
భద్రతా వలయంలో కోట
గోల్కొండ: ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం గోల్కొం డకు వచ్చిన సందర్భంగా పోలీసు అధికారులు సుమారు నాలుగు గంటల పాటు కోటను తమ అధీనంలోకి తీసుకున్నారు. కోటకు వచ్చే దారులన్నిం టినీ మూసివేశారు. అంతేకాకుండా కోట మీదుగా వెళ్లే బస్సులు, ఇతర వాహనాలను దారి మళ్లించారు. సమీపంలోని షాపులన్నింటినీ మూసివేయించడమే కాకుండా కోట బస్ స్టాప్, చోటాబజార్ మెయిన్ రోడ్లపై తోపుడు బండ్లనూ దూరంగా తరలించారు.
మూడు గంటలకు కేసీఆర్ వస్తారని తెలుసుకున్న అధికారులు మధ్యాహ్నం 2.30 నుంచే పర్యాటకులను కోటలోకి అనుమతించ లేదు. సాయంత్రం 5.30 గంటలకు సీఎం అక్కడికి చేరుకున్నారు. లోప ల ఉన్న పర్యాటకులను బయటకు రానివ్వకుండా పోలీసులు గేటు వేసేశారు. దీంతో సుమారు గంట పాటు పర్యాటకులు కోట లోపలే ఉండిపోయారు.