Golconda
-
మరోసారి తెరపైకి ‘గోల్కొండ వజ్రం’
సాక్షి, హైదరాబాద్: ‘అసలు సిసలైన వజ్రం కావాలంటే గోల్కొండ గనుల్లోనే దొరకాలి’ఇది ఒకప్పుడు ప్రపంచం మాట. కృష్ణానది పరీవాహక ప్రాంతంలో విస్తరించిన గోల్కొండ గనుల్లో లభించే వజ్రాలకు ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. వజ్రం అనగానే గుర్తుకొచ్చే ‘కోహినూర్’ఇక్కడ దొరికిందే. ఇప్పుడు మరోసారి గోల్కొండ వజ్రాల అంశం తెరపైకి వచ్చింది. బ్రిటిష్ రాజకుటుంబం నగల కలెక్షన్లలో భాగంగా ఉన్న 18వ శతాబ్దం నాటి అరుదైన నెక్లెస్ నవంబర్‌లో వేలానికి వస్తోంది.వేలం నిర్వహణలో ఖ్యాతిగాంచిన సోథెబైస్ జెనీవాలో దీనిని వేలం వేస్తోంది. మూడు వరుసలతో ఉన్న ఈ నెక్లెస్‌లో దాదాపు 500 వజ్రాలున్నాయి. అవి ప్రఖ్యాత గోల్కొండ గనుల నుంచి సేకరించినవే అయ్యి ఉంటాయంటూ తాజాగా వేలం నిర్వహణ సంస్థ సోథేబైస్ ప్రకటించింది. ఈ నెక్లెస్‌కు వేలంలో 2.8 మిలియన్ డాలర్ల గరిష్ట ధర పలుకుతుందని వేలం సంస్థ అంచనా వేస్తోంది. గోల్కొండ వజ్రాల స్వచ్ఛత ఆధారంగా వాటికి వేలం పాటల్లో అధికంగా ధరలు పలుకుతాయి. దీంతో ఇప్పు డు మరోసారి గోల్కొండ వజ్రాలు చర్చనీయాంశంగా మారాయి. ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా గోల్కొండ వజ్రాలు ప్రజలను విపరీతంగా అకట్టుకుంటున్నాయి.కోహినూర్‌తో..గోల్కొండ వజ్రాలకు అంతగా ఖ్యాతి రావటానికి కోహినూర్ వజ్రం ప్రధాన భూమిక పోషించింది. ప్రపంచం మొత్తానికి రెండున్నర రోజుల పాటు భోజన ఏర్పాట్లు చేసినందుకు ఎంత ఖర్చవుతుందో కోహినూర్ వజ్రం విలువ అంత ఉంటుందని మొఘల్ చక్రవర్తులు వ్యాఖ్యానించారట. గత పదేళ్లలో కొల్లాపూర్, నారాయణపేటలో జీఎస్ఐకి ముడి వజ్రాలుండే కింబర్లైట్ డైక్స్ లభించాయి. ఈ ప్రాంతాల్లో వజ్రాలుంటాయనటానికి ఇది ఓ ఆధారం. మూసీ పరీవాహకంలో కూడా వజ్రాలు భూగర్భంలో ఉన్నాయని కొందరు నిపుణులు పేర్కొంటున్నారు. బ్రిటిష్ పాలన కాలంలో గుంతకల్ సమీపంలోని వజ్రకరూరులో భారీ వజ్రాల గని తవ్వారు. ఇప్పటికీ అక్కడ 90 మీటర్ల లోతుతో భారీ గుంత నీటితో నిండి ఉంటుంది. » కుతుబ్‌షాహీల కాలంలో వజ్రాల వ్యాపారం ముమ్మరంగా సాగింది. విస్తారంగా గనులు తవ్వి వజ్రాలు వెలికితీశారు. దాదాపు లక్ష మంది కార్మికులు ఈ గనుల్లో పనిచేసేవారట. » ఈ గనులు స్థానిక సుబేదారుల అధ్వర్యంలో రోజువారీగా లీజుకు తీసుకొని హైదరాబాద్‌లోని వ్యాపారులు వజ్రాలు వెలికి తీసేవారు. ఒక క్యారెట్ కంటే ఎక్కువ బరువు తూగే వజ్రం లభిస్తే రాజుకు చెందుతుంది అన్న విధానం అమలులో ఉండేది. అలా కుతుబ్‌షాహీలు చాలా విలువైన, పెద్ద సైజు వజ్రాలు సొంతం చేసుకున్నారు. » గోల్కొండ వజ్రాల్లో నైట్రోజన్, బోరాన్ ఉండదు. ఈ కారణంగా వజ్రం అధిక కాంతివంతంగా ఉంటుంది. » కోహినూర్ తర్వాత అతిపెద్ద వజ్రం నిజాం జాకబ్ వజ్రమే. ఇది 420 క్యారెట్ బరువు ఉండేది. » గోల్కొండ గనుల నుంచి 12 మిలియన్ క్యారెట్ల వజ్రాలు తవ్వారని బ్రిటిష్ కాలంలో నిపుణులు అంచనా వేశారు. ఇప్పటికీ గోల్కొండ గనుల ప్రాంతంలో చిన్నసైజు వజ్రాలు లభిస్తూనే ఉన్నాయి. » గోల్కొండ డైమండ్స్ అన్నీ ఇప్పుడు యూరోపియన్ రాజకుటుంబాల సేకరణలో భాగంగా ఉన్నాయి. వాటిలో కొన్ని ఇరాన్ ట్రెజరీలో ఉన్నాయి. ఒకటి రెండు నైజాం కలెక్షన్లలో ఉన్నాయిటైప్ టూ ఏ కేటగిరీ..» అసలైన వజ్రం స్వచ్ఛతకు మారుపేరుగా ఉంటుందని, ‘గోల్కొండ వజ్రాలు కన్నీళ్లంత స్వచ్ఛమైనవి’అని నిపుణులు చెబుతారు. వజ్రాల వ్యాపారంలో టైప్ టూ ఏ కేటగిరీని అత్యంత అరుదైన, స్వచ్ఛమైనదిగా భావిస్తారు. అందుకే గోల్కొండ వజ్రాలను ఆ కేటగిరీకి చెందినవిగా పేర్కొంటారు. కాకతీయుల కాలంలో గోల్కొండ వజ్రాలను వెలికితీయటం ప్రారంభించారు. ప్రస్తుతం కర్ణాటకలోకి రాయచూరు నుంచి ఉమ్మడి కృష్ణా జిల్లా నందిగామ వరకు ఉన్న ప్రాంతాన్ని గోల్కొండ గనులుగా పరిగణిస్తారు. కృష్ణానది పరీవాహక ప్రాంతంలో విస్తారంగా వజ్రాలు లభించేవి. ఈ వజ్రాలు అధికంగా ఉన్న ప్రాంతాలను తన పరిధిలో ఉంచుకునేందుకు నిజాం తహతహలాడేవాడు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లోని భూభాగాన్ని అప్పట్లో నిజాం ఆంగ్లేయుల పరం చేశాడు. ఆ సమయంలో ప్రస్తుతం ఆంధ్రాప్రాంతంలో ఉన్న పరిటాల ప్రాంతాన్ని నిజాం తన పరిధిలోకి వచ్చేలా చేసుకున్నాడు. అక్కడ వజ్రాలు అధికంగా లభిస్తుండటమే దీనికి కారణం. ప్రస్తుతం తెలంగాణలో భాగంగా ఉన్న మునగాలను నిజాం సర్కారు బ్రిటిష్ పరిధిలోకి మార్చింది. రాష్ట్రాల పునరి్వభజన సమయంలో భౌగోళికంగా ఈ తీరు సరిగ్గా లేకపోవటంతో పరిటాలను ఆంధ్రప్రదేశ్‌కు, మునగాలను తెలంగాణకు కేటాయించారు. ఇప్పటి వరకు వేలంలో అత్యధిక ధరకు అమ్ముడైన మూడు ప్రధాన వజ్రాలు 2008: విట్టెల్స్‌బాచ్ డైమండ్ - 23.7 మిలియన్ డాలర్లు 1995: ఓర్లోవ్ డైమండ్ - 20.7 మిలియన్ డాలర్లకు 1995: జాకబ్ డైమండ్ - 13.4 మిలియన్ డాలర్లుప్రధాన గోల్కొండ వజ్రాల నమూనాలుప్రజలు సందర్శించేందుకు వీలుగా కొన్ని ప్రధాన గోల్కొండ వజ్రాలకు నమూనాలు రూపొందించారు. » లండన్ నేచురల్ హిస్టరీ మ్యూజియంలో కోహినూర్ నకలు వజ్రం ఉంది » మాస్కోలోని క్రెమ్లిన్ ఆర్మరీలో ఓర్లోవ్ డైమండ్ నమూనా ఉంది » టెహరాన్స్ నేషనల్ మ్యూజియంలో దరియా–ఇ–నూర్ వజ్రం నమూనా ఏర్పాటు చేశారు. -
గోల్కొండ కోటపై ఘనంగా పంద్రాగష్టు పండుగ (ఫొటోలు)
-
ఎందరో మహనీయుల త్యాగ ఫలితమే స్వాతంత్య్రం
-
హైదరాబాద్ గోల్కొండలో కారు బీభత్సం
-
గోల్కొండలో దారుణం.. డ్రంక్ & డ్రైవింగ్‌తో చిన్నారి బలిగొన్న యువకులు
హైదరాబాద్: గోల్కొండలో దారుణం చోటు చేసుకుంది. గోల్కొండ ఇబ్రహీం బాగ్ లో కారు బీభత్సం సృష్టించడంతో..చిన్నారి మృతి చెందింది. రాంగ్ రూట్లో ర్యాష్‌గా దూసుకొచ్చన కారు బైక్‌ను ఢీకొట్టడంతో బైక్‌పై ఉన్న చిన్నారి మృతి చెందింది, తల్లిదండ్రులకు తీవ్ర గాయాలు అయ్యాయి.కారులోని వ్యక్తి మద్యం సేవించి ఉన్నట్లు స్థానికులు చెపుతున్నారు. స్పాట్‌కు చేరుకున్న గోల్కొండ పోలీసులు కార్ డ్రైవ్ చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. కారులో మద్యం బాటిళ్ళు కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు గోల్కొండ పోలీసులు. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. -
భాగ్యనగరంలో బోనాల సందడి
-
స్విచ్‌బోర్డ్‌లో రూ. 15 కోట్ల గోల్కొండ వజ్రం
కోల్‌కతా: సత్యజిత్ రే దర్శకత్వంలో 1979లో వచ్చిన ‘జోయ్ బాబా ఫెలూనాథ్’ అనే బెంగాలీ సినిమాలో అత్యంత ఖరీదైన వజ్రం దుర్గామాత అధిష్టించిన సింహం బొమ్మ నోటిలో చాలాకాలం తర్వాత దొరుకుతుంది. మిస్టరీ వీడిపోతుంది. అలాంటి సంఘటనే పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో జరిగింది. ఇక్కడ కరెంటు స్విచ్‌బోర్డులో రూ.15 కోట్ల విలువైన 32 క్యారెట్ల బరువైన గోల్కొండ వజ్రం దొరికింది. అసలు విషయమేమి టంటే.. ప్రణబ్ కుమార్ రాయ్ అనే వ్యక్తి వద్ద ఈ వజ్రం ఉండేది. 2002లో దాని నాణ్యత, ధర తెల్సుకునేందుకు ఇంద్రజిత్ తపాదార్ అనే వజ్రాల మధ్యవర్తిని సంప్రదించాడు. 2002 జూన్‌లో ఇంద్రజిత్ మరొకడిని తీసుకొని ప్రణబ్ ఇంటికి వచ్చాడు. వారిద్దరూ కలిసి ప్రణబ్‌ను పిస్తోల్‌తో బెదిరించి వజ్రంతో ఉడాయించారు. బాధితుడి ఫిర్యాదులో పోలీసులు రంగంలోకి దిగారు. ఇంద్రజిత్ ఇంట్లో గాలింపు చేపట్టారు. వజ్రం ఆచూకీ దొరకలేదు. మరోవైపు తనకేమీ తెలియదని ఇంద్రజిత్ బుకాయించాడు. వజ్రం కచి్చతంగా అతడి ఇంట్లోనే ఉంటుందున్న నమ్మకంతో పోలీసులు అన్వేషణ కొనసాగించారు. అయినాదొరకలేదు. చిట్టచివరకు చాలా రోజుల తర్వాత అదే ఇంట్లో మెట్ల కింద కరెంటు స్విచ్‌బోర్డు లోపలున్న చిన్న సొరంగంలో వజ్రం లభ్యమైంది. నిందితుడు ఇంద్రజిత్‌కు ట్రయల్ కోర్టు రెండేళ్ల జైలుశిక్ష విధించింది. ఇంకోవైపు వజ్రం యజమాని ప్రణబ్ కుమారేనా కాదా అనే దానిపై న్యాయ వివాదం కొనసాగింది. ఆ వజ్రం అసలు సొంతదారు అతడేనని సిటీ సెషన్స్ కోర్టు గతవారం తీర్పునిచి్చంది. వజ్రం రూపురేఖలు మార్చొద్దని, ఇందుకోసం రూ.2 కోట్ల విలువైన బాండ్ సమర్పించాలని ప్రణబ్‌ను ఆదేశించింది. ప్రపంచ ప్రఖ్యాత కోహినూర్, షాజహాన్ వజ్రాలు సైతం గోల్కొండ ప్రాంతానికి చెందినవే. -
Golconda Bonalu 2023 : గోల్కొండ బోనాలు షురూ (ఫొటోలు)
-
గోల్కొండ మెట్లబావి, దోమకొండ కోటలకు యునెస్కో పురస్కారాలు
సాక్షి, హైదరాబాద్/కామారెడ్డి: ప్రజలు, పౌర సంస్థలు, వ్యక్తుల ఆధ్వర్యంలో సాంస్కృతిక వారసత్వ కట్టడాల పునరుద్ధరణలో మంచి ప్రతిభ కనబరిచిన పనులకు యునెస్కో పురస్కారాలు ప్రకటించింది. ఆసియా–పసిఫిక్ విభాగానికి మన దేశం నుంచి మూడు నిర్మాణాలు ఎంపిక కాగా, అందులో రెండు తెలంగాణకు చెందినవే కావడం విశేషం. సాంస్కృతిక వారసత్వ కట్టడాల పున రుద్ధరణ (ఏసియా–పసిఫిక్) కింద కుతుబ్‌షాహీ టూంబ్స్ పరిధిలోని గోల్కొండ మెట్ల బావి ‘అవార్డ్ ఆఫ్ డిస్టింక్షన్’కు, కామారెడ్డి జిల్లా దోమకొండ కోట ‘అవార్డ్ ఆఫ్ మెరిట్’కు ఎంపికయ్యాయి. దోమకొండ కోటను నాటి సంస్థానాధీశుల వారసులు పునరుద్ధరించుకుంటూ వస్తుండగా, మెట్ల బావిని ఆగాఖాన్ ట్రస్ట్ సొంత నిధుల తో పునరుద్ధరించింది. కుతుబ్‌షాహీల కాలంలో అద్భుత నిర్మాణ కౌశలంతో ఈ బావి రూపుదిద్దుకుంది. ఈ తరహా మెట్లబావులు కాకతీయుల కాలంలో నిర్మించిన దాఖలాలున్నాయి. గోల్కొండ కోటను కూడా తొలుత కాకతీయులే నిర్మించినందున, ఈ బావి కూడా వారి హయాంలోనే రూపుదిద్దు కుని ఉంటుందన్న వాదనా ఉంది. భారీ వర్షాలతో బావి కొంతభాగం కూలి పూడుకుపోయింది. ఆగాఖాన్ ట్రస్టు దాన్ని పూర్తిస్థాయిలో పునరుద్ధరించడంతో మళ్లీ అందులో నీటి ఊట ఏర్పడి ఇప్పుడు పూర్వపు రూపాన్ని సంతరించుకుంది. ఈ పునరుద్ధరణ పనులు అద్భుతంగా సాగిన తీరును యునెస్కో గుర్తించింది. వారెవ్వా.. ముంబై మ్యూజియం.. ఏసియా–పసిఫిక్ ప్రాంతానికి సంబంధించి 6 దేశాలకు చెందిన 13 కట్టడాలు పురస్కారాల జాబితాలో చోటు దక్కించుకున్నాయి. భారత్, చైనా, అఫ్ఘానిస్తాన్, ఇరాన్, నేపాల్, థాయిలాండ్ మాత్రమే ఈ ఘనత సాధించాయి. ఇందులో మన దేశం నుంచి నాలుగు కట్టడాలున్నాయి. పురస్కారాల్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన విభాగం ‘అవార్డ్ ఆఫ్ ఎక్సెలెన్స్’. ఈ కేటగిరీలో ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ వాస్తు సంగ్రహాలయ మ్యూజియం ఒక్కటే చోటు దక్కించుకోవటం విశేషం. దీని నిర్మాణాన్ని పునరుద్ధరించిన తీరు అత్యద్భుతమని యునెస్కో పురస్కారాల జ్యూరీ అభిప్రాయపడింది. రెండో కేటగిరీ అయిన డిస్టింక్షన్లో మెట్లబావి చోటు దక్కించుకుంది. అలాగే ముంబైలోని బైకులా స్టేషన్ మెరిట్ విభాగంలో చోటు దక్కించుకుంది. ఎంగ్ టెంగ్ ఫాంగ్ చారిటబుల్ ట్రస్టుతో సంయుక్తంగా యునెస్కో ఈ పురస్కారాలను ప్రకటిస్తోంది. 40 ఎకరాల విస్తీర్ణంలో... 40 ఎకరాల విస్తీర్ణంలో చుట్టూ ఎత్తైన రాతి కట్టడంతో ప్రహరీ, దాని చుట్టూ కందకం.. ఇప్పటికీ దోమకొండ కోట చెక్కు చెదరలేదు. కోటకు తూర్పు, పడమర దిక్కుల్లో పెద్ద ద్వారాలున్నాయి. సంస్థానాదీశుల ప్రధాన నివాసంగా వెంకటభవనం రాజసం ఉట్టిపడేలా కనిపిస్తుంది. కోటలో రాతితో మహదేవుని ఆలయాన్ని అద్భుతంగా నిర్మించారు. కోటలో అద్దాల మేడ ప్రత్యేకం. ప్రముఖ సినీ హీరో చిరంజీవి తనయుడు రాంచరణ్, ఉపాసనల వివాహం ఇక్కడే జరిగింది. ఆర్కిటెక్ట్ అనురాధ నాయక్ కోట పరిరక్షణ బాధ్యతలు చూస్తున్నారు. గుర్తింపు రావడంపై దోమకొండ సంస్థానం వారసుడు అనిల్ కామినేని, అతని సతీమణి శోభన కామినేని మాట్లాడుతూ.. కోటకు వచ్చిన గుర్తింపు దోమకొండ ప్రజలకేకాక తెలంగాణ ప్రజలందరికీ దక్కిన గుర్తింపుగా భావిస్తున్నామన్నారు. -
నగరంలో ఆధ్యాత్మిక వాతావరణం
గోల్కొండ: నగరంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొందని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ అన్నారు. ఆదివారం ఆయన గోల్కొండ కోటకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన పోలీస్ అధికారులతో కలిసి బోనాల బందోబస్తును పర్యవేక్షించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో టీఆర్ఎస్ కార్వాన్ నియోజకవర్గ ఇంచార్జ్ టి.జీవన్ సింగ్ ఆయనకు శాలువా కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... వివిధ వర్గాల పండుగలు ఒకే రోజు రావడంతో నగరంలో ఆధ్యాత్మిక వాతావరణం పరిఢవిల్లిందని ఆయన అన్నారు. వివిధ వర్గాల ప్రజలు ఒకరినొకరు అభినందించుకుంటూ స్నేహపూరితమైన వాతావరణంలో పండుగలు నిర్వహించుకుంటున్నారు. కోట బోనాలకు గతంలో ఎన్నడూ లేని విధంగా బందోబస్తును ఏర్పాటు చేశామన్నారు. ఆయన వెంట పశ్చిమ మండలం డీసీపీ జోయల్ డేవిస్, నగర అదనపు కమిషనర్ ఎ.ఆర్. శ్రీనివాస్, టీఆర్ఎస్ నాయకులు గోవింద్ రాజ్, మైత్రి కమిటీ సభ్యులు ఆబెద్, ఇలియాస్ అక్బర్, జంగయ్య తదితరులున్నారు. -
గోల్కొండ కోటలో బోనాల సందడి (ఫొటోలు)
-
‘గోల్కొండ’ నోట్‌బుక్స్
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: లేపాక్షి నంది నోట్‌బుక్స్ అంటే ఒకప్పుడు విద్యార్థుల్లో యమ క్రేజ్. హాస్టళ్లలోని విద్యార్థులకు ఈ నోట్ బుక్స్‌నే సరఫరా చేసేవారు. బయటివారు కొనుక్కోవాలంటే మాత్రం సూపర్బజార్లకు వెళ్లాల్సిందే. సాధారణ నోట్ బుక్‌లకంటే పెద్దసైజ్, నాణ్యత ఈ నోట్‌బుక్స్ సొంతం. వాటి మీద ఆసక్తితో విద్యార్థులు పట్టణాల్లోని సూపర్ బజార్లకు వెళ్లి మరీ కొనుక్కునేవారు. ఇప్పుడు ఆ నోట్‌బుక్స్ మళ్లీ రాబోతున్నాయి. కాకపోతే లేపాక్షి నంది బ్రాండ్ స్థానంలో ‘గోల్కొండ’ నోట్‌బుక్స్ పేరుతో వాటిని పరిశ్రమల శాఖ తీసుకొస్తోంది. అన్ని శాఖలకు అందుబాటులోకి... తెలంగాణ ట్రేడ్ ప్రమోషన్లో భాగంగా ఈ నోట్‌బుక్స్‌ను విద్యార్థులకు అందుబాటులోకి తెస్తోంది. విద్యాశాఖ పరిధిలోని గురుకులాలు, కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాల్లో (కేజీబీవీ) వీటిని అందించేందుకు చర్యలు చేపట్టింది. గోల్కొండ నోట్‌బుక్‌లను తీసుకునేలా జిల్లాల్లోని డీఈఓలకు తగిన ఆదేశాలు జారీ చేయాలని విద్యాశాఖను కోరింది. విద్యార్థులకే కాక... అన్ని శాఖల విభాగాధిపతి కార్యాలయాలు, కమిషనరేట్లు, కలెక్టరేట్లు, కార్పొరేషన్లు, బోర్డు కార్యాలయాల్లోనూ గోల్కొండ స్క్రిబ్లింగ్ ప్యాడ్లు, పేపరు అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టింది. ఆయా శాఖల అధికారులకు పరిశ్రమల శాఖ లేఖలు కూడా రాసింది. సైజును బట్టి ధరలు.. సైజులను బట్టి ఈ నోట్‌బుక్‌ల ధరలను నిర్ణయించింది. ఏ4 సైజ్, ఏ3 సైజు తదితర తెల్ల కాగితం నాణ్యతను (70 జీఎస్ఎం, 75 జీఎస్ఎం) బట్టి ధరలను ఖరారు చేసింది. 200 పేజీల సింగిల్ రూల్డ్ (వైట్) నోటుబుక్కు సైజును బట్టి రూ.31.30గా, 100 పేజీల నోట్ బుక్ ధరను సైజును బట్టి రూ.10.29గా, రూ.17.77గా నిర్ణయించింది. ఈ మేరకు వివరాలను గురుకుల విద్యాసంస్థల అధికారులకు పంపించింది. వాటిని కొనుగోలు చేసేలా చర్యలు చేపట్టాలని కోరింది. -
స్వధర్మం, స్వాభిమానం పెంపొందించేందుకే..
హిమాయత్‌నగర్: దేశ స్వాతంత్య్ర అమృతోత్సవాల్లో (ఆజాదీ కా అమృత్ మహోత్సవ్) భాగంగా హైదరాబాద్‌లోని కేశవ మెమోరియల్ కాలేజీలో గోల్కొండ సాహితీ మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. దేశ ప్రజల్లో స్వధర్మ, స్వాభిమాన, స్వరాజ్య భావాలను పెంపొందించేందుకు పెద్ద ఎత్తున ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. శనివారం నారాయణగూడలోని కేశవ మెమోరియల్ కాలేజీ ప్రాంగణంలో సమాచార భారతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గోల్కొండ సాహితీ మహోత్సవాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ తరహా ఉత్సవాలు ప్రజల్లో ఉత్సాహం నింపుతాయని బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. విస్మరణకు గురైన వీరుల యాదిలో.. భారత స్వతంత్ర పోరాటంలో విస్మరణకు గురైన వీరులను స్మరించుకునేందుకు ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ నిర్వహించుకుంటున్నామని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే బ్రిటిషర్లను ధైర్యంగా ఎదుర్కొన్న వనవాసీ వీరుడు బిర్సా ముండా జయంతిని జాతీయ గిరిజన దినోత్సవంగా కేంద్రం ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. హైదరాబాద్‌లో కూడా కుమురంభీం, రాంజీ గోండు, అల్లూరి సీతారామరాజు వంటి గిరిజన వీరుల గాథలను పరిచయం చేసేందుకు గిరిజన మ్యూజియం ఏర్పాటుకు కేంద్రం రూ.15 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. కాగా, డాక్టర్ రతన్ శార్దా రచించిన స్వరాజ్య సాధనలో ఆర్ఎస్ఎస్, ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి రచించిన నిజాం రూల్ అన్మాస్క్డ్, డాక్టర్ బి.సారంగపాణి రచించిన ఆంగ్లేయుల ఏలుబడి.. పుస్తకాలను వారు ఆవిష్కరించారు. ఆకట్టుకున్న స్వాగత తోరణం కేశవ మెమోరియల్ కాలేజీ ప్రాంగణంలో రెండ్రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల కోసం ఏర్పాటు చేసిన స్వాగత తోరణం అందరినీ ఆకట్టుకుంది. ఇందులో భారత స్వంతంత్య్ర సమరయోధుల చిత్రాలు, నిజాం సంకెళ్ల నుంచి తెలంగాణను కాపాడటానికి పాటుపడ్డ కవులు, కళాకారులు, యోధుల చిత్రాలు, వారి సంక్షిప్త జీవిత చరిత్ర ఉన్నాయి. -
బ్యాంక్ ఉద్యోగి: భార్య వేధిస్తోంది.. చనిపోతున్నా..
గోల్కొండ: ఉన్నత చదువులు, మంచి ఉద్యోగం చేస్తున్న ఓ వ్యక్తి భార్య వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. షేక్‌పేట్‌కు చెందిన సంతోష్(36) నగరంలోని బ్యాంక్ ఆఫ్ అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు. ఇతడికి 2013లో పాత నగరానికి చెందిన కళ్యాణితో పెళ్లి అయింది. వీరికి అభిరామ్(6) కొడుకు ఉన్నాడు. అభిరామ్ కొంత కాలంగా అనారోగ్యంతో ఉన్నాడు. దీంతో సంతోష్‌ను భార్య కళ్యాణి వేధిస్తోంది. భార్య, ఆమె కుటుంబ సభ్యుల వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకుందామని నిర్ణయించుకున్నాడు. ఆన్లైన్లో పురుగుల మందు తెప్పించుకున్నాడు. శుక్రవారం రాత్రి కూల్ డ్రింక్‌లో ఆ మందును కలిపి తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా ఆదివారం మృతి చెందాడు. సెల్ఫీ వీడియో.. సంతోష్ ఆత్మహత్య చేసుకునే ముందే ఓ సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. తన మరణానికి భార్య కళ్యాణి కారణమని స్పష్టం చేశాడు. ఇప్పటి వరకు మూడుసార్లు తనపై కళ్యాణి కుటుంబ సభ్యులు హత్యాయత్నం చేశారని, కేసులు, పంచాయితీలతో తనను ఇబ్బంది పెట్టారని రికార్డ్ చేశాడు. కళ్యాణి తల్లిదండ్రులు అరుణ, పండరినాథ్, కళ్యాణి సోదరుడు గణేష్, బాబాయి భీమ్ హత్యాయత్నం చేశారని ఆరోపించాడు. -
గోల్కొండ నకిలీ నోట్ల వ్యవహారంలో కొత్త ట్విస్ట్
-
ఆంధ్ర గోల్కొండగా పిలిచే ప్రాంతమేదో తెలుసా?
యడ్లపాడు(గుంటూరు): కొండవీడు అంటే రెడ్డిరాజుల సుదీర్ఘ పాలన గుర్తొస్తుంది. కాని శత్రుదుర్భద్యమైన ఈ రాజ్యాన్ని మరెందరో రాజులు, రారాజులు పరిపాలించారు. అందుకే ఇక్కడ గుట్టను తాకినా, ఏ కొండరాయిని కదిలించిన గత చరిత్ర వైభవాలను ఆనావాళ్లుగా చూపించి ఆకట్టుకుంటాయి. గుంటూరు జిల్లా కేంద్రానికి అత్యంత సమీపాన ఉన్న ఈ కొండవీడును పర్యాటక ప్రేమికులు ఆంధ్ర గోల్కొండగా పిలుచుకుంటారు. బాగ్దాద్ నుంచి భారతదేశానికి ఆధ్యాత్మిక పరిమళాలను పంచేందుకు వచ్చిన ఓ మహనీయుని చరిత్ర ఇది. కొండవీడులోని దాదాపీర్ దర్గా దాదాపీర్ అసలు పేరు... ఫిరంగిపురం నుంచి వస్తుండగా గ్రామ ప్రారంభంలో కొండవీడు కొండల పక్కనే కనిపించే దర్గా ఇది. ‘హజ్రత్ సయ్యద్ ఖుదాదే ఫకీర్షా ఔలియా’ అన్నది దర్గా అసలు పేరు. స్థానికులు వాడుకలో పిలుచుకునే పదం ‘దాదాపీర్’ దర్గా. సృష్టికర్త అల్లాహ్ గొప్పతనాన్ని, ఆయన్నూ ఆరాధించే విధానాన్ని చైతన్యం చేయాలని ఆధ్యాత్మిక గురువులకు గురువైన మహబూబ్ సుభాని సంకల్పించారట. దీంతో బాగ్దాద్‌కు చెందిన బీబీహాజీర దంపతులు సుమారు నాలుగు శతాబ్ధాల క్రితం భారతదేశానికి వచ్చారట. (చదవండి: పోణంగిలో అశ్లీల నృత్యాలు ) చివరి మజీలి కొండవీడు.. తొలుత ఉత్తరభారత్‌లో ప్రారంభమైన బాబావారి ఆధ్యాత్మిక బోధనలు.. క్రమేణ దక్షిణప్రాంతాలకు విస్తరించాయి. దాదాపీర్ వారి చివరి మజీలిగా కొండవీడును ఎంచుకున్నట్లు ఇక్కడి పెద్దలు చెబుతారు. అనంత కరుణామయుడు అల్లాహ్ ఆజ్ఞలను అందరికీ తెలపడం కోసమే దాదాపీర్ జీవితాన్ని గడిపారు. ఖురాన్లో సందేశాలను పాటిస్తూ అందరిని అదేమార్గంలో నడిపించడంతో ఆయన్నూ దైవదూతగా భావించారు. కొండవీడులోని దాదాపీర్ దర్గా అత్తరు విక్రయాలతో జీవనం.. కొండవీడు పరిపర ప్రాంతాల్లో లభించే పుష్పాలు, మూలికలతో వివిధ రకాల అత్తరు పరిమళాలను దాదాపీర్ దంపతులు తయారు చేసేవారు. దాదాపీర్ వద్ద నిత్యం అత్తరు సువాసనలు గుభాళిస్తాయట. తాము తయారు చేసిన పరిమళాలను సమీప గ్రామాల్లో విక్రయిస్తూ జీవనాన్ని కొనసాగించారట. కేవలం ఒక్కరూపాయికే అత్తరును ఇచ్చేవారట? ప్రకృతి అంటే బాబావారికి ఎంతో ప్రీతి. ఆయన చివరి మజీలిగా పచ్చగా పరిఢవిల్లే కొండవీడును ఎంచుకున్నరని ఇక్కడి ప్రజలు చెబుతుంటారు. కొండవీడులోని దాదాపీర్ దర్గా దాపరికంతో జరిగే అనర్థాలు.. పవిత్ర ఖురాన్, నమాజ్, దువా, బయాన్ తదితర అంశాల గురించి నిత్యం వివరించడంలోనే ఎక్కువ సమయాన్ని గడిపేవారట. రేపటికి (మరణం తర్వాత) మనిషికి అవసరమైంది పుణ్యమేగాని, సంపాదన కాదని చెప్పెవారట. దాచుకోవడం వల్ల దోచుకోవడం అలవరుతుందని, తద్వార స్వార్ధం, సోమరితనం ఏర్పడతాయని బోధించేవారు. మనిషి ఎక్కువగా సంపాదించుకోవాల్సింది దైవంపై విశ్వాసం మాత్రమే అంటూ వివరించేవారు. శతాబ్ధాల కిందటి మసీదులో నేటికీ నమాజులు... ఈ ప్రాంతంలో ముస్లిం రాజుల కాలం నాటి అతి పురాతన రెండు మసీదులు ఉన్నాయి. శతాబ్ధాల క్రితం నిర్మించిన ఈ మసీదుల్లో ఒకటి కొండవీడు కొండలపై ఉండగా, రెండోది కొండ దిగువన కొండవీడు గ్రామంలో ఉంది. అయితే కొండపై ఉన్న మసీదును ముస్లింరాజు నిర్మించారు. అందులో గుప్తనిధుల కోసం దుండగుల మసీదును కొంతభాగం ధ్వంసం చేయగా, కొండకింద దర్గా ప్రాంగణంలో ఉన్న మసీదు నేటికీ చెక్కుచెదరలేదు. ఇప్పటికి దర్గాకు వచ్చిన వారంతా ఆ మసీదులోనే నమాజ్, ఖురాన్ పఠనం చేయడం విశేషం. (చదవండి: ‘అమూల్’ ఒప్పందంతో మీకేంటి నష్టం?) దర్గా ప్రాంగణంలో దాదాపీర్ నిర్మించిన చెక్కుచెదరని మసీదు ముస్లిం రాజు నిర్మించిన దాదాపీర్ దర్గా దాదాపీర్ నిర్మించిన ఆ మసీదును అంతా భారీ కొండబండరాళ్లతో నిర్మితమైంది. ఏనుగులు సైతం మోయలేని ఆ బండరాళ్లను సునాయాసంగా తెచ్చి మసీదు నిర్మాణం చేస్తున్న దాదాపీర్ మహిమను కొండవీడును పాలించే అప్పటి రాజు పఠాన్మథాన్ఖాన్ కళ్లారా చూశాడట. ఎవరి సాయం లేకుండా స్వయంగా ఆయనే మసీదు నిర్మించడాన్ని చూసి ఆనందపరవశుడై నాటి నుంచి ఆయన భక్తునిగా మారిపోయాడు. అంతేకాదు కొన్నాళ్లకు స్వర్గస్తులైన ఆ దంపతుల సమాధులకు 4.5 ఎకరాల విస్తీర్ణంలో దర్గా నిర్మించారు. దర్గా ఉత్సవాలకు నిర్వహణకు మరో 91 ఎకరాల భూమిని వంశీయులకు ఈనాంగా ఇచ్చినట్లు చరిత్ర చెబుతుంది. బక్రీద్ పండుగ నాడు ఉరుసు ఉత్సవాలు.. ప్రతియేటా బక్రీద్ పండుగనాడు ఈ దర్గా ఉరుసు మహోత్సవ వేడుకలను వస్తాయి. నాలుగు శతాబ్ధాల కాలం నుంచి బాబావారి వంశీయులు, గ్రామ ముజావర్ల ఆధ్వర్యంలో ఈ వేడుకలను మూడు రోజులపాటు ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలకు సుదూర ప్రాంతాలకు చెందిన వేలాది మంది భక్తులు ఇక్కడకు వచ్చి దాదాపీర్ దర్గాను సందర్శిస్తారు. ప్రస్తుతం దాదాపీర్ వంశీయులైన నౌషద్ నేతృత్వంలో ఉరుసు ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. (చదవండి: కర్నూల్లో సింగర్ సునీత సందడి) -
గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన సీఎం కేసీఆర్
-
పంద్రాగస్టు వేడుకులకు సిద్దమైన గోల్కొండ కోట
-
గోల్కొండ కోటలో బోనాల సందడి
-
ముగ్గురు కూతుళ్లను చైన్‌తో చితకబాదిన తండ్రి
సాక్షి, గోల్కొండ: తన ముగ్గురు కూతుళ్లను ఇనుప చైన్‌తో రాక్షసంగా కొట్టి గాయపర్చిన ఓ తండ్రి ఉదంతం గోల్కొండలో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాలు ఇలా ఉన్నాయి ఆటో డ్రైవర్ ఎజాస్ భార్య గౌసియాతో కలిసి గోల్కొండ ధాన్ కోటలోని సాలె నగర్ కంచెలో ఉంటున్నాడు. వీరికి జైనా (12), ఉస్నా (9), జువేరియా సంతానం. తాగుడుకు బానిసైన ఎజాజ్ నిత్య భార్యతో పాటు ముగ్గురు కూతుళ్లను హింసించేవాడు. ఈ క్రమంలో ఈనెల 7వ తేదీ రాత్రి ఎజాజ్‌ఖాన్ మద్యం సేవించి ఇంటికి వచ్చి భార్యతో ఘర్షణకు దిగాడు. వెంటనే ఇనుప చైన్ తీసుకుని భార్య గౌసియాను కొట్టడం ప్రారంభించాడు. దెబ్బలు భరించలేని గౌసియా భర్త నుంచి తప్పించుకుని ఇంటి బయటకు వెళ్లింది. దీంతో ఎజాజ్ వెంటనే తన ముగ్గురు కూతుళ్లను విచక్షణారహితంగా కొట్టాడు. కాగా ఉదయం ఇంటికి వచ్చిన గౌసియా పిల్లలు గాయాలతో ఉండటం చూసింది. భర్త ఎజాస్ ఖాన్ ఇంటి నుంచి పారిపోయాడు. గాయపడిన తన పిల్లలతో గౌసియా బేగం గోల్కొండ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. -
బోనం ఎత్తుదాం.. నేటి నుంచి మహా సంబురం
-
గెస్ట్ హౌస్‌లో వ్యభిచారం.. ఇద్దరు విటులు, యువతుల అరెస్టు
సాక్షి, గోల్కొండ: వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ గెస్ట్ హౌస్‌పై గోల్కొండ పోలీసులు దాడి చేశారు. గెస్ట్‌హౌస్ వాచ్‌మెన్‌తో పాటు ఇద్దరు విటులను అరెస్టు చేశారు. గోల్కొండ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... కిరణ్ అలియాస్ మున్నాభాయ్ షేక్‌పేట్ ఓయూ కాలనీలో ‘ఎంఎస్పీ గెస్ట్ ఇన్’గెస్ట్ హౌజ్‌లో వ్యభిచారం నిర్వహిస్తున్నాడు. గెస్ట్‌హౌజ్‌ను బాగా ఇంటీరియర్ డెకరేషన్ చేసి ఇంటి ముందు ఒక సెక్యూరిటీ గార్డును కూడా నియమించుకున్నాడు. కాగా ఇతర ప్రాంతాల నుంచి యువతులను తెచ్చి వ్యభిచారం నిర్వహించేవాడు. అయితే బుధవారం రాత్రి పోలీసులు ఆ ఇంటిపై దాడి చేశారు. ఆ సమయంలో ఇద్దరు యువతులు, ఇద్దరు విటులతో పాటు గెస్ట్‌హౌజ్ వాచ్మెన్ జనైనాజెమ్ ఉద్దీన్ మలిక్‌ను అదుపులోకి తీసుకున్నారు. నిర్వాహకుడు మున్నాభాయ్ పరారీలో ఉన్నాడు. వాచ్‌మెన్‌తో పాటు పట్టుబడ్డ వి.శ్రీను, గొలుసుల శ్రీనివాస్‌లను రిమాండ్‌కు తరలించారు. పోలీసులు వారి నుంచి రూ.4వేల నగదు, 5 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నాడు. వ్యభిచార ముఠా సభ్యులపై పీడీయాక్ట్ చైతన్యపురి: సులువుగా డబ్బు సంపాదన కోసం వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠా సభ్యులపై సరూర్ నగర్ పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేశారు. ఇన్స్పెక్టర్ సీతారాం తెలిపిన వివరాల ప్రకారం.. బత్తుల మానస, వల్లపు మల్లికార్జున్, పోకల లింగయ్యలు ఒక ముఠాగా ఏర్పడి తెలుగు రాష్ట్రాల నుంచి యువతులను రప్పించి వ్యభిచార గృహం నడుపుతున్నారు. సమాచారం అందుకున్న సరూర్‌నగర్ పోలీసులు, ఎస్ఓటీ పోలీసులు వారం రోజుల క్రితం ఇంటిపై దాడి చేశారు. మానస, మల్లికాఖార్జులను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. పరారీలో ఉన్న పోకల లింగయ్యను గురువారం అరెస్టు చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ముగ్గురు నిందితులపై పీడీ యాక్ట్ నమోదు చేసినట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు. చదవండి: హైటెక్ సిటీ: విదేశీ యువతులతో వ్యభిచారం -
హస్త కళాకృతులకు ఇక ప్రపంచ స్థాయి మార్కెటింగ్ ..
హైదరాబాద్: రాష్ట్రంలో తయారవుతున్న సంప్రదాయ హస్త కళాకృతులకు ప్రపంచస్థాయి మార్కెటింగ్ సౌకర్యం కల్పించేందుకు ‘ఈ–గోల్కొండ’ వెబ్ పోర్టల్‌ను రూపొందించినట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొ న్నారు. తెలంగాణ చేనేత, జౌళి శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన ఈ ప్లాట్‌ఫాం ద్వారా సంప్రదాయ హస్త కళా కృతులను కొనుగోలు చేసే వీలుంటుందన్నారు. గురువారం ప్రగతిభవన్‌లో జరిగిన కార్య క్రమంలో ‘ఈ– గోల్కొండ’ఆన్లైన్ ప్లాట్‌ఫాంను కేటీఆర్ ఆవిష్కరించారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ప్రైవేటు ఈ–కామర్స్ వెబ్సైట్లతో పోలిస్తే ‘ఈ–గోల్కొండ’పోర్టల్‌ను మెరుగైన ఫీచర్స్‌తో రూపొందించినట్లు తెలిపారు. ఈ పోర్టల్ ద్వారా ప్రస్తుతం దేశంలోని ఏ ప్రాంతానికైనా తమ కళా కృతులను సరఫరా చేయనున్నట్లు చెప్పారు. త్వరలో కేంద్ర ప్రభుత్వ అనుమతులు పొంది.. ప్రపంచ దేశాలకు కూడా ఎగుమతులు చేసేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ‘ఈ– గోల్కొండ’ద్వారా అమ్మకానికి పెట్టిన కళాకృతులను పరిశీలించేందుకు త్రీడీ చిత్రాలు అందు బాటులో ఉంటాయని తెలిపారు. మొబైల్ ఫోన్ వినియోగదారులకు కూడా సౌకర్యవంతంగా ఉండేలా వెబ్సైట్ రూపొందించామన్నారు. https://golkondashop.telangana.gov.in లింకు ద్వారా తమకు నచ్చిన కళాకృతులను ప్రజలు కొనుగోలు చేయొచ్చని సూచించారు. రాష్ట్రంలో శతాబ్దాలుగా కొనసాగుతూ వస్తున్న చేనేత కళాకృతుల తయారీని ప్రోత్సహించేందుకు నైపుణ్య శిక్షణ, సాంకేతిక సహకారం, మార్కెటింగ్ సేవలు అందుబాటులోకి తెస్తామన్నారు. కామన్ ఫెసిలిటీ సెంటర్ ఏర్పాటు ద్వారా హస్త కళాకృతులు తయారుచేసే వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని ప్రకటించారు. ప్రగతిభవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే వివేకానంద్‌గౌడ్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, రాష్ట్ర హ్యాండీక్రాఫ్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బొల్లం సంపత్‌కుమార్, చేనేత శాఖ కార్యదర్శి శైలజ రామయ్య పాల్గొన్నారు. -
మరో కోహీనూర్: మన గోల్కొండ వజ్రం వేలానికి
నిజాం కాలంలో వజ్రాలు రాశులుగా పోసి మార్కెట్లో కూరగాయల మాదిరి అమ్ముకున్నారని చదువుకున్నాం. ఇప్పుడు అలాంటి వజ్రాలు ఎక్కడా కనిపించడం లేదు. ఉన్న కొన్నింటిలో కోహీనూర్ వజ్రం బ్రిటన్ రాణి కిరీటంలో ఉండగా.. మరికొన్ని వజ్రాలు విదేశాల్లో ఉన్నాయి. నిజాం వంశస్తులకు సంబంధించిన అరుదైన ఆభరణాలు, వజ్రాలు తదితర విలువైన వస్తువులు భారతదేశం నుంచి చేజారాయి. అలా చేజారిన వాటిలో ఉన్న ఒక వజ్రం ప్రస్తుతం వేలానికి పెట్టారు. గోల్కొండలో లభించిన అపురూపమైన, అరుదైన వజ్రం న్యూయార్క్‌లోని ఫార్చునా ఆక్షన్ హౌస్‌లో వేలం వేస్తున్నారు. 3.05 క్యారెట్ల వజ్రం రూ.కోటిన్నరకు విలువ చేస్తుందని అంచనా. వీటితో పాటు కుతుబ్ షాహీ కాలంలో గోల్కొండ నుంచి తవ్విన వజ్రాలు, అనేక విలువైన కళాఖండాలు ఇక్కడ వేలం వేయనున్నారు. గోల్కొండ డైమండ్స్ అని పిలువబడే వజ్రాలు మచ్చలేని విలువైన రాళ్లుగా పేరు పొందాయి. ళ్లను వేలంపాటదారుల కోసం ప్రదర్శిస్తున్నట్లు నిర్వహకులు తెలిపారు. అయితే ఆ వజ్రంతో పాటు మిగతా వస్తువులను భారత ప్రభుత్వమే కొనుగోలు చేయాలని నిజాం వారసులు కోరుతున్నారు. ఇప్పటికే విలువైన వస్తువులను కోల్పోయినట్లు గుర్తు చేస్తున్నారు. ప్రస్తుతం వేలానికి వచ్చిన వజ్రంలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయంట. నైట్రోజన్ ఉనికి ఉండని వజ్రం అని తెలుస్తోంది. దీంతోపాటు పసుపు రంగులో మెరుస్తుందంట. మన దక్కన్ సాంప్రదాయానికి గర్వంగా చెప్పుకునే వజ్రాలు చాలా ఏళ్ల కిందటే హైదరాబాద్ దాటింది. అనంతరం విదేశాలకు చేరింది. దేశానికి చెందిన అపరూపమైన సంపద విదేశాలకు తరలిపోతోందని రాయల్టీ ఆఫ్ హైదరాబాద్ ఎస్టేట్స్ ప్రతినిధి నవాబ్ షఫాత్ అలీఖాన్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గోల్కొండ వైభవాన్ని భావితరాలకు వివరించేందుకే భారతదేశం వేలంలొ పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఎలాగైనా ఆ వజ్రాన్ని మనం సొంత చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. -
2021.. ఓ మువ్వన్నెల పండుగ!
భాగ్యనగరం ఒకప్పుడు.. 30 వేల జనాభాతో కిటకిటలాడింది.. భవిష్యత్తు మీద బెంగతో గోల్కొండను వదిలింది.. అడిగింది లేదనకుండా ఇచ్చే అక్షయపాత్రగా అలరారింది.. చార్మినార్, హుస్సేన్‌సాగర్ వంటి నిర్మాణాలతో అబ్బురపరిచింది.. ఇప్పుడు.. కోటి జనాభాతో కిక్కిరిసిపోతోంది.. ఆధునిక పరిజ్ఞానానికి కేరాఫ్ అడ్రస్‌గా మారుతోంది.. శాటిలైట్ టౌన్‌షిప్స్ ఏర్పాటుకు ప్రణాళికలు వేసుకుంటోంది.. సరికొత్త హైదరాబాద్‌గా మారేందుకు అడుగులేస్తోంది.. అలాంటి మన హైదరాబాద్ మహానగరం త్వరలోనే ఓ అద్భుతమైన మైలు రాయిని దాటనుంది. అదేంటంటే.. 2021 నాటికి.. గోల్కొండ రాజధానిగా అవతరించి 525 ఏళ్లు కానుంది. భాగ్యనగరం రూపుదిద్దుకుని 430 ఏళ్లు పూర్తవుతుంది. సికింద్రాబాద్ ఏర్పడి 215 ఏళ్లు అవుతుంది. సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ ఘన చరిత్రను గుర్తు చేసుకునేందుకు, ఈ నగరాన్ని భావితరాలకు చెక్కు చెదరకుండా అందించేందుకు ‘హైదరాబాద్ హెరిటేజ్ ఫెస్ట్’పేరిట హైదరాబాద్ ట్రేల్స్, వసామహ ఆర్కిటెక్ట్, హెరిటేజ్ ఫ్యూచర్స్ వంటి పలు సంస్థలు ముందుకొచ్చాయి. హైదరాబాద్ గొప్పతనాన్ని చాటిచెప్పేందుకు, ప్రజలకు నగరంపై అవగాహన కలిగించేందుకు ఏడాది పొడవునా పలుకార్యక్రమాలు నిర్వహించనున్నాయి. తొలి అడుగు పడిందక్కడ.. 1496: గోల్కొండ రాజధాని నగరంగా ఏర్పాటుకు తొలి అడుగు.. కాకతీయుల హయాంలో సైనిక పోస్టు, చిన్న గ్రామాల సముదాయంగా ఉన్న గోల్కొండ.. రాజధానిగా ఎదిగేందుకు 1496లో బీజం పడింది. ఈ ప్రాంతంపై దండెత్తి విధ్వంసం సృష్టించిన బహమనీ సామ్రాజ్యం.. సుల్తాన్ కులీని సుబేదారు (గవర్నర్)గా నియమించింది. పర్షియా నుంచి వచ్చిన ఆయన కుతుబ్‌షాహీ సామ్రాజ్యాన్ని స్థాపించారు. చూస్తుండగానే గోల్కొండ పట్టణంగా పురోగమించింది. అలా 95 ఏళ్లు కొనసాగింది. సరికొత్త పరిజ్ఞానం గోల్కొండ ప్రాంతంలో మౌలిక వసతుల కల్పనకు.. నాటి ఆధునికతను వాడుకుంటూ ముందుకు సాగారు. నీటి వనరుల కోసం గురుత్వాకర్షణ శక్తితో అందేలా ఎత్తయిన ప్రాంతంలో దుర్గం చెరువును తవ్వించారు. అక్కడి నుంచి ప్రత్యేక చానెళ్ల ద్వారా నీటిని తరలించి కోటలో నిల్వచేసేందుకు కటోరా హౌస్‌ను నిర్మించారు. ఆ నీళ్లు కోట భాగానికి చేరేందుకు ఈజిప్షియన్ వాటర్ వీల్ పరిజ్ఞానాన్ని వినియోగించారు. అంటే మనం చూసే జెయింట్ వీల్ తరహాలో ఉండే ఏర్పాటన్న మాట. అది తిరిగే కొద్దీ కింది నీళ్లు పైకి చేరతాయి. అలా రెండు, మూడు యంత్రాలతో పూర్తి పైకి చేరుకుంటాయి. అక్కడ నిల్వ చేసి ప్రత్యేక పైప్లైన్ల ద్వారా దిగువకు పంపుతారు. అలాగే కింద అలికిడి అయితే పై వరకు వినిపించేలా ధ్వని శాస్త్రం ఆధారంగా ఏర్పాట్లు చేయించారు. ఇక గానా బజానాలు, కుస్తీ పోటీలు, వేడుకలతో నిత్యం కోట కళకళలాడుతుండేది. 1591 భాగ్యనగరానికి పునాది.. ‘చెరువులో చేపల్లాగా ఈ కొత్త నగరం జనంతో నిండిపోవాలి’.. మహ్మద్ కులీ కుతుబ్‌షా దైవ ప్రార్థన ఇదీ. అప్పటికే గోల్కొండ నగరం దాదాపు 30 వేల జనాభాతో కిటకిటలాడుతోంది. దీంతో నగరాన్ని విస్తరించాలన్న ఉద్దేశంతో ఆయన పట్టాభిషిక్తుడైన 11 ఏళ్ల తర్వాత.. మూసీకి ఆవల కొత్త నగరానికి శంకుస్థాపన చేశాడు. శత్రువుల భయంతో కోట గోడల మధ్య గోల్కొండ ఉండగా, శత్రువులు లేరన్న ధీమాతో గోడల అవసరం లేకుండా హైదరాబాద్‌ను నిర్మించాడు. ఇరాన్ నుంచి వచ్చిన ఆర్కిటెక్ట్ మీర్ మొమీన్ ప్రణాళికతో నగరం రూపుదిద్దుకుంది. చూస్తుండగానే నగరం నలుచెరగులా విస్తరించింది. నిజాం(గవర్నర్)గా నియమితుడైన మీర్ ఖమ్రుద్దీన్ ఖాన్.. అసఫ్‌జాహీ పాలనకు శ్రీకారం చుట్టాడు. తొలుత ఆయన ఔరంగాబాద్ నుంచే పాలన సాగించారు. కానీ తర్వాత హైదరాబాద్‌కు మకాం మార్చారు. దీంతో మళ్లీ నగర విస్తరణ పెరిగింది. మలుపు తిప్పిన ఆరో నిజాం ముస్లిమేతరుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తూ, పరమత సహనానికి ప్రాధాన్యం ఇవ్వనప్పటికీ.. హైదరాబాద్ నిర్మాణం విషయంలో అసఫ్జాహీలు ప్రత్యేకత చాటుకున్నారు. హిందూ సంస్కృతిపై దౌర్జన్యాల అప ఖ్యాతి మూటగట్టుకున్నారు. ఆరో నిజాం మీర్ మహబూబ్ అలీఖాన్ హయాంలో ఆధునిక హైదరాబాద్‌కు బీజం పడింది. అప్పటికే రైల్వే లాంటి అరుదైన ప్రయాణ వసతి భాగ్యనగరాన్ని చేరింది. నూతన హైదరాబాద్ శిల్పిగా ఖ్యాతికెక్కిన ప్రముఖ ఇంజనీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్యను హైదరాబాద్‌కు పిలిపించింది ఆరో నిజామే. అప్పుడే విరుచుకుపడ్డ వరదలు హైదరాబాద్‌ను అల్లకల్లోలం చేయటంతో మోక్షగుండం వచ్చి అద్భుత డ్రైనేజీ వ్యవస్థ, వరదకు అడ్డుకట్ట పడేలా హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్‌ల నిర్మాణం జరిపిన విషయం తెలిసిందే. ఆరో నిజాం హయాంలో అందుకు ప్రణాళికలు రచించగా.. ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ హయాంలో అమలైంది. ఇక ప్రపంచ కుబేరుడిగా చరిత్రలో నిలిచిన ఏడో నిజాం.. హైదరాబాద్‌కు పూర్తి ఆధునిక రూపునిచ్చాడు. భారతదేశంలో భాగంగా ఉండాలన్న కోరిక లేక పాకిస్తాన్‌కు అనుకూల వైఖరి ప్రదర్శించిన అప్రతిష్ట మూటగట్టుకున్నాడు. ప్రస్తుత హైదరాబాద్‌లో ఈ మాత్రం వసతులు ఉన్నాయంటే దానికి ప్రధాన కారణం మాత్రం ఆయనే. 1806 జంట నగరం వెలసిందప్పుడే ప్రపంచ జంటనగరాల జాబితాలో హైదరాబాద్–సికింద్రాబాద్లు ప్రముఖంగా నిలుస్తాయి. దానికి బీజం పడి 215 ఏళ్లు అవుతోంది. మూడో నిజాం హయాంలో సైనిక స్థావరం పేరుతో సికింద్రాబాద్‌లో ఈస్టిండియా కంపెనీ కాలు మోపింది. అది నిజాంకు మద్దతుగా ఉంటుందనీ నమ్మబలికింది. 5 వేల బ్రిటిష్ సైన్యంతో హుస్సేన్‌సాగర్‌కు ఉత్తరాన కంటోన్మెంట్ ఏర్పడింది. క్రమంగా బ్రిటిష్ అధికారులు, సైనిక పటాలాలు, స్థానికుల నివాసాలు పెరగటంతో అక్కడ తమకు ప్రత్యేకంగా నగరం ఏర్పాటుకు స్థలం చూపాలని నాటి బ్రిటిష్ రెసిడెన్సీ థామస్ సైడన్‌హామ్.. మూడో నిజాం మీర్ అక్బర్ అలీఖాన్ సికిందర్ జాకు లేఖ రాశాడు. ప్రస్తుతం కంటోన్మెంట్ ఉన్న స్థలాన్ని కేటాయిస్తూ దానికి తన పేర సికింద్రాబాద్ అని నామకరణం చేశాడు. ఈ ప్రాంతానికి దిగుమతి సుంకం నుంచి మినహాయింపు ఉండటంతో శరవేగంగా ఆ ప్రాంతం వ్యాపారపరంగా అభివృద్ధి చెంది జనరల్ బజార్ లాంటివి విస్తరించాయి. విద్యాసంస్థలు, స్పోర్ట్స్ క్లబ్‌లు, సాధారణ క్లబ్‌లు, చర్చిలు, తమిళ, కన్నడ, మరాఠీ, పార్సీ వారి విస్తరణ.. కొత్త దేవాలయాలు.. ఒకటేమిటి సికింద్రాబాద్ ఎంతో అద్భుతంగా అభివృద్ధి చెందింది. హైదరాబాద్ కన్నా ప్రణాళికా బద్ధంగా, విశాలమైన రోడ్లు, ఎక్కడ చూసినా పరిశుభ్రత.. విదేశీ ప్రాంతం తరహాలో పురోగమించింది. కుతుబ్‌షాహీల హయాంలో నగరానికి పునాది పడినా.. అభివృద్ధి మాత్రం అసఫ్‌జాహీల కాలంలోనే ఊపందుకుంది. ఇక సికింద్రాబాద్ అభివృద్ధి బ్రిటిష్ వారి పాలనలో జరిగిందని చెప్పుకోవచ్చు.