క్యాథ్‌ల్యాబ్ సిటీ
* డేంజర్ జోన్‌లో 25 లక్షల మంది యువత..
* 80 శాతం గుండెపోట్లు 40 ఏళ్ల లోపు వారికే
గోల్కొండ, చార్మినార్, హుస్సేన్‌సాగర్.. బిరియానీ, హలీం..అంటే చాలు హైదరాబాద్ సిటీ గుర్తుకొస్తుంది. కానీ కొత్తగా ఈ నగరం తన సంస్కృతి, సంప్రదాయాలు మార్చుకుని ‘క్యాథ్‌ల్యాబ్’ సిటీగా మారిపోతోంది. క్యాథ్‌ల్యాబ్ అంటే గుండెపోటుకు వైద్యమందించే పరికరాలు. వాటిని వినియోగిస్తున్నవారు పెరిగిపోతుండడంతో ఆ బాధితుల నగరంగా రికార్డుల్లోకి ఎక్కుతోందన్నమాట.
అందుకే ఇది అలా మారిపోరుు ఉండొచ్చని ప్రముఖ హృద్రోగ నిపుణులు డా.ఎం.ఎస్.ఎస్.ముఖర్జీ అంటున్నారు. నగరంలో 25 ఏళ్ల నుంచి 40 ఏళ్ల మధ్య వయస్కులు 50 లక్షల మంది ఉంటే ఇప్పటికే 25 లక్షల మంది డేంజర్ జోన్‌లో ఉన్నారు. మరో పాతిక లక్షల మంది దానికి దగ్గరగా ఉన్నారు. గుండె పోటుకు గురయ్యే వారిలో 80 శాతం మంది 40 ఏళ్ల లోపు వారేనని వుుఖర్జీ చెబుతున్నారు.
కారణాలివీ..
* విదేశాల్లో ఉన్న అనారోగ్యకర ఆహార ప్రభావం ఇప్పుడు నగరంపైనా పడుతోంది.
* రెండుమూడేళ్లుగా సాఫ్ట్‌వేర్ రంగంలోనే ఎక్కువగా ఒత్తిడి అనుభవించేవారు.
* ఇప్పుడు జీహెచ్‌ఎం లేబర్ నుంచి ఎలక్ట్రీషియన్ వరకూ ఒత్తిడిలోనే ఉంటున్నారు. దీనిక్కారణం తింటున్న తిండే.
* సాధారణంగా రోజుకు మనిషికి 1500 కేలరీలతో కూడిన ఆహారం అవసరం. కానీ 2500 కేలరీలు తింటున్నారు. ఇందులో 400 కేలరీలు ఖర్చు చేయలేక పోతున్నారు.
* అంతా సంపాదన, సెటిల్‌మెంట్‌మీద దృష్టి సారిస్తున్నారు. తినే ఆహారంపై చర్చ 2 శాతం కూడా సాగడం లేదు.
* ఒత్తిడితో 30 ఏళ్లలోపే రక్తపోటు, మధుమేహం వస్తున్నాయి.
* నికోటిన్ (పొగాకు) వాడకం హైదరాబాద్‌లోనే ఎక్కువగా ఉంది.
‘గుండె’ను ఎలా రక్షించుకోవాలి
* రోజూ 45 నిమిషాలు వేగంగా నడవాలి.
* అన్నంలో కూర కాదు. కూరలో అన్నం వేసుకుని తినే అలవాటు రావాలి.
* తక్షణమే ఉప్పు, కారం, నూనె తగ్గించాలి. నూనె నెలకు ఒక మనిషికి అరకిలో చాలు.
* పండ్లు..అంటే ఆపిల్ ఒక్కటే అని కాదు అన్ని రకాలవీ తీసుకోవాలి.
* గుండె జబ్బులు, కిడ్నీ జబ్బులు లేని వాళ్లు రోజూ కనీసం 3 లీటర్ల నీళ్లు తాగాలి.
* ఆలివ్ ఆయిల్ ఖరీదైనా మిగతా వాటికంటే మంచిది.
* బాడీ మాస్ ఇండెక్స్ (బీఎంఐ)కి 25 కంటే తక్కువగా ఉండాలి.
* రోజూ 6 నుంచి 8 గంటలు విధిగా నిద్రపోవాలి.
* ఒత్తిడి నివారణకు యోగా తప్పనిసరి. వ్యాయామం కూడా అవసరమే.
* గుండెజబ్బులు రాకుండా జాగ్రత్త పడేందుకు ఎలాంటి మందులూ అక్కర్లేదు.. వచ్చాక మందుల్లేకుండా మనగలగడం కష్టం.
ప్రజెంటేషన్..: జి.రామచంద్రారెడ్డి