గోల్కొండ, న్యూస్‌లైన్: తమ దైనందిన బిజీ షెడ్యూల్‌లో మహిళా న్యాయవాదులు శారీరక దృఢత్వంపై కూడా శ్రద్ధ చూపాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సి.రోహిణి అన్నారు. గురువారం మాసబ్ ట్యాంక్ స్పోర్ట్స్ కోచింగ్ గ్రౌండ్‌లో మహిళా న్యాయవాదుల క్రికెట్ పోటీలను ఆమె ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ హైకోర్టు న్యాయవాదుల సంఘం మరింత చొరవ చూపి తరచూ ఇలాంటి టోర్నీలు నిర్వహించాలని ఆమె కోరారు. ఈ సందర్భంగా ఆమె మహిళా క్రికెటర్లతో పరిచయం చేసుకున్నారు. అలాగే టాస్ వేసి, బ్యాటింగ్ చేసి టోర్నమెంట్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జస్టిస్ అనీస్, ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు గిరిధర్‌రావు, ఉపాధ్యక్షుడు వేణుమాధవ్, కార్యదర్శి డి.ఎల్. పాండులు పాల్గొన్నారు.
ఫిట్‌నెస్‌పై కూడా దృష్టి పెట్టాలి
Published Fri, Mar 7 2014 12:00 AM | Last Updated on Fri, Aug 31 2018 8:24 PM
Advertisement
Advertisement