత్సవాలు ప్రారంభమవుతాయి. అదే రోజు సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి దేవాలయంలో కలశస్థాపన, ఘట స్థాపనతో బోనాలు షురూ అవుతాయి. ఇందులో భాగంగా భాగ్యనగర్ మహంకాళి జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ నూతన చైర్మన్ గాజుల అంజయ్య బుధవారం ఎంపీ అనిల్‌కుమార్ యాదవ్‌తో కలిసి జిల్లా ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈసారి ఆషాఢ మాసం బోనాల జాతర ఉత్సవాల ఏర్పాట్లు తదితర అంశాలపై చర్చించారు. గతంలో కన్నా మరింత అంగరంగ వైభవంగా బోనాల ఉత్సవాలు నిర్వహించేందుకు ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.
జాతర వివరాలిలా...
👉 జూలై 7న గోల్కొండ అమ్మవారి బోనాలతో ఉత్సవాలు ప్రారంభం.
👉 ఇదే రోజు సికింద్రాబాద్‌లో బోనాల జాతర ఉత్సవాలు షురూ.
👉 21న, సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారికి బోనాల సమర్పణ.
👉 22న రంగం–భవిష్యవాణి, సామూహిక ఊరేగింపు.
సప్త మాత్రుకలకు సప్త బంగారు బోనం కార్యక్రమంలో భాగంగా ఏడు అమ్మవారి దేవాలయాలకు బంగారు పాత్రలో బోనంతో పాటు పట్టు వ్రస్తాలను సమరి్పంచనున్నారు. ఇందులో భాగంగా జూలై 10న, బల్కంపేట్ ఎల్లమ్మ తల్లికి బంగారు బోనంతో పటు పట్టు వ్రస్తాల సమర్పణ. 12న, జూబ్లీహిల్స్‌లోని పెద్దమ్మ తల్లికి.. 14న, ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ బోనాల జాతర ఉత్సవాలుంటాయి. ఇందులో భాగంగా విజయవాడ కనక దుర్గా అమ్మవారికి పట్టు వ్రస్తాలు, బంగారు పాత్రలో బోనం, కృష్ణా నదిలో గంగ తెప్పకు పూజలు నిర్వహించనున్నారు.
👉 8న, సికింద్రాబాద్‌లో నిర్వహించే ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బోనాల సమర్పణ.
👉 19న, పాతబస్తీలో అమ్మవారి కలశ స్థాపన, ధ్వజారోహణం.
👉 21న, పాతబస్తీ శాలిబండలోని కాశీ విశ్వనాథ దేవాలయం నుంచి ఘట స్థాపన ఊరేగింపు.
👉 23న, చారి్మనార్ భాగ్యలక్ష్మి అమ్మవారికి పట్టు వ్రస్తాలు, బోనం సమర్పణ.
👉 25న, లాల్‌దర్వాజా సింహవాహిని అమ్మ వారికి పట్టు వ్రస్తాలు, బంగారు బోనం.
👉 28న నగరంతో పాటు పాతబస్తీలో బోనాల జాతర ఉత్సవాలు.
👉29న పాతబస్తీ ప్రధాన వీధుల్లో అమ్మవారి ఘటాల సామూహిక ఊరేగింపు, తదనంతరం మారు బోనంతో ఆషాడ మాసం బోనాల ఉత్సవాల ముగింపు.
Comments
Please login to add a commentAdd a comment