గోల్కొండ భోనాలు ప్రారంభం | Golconda Bonalu festival begans | Sakshi
Sakshi News home page

Published Thu, Jul 11 2013 2:49 PM | Last Updated on Thu, Mar 21 2024 6:13 PM

జంటనగరాల ప్రజలు అత్యంత భక్తిభావంతో జరుపుకునే బోనాల పండగకు గురువారం అంకురార్పణ జరిగింది. అన్నింటికన్నా గోల్కొండ కోటలోని మాతా జగదాంబికా ఆలయంలో బోనాలు ప్రారంభం అయ్యాయి. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవార్లకు బోనాలు సమర్పిస్తున్నారు. తెలంగాణ ప్రాంత పల్లె ప్రజలు బోనాలను ఆషాఢ మాసంలో ప్రారంభించి శ్రావణ మాసం ముగిసే వరకు జరుపుకొంటారు. అత్యంత భక్తి శ్రద్ధలు, ఆనందోత్సాహాలతో జరుపుకునే బోనాల పండుగకు విస్తృతస్థాయిలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. పూజలు, పునస్కారాలతో అమ్మవారిని ఆదిశక్తిగా, మాతృ మూర్తిగా, దేవీ స్వరూపంగా పలుపేర్లతో వర్ణిస్తూ ఉత్స వాలు జరుపుకుంటాయి. మహిళలు పసుపు కుంకుమలతో అందంగా అలంకరించి... పైన జ్యోతిని వెలిగించిన బోనాన్ని అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. అమ్మవారికి బోనాన్ని, వేపాకు, నీళ్లతో కూడిన సాకను సమర్పించ డం ఆనవాయితీ. ఈ పండుగ ప్రధానంగా హైదరాబాద్‌, సికింద్రాబాదు, తెలంగాణ, రాయలసీమలోని కొన్ని ప్రాంతాలలో జరుగుతుంది. పండుగ మొదటి చివరి రోజులలో ఎల్లమ్మ దేవికి ప్రత్యేక పూజలు చేస్తారు. భోజనం అని అర్థం కలిగిన బోనం దేవికి సమర్పించే నైవేద్యం. మహిళలు వండిన అన్నంతో పాటు పాలు, బెల్లం, కొన్నిసార్లు ఉల్లిపాయలతో కూడిన బోనాన్ని మట్టి లేక రాగి కుండలలో తమ తల పై పెట్టుకుని, డప్పుగాళ్లు, ఆటగాళ్లు తోడ్కొని రాగా దేవి గుడికి వెళ్లి నైవేధ్యాలు సమర్పిస్తారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement