గోల్కొండ: పంద్రాగస్టు రోజున కేసీఆర్ గోల్కొండ కోటలో జెండా ఎగరవేయనుండడంతో దానికి కావాల్సిన ఏర్పాట్లు చేయడానికి జిల్లా కలెక్టర్ ముఖేశ్‌కుమార్ మీనా మంగళవారం గోల్కొండ కోటకు వచ్చారు. భారతీయ పురాతత్వ సర్వేక్షణ శాఖ అధికారులతో కలిసి ఆయన అట్టార సిడి ప్రాంతాన్ని పరిశీలించారు. గత సోమవారం ముఖ్యమంత్రి కేసీఆర్ అట్టార సిడి ప్రాంతాన్ని ప్రత్యేకంగా సందర్శించి అరగంట పాటు అక్కడున్నారు. 51 ఎకరాల విస్తీరణంలో ఉన్న ఈ ప్రాంతాన్ని పరేడ్ గ్రౌండ్‌గా తీర్చిదిద్దేందుకు కావాల్సిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదే శించడంతో కలెక్టర్ అట్టార సిడి కందకాల నుంచి ఆషుర్‌ఖానా వరకు విస్తరించి ఉన్న మైదానాన్ని పరిశీలించారు.
మైదానం మధ్యలో ఉన్న పెద్ద బండరాళ్లు, చెట్లను తొలగించేందుకు వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. కాగా కటోరహౌస్ క్రాస్‌రోడ్డు నుంచి అట్టార సిడి వరకు ఉన్న రోడ్డు ఎక్కువ సంఖ్యలో వాహనాలు వస్తే తలెత్తే సమస్యలను కూడా ఆయన అధికారులతో చర్చించారు. ఆయన వెంట ఆర్‌డిఓ నిఖిల, గోల్కొండ త హసిల్దార్ వంశీమోహన్, పురావస్తు శాఖ, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ విభాగం అధికారులు ఉన్నారు.
గోల్కొండ కోటను సందర్శించిన కలెక్టర్
Published Wed, Aug 6 2014 4:05 AM | Last Updated on Wed, Aug 15 2018 9:04 PM
Advertisement