bonalu
-
మల్లన్న పట్నం వేసి బోనం చేసిన సోనియా ఆకుల (ఫోటోలు)
-
సూర్యాపేట : పెద్దగట్టు జాతరలో బోనం ఎత్తిన ఎమ్మెల్సీ కవిత (ఫొటోలు)
-
శ్రీ గజ్జలమ్మదేవి వార్షికోత్సవాలు బోనాలు సమర్పించిన భక్తులు (ఫొటోలు)
-
హైదరాబాద్: రాజ్‌భవన్ లో ఆషాడ బోనాలు ఉత్సవాలు (ఫోటోలు)
-
బోనమెత్తిన తమన్నా.. దాదాపు 800 మందితో!
తమన్నా ప్రధాన పాత్రలో నటిస్తోన్నతాజా చిత్రం ఓదెల-2. ఈ సినిమాను అశోక్ తేజ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్‌వర్క్స్ బ్యానర్లపై భారీ బడ్జెట్‌తో ఈ మూవీని నిర్మిస్తున్నారు. 2021లో వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ ఓదెల రైల్వేస్టేషన్ చిత్రానికి సీక్వెల్‌గా ఈ చిత్రాన్ని తీసుకొస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన అప్డేట్ ఇచ్చారు మేకర్స్. అయితే తెలంగాణలో బోనాల పండుగ సందర్బంగా కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. చీర కట్టులో తమన్నా బోనం మోస్తున్న పోస్టర్ అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది. 800 మందితో క్లైమాక్స్ సీన్ షూట్..ఈ చిత్రం క్లైమాక్స్ కోసం ఏకంగా 800 మంది కళాకారులతో భారీస్థాయిలో చిత్రీకరిస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్‌లోని ఓదెల మల్లన్న టెంపుల్ సెట్లో జరుగుతోంది. కేవలం క్లైమాక్స్ సీన్ కోసమే అత్యంత భారీ ఆలయ సెట్‌ను అధిక బడ్జెట్‌తో నిర్మించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న షూటింగ్లో తమన్నాతో పాటు ఇతర నటీనటులు కూడా పాల్గొంటున్నారు. కాగా.. ఈ చిత్రంలో హెబ్బా పటేల్, వశిష్ట ఎన్ సింహ, యువ, నాగ మహేష్, వంశీ, గగన్ విహారి, సురేందర్ రెడ్డి, భూపాల్, పూజారెడ్డి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి అజనీష్ లోక్‌నాథ్ సంగీతమందిస్తున్నారు. Team #Odela2 wishes everyone celebrating the festival a very Happy Bonalu ✨#Odela2 climax currently being shot in a Grand Mallanna Temple set erected at Ramoji Film City.@tamannaahspeaks @IamSampathNandi @ashokalle2020 @ImSimhaa @AJANEESHB @SampathNandi_TW @creations_madhu… pic.twitter.com/xfSR8QFfZh— Telugu FilmNagar (@telugufilmnagar) July 29, 2024 -
ఖైరతాబాద్ నియోజకవర్గంలో బోనాల సందడి దృశ్యాలు
-
భాగ్యనగరంలో బోనాల సంబురం.. (ఫొటోలు)
-
అమ్మవారి ఆశీస్సులతో ప్రజలు సుభిక్షంగా ఉండాలి: మంత్రి కోమటిరెడ్డి
సాక్షి, హైదరాబాద్: భాగ్యలక్ష్మి అమ్మవారి ఆశీస్సులతో తెలంగాణ ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఆయన చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి బోనాల కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున కుటుంబ సమేతంగా పాల్గొని.. అమ్మవారికి అధికారికంగా పట్టువస్త్రాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.‘‘ కరోనా వంటి మహమ్మరులు రాకుండా అమ్మవారు ప్రజలందరిని కాపాడలని కోరుకున్నాను. గత సంవత్సరం వర్షాలు లేక రైతులంతా ఇబ్బంది పడ్డారు. ఈసారి అమ్మవారి ఆశీస్సులతో సమృద్ధిగా వర్షాలు పడాలి. పాడి పంటలతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలి. అఖిలపక్ష నిర్ణయానికి అనుగుణంగా పాత డెజైన్‌తో కొత్త ఉస్మానియా దవాఖాన నిర్మిస్తాం. ... హైదరాబాద్‌తో పాటు వివిధ జిల్లాల ప్రజల ఆరోగ్యాలను దెబ్బతిస్తున్న మూసి నదిని ప్రక్షాళన చేస్తున్నాం. పాత బస్తీ స్థితిగతులను మార్చేందుకు మెట్రోను విస్తరిస్తున్నాం. హైదరాబాద్ అభివృద్ధికి భారీగా నిధులు కేటాయించాం. మేడిగడ్డ బ్యారేజి కుంగడంలో కుట్ర ఉందన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలపై స్పందించాలని అడిగిన విలేకర్ల ప్రశ్నకు.. దేవాలయం దగ్గర రాజకీయాలు మాట్లాడటం భావ్యం కాదు’’ అని అన్నారు. -
Bonalu: బోనాల్లో డ్యాన్స్ వేసేవాణ్ని
‘నేను పెరిగింది హైదరాబాద్ పాతబస్తీలో. చిన్నప్పటి నుంచి లాల్ దర్వాజా బోనాలు చూస్తూ పెరిగాను. పోతరాజు వేషంలో డ్యాన్స్ చేసేవాళ్లని చూస్తుంటే సంతోషంగా ఉంటుంది. డ్రమ్స్, మ్యూజిక్, డ్యాన్స్ చూస్తుంటే బాడీలో ఒక వైబ్రేషన్ వస్తుంటుంది. ఇప్పుడు సినిమాల్లోకి వచ్చాక డైరెక్టుగా బోనాల్లో పాల్గొనలేకపోతున్నాను గాని.. లాల్ దర్వాజా, సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి, బల్కంపేట ఎల్లమ్మ.. ఇలా అమ్మవార్ల బోనాల ఉత్సవాలను టీవీలో చూస్తుంటాను.. చాలా సంతోషంగా ఉంటుంది’ అని సినీ నటుడు ప్రియదర్శి అన్నారు. సహాయ, కామెడీ పాత్రలతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రియదర్శి.. నగరంలో బోనాల పండగ జోరుగా జరుగుతున్న సందర్భంగా ‘సాక్షి’తో తన అనుభవాలను ఇలా పంచుకున్నారు.‘నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను గమనిస్తున్నది ఏంటంటే.. బోనాల తర్వాత మనకు తప్పకుండా వర్షం వస్తుంది. ఈ విషయాన్ని నేను ఏళ్ల తరబడి చూస్తున్నాను. బోనాల సమయంలో తప్పనిసరిగా వర్షం రావడం మంచిగా అనిపిస్తుంది. హైదరాబాద్‌లో అన్ని కులాలు, మతాల వారు బోనాల ఉత్సవాలను ఎంతో సంబరంగా జరుపుకోవడం సంతోషంగా ఉంటుంది. నేను చిన్నప్పుడు బోనాల్లో డ్యాన్స్ చేసేవాణ్ని. పోతరాజు వేషధారణల మధ్య డ్యాన్స్ చేయడమంటే నాకు చాలా ఇష్టం. అలాగే హైదరాబాద్‌లో యాదవ సోదరులు సదర్ ఉత్సవాలని ఎంతో ఘనంగా నిర్వహిస్తుంటారు. అవి కూడా నాకెంతో ఇష్టం.. నేను పాల్గొనేవాణ్ని. ‘సేవ్ ద టైగర్స్’ వెబ్ సిరీస్‌లో నేను ఘంటా రవి పాత్ర చేస్తున్నప్పుడు ఇలాంటివన్నీ బాగా రిఫరెన్స్‌గా వాడుకున్నా. సెలబ్రిటీ అయ్యాక బోనాలు, సదర్ ఉత్సవాల్లో డైరెక్టుగా పాల్గొనలేకపోతున్నాను. తప్పదు.. కొన్నింటిని త్యాగం చేయాల్సిందే. సంక్రాంతి పండగను ఆంధ్రప్రదేశ్‌లో ఎంత ఘనంగా జరుపుకుంటారో హైదరాబాద్‌లోనూ అంతే గ్రాండ్‌గా జరుపుకొంటారు. తెలంగాణలో సమ్మక్క– సారక్క, కొండగట్టు అంజన్న, యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి, మల్లన్న జాతర.. ఇలాంటివన్నీ సంస్కృతికి నిదర్శనం’. హిందువుల పండగలనే కాదు... నాకు అన్ని పండగలూ ఇష్టమే. ప్రత్యేకించి రంజాన్, బక్రీద్ సమయంలో ముస్లిం స్నేహితులని కలవడం.. వారు పెట్టే ఖీర్ (పాయసం) తినడం చాలా హ్యాపీగా ఉండేది’ అన్నారు ప్రియదర్శి. -
తెలంగాణ సచివాలయంలో బోనాల వేడుకలు (ఫొటోలు)
-
మహబూబ్‌నగర్ : ఘనంగా పోచమ్మ అమ్మవారి బోనాలు (ఫొటోలు)
-
NRI Video: TCSS ఆధ్వర్యంలో ఘనంగా సింగపూర్ బోనాల జాతర
-
TCSS ఆధ్వర్యంలో ఘనంగా సింగపూర్ బోనాల జాతర
‘తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్)’ ఆధ్వర్యంలో నిర్వహించిన బోనాల పండగ వేడుకలు ఆదివారం (21 జూలై 2024) మధ్యాహ్నం అత్యంత వైభవంగా జరిగాయి. భాగ్యనగరంలో ఉజ్జయిని మహంకాళి బోనాలు జరిగిన రోజున సింగపూరులో కూడా జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందని సభ్యులు తెలిపారు. ఈ బోనాల వేడుకలను స్థానిక ‘సుంగే కేడుట్’ లోని శ్రీ అరసకేసరి శివాలయంలో ఘనంగా జరుపుకున్నారు. ఈ బోనాల ఊరేగింపులో పోతురాజులు, పులి వేషాలు, తొట్టెలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ వేడుకల్లో సింగపూర్‌లో ఉన్న తెలంగాణ ప్రాంతానికి చెందిన వారే కాకుండా.. ఇతరులు తో కలిపి సుమారు 1000 మంది వరకు భక్తులు పాల్గొన్నారు. బోనాల ఊరేగింపులో చిన్నా, పెద్ద తేడా లేకుండా అందరూ కలిసి ఆడిపాడారు. తెలంగాణ మహిళలు భక్తి శ్రద్ధలతో దుర్గాదేవికి బోనాలు సమర్పించి అమ్మవారి ఆశీస్సులు పొందారు. ఈ వేడుకల్లో పాల్గొన్న తెలుగింటి ఆడపడుచులకు జిఆర్టి జెవెల్లెర్స్ వారు తాంబూళంతో కూడిన గూడీ బ్యాగ్ అందజేసి అందరికీ బోనాలు పండుగ శుభాకాంక్షలు తెలియజేసారు. ప్రజలందరికి మహంకాళి తల్లి ఆశీస్సులు ఉండాలని టీసీఎస్ఎస్ సభ్యులు ప్రత్యేక పూజలు చేశారు. సింగపూర్ లో ఉన్న తెలంగాణ ప్రాంతానికి చెందిన వారే కాకుండా అందరు తెలుగు వారితో పాటు ఇతరులు ఈ బోనాల జాతరలో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా టీసీఎస్ఎస్ వారు తొలిసారి 2017 లో బోనాల పండుగను నిర్వహించి సింగపూర్ కు ఈ పండుగ ప్రాముఖ్యతని పరిచయం చేసిన రోజులను గుర్తు చేసుకొని సంతోషించారు. మన ఈ తెలంగాణ సంప్రదాయం లో ప్రధాన భూమిక పోషించే బోనాల పండుగతో ప్రేరణ పొంది తెలుగు వారందరు బోనాల వేడుకను జరుపుకోవడం సంతోషకరం అని బోనాల్లో పాల్గొన్న వారు అన్నారు.బోనాల జాతర లో పోతురాజు మరియు పులివేషాలతో జాతరకు కళ తెచ్చిన నేరెళ్ల శ్రీనాథ్, గౌడ లక్ష్మణ్, అయిట్ల లక్ష్మణ్ మరియు అరవింద్ లకు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు.ఈ ఏడాది బోనం సమర్పించిన వారిలో గడప స్వాతి రమేశ్, గోనె రజిత నరేందర్ రెడ్డి, ఎర్రమ రెడ్డి దీప్తి శిశిధర్ రెడ్డి, అలేఖ్య దార, బండ శ్రీదేవి మాధవ రెడ్డి, బొందుగుల ఉమారాణి రాము , నడికట్ల కళ్యాణి భాస్కర్, కాశబోయిన హర్షిని (W/O ప్రవీణ్) , భూక్య మీనా శ్రీధర్ , గౌరీ శ్రీవాణి శ్రీనివాస్ , తడిసిన అలేఖ్య లక్ష్మినర్సింహ , మందాడి సులోచన అనిల్ కుమార్ , శ్వేతా కుంభం , చాడ అనిత వేణుగోపాల్ రెడ్డి , బెహరా మాధవి, అమిత్ సేథీ ఉన్నారు. బోనం సమర్పించిన భక్తులకు తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) వారు రిటర్న్ గిఫ్ట్ ను అందచేశారు. వీరితో పాటు గడప రమేశ్ అమ్మవారికి కోసం తొట్టెలను స్వయంగా పేర్చి తీసుకుకొచ్చారు.బోనాల పండుగలో పాల్గొని విజయవంతం చేసిన మరియు ఎల్లప్పుడూ సొసైటీ వెన్నంటే ఉండి సహకారం అందిస్తున్న ప్రతీ ఒక్కరికి సొసైటీ అధ్యక్షులు గడప రమేష్ బాబు, ప్రధాన కార్యదర్శి బసిక ప్రశాంత్ రెడ్డి మరియు కోశాధికారి జూలూరి సంతోష్ కుమార్, సొసైటీ ఉపాధ్యక్షులు దుర్గ ప్రసాద్, భాస్కర్ గుప్త నల్ల, గోనె నరేందర్ రెడ్డి, ఉపాధ్యక్షురాలు మిర్యాల సునీత రెడ్డి, సంస్థాగత కార్యదర్శి, కాసర్ల శ్రీనివాస రావు, ప్రాంతీయ కార్యదర్శులు బొందుగుల రాము, నంగునూరి వెంకట రమణ, నడికట్ల భాస్కర్, రవి కృష్ణ విజాపూర్ మరియు కార్యవర్గ సభ్యులు రోజా రమణి, శివ ప్రసాద్ ఆవుల, రవి చైతన్య మైసా, భాస్కర్ రావు పులిగిల్ల, సంతోష్ వర్మ మాదారపు, శశిధర్ రెడ్డి ఎర్రమ రెడ్డి, విజయ మోహన్ వెంగళ, ప్రవీణ్ మామిడాల, సతీష్ పెసరు, మణికంఠ రెడ్డి చెన్నప్పగారి మరియు పెరుకు శివ రామ్ ప్రసాద్ కృతజ్ఞతలు తెలిపారు. అందరి పై ఉజ్జయిని మహంకాళీ ఆశీస్సులు ఉండాలని సొసైటి సభ్యులు ఆకాంక్షించారు.ఈ వేడుకలకు సహకారం అందించిన సంపంగి రియాలిటీ & ఇన్ఫ్రాస్ట్రక్చర్ , GRT జువెల్లర్స్ , వీర ఫ్లేవర్స్ ఇండియన్ రెస్టారెంట్ , తందూర్ లౌంజ్ ఇండియన్ రెస్టారెంట్ ,ప్రాడ్ ఈవెంట్ మేనేజ్ మెంట్, GRT ఆర్ట్లాండ్, నిక్స్ గ్లోబల్ రియాలిటీ, మంచికంటి శ్రీధర్, రాము బొందుగుల, లాలంగర్ వేణుగోపాల్, రాధాకృష్ణ కవుటూరు, కొమాకుల సాయికృష్ణ, అజయ్ కుమార్ నందగిరి, చమిరాజ్ వెంకట రామాంజనేయులు (టింకర్ టాట్స్ మాంటిస్సోరి) గార్లకు మరియు దేవాలయ యాజమాన్యానికి సొసైటీ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు.తెలంగాణ బోనాల పండుగ ప్రాముఖ్యత మరియు విశిష్టతని సింగపూర్ వాసులకు తెలియపరిచే ప్రేరణతో ఫేస్బుక్ వేదికగా నిర్వహించిన పోటీలలో భాగంగా ఉత్తమ రచన విజేతలుగా నిలిచిన మొదటి ఐదుగురికి కల్వ లక్ష్మణ్ రాజ్ గిఫ్ట్ వౌచెర్స్ ని అందచేశారుఈ వేడుకలకు సునీత రెడ్డి మిర్యాల, సంతోష్ వర్మ మాదారపు, మణికంఠ రెడ్డి చెన్నప్పగారి , శశిధర్ రెడ్డి ఎర్రమ రెడ్డి , శివ ప్రసాద్ ఆవుల, గోనె నరేందర్ రెడ్డి, బొందుగుల రాము ,రవి కృష్ణ విజాపూర్, నంగునూరి వెంకట రమణ, పెరుకు శివరామ్ ప్రసాద్ మరియు కాసర్ల శ్రీనివాస రావు సమన్వయ కర్తలుగా వ్యవహరించారు.వీరితో పాటు పండుగ వేడుకలో సహాయపడిన సుగుణాకర్ రెడ్డి రావుల, మల్లేశ్ బరపతి,కల్వ లక్ష్మణ్ రాజ్ , ఫణి భూషన్ చకిలం మరియు సాయికృష్ణ కొమాకుల గార్లకు సొసైటీ సభ్యులు కృతజ్ణతలు తెలియజేశారు. -
కోరినన్ని వర్షాలు కురుస్తాయి..
రాంగోపాల్‌పేట్(హైదరాబాద్): సికింద్రా బాద్ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి బోనాల జాతర ఉత్సవాలు సోమవారంతో అంగరంగ వైభవంగా ముగిశాయి. ఉత్స వాల్లో రెండో ఘట్టమైన రంగం కార్యక్రమంలో భాగంగా ఉదయం 9.55 గంటల సమ యంలో అమ్మవారి గర్భగుడికి ఎదురుగా ఉండే మాతంగేశ్వరి గుడి ముందు పచ్చికుండపై నిలబడి స్వర్ణలత భవిష్య వాణి వినిపించారు. ‘ఈ ఏడాది భక్తులు సమర్పించిన బోనాలు, సాక, పూజలు నాకు ఆనందాన్ని చ్చాయి. కోరినన్ని వర్షాలు కురుస్తాయి. నా ప్రజలందరినీ బాగా చూసుకుంటా, నన్ను నమ్ముకున్న వారిని నేను కాపా డుకుంటా. నా రూపాన్ని పెట్టాలనే సంకల్పాన్ని నెర వేర్చుకుంటా. నాకు శాశ్వత రూపం పెట్టా లని చూస్తున్నారు అది చేయండి, నాకు రక్తబలిని ఇవ్వడం లేదు. మీకు నచ్చింది ఇస్తున్నారు. దాంతోనే నేను సంతోషంగా ఉన్నాను. అదే చాలు. 5 వారాలపాటు పప్పు, బెల్లంతో సాక పెట్టండి. పంటల్లో ఎక్కువ రసాయనాలు వాడుతున్నారు, వాటితో రోగాలు పెరిగిపోతున్నాయి, వాటి ని తగ్గించుకోండి. పిల్లలు, గర్భిణీలకు ఏ ఇబ్బంది రానివ్వను. అంద రినీ సంతోషంగా ఉండేలా చూసుకుంటా ను’అని అన్నా రు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, దేవాదాయ శాఖ ముఖ్య కార్య దర్శి శైలజా రామయ్యర్, కమి షనర్ హన్మంతరావు, కలెక్టర్ అనుదీప్ దురి శెట్టి, ఈవో మనోహర్‌రెడ్డి, భక్తులు పాల్గొన్నారు.ఘనంగా అమ్మవారికి సాగనంపు..: బోనా లు, రంగం అనంతరం అమ్మవారి సాగనంపు కార్యక్రమాన్ని ఘనంగా చేప ట్టారు. అమ్మవారిని అంబారీపై ఉంచి, అమ్మవారి ఘటంతో సాగనంపు కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనితో జాతర ముగిసింది. -
వైభవంగా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి రంగం ఊరేగింపు (ఫొటోలు)
-
ఓల్డ్ సిటీ మహంకాళి జాతర బోనాల సందర్భంగా ఘట్టాల ఊరేగింపు (ఫోటోలు)
-
సికింద్రాబాద్: లష్కర్ బోనాల సందడి.. తొలి బోనం సమర్పించిన మంత్రి పొన్నం
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. అమ్మవారికి భక్తులు బోనాలు సమర్పిస్తున్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ కుటుంబ సమేతంగా తొలి బోనాన్ని సమర్పించి పట్టు వస్త్రాలు అందజేశారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, సకాలంలో మంచి వర్షాలు పడి పంటలతో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని వేడుకున్నానని తెలిపారు. హైదరాబాద్ జంట నగరంలోనే కాకుండా వంద సంవత్సరాల నుంచి సంస్కృతి సాంప్రదాయాలతో ఈ బోనాలు ఉత్సవాలు జరుగుతున్నాయన్నారు. ఇలాంటి అవాంతరాలు జరగకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని మంత్రి అన్నారు.ఈ రోజు ఇక్కడ సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దగ్గర బోనాలు, 28వ తేదీ లాల్ దర్వాజా బోనాలు, తర్వాత రంగం, అంబారీ ఊరేగింపు అన్ని కార్యక్రమాలు విజయవంతం కావడానికి స్థానిక ప్రజలు సహకారం కావాలని కోరారు. -
జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడిలో శాకాంబరి ఉత్సవాలు (ఫొటోలు)
-
మహంకాళి అమ్మవారి బోనాలకు శివశక్తుల దూరం..! రాష్ట్రానికి మంచిది కాదు..
-
టాక్ ఆధ్వర్యంలో లండన్‌లో ఘనంగా బోనాల వేడుకలు
లండన్: తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) ఆధ్వర్యంలో లండన్‌లో బోనాల జాతరను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు యుకే నలుమూలల నుండి సుమారు 1000 కి పైగా ప్రవాస కుటుంబ సభ్యులు హాజరయ్యారు. స్వదేశం లో జరుపుకున్నట్టు సాంప్రదాయ బద్దంగా పూజలు నిర్వహించి, తొట్టెల ఊరేగింపు, ముఖ్యంగా పోతురాజు ఆటలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. లండన్ కి ఉన్నత చదువులకోసం వచ్చిన ప్రవాస తెలంగాణ విద్యార్ధి అక్షయ్ మల్చేలం, వారి వంశ వృత్తిని మర్చిపోకుండా పోతురాజు వేషదారని ధరించి, మన తెలంగాణ సంస్కృతి కోసం బోనాలు ఊరేగింపులో పాల్గొని వేడుకలకు సరికొత్త శోభను తీసుకొచ్చాడు. పోతురాజు విన్యాసాన్నీ ప్రవాసులే కాక హాజరైన ముఖ్య అతిధులు సైతం ప్రసంశించి సత్కరించారు.టాక్ అధ్యక్షుడు రత్నాకర్ కడుదుల మరియు ఉపాధ్యక్షులు శ్రీమతి శుష్మణ రెడ్డి అధ్యక్షతన ప్రారంభమైన వేడుకలకు, వ్యాఖ్యాతగా ఉపాధ్యక్షులు సత్య మూర్తి చిలుముల వ్యవహరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హౌంస్లౌ నగర డిప్యూటీ మేయర్ ముహమ్మద్ షకీల్ అక్రమ్ పాల్గొన్నారు.హౌంస్లౌ నగర డిప్యూటీ మేయర్ ముహమ్మద్ షకీల్ అక్రమ్ మాట్లాడుతూ.. యూకే లో నివసిస్తున్న తెలంగాణ ఎన్నారైలంతా సమాజ సేవలో ఎంతో క్రియాశీలకంగా పాల్గొంటారని, వీరి స్ఫూర్తి చాలా గొప్పదని తెలిపారు. విదేశాల్లో ఉన్నపటికీ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలని ప్రపంచానికి చాటి చెప్తున్న తీరు చాలా గొప్పగా ఉందని, టాక్ సంస్థ చేస్తున్న కార్యక్రమాలు ఎందరికో స్ఫూర్తినిస్తున్నాయని ప్రశంసించారు. స్థానికంగా ఎటువంటి సహాయం కావాలన్న నన్ను సంప్రదించవచ్చని, లండన్ నగరం భిన్న సంస్కృతుల ప్రజలు నివసించే నగరమని, మనమంతా ఐకమత్యంగా ఉండి పరస్పర సంప్రదాయాలని సంస్కృతిని గౌరవించుకుంటూ ముందుకు వెళ్లాలని తెలిపారు.స్థానిక కౌన్సిళ్లర్లు అజమీర్ గ్రేవాల్, ప్రీతమ్ గ్రేవాల్, ఆదేశ్ ఫర్మాహాన్, బంధన చోప్రా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర పండుగ "బోనాల" వేడుకల్ని ఎంతో ఘనంగా నిర్వహించడమే కాకుండా, సంప్రదాయ బద్దంగా పూజలు నిర్వహించి, అమ్మవారికి బోనం సమర్పించడానికి పెద్ద ఎత్తున మహిళలు బోనం నెత్తిన ఎత్తుకొని లండన్ వీధుల్లో రావడం చూస్తుంటే,ఎంతో గర్వంగా అనిపించిందని, తెలంగాణ సంస్కృతిని ప్రతి ఒక్కరికి తెలిసేలా టాక్ సంస్థ చేపడుతున్న కార్యక్రమాలు ఎందరికో ఆదర్శంగా ఉన్నాయని తెలిపారు. బోనం చేసి వేడుకల్లో పాల్గొన్న మహిళలందరిని ప్రత్యేక సత్కరించి, బహుమతులందజేశారు.కుటుంబ సమేతంగా అంతా కలిసి ఇలా వేడుకలు చేసికొని రాబోయే తరాలకి తెలియజెప్పడం ఎంతో స్ఫూర్తినిస్తుందని,. బ్రిటన్ అన్ని వర్గాల ప్రజలను, సంస్కృతుల్ని ఆదరించే గొప్ప దేశమని మనమంతా కలిసి మెలిసి ఐక్యంగా ఉండాలని తెలిపారు.టాక్ సంస్థ అద్యక్షులు రత్నాకర్ కడుదుల మాట్లాడుతూ ప్రవాస తెలంగాణ ప్రజలందిరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు. టాక్ సంస్థ ,తెలంగాణా ప్రజల కోసం, ప్రపంచం లో ఉన్నతెలంగాణా బిడ్డల కోసం చేస్తున్న కార్యక్రమాల గురించి వివరించి, అందరు ఇందులో బాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఒక పక్క వ్యక్తిగతంగా ఇక్కడున్న బిడ్డలు రోజు వారి పనుల్లో బిజీగా ఉన్నపట్టికి, బాద్యత గల తెలంగాణా బిడ్డలు గా ఆనాడు ఉద్యమం లో నేడు పునర్నిర్మాణం లో పోశిస్తున్న పాత్ర ఎందరికో ఆదర్శనంగా ఉందని తెలిపారు.టాక్ సంస్థని అన్ని సందర్భాల్లో సూచనలు సలహాలు ఇస్తూ ముందుకు నడిపిస్తున్న ఎమ్మెల్సీ కవిత గారికి కృతఙ్ఞతలు తెలిపారు. టాక్ వ్యవస్థాపకులు అనిల్ కూర్మాచలం అన్న తన సహకారం, సూచనలు, స్పూర్తి వల్లే ఇంత ఘనంగా సంబరాలు నిర్వహించుకున్నాం అని తేలిపారు.సంస్థ ఉపాద్యక్షురాలు శుషుమన రెడ్డి మాట్లాడుతూ, టాక్ సంస్థ ద్వారా జరుపుతున్న బోనాల వేడుకలకు విచ్చేసిన అతిథులకు, స్థానిక ప్రవాసులకు కృతఙ్ఞతలు తెలిపారు. ఆడబిడ్డలందరు బోనాలతో మన సంస్కృతిని విశ్వవ్యాప్తం చేస్తున్న తీరు నూతన ఉత్సాహాన్ని నింపిందని అన్నారు. టాక్ చేస్తున్న కార్యక్రమాల గురించి అలాగే భవిష్యత్తులో చేయబోయే కార్యక్రమాల గురించి సభకు వివరించారు.ఎన్నారై బీ. ఆర్. యస్ యూకే అధ్యక్షులు మరియు టాక్ జాతీయ కన్వీనర్ అశోక్ దూసరి గారు మాట్లాడుతూ, తెలంగాణ ప్రజలందిరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు. లండన్ లో తెలంగాణ రాష్ట్ర పండుగను ఇంత ఘనంగా నిర్వహించుకోవడం గర్వాంగా ఉందని, , ప్రవాస తెలంగాణ సంఘాలు ఏర్పడ్డాక బోనాలు - బతుకమ్మ వేడుకల్ని ప్రపంచవ్యాప్తంగా ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నారని తెలిపారు.ప్రముఖ నృత్య కళాకారిణి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ గ్రహీత, రాగసుధా వింజమూరి చేసిన నృత్యం వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ ఈవెంట్ స్పాన్సర్స్, అలాగే సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని సంస్థ ఎగ్జిక్యూటివ్ టీం జ్ఞాపిక లతో ప్రశంసించారు. టాక్ ముఖ్య నాయకులు సుప్రజ పులుసు, గణేష్ కుప్పలా, హరి గౌడ్ నవపేట్, సురేష్ బుడగం, రాకేష్ పటేల్, సత్యపాల్ పింగిళి, శ్రీకాంత్, క్రాంతి మాట్లాడుతూ బోనాల జాతర ఇంతటి విజయం సాదించడం సంతోషం గా ఉందని తెలిపారు. ఇతర ఎన్నారై సంఘాల యూకే ప్రతినిధులు వేడుకలకు హాజరైన వారిలో ఉన్నారు.ఈ కార్యక్రమంలో టాక్ అద్యక్షులు రత్నాకర్ కడుదుల, అశోక్ దూసరి, శుష్మున రెడ్డి, సత్య చిలుముల , మట్టా రెడ్డి , వెంకట్ రెడ్డి , సురేష్ బుడగం , జహ్నవి వేముల , రవి రేతినేని , రవి ప్రదీప్ పులుసు , రాకేష్ పటేల్ , సత్యపాల్ , మల్లా రెడ్డి,గణేష్ కుప్పాల , సత్యం కంది , శ్రీకాంత్ జెల్ల , శ్రీధర్ రావు , మధుసూదన్ రెడ్డి , శైలజ జెల్ల ,స్నేహ , శ్వేతా మహేందర్ , స్వాతీ , క్రాంతి , పవిత్ర , సుప్రజ , శ్వేత , శ్రీ విద్య , నీలిమ , పృద్వి , మని తేజ ,గణేష్ పాస్తం , నిఖిల్ రెడ్డి , హరి గౌడ్ , నవీన్ రెడ్డి , కార్తీక్ , రంజిత్ , రాజేష్ వాక, మహేందర్, వంశీ , ఆనంద్ , అక్షయ్ , పావని , జస్వంత్ , శివ వెన్న , నాగ్ , మాడి, వినోద్ , సన్నీ , సందీప్ తదితరులు పాల్గొన్న వారిలో ఉన్నారు. -
Nabha Natesh: బిర్యానీ.. అదో ఎమోషన్!
‘హైదరాబాద్ అనగానే అందరికీ గుర్తొచ్చేది బిర్యానీ. ఇక్కడ చాలా రకాల బిర్యానీలు ఉంటాయి. ధమ్ బిరియానీ, మొఘల్ స్టైల్, నాటుకోడి, పులావ్, ఆవకాయ్, ఉలవచారు బిర్యానీ.. ఇలా ఎన్నోరకాలు ఉంటాయి. హైదరాబాద్ బిర్యానీ అంటే కేవలం ఫుడ్ కాదు.. అదొక ఎమోషన్. నాకు ఇక్కడి హలీమ్ అంటే చాలా ఇష్టం. హలీమ్ సీజన్లో తప్పకుండా తింటాను’ అని హీరోయిన్ నభా నటేశ్ అన్నారు.‘నన్ను దోచుకుందువటే’ సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచి్చన ఈ బ్యూటీ ‘అదుగో, ఇస్మార్ట్ శంకర్, డిస్కో రాజా, సోలో బ్రతుకే సో బెటర్, అల్లుడు అదుర్స్, మాస్ట్రో’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నారు. తాజాగా ఆమె నటించిన చిత్రం ‘డార్లింగ్’. ప్రియదర్శి హీరోగా నటించారు. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా నగరానికి వచ్చిన నభా హైదరాబాద్‌తో తనకున్న అనుబంధాన్ని, బోనాల పండుగ గురించి ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. – సాక్షి, సినిమా డెస్క్ఇదే నా ఫస్ట్ హోం..భాగ్యనగరం నాకిప్పుడు ఫస్ట్ హోం అయిపోయింది. నా స్వస్థలం కర్నాటకలోని చిక్‌మంగళూర్. చిన్నప్పటి నుంచి వేర్వేరు ప్రదేశాల్లో పెరిగాను. కానీ, ఆరేళ్లుగా తెలుగు సినిమాలు చేస్తున్నాను కాబట్టి ఇక్కడే ఉంటున్నాను. ఇక్కడి ప్రజలు చాలా మంచివారు. ఎంతో ప్రేమగా మాట్లాడతారు.. అభిమానిస్తారు.ఇక్కడి హాస్పిటాలిటీ చాలా బాగుంటుంది. ఫుడ్ అద్భుతంగా ఉంటుంది.. కావాల్సినంత పెడతారు(నవ్వుతూ). స్వీట్ చాలా ఎక్కువ తినిపిస్తారు. స్వీట్స్‌ని నేను ఎక్కువగా తినను. ఎందుకంటే డైట్లో ఉంటాను. ఏదైనా ఫంక్షన్‌కి వెళ్లినప్పుడు అయ్యయ్యో... ఇప్పుడు ఎలా? తప్పకుండా స్వీట్స్ తినాలనే ఫీలింగ్ వస్తుంది. ఏదేమైనా హైదరాబాద్‌లో ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది. బోనాలంటే ఇష్టం..హైదరాబాద్‌లో జరిగే బోనాలంటే నాకు చాలా ఇష్టం. ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాలో బోనాల పాటకి నేను డ్యాన్స్ కూడా చేశాను. ఆ పాట చాలా బాగా పాపులర్ అయ్యింది. నేను కూడా బోనం ఎత్తుకున్నాను. ప్రస్తుతం బోనాల సమయంలోనే మా ‘డార్లింగ్’ మూవీ విడుదల కావడం సంతోషంగా ఉంది. ఇప్పుడు జరుగుతున్న బోనాల ఉత్సవాల్లో పాల్గొనాలని ఆత్రుతగా ఉంది. మా నిర్మాత చైతన్య మేడంగారు ప్లాన్ చేస్తామని చెప్పారు. తప్పకుండా పాల్గొంటాను.ఆ నమ్మకంతోనే...ప్రత్యేకించి ఈ నగర సంస్కృతి అంటే ఇష్టం. బాగా చూసుకుంటారు. నా మొదటి సినిమాకు మా అమ్మ తోడుగా వచ్చేది. కానీ, ఇక్కడివారు ఎంతో జాగ్రత్తగా చూసుకునే విధానం అమ్మకి నచి్చంది. నేను తోడు రాకున్నా ఎంతో కేరింగ్‌గా చూసుకుంటారని అమ్మకి రావడంతో ఇప్పుడు రావడం లేదు. సినిమా సెట్స్‌లో నటీనటులను బాధ్యతగా చూసుకుంటారు.. నాకు అది చాలా బాగా నచ్చుతుంది. మంచి సౌకర్యాలు కల్పిస్తారు.. గౌరవం ఇస్తారు. – సినీ నటి నభా నటేశ్ -
వైభవంగా సోమాజిగూడ శ్రీ రేణుక మహాలక్ష్మి ఎల్లమ్మ కళ్యాణం దృశ్యాలు..
-
సీఎం రేవంత్ ఆధ్వర్యంలో రాష్ట్రం అభివృద్ధి
లంగర్‌హౌస్ (హైదరాబాద్): గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిందని, అయితే సీఎం రేవంత్‌రెడ్డి అమ్మవారి ఆశీర్వాదాలతో తెలంగాణను అభివృద్ధిపథంలోకి తీసుకెళ్తారని శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ అన్నారు. రాష్ట్రంలో మెదటి బోనాల పూజలు అందుకునే గోల్కొండ జగదాంబిక అమ్మవారి బోనాల ఉత్సవాలను ఆదివారం లంగర్‌హౌస్‌లో ప్రారంభించారు. దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజారమ్యన్, గోల్కొండ జగదాంబిక ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ కాంత అరవింద్‌ల ఆధ్వర్యంలో మంత్రులు లంగర్‌హౌస్ చౌరస్తాలో అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం నజర్బోనంతో, తొట్టెలను ఊరేగింపుగా గోల్కొండ కోటకు తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా స్పీకర్ ప్రసాద్ మాట్లాడుతూ.. ఉచిత బస్సు సౌకర్యం వల్ల ఈ సంవత్సరం రాష్ట్రం నలుమూలల నుంచి మహిళలు పెద్ద ఎత్తున గోల్కొండకు తరలి వచ్చే అవకాశం ఉందన్నారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు.20 కోట్లు మంజూరు..అనంతరం దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మాట్లా డుతూ.. బోనాల ఉత్సవాల నిర్వహణకోసం రాష్ట్రవ్యాప్తంగా ఆలయాలకు గత సంవత్సరం కంటే రూ.5 కోట్లు ఎక్కు వగా అంటే ఈ సంవత్సరం రూ.20 కోట్లు మంజూరు చేశా మని తెలిపారు. ఒక వేళ ఈ నిధులు సరిపోకపోతే మరింత అందజేస్తామని వివరించారు. గోల్కొండ బోనాలు నిర్వ హించే కార్వాన్ నియోజకవర్గానికి 73 లక్షల 15 వేల రూపా యలు మంజూరు చేశామన్నారు. అనంతరం ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. జంట నగరాల బోనా ల ఉత్సవాలను ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ఆనందోత్సాహాలతో జరుపుకోవాలన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తరఫున రాష్ట్ర ప్రజలకు బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నామన్నారు. దానం నాగేందర్, చిన్నారెడ్డి, మధుయాష్కీ గౌడ్, వి.హనుమంతరావు, మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలతారెడ్డి, దేవాదాయశాఖ కమిషనర్ హనుమంత రావు, సీపీ శ్రీనివాస్‌రెడ్డి ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారికి పూజలు నిర్వహించారు. -
రేపట్నుంచే ఆషాడ బోనాల జాతర.. గోల్కొండతో షురూ (ఫొటోలు)
-
బంగారు బోనం కోసం ఏర్పాట్లు షురూ
చార్మినార్: రానున్న ఆషాఢ మాసం బోనాల ఉత్సవాలను పురస్కరించుకుని ఏటా మాదిరిగానే సప్త మాతృకలకు సప్త బంగారు బోనం సమర్పించేందుకు భాగ్యనగర్ మహంకాళి జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా బంగారు పాత్రలోని నైవేద్యాన్ని ఏడు అమ్మవారి ఆలయాలకు తీసుకెళ్లి సమర్పించేందుకు జోగిని నిషా క్రాంతికి సోమవారం మీరాలంమండిలో ఉమ్మడి ఆలయాల ఊరేగింపు కమిటీ చైర్మన్ గాజుల అంజయ్య, చంద్రకళ దంపతులు వాయినాన్ని అందజేశారు. జులై 7న గోల్కొండ జగదాంబిక అమ్మవారికి సమరి్పంచే బంగారు బో నంతో బంగారు బోనం కార్యక్రమాలు ప్రారంభమవుతాయని గాజుల అంజయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ మాజీ చైర్మన్ పొటేల్ సదానంద్ యాదవ్, మధుసూదన్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
కొల్లేరమ్మ జాతర చూసొద్దాం రండి!
కైకలూరు: చుట్టూనీరు.. మధ్యన ద్వీపకల్పం.. పద్మాసన భంగిమలో ఆశీనులైన పెద్దింట్లమ్మ అమ్మవారి వార్షిక జాతర మహోత్సవాలు ఈ నెల 11 నుంచి 24వ తేదీ వరకు జరగనున్నాయి. వేంగి రాజుల కాలంలో నిర్మించిన పురాతన క్షేత్రంలో జాతరను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. కొల్లేటి గ్రామాల ఆరాధ్య దేవత పెద్దింట్లమ్మ క్షేత్రంలో అనేక విశేషాలున్నాయి. ఏటా జాతర (తీర్థం) నిర్వహిస్తారు. ఆ సమయంలో కొల్లేటికోట జనారణ్యంగా మారుతుంది. జాతరలో ప్రధాన ఘట్టమైన జలదుర్గ, గోకర్ణేశ్వరస్వామి కల్యాణం రోజున ప్రభల ఊరేగింపు, బోనాల సమర్పణ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. చరిత్రలో కొల్లేటికోట ‘దండకారణ్య మధ్యమున మహా సరస్సొకటి కలదు. అది జల విహంగములతో అత్యంత రమణీయమైనది’ అని అగస్త్యుడు శ్రీరామచంద్రునితో చెప్పినట్టు రామాయణంలోని అరణ్య కాండంలో పేర్కొనబడింది. చైనా యాత్రికుడు హ్యుయాన్‌త్సాంగ్ కొల్లేరు సరస్సును ఒక మహత్తర మంచినీటి సరస్సుగా అభివర్ణించారు. దండి మహాకవి ‘దశకుమార చరిత్ర’లో కొల్లేరు సరస్సుతోపాటు బహు సాహసిగా పేరు గడించిన తెలుగు భీముడు (భుజబలపట్నం ఆ«దీశుడు) గురించి రాశారు. విజయాదిత్య చక్రవర్తి పార్వతీదేవి రూపంలో కొలువైన అమ్మవారిని మొదటిసారిగా పెద్దమ్మగా సంబోధించారు. కమలాకరపుర వల్లభుల శాసనాల ప్రకారం వేంగి–చాళుక్య రాజులకు వైవాహిక బాంధవ్యాలు ఉండేవి. వీరికి ప్రధాన పురాలుగా కమలాకరపురం (ఏలూరు), పద్మినీపురం (గణపవరం), కొలనువీడు (కొల్లేటికోట)ను వ్యవహరించారు. కోస్తా జిల్లాల్లో ఎక్కడా లేనివిధంగా అతిపెద్ద అనివేటి మండపాన్ని దాతల విరాళం రూ.4.50 కోట్లతో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు (డీఎన్నార్) నిర్మించారు. కొల్లేటికోట పెద్దింట్లమ్మ క్షేత్రానికి చేరుకోవడానికి సర్కారు కాలువపై ఇనుప వంతెన మాత్రమే ఆధారంగా ఉండేది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రూ.14.70 కోట్ల నిధులు మంజూరు చేయడంతో పెద్దింట్లమ్మ వారధి నిర్మాణం అందుబాటులోకి వచ్చింది. ఏర్పాట్లు పూర్తి పెద్దింట్లమ్మ జాతర మార్చి 11 నుంచి 24వ తేదీ వరకు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశాం. 21న జలదుర్గ, గోకర్ణేశ్వర స్వామి కల్యాణం నిర్వహిస్తాం. కల్యాణం రోజునే ప్రభ బండి, బోనాలు, కలువమ్మల గ్రామోత్సవం జరుగుతుంది. చివరి రోజున కోనేరులో తెప్పోత్సవం ఉంటుంది. కొల్లేరు వారధి పూర్తికావడంతో ఈ ఏడాది భక్తుల తాకిడి మరింతగా పెరుగుతుందని భావిస్తున్నాం. – కందుల వేణుగోపాలరావు, ఈవో -
ఖైరతాబాద్‌లో ఘనంగా గంగ తెప్పోత్సవం బోనాలు (ఫోటోలు)
-
సింగపూర్‌లో ఘనంగా బోనాల పండగ
సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో బోనాల పండుగని శ్రీ అరసకేసరి శివన్ ఆలయంలో భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. భక్తిగీతాలు, అత్యద్భుతమైన సాంస్కృతిక ప్రదర్శనలు, డప్పు వాయిద్యాల నడుమ, అమ్మవారి నామస్మరణలతో కార్యక్రమం హోరెత్తింది. పలువురు మహిళలు కుటుంబ సభ్యులతో భక్తి శ్రద్ధలతో అమ్మవారికి బోనాలు సమర్పించారు. బోనం ఆ జగన్మాతకు ఆషాడ మాసంలో సమర్పించే నైవేద్యం. అరకేసరి దేవాలయంలో మహిళలు బోనాలు సమర్పించారు. డప్పు వాయిద్యాలు, పోతురాజు ప్రదర్శన ఆకర్షణగా నిలిచింది. పలువురు తెలుగువాళ్లు ఆ వేడుకలో పాల్గొన్నారు. కాగా ఈ సందర్భంగా సింగపూర్ తెలుగు సమాజం అధ్యక్షులు బొమ్మారెడ్డి శ్రీనివాసులు రెడ్డి అందరికీ బోనాల శుభాకాంక్షలు తెలియజేశారు. బోనాలు పండగ మన తెలుగు వారి గొప్ప సాంప్రదాయక పండగని,దీన్ని ప్రతీ సంవత్సరం జరపాలని తమ కార్యవర్గం నిర్ణయించినట్లు తెలిపారు. బోనాలు సమర్పించిన మహిళలల్ని, కార్యక్రమ నిర్వాహకులను ఆయన అభినందించారు. -
సికింద్రాబాద్ ఉజ్జయిని మహాకాళి అమ్మవారి రంగం ఊరేగింపు (ఫొటోలు)
-
సికింద్రాబాద్ లష్కర్ బోనాలు....నేడు రంగం భవిష్యవాణి
-
Telangana Bonalu 2023 Photos: ఘనంగా సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి బోనాలు (ఫొటోలు)
-
లండన్‌లో ఘనంగా బోనాల జాతర
లండన్: తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) ఆధ్వర్యంలో లండన్‌లో బోనాల జాతరను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు యుకే నలుమూలల నుంచి సుమారు 1200కి పైగా తెలుగు, ఇతర ప్రవాస భారతీయులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి హౌంస్లౌ నగర మేయర్ ఆఫ్ఝల్ కియానీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్వదేశంలో జరుపుకున్నట్లుగా సాంప్రదాయబద్దంగా పూజలు నిర్వహించి, లండన్ వీధుల్లో తొట్టెల ఊరేగింపు, పోతురాజు ఆటలు స్థానికులను ఆకట్టుకున్నాయి. ప్రవాస తెలంగాణ విద్యార్ధి అక్షయ్ మల్చేలం, వారి వంశ వృత్తిని మర్చిపోకుండా పోతురాజు వేషదారని ధరించి, బోనాలు ఊరేగింపులో పాల్గొని వేడుకలకు సరికొత్త శోభను తీసుకొచ్చారు. ప్రముఖ నృత్య కళాకారిణి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ గ్రహీత, రాగసుధా వింజమూరి చేసిన మహా శక్తి నృత్యం వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. విదేశాల్లో ఉన్నపటికీ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలని ప్రపంచానికి చాటి చెప్తున్న తీరు చాలా గొప్పగా ఉందని హౌంస్లౌ నగర మేయర్ ఆఫ్ఝల్ కియానీ అన్నారు. తెలంగాణ రాష్ట్ర పండుగ బోనాల వేడుకల్ని ఎంతో ఘనంగా నిర్వహించడమే కాకుండా,ముఖ్యంగా లండన్ వీధుల్లో నిర్వహించిన తొట్టెల ఊరేగింపు లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. తెలంగాణ సంస్కృతిని ప్రతి ఒక్కరికి తెలిసేలా టాక్ సంస్థ చేపడుతున్న కార్యక్రమాలు ఎందరికో ఆదర్శంగా ఉన్నాయన్నారు. అనంతరం బోనం చేసి వేడుకల్లో పాల్గొన్న మహిళలందరిని ప్రత్యేకంగా సత్కరించి బహుమతులు అందజేశారు. -
Golconda Bonalu Photos: గోల్కొండ జగదాంబిక అమ్మవారి బోనాలు (ఫొటోలు)
-
Golconda Bonalu 2023 : గోల్కొండ బోనాలు షురూ (ఫొటోలు)
-
పాతబస్తీలో ఘనంగా బోనాలు
సాక్షి, హైదరాబాద్: డప్పు వాయిద్యాలు.. యువకుల కేరింతలు.. పోతరాజుల నృత్యాలు.. అమ్మవారి ఫలహార బండ్ల ఊరేగింపు.. ఆడపడుచుల బోనాలు.. అమ్మవారికి తొట్టెల సమర్పణ తదితర కార్యక్రమాల మధ్య పాతబస్తీలో ఆదివారం బోనాల జాతర కన్నుల పండువగా జరిగింది. భక్తులు తెల్లవారుజామునే లాల్‌దర్వాజ సింహవాహినీ దేవాలయం అమ్మవారికి బోనం సమర్పించడానికి క్యూ కట్టారు. అలాగే పాతబస్తీలోని ఇతర మహంకాళి దేవాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. పటిష్ట భద్రత మధ్య... బోనాల జాతర ఉత్సవాలకు దక్షిణ మండలం పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా దక్షిణ మండలం పోలీసులు చర్యలు చేపట్టారు. ఈ బోనాల జాతర వేడుకల్లో పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పాతబస్తీలోని అన్ని ప్రధాన దేవాలయాల్లో రాష్ట్ర ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో అమ్మవారికి మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, మహమూద్ అలీ పట్టువస్త్రాలను సమర్పించారు. నేడు సామూహిక ఘటాల ఊరేగింపు... ఆషాఢమాసం బోనాల జాతర ఉత్సవాలను పురస్కరించుకొని సోమవారం పాతబస్తీలో అమ్మవారి ఘటాల సామూహిక ఊరేగింపు జరగనుంది. ఇందుకోసం ఏర్పాట్లు పూర్తి చేశామని భాగ్యనగర్ శ్రీ మహంకాళి జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ చైర్మన్ రాకేశ్ తివారీ తెలిపారు. తెలంగాణ సంస్కృతికి ప్రతీక బోనాలు బోనాలు పండుగ తెలంగాణ సంస్కృతికి ప్రతీకని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. పాతబస్తీ బోనాలు ఉత్సవంలో భాగంగా లాల్‌దర్వాజలోని సింహవాహిని మహంకాళి అమ్మవారి ఆలయాన్ని ఆమె సందర్శించారు. అమ్మవారికి బోనం సమర్పించారు. -
Bonalu: అంగరంగ వైభవంగా లాల్‌దర్వాజ సింహవాహిని బోనాలు
హైదరాబాద్‌లో అమ్మవారి బోనాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆషాడమాసం చివరి ఆదివారం లాల్‌దర్వాజ సింహవాహిని అమ్మవారి బోనాల ఉత్సవం కన్నులపండువగా జరుగుతోంది. తెలంగాణ దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. భక్తులు భక్తి శ్రద్దలతో అమ్మవారికి బోనం సమర్పిస్తున్నారు. కాగా, నేడు(ఆదివారం) బోనాల్లో భాగంగా అమ్మవారికి దేవేందర్ గౌడ్ కుమారుడు, కోడలు మొదటి బోనాన్ని సమర్పించారు. ఇక, తెలుగు కెరటం, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు కూడా బోనమెత్తి అమ్మవారికి బోనం సమర్పించుకుంది. ఈ సందర్భంగా పీవీ సింధును ఆలయ కమిటీ సత్కరించింది. మరోవైపు.. ఆదివారం తెల్లవారుజాము నుంచే భక్తులు అమ్మవారి దర్శనం కోసం తరలివచ్చారు. రద్దీ పెరగడంతో గంటలపాటు క్యూ లైనులో వేచి చూస్తున్నారు. ఇదిలా ఉండగా.. అమ్మవారి బోనాల నేపథ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్, గవర్నర్ తమిళిసై సౌందరారాజన్ ప్రజలకు బోనాల శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో సుభిక్షంగా జీవించేలా అమ్మవారి ఆశీస్సులు కలకాలం కొనసాగాలని సీఎం కేసీఆర్ ప్రార్థించారు. ఇది కూడా చదవండి: బోనమెత్తిన గవర్నర్ తమిళిసై -
Ujjaini Mahankali Bonalu: జంటనగర వాహనదారులకు అలర్ట్.. ఆ రూట్లలో వెళ్లొద్దు
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి బోనాల జాతర కారణంగా ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా నగర పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా ఈ నెల 17, 18వ తేదీల్లో నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ మేరకు నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఒక ప్రకటన విడుదల చేశారు. ట్రాఫిక్ మళ్లింపులు ఇలా... కర్బల మైదాన్ వైపు నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులు రాణిగంజ్ చౌరస్తా నుంచి మినిష్టర్ రోడ్ మీదుగా, ఎస్పీ రోడ్‌లోని బేగంపేట హెచ్‌పీఎస్ వద్ద యూటర్న్ తీసుకుని సీటీవో, వైఎంసీఏ, సెయింట్ జాన్సన్ రోటరీ, సంగీత్, గోపాలపురం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల మీదుగా స్టేషన్‌కు చేరుకోవాలి. ► సికింద్రాబాద్ స్టేషన్ నుంచి ట్యాంక్‌బండ్ వైపు వెళ్లే ఆర్టీసీ బస్సులు చిలకలగూడ చౌరస్తా, గాంధీ ఆస్పత్రి, ముషీరాబాద్, కవాడిగూడ, మారియట్ హోటల్ మీదుగా ట్యాంక్‌బండ్ వైపు వెళ్లాలి. ► సికింద్రాబాద్ స్టేషన్ నుంచి తాడ్బంద్, బేగంపేట వెళ్లే ఆర్టీసీ బస్సులు క్లాక్ టవర్, ప్యాట్నీ చౌరస్తా లేదా క్లాక్ టవర్, వైఎంసీఏ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. ► బైబిల్ హౌస్ నుంచి సికింద్రాబాద్ స్టేషన్‌కు వెళ్లే సాధారణ ట్రాఫిక్ గాస్మండి చౌరస్తా, సజ్జన్‌లాల్ స్ట్రీట్, రాణిగంజ్ మీదుగా వెళ్లాలి. ► ప్యాట్నీ ఎస్బీఐ చౌరస్తా నుంచి ట్యాంక్ బండ్ వెళ్లే సాధారణ ట్రాఫిక్ ప్యాట్నీ చౌరస్తా నుంచి మినిష్టర్ రోడ్, ప్యారడైజ్ లేదా క్లాక్ టవర్ సంగీత్ చౌరస్తా, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మీదుగా చిలకలగూడ వైపు నుంచి వెళ్లాలి. ► ప్యారడైజ్ వైపు నుంచి బైబిల్ హౌస్ వెళ్లాల్సిన వాహనదారులు ఎస్బీఐ, క్లాక్‌టవర్ మీదుగా వెళ్లాలి. ► క్లాక్ టవర్ నుంచి ఆర్పీరోడ్ వెళ్లే వాహనదారులు ప్యారడైజ్, మినిష్టర్ రోడ్ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. ► సీటీవో, ప్యారడైజ్ నుంచి ఎంజీరోడ్ వెళ్లే వాహనాలు సింధీకాలనీ, మినిష్టర్ రోడ్, కర్బల మైదాన్గా వెళ్లాలి. ► పంజగుట్ట వైపు నుంచి సికింద్రాబాద్ స్టేషన్ వైపు వెళ్లే వాహనదారులు ఖైరతాబాద్ జంక్షన్, ఐమాక్స్ రోటరీ, తెలుగు తల్లి ఫ్లై ఓవర్, లోయర్ ట్యాంక్‌బండ్, ఆర్టీసీ చౌరస్తా, ముషీరాబాద్, గాంధీ ఆస్పత్రి మీదుగా చేరుకోవాల్సి ఉంటుంది. ► సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ట్యాంక్ బండ్ వైపు వెళ్లే వాహనదారులు ఓల్డ్ గాంధీ, మోండా మార్కెట్, బైబిల్ హౌస్, కర్బల మైదాన్ మీదుగా వెళ్లాలి. ► ఉప్పల్ నుంచి పంజగుట్ట వెళ్లే వాహనదారులు రామంతాపూర్, అంబర్పేట్, హిమాయత్‌నగర్, ఖైరతాబాద్ రోడ్డును వినియోగించుకోవాలి. ► సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి క్లాక్ టవర్ వైపు రెండు వైపుల రోడ్డు మూసి ఉంటుంది ఈ రోడ్డు వైపు రావద్దు. ► మహంకాళి ఆలయానికి వెళ్లే టొబాకోబజార్, హిల్‌స్ట్రీట్, సుభాష్‌రోడ్‌లో బాటా నుంచి రాంగోపాల్‌పేట్ పాత పోలీస్ స్టేషన్ వరకు, ఆదయ్యనగర్ నుంచి దేవాలయం వైపు వెళ్లే వాహనాల రాకపోకలను నిషేధించారు. వాహనాల పార్కింగ్ ప్రదేశాలు ఇవే... ► బోనాల జాతరకు వచ్చే వాహనదారుల కోసం ట్రాఫిక్ పోలీసులు 8 ప్రాంతాల్లో పార్కింగ్‌లను ఏర్పాటు చేశారు. ► సెయింట్ జాన్సన్ రోటరీ, స్వీకార్ ఉపకార్, ఎస్బీఐ వైపు నుంచి వచ్చే వాహనాలు హరిహర కళా భవన్‌తో పాటు బెల్సన్ తాజ్ హోటల్, మహబూబ్ కళాశాల, ఎస్వీఐటీలో పార్కింగ్ చేసుకోవచ్చు. ► సుభాష్‌రోడ్, రైల్వే స్టేషన్ వైపు నుంచి వచ్చే వాహనాలు ఓల్డ్ జైల్‌ఖానా వద్ద, కర్బల మైదాన్, బైబిల్ హౌస్, గాస్మండి వైపు నుంచి వచ్చే వాహనాలు ఇస్లామియా స్కూల్, రాణిగంజ్, ఆదయ్యనగర్ చౌరస్తా నుంచి వచ్చే వాహనాలు ఆదయ్య మెమోరియల్ స్కూల్లో, సీటీవో, బాలంరాయి, రసూల్‌పురా నుంచి వచ్చే వాహనాలు గాంధీ విగ్రహం వద్ద, మంజు థియేటర్ వైపు వచ్చే వాహనాలు అంజలి థియేటర్ వద్ద పార్కింగ్ చేసికోవచ్చు. ► ‘సికింద్రాబాద్ స్టేషన్‌కు వచ్చే ప్రయాణికులు 10వ నంబర్ ప్లాట్‌ఫాం వైపు ఉన్న రహదారిని ఉపయోగించుకోవాలి’ అని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ సూచించారు. (క్లిక్: హైదరాబాద్ ఐఐటీ అదుర్స్) -
పోతరాజులతో కలిసి సరదాగా చిందులు వేసిన మంత్రి తలసాని
-
‘గణేష్ ఉత్సవాలను బాగా జరుపుకోవాలి’
హైదరాబాద్: భాగ్యనగరంలో గణేష్ ఉత్సవాల నిర్వాహణపై ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులతోపాటు.. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ప్రభుత్వ విప్ ప్రభాకర్, డీజీపీ మహేందర్ రెడ్డి, మంత్రి మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ గడిచిన రెండేళ్ల నుంచి కరోనా వలన గణేష్ ఉత్సవాలకు తీవ్ర ఇబ్బంది కలిగిందని అన్నారు. అయితే, ఈసారి దేవుని ఆశీస్సులతో బోనాల పండుగను ఘనంగా జరుపుకున్నాం... గణేష్ ఉత్సవాలను కూడా ఇలానే జాగ్రత్తగా నిర్వహించుకోవాలని తెలిపారు. వినాయక నిమజ్జన కోసం.. ప్రత్యేకంగా క్రేన్స్‌లను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ఈసారి ట్యాంక్ బండ్ నిండుకుండలాగా ఉందని అన్నారు. కాగా, విగ్రహల ఎత్తు గురించి ప్రభుత్వం ఎప్పుడూ నిబంధనలు పెట్టలేదని అన్నారు. మూడు కమిషనరేట్ పరిధిలోని పోలీస్ వారు గణేష్ విగ్రహల ఏర్పాటుకి అనుమతి ఇస్తారని అన్నారు. చదవండి: Hyderabad: రెండు కేజీ బంగారు నగల బ్యాగు మిస్సింగ్ -
ఘనంగా లాల్ దర్వాజ సింహవాహిని అమ్మవారి బోనాల ఉత్సవాలు
-
పాతబస్తీలోని పలు దేవాలయాలను సందర్శించిన తలసాని
-
వర్షాల వల్ల ప్రజలు కొంత ఇబ్బంది పడతారు
-
సింగపూర్‌లో బోనాల పండుగ
సింగపూర్: బోనాల పండుగను సింగపూర్‌లో ఘనంగా నిర్వహించారు. బోనాలు నిర్వహించిన తెలంగాణ కల్చరల్ సొసైటీ ఆధ్వర్యంలో స్థానికంగా ఉన్న సుంగే కేడుట్ లోని శ్రీ అరస కేసరి శివన్ దేవాలయంలో ఈ వేడుకలు 2021 జులై25న నిర్వహించారు. సింగపూర్ ప్రభుత్వం నిర్దేశించిన కరోనా నిబంధనల నడుమ ఈ వేడుకులు జరిగాయి. మహంకాళీ ఆశీస్సులు సింగపూర్‌లోని తెలంగాణ కల్చరల్ సొసైటీ(TCSS) భౌతిక దూరం పాటిస్తూ భక్తి శ్రద్ధలతో పరిమిత సంఖ్యలో సభ్యులు బోనాలు సమర్పించారు. సమస్త ప్రజలపై ఆ మహంకాళి తల్లి ఆశీస్సులు ఉండాలని భక్తులు కోరుకున్నారు. కరోనా కోరల నుంచి ప్రపంచాన్ని కాపాడాలని సోసైటీ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఐదేళ్లుగా ఐదేళ్ల కిందట తెలంగాణ కల్చరల్ సోసైటీ సభ్యులు సింగపూర్‌కి బోనాల పండుగను పరిచయం చేశారు. ప్రతి ఏడాది సుమారు వేయి మంది భక్తులతో బోనాల ఊరేగింపు లో పోతరాజులు, పులి వేషాలు, తొట్టెలలు ప్రత్యేక ఆకర్షణ గా నిలిచేవి. ఈ ఆసరి కరోనా నిబంధనలతో పోతరాజు, పులివేషాలు సాధ్యపడలేదు. బోనం సమర్ఫణ ఈ ఏడాది బోనం సమర్పించిన వారిలో టీసీఎస్ఎస్ ఉపాధ్యక్షులు గర్రెపల్లి శ్రీనివాస్ కస్తూరి, గోనె నరేందర్ రెడ్డి రజిత, సంస్థాగత కార్యదర్శి గడప రమేశ్ స్వాతి మరియు వ్యవస్థాపక మరియు పూర్వ అధ్యక్షులు బండ మాధవ రెడ్డి శ్రీదేవి దంపతులు ఉన్నారు. వీరితో పాటు సొసైటీ అధ్యక్షులు నీలం మహేందర్ మరియు ప్రధాన కార్యదర్శి బసిక ప్రశాంత్ రెడ్డి దంపతులు సొసైటీ తరపున ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సమన్వయకర్తలుగా సునీతారెడ్డి, రోజారమణి, గోనే రజిత, జూలూరు పద్మజ, కాసర్ల శ్రీనివాసరావులు వ్యవహరించారు. -
బోనాల పాట వివాదంపై స్పందించిన మంగ్లీ
-
బోనాలను కేంద్ర జాబితాలో చేరుస్తా: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: బోనాలను కేంద్ర ప్రభుత్వ పండుగల జాబితాలో చేర్చేలా కృషి చేస్తానని కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి హామీ ఇచ్చారు. కరోనా నుంచి విముక్తి లభించాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నానని ఆయన తెలిపారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్లో బుధవారం హైదరాబాద్ లాల్‌దర్వాజా సింహవాహిని శ్రీ మహాలక్ష్మి ఆలయం వారు నిర్వహించిన బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న కిషన్‌రెడ్డి అమ్మవారికి బోనం, పట్టు వస్త్రాలను సమర్పించారు. ఆయనతో పాటు హైదరాబాద్ మాజీ మేయర్ బండ కార్తీక రెడ్డి బంగారం బోనం ఎత్తి, అమ్మవారికి సమర్పించారు. ఈ సందర్భంగా తెలంగాణభవన్ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను కిషన్‌రెడ్డి సందర్శించారు. బోనాల కార్యక్రమంలో టీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ కేశవరావు, మాజీమంత్రి ఈటల రాజేందర్, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి పాల్గొన్నారు. -
జులై మూడోవారంలో ప్రారంభంకానున్న లష్కర్ బోనాలు
-
భక్తిశ్రద్ధలతో అమ్మవారి ఘటాల ఊరేగింపు
-
హైదరాబాద్ లో బోనాల ఉత్సవాలు
-
రేపు ఉజ్జయినీ అమ్మవారి బోనాలు
-
బల్కంపేటలో బోనాల సంబరాలు..!
-
ఇంట్లోనే అమ్మవారికి బోనాలు సమర్పించండి
-
ఎస్సైకి ముద్దుపెట్టిన యువకుడు..
-
పబ్లిక్‌లో ఎస్సైకి ముద్దుపెట్టిన యువకుడు..
హైదరాబాద్ : పోలీసులు వస్తున్నారంటే మాములుగా జనాలు భయపడిపోతారు. కానీ ఓ యువకుడు మాత్రం ఏకంగా విధుల్లో ఉన్న ఎస్సైకి ముద్దుపెట్టాడు. ఈ ఘటన హైదరాబాద్ వెస్ట్ జోన్ పరిధిలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బోనాల వేడుకల్లో భాగంగా పలువురు యువకులు రోడ్డుపై చిందులేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. అదే సమయంలో అక్కడ భద్రతను పర్యవేక్షిస్తున్న ఎస్సై మహేందర్ అటుగా వెళ్తున్నారు. అయితే ఒక్కసారిగా ఆ గ్యాంగ్‌లోని ఓ యువకుడు ఎస్ఐ దగ్గరకు వెళ్లి ఆయనకు ముద్దుపెట్టాడు. దీంతో ఉలిక్కిపడ్డ ఎస్ఐ ఆ యువకుడిని పక్కకు నెట్టాడు. ఆ తర్వాత అతనిపై కోపం ప్రదర్శించకుండా.. సంయమనం పాటించాడు. కోపాన్ని దిగమింగుకుంటూ ఎస్సై అక్కడి నుంచి వెళ్లిపోయారు. యువకుడు మద్యం మత్తులో ఉండి ఈ విధంగా ప్రవర్తించినట్టుగా తెలుస్తోంది. కాగా, ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. యువకుడు మద్యం మత్తులో తనతో అమర్యాదగా ప్రవర్తించాడని అర్థం చేసుకుని.. అతన్ని ఏమి అనకుండా అక్కడి నుంచి వెళ్లిపోయిన ఎస్సైని పలువురు ప్రశంసిస్తున్నారు. -
బోనమెత్తిన రాములమ్మ, సింధు, పూనమ్
సాక్షి, హైదరాబాద్ : పాతబస్తీ లాల్‌దర్వాజా సింహవాహిని మహంకాళి ఆలయంలో బోనాల జాతర వైభవంగా జరుగుతోంది. తెల్లవారుజామున నుంచే భక్తులు పెద్ద ఎత్తున అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్‌లు అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. సామాన్యులే కాకుండా పలువురు సెలబ్రిటీలు కూడా బోనం సమర్పించేందుకు అమ్మవారి ఆలయానికి తరలివచ్చారు. భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు ఆదివారం లాల్‌దర్వాజా సింహవాహని అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారికి బంగారు బోనం సమర్పించారు. అమ్మవారికి బోనం సమర్పించడం సంతోషంగా ఉందన్నారు. అందరికి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకున్నట్టు తెలిపారు. అమ్మవారి ఆశీస్సుల ఉంటే నేను ఇంకా బాగా ఆడతానని అన్నారు. కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి అమ్మవారికి బోనం సమర్పించారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలని ఆమె అమ్మవారిని కోరుకున్నారు. ప్రభుత్వం అమ్మవారి ఆలయాన్ని అభివృద్ధి చేయాలని అన్నారు. సినీనటి పూనమ్‌కౌర్ కూడా బోనమెత్తారు. చార్మినార్ భాగ్యలక్ష్మీ అమ్మవారికి బోనం సమర్పించి.. దర్శనం చేసుకున్నారు. -
పాతబస్తీలో వైభవంగా బోనాల పండుగ
సాక్షి, హైదరాబాద్: పాతబస్తీలో బోనాల జాతర వైభవంగా జరుగుతోంది. బోనాల శోభతో జంటనగరాలు కళకళలాడుతున్నాయి. తెల్లవారుజామున నుంచే అమ్మవారికి ప్రత్యేక పూజలు ప్రారంభమయ్యాయి. 5 గంటలకు అమ్మవారిని అభిషేకించారు. భక్తులు భక్తి శ్రద్ధలతో అమ్మవారికి బోనం సమర్పిస్తున్నారు. లాల్ దర్వాజ సింహవాహిని మహంకాళి అమ్మవారికి తెలంగాణ ప్రభుత్వం తరఫున మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ పట్టువస్త్రాలు సమర్పించారు. సోమవారం సాయంత్రం రంగం కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు ఆలయ కమిటీ తెలిపింది. తెలంగాణలో నిర్వహించే ఈ బోనాల్లో.. లాల్‌దర్వాజ బోనాలు విశిష్ఠమైనవి. ఆషాడ మాసం చివరివారంలో పాతబస్తీలో జరిగే లాల్‌దర్వాజ బోనాలకు 104 ఏళ్ల చరిత్ర ఉంది. మూసీ నది ఉప్పొంగి హైదరాబాద్‌ను ముంచెత్తుతున్న సమయంలో నిజాం నవాబు సింహవాహని మహంకాళి అమ్మవారికి మొక్కుకున్నారని.. ఆపద గట్టెకిస్తే.. గుడికట్టిస్తానని వేడుకున్నారని ప్రతీతి. అప్పటి నుంచి లాల్‌దర్వాజ బోనాల ఆనవాయితీ కొనసాగుతుందంటారు భక్తులు. ఇంతటి విశిష్ఠత ఉన్న ఈ బోనాలను భక్తిశ్రద్ధలతో జరుపుకుంటున్నారు. ఇంటిల్లిపాది వచ్చి అమ్మకు బోనం సమర్పించుకుంటున్నారు. బోనం ఎత్తుకుని.. అమ్మను దర్శించుకుంటే సకల పాపాలు పోతాయని, కోరిన కోర్కెలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. అందుకే తెలంగాణవారే కాదు ఇతర ప్రాంత ప్రజలు కూడా.. బోనాల ఉత్సవాల్లో పాల్గొంటున్నారు. దీంతో ఆలయాన్ని భక్తులతో కిక్కిరిసిపోయాయి. ఇక, సోమవారం సాయంత్రం రంగం కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు ఆలయ కమిటీ తెలిపింది. అక్కన్న మాదన్న, మహంకాళి అమ్మవారి ఘటాన్ని నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ ప్రారంభిస్తారు. ఒడిషా, కర్ణాటక, కేరళ నుంచి వచ్చిన కళాకారులు వివిధ ఆకృతులతో అమ్మవారి శకటాలను సుందరంగా అలంకరిస్తున్నారు. బోనాల ఉత్సవాల్లో అమ్మవారి ఘటాల సామూహిక ఊరేగింపు ప్రత్యేక ఆకర్షణగా నిలువనుంది. తెలంగాణ నలుమూలల నుంచి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. పాతబస్తీ బోనాల సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇందుకుగాను 13 వేల మంది పోలీసులతో భద్రతను కట్టుదిట్టం చేశారు. వీటరికి తోడుగా 43 ప్లటూన్ల సాయుధ బలగాలు కూడా భద్రత విధుల్లో పాటు పంచుకోనుంది. -
పోతరాజుల పోసాని
ఒళ్లంతా పసుపు.. కుంకుమలు.. చేతిలో చర్నాకోల.. కళ్లకు కాటుక. నోటిలో నిమ్మకాయలు.. ఒళ్లు గగుర్పొడిచే విన్యాసాలు.. బోనాల ఉత్సవాల్లో పోతరాజుల సందడి అంతా ఇంతా కాదు. లాల్‌దర్వాజా సింహవాహిని మహంకాళి బోనాల జాతరలో పోతరాజు వేషధారణలో పోసాని కుటుంబానికి వందేళ్ల చరిత్ర ఉంది. ఇప్పటికీ ఆ కుటుంబానికి చెందినవారే అమ్మవారి బోనాల ఉత్సవాల్లో పోతరాజు వేషధారణతో అలరిస్తున్నారు. చాంద్రాయణగుట్ట :మేకలబండకు చెందిన ‘పోసాని’ కుటుంబం నుంచి ఎనిమిది మంది పోతరాజు వేషధారణ వేశారు. 1908లో ఆలయంలో బోనాలు ప్రారంభమైన కొన్నేళ్ల నుంచే ఈ కుటుంబ సభ్యులు పోతరాజు వేషధారణ వేయడం ప్రారంభించారు. ప్రస్తుతం ఇదే వంశానికి చెందిన నాలుగో తరం వారు వంశపారంపర్యంగా పోతరాజు వేషధారణలో కొనసాగుతున్నారు. పోసాని బాబయ్య అలియాస్ సింగారం బాబయ్యతో ఈ అంకానికి శ్రీకారం చుట్టారు. బాబయ్య తమ్ముడు ఎట్టయ్య, బాబయ్య కుమారుడు లింగమయ్య, లింగమయ్య తమ్ముడు సత్తయ్య, లింగమయ్య కుమారుడు బాబురావు, బాబురావు సోదరుడు సుధాకర్, హేమానంద్.. ఇలా ఇప్పటి వరకు ఏడుగురు ఒకే వంశం నుంచి పోతరాజు వేషధారణ వేశారు. 2015 బోనాల నుంచి బాబురావు కుమారుడు పోసాని అశ్విన్ పోతరాజు వేషధారణ వేస్తున్నారు. పోసాని వంశం నుంచి మూడో తరానికి చెందిన బాబురావు 30 ఏళ్ల పాటు పోతరాజుగా తనదైన ముద్ర వేయడం గమనార్హం. అమ్మవారి ఆశీస్సులతోనే.. లాల్‌దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి ఆశీస్సులతోనే 30 ఏళ్ల పాటు పోతరాజుగా రాణించాను. దీంతో నన్నందరూ ‘పోతరాజు బాబురావు’ అని పిలుస్తుంటే ఎంతో గర్వంగా, సంతోషంగా ఉంటుంది. – పోతరాజు (పోసాని) బాబురావు ఎంతో సంతోషాన్నిచ్చింది.. నాలుగేళ్లుగా పోతరాజు వేషధారణ వేస్తున్నాను. ఘటస్థాపన రోజు నుంచి నియమ నిష్టలతో ఉంటూ అమ్మవారి ధ్యానంలో గడుపుతున్నాను. అమ్మవారి కరుణతోనే పోతరాజు వేసే అవకాశం దక్కిందని భావిస్తున్నా. – పోసాని అశ్విన్, ప్రస్తుత పోతరాజు పోతరాజు అంటే ఏమిటి.. పోతరాజంటే ఏడుగురు అక్కల ముద్దుల తమ్ముడు. అమ్మవారిని పొలిమేర నుంచి గ్రామంలోని దేవాలయానికి తీసుకొచ్చేటప్పుడు, అనంతరం సాగనంపేటప్పుడు రక్షణగా ముందు నడుస్తూ ఉంటాడు. డప్పు చప్పుళ్లకనుగుణంగా ఆనందంతో నృత్యం చేస్తూ స్వాగతిస్తుంటాడు. ఏడుగురు అక్కాచెల్లెళ్లు అయిన అమ్మవార్లకు ఈ పోతురాజంటే అమితానందం. దీంతో ఆయన సూచించిన రహదారిలో నడుస్తూ దేవాలయానికి తరలి వస్తారు. ఆయన గావుతో శాంతించి పొలిమేర దాటుతారు. -
మారు బోనం సమర్పించాలి : స్వర్ణలత
సాక్షి, హైదరాబాద్ : ఉజ్జయిని మహంకాళి బోనాల్లో భాగంగా సోమవారం ఉదయం జరిగిన రంగం కార్యక్రమంలో స్వర్ణలత ‘భవిష్యవాణి’ వినిపించారు. ఈ సందర్భంగా భక్తులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. బోనాల జాతర జరిపినందుకు సంతోషంగా ఉందన్నారు. గతేడాది బోనాల ఏర్పాట్లపై పెదవి విరిచిన అమ్మవారు.. ఈ ఏడాది సిబ్బంది మంచిగా పనిచేశారని పేర్కొన్నారు. ఐదు వారాలు సాకలతో, పప్పు బెల్లాలతో తనకు పూజలు జరిపించాలని కోరారు. మారు బోనం తప్పకుండా సమర్పించాలని సూచించారు. ‘ఈ ఏడాది ప్రజలంతా సంతోషంగా ముడుపులు చెల్లించుకున్నారు. ప్రజలందరినీ సంతోషంగా ఉంచుతాను. నా చెల్లెలు గంగాదేవికి జలాభిషేకం చేయండి.. తప్పకుండా కోర్కెలు నెరవేరుతున్నాయి. రాష్ట్రంలో తప్పకుండా వర్షాలు కురుస్తాయి. నా అక్కాచెల్లెళ్లు సంతోషంగా ఉంటే నేను సంతోషంగా ఉంటా. రైతులను సుఖ సంతోషాలతో ఉంచే బాధ్యత నాదేన’ని స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. -
ఇంద్రకీలాద్రిపై శాకంబరి ఉత్సవాలు
సాక్షి, విజయవాడ: ఇంద్రకీలాద్రి పండుగ శోభను తరించుకుంది. జగతిని కాచే తల్లి మహోత్సవానికి వేళయింది. ఆదివారం నుంచి శాకంబరి ఉత్సవాలు ప్రారంభం కావడంతో దుర్గగుడి కళకళలాడుతోంది. కూరగాయలు.. ఆకుకూరలు.. ఫలాలతో దుర్గమ్మ సర్వాంగసుందరంగా అలలారుతోంది. ఆషాఢ మాసోత్సవాల్లో భాగంగా అమ్మవారికి పవిత్ర సారెను సమర్పించేందుకు తెలంగాణతో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి భక్తులు పోటెత్తారు. ప్రతి ఏడాదిలాగానే తెలంగాణ నుంచి అమ్మవారికి బంగారు బోనం సమర్పించేందుకు సుమారు 200మందితో వివిధ రకాల విన్యాసాలు చేస్తూ దుర్గమ్మకు బోనం సమర్పించేందుకు వచ్చినవారికి దేవాదాయ శాఖమంత్రి వెలంపల్లి శ్రీనివాస్ స్వాగతం పలికారు. అంతకు ముందు బ్రాహ్మణవీధిలోని జమ్మిచెట్టు నుంచి బోనాల ఊరేగింపు ప్రారంభమైంది. మేళతాళాలు, మంగలవాద్యాల నడుమ ఊరేగింపు అమ్మవారి ఆలయానికి చేరింది. మూడు రోజుల పాటు జరిగే శాకంబరి ఉత్సవాల్లో తొలిరోజు అమ్మవారి అలంకరణకు ఆకుకూరలు వినియోగించారు. రెండోరోజు పండ్లు, కాయలు, ఫలాలతో అలంకరిస్తారు. మూడోరోజు అయిన మంగళవారం బాదం. జీడిపప్పు, కిస్మిస్, లవంగాలు, యాలకులు, ఖర్జూరం వంటి డ్రై ఫ్రూట్స్‌తో అలకరించనున్నారు. ఆదివారం ఉదయం ప్రారంభం అయిన ఈ ఉత్సవాలు మంగళవారం సాయంత్రం ఆరు గంటలకు ముగుస్తాయి. కాగా మంగళవారం చంద్రగ్రహణం కారణంగా సాయంత్రం ఆరు గంటలకు అమ్మవారి దర్శానాన్ని నిలిపివేస్తారు. కాయగూరలతో కదంబం ప్రసాదాన్ని తయారు చేస్తారు. ఇక మూడురోజులు కూడా భక్తులు అమ్మవారికి కొబ్బరికాయ, పూలకు బదులుగా కూరగాయలు, ఆకుకూరలను దండగలుగా కూర్చి అమ్మకు కానుకగా సమర్పిస్తారు. మరోవైపు భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. -
లండన్‌లో ఘనంగా బోనాలు
లండన్ : తెలంగాణ ఎన్ఆర్ఐ ఫోరం (టీఈఎన్ఎఫ్) ఆధ్వర్యంలో లండన్‌లోని కాన్‌ఫోర్డ్ కళాశాలలో ఘనంగా బోనాల జాతర నిర్వహించారు. ఈ సంబరాలకు బ్రిటన్ నలుమూలల నుంచి ఎన్ఆర్ఐలు తరలివచ్చారు. ఈ వేడుకలకు లండన్ ఎంపీలు వీరేంద్రశర్మ, సీమా మల్హోత్రా, భారత రాయభార కార్యాలయ ఉన్నతాధికారి కే ఈవోమ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. భారతీయ సంస్కృతి ప్రచారంలో తెలుగువారు మొదటిస్థానంలో ఉన్నారని ఎంపీ వీరేంద్రశర్మ తెలిపారు. ఎనిమిదేళ్లుగా లండన్ బోనాల వేడుకల్లో పాల్గొనడం గర్వంగా ఉందని చెప్పారు. ఇంగ్లాండ్ గడ్డపై తన నియోజకవర్గంలో బోనాలు నిర్వహించడం, హిందూ సంప్రదాయాల్లో తాను భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉందని ఎంపీ సీమా మల్హోత్రా అన్నారు. ప్రపంచవ్యాప్తంగా విదేశాల్లో 2011లో తొలిసారిగా బోనాలు నిర్వహించిన తనకు సహకరించి.. ఇప్పుడు విశ్వవ్యాప్తంగా బోనాల నిర్వహణకు దోహదపడుతున్న వారందరికీ తెలంగాణ ఎన్ఆర్ఐ ఫోరం వ్యవస్థాపకుడు, చైర్మన్ గంప వేణుగోపాల్ ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ ఆచార, సంప్రదాయాలను ప్రచారంచేయడాన్ని సేవగా సంస్థ స్వీకరిస్తోందని, నియమ నిబంధనల మేరకు కలిసివచ్చే అందరితో సంస్థ పనిచేస్తుందని టీఈఎన్ఎఫ్ ప్రధాన కార్యదర్శి సుధాకర్‌గౌడ్ తెలిపారు. విదేశాల్లో పుట్టిపెరిగే భారతీయ సంతతి కోసం మన పండుగలు నిర్వహించడం చాలాముఖ్యమని ఉపాధ్యక్షులు ప్రవీణ్‌రెడ్డి, రంగు వెంకట్ అన్నారు. స్థానిక లక్ష్మీనారాయణ గుడిలో కార్యదర్శి, మహిళాసభ్యుల ఆధ్వర్యంలో దుర్గామాతకు బోనం, ఒడిబియ్యం సమర్పించారు. లండన్ పురవీధుల్లో తొట్టెలు, బోనాల శోభాయాత్రను కన్నులపండువగా నిర్వహించారు. కాన్‌ఫోర్డ్ కళాశాల ఆడిటోరియంలో మీనాక్షి అంతరి అధ్యక్షతన వీరేంద్రవర్మ, శ్రీవాణి.. మహంకాళి మాతకు బోనాలు సమర్పించి పూజలు జరిపారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. భారతనాట్యం, గీతాలాపన, చిన్నారుల నృత్య ప్రదర్శన, ఆధ్యాత్మిక ప్రవచనాలు భక్తులను అలరించాయి. ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడంలో మహేష్ జమ్ముల, స్వామి ఆశ, వెంకట్ ఆకుల, మహేష్ చట్ల, బాల కృష్ణ రెడ్డి, శేషు అల్ల, నరేంద్ర వర్మ, సాయి మార్గ్, మీనాక్షి అంతటి, వాణి అనసూరి, శ్రీవాణీ, సవిత, సీత, శౌరి, దివ్య, సాయి లక్ష్మి, శిరీష, అశోక్ మేడిశెట్టి, నర్సింహా రెడ్డి తిరుపరి, రాజు కొయ్యడ, రవి కూర, నరేందర్, మల్లేష్ తదితరులు ఎంతగానో కృషి చేశారు. -
తెలంగాణ భవన్లో బోనాల సంబరాలు
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలోని తెలంగాణ భవన్లో లాల్‌దర్వాజ బోనాల ఉత్సవాలు ప్రారంభం అయ్యాయి. ఈ సంబరాల్లో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి గురువారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బోనాలు తెలంగాణకు ప్రత్యేకమైన పండుగ అని, ప్రకృతిని ఆరాధించే పండుగ బోనాలు అని అన్నారు. కాగా తెలంగాణ ప్రభుత్వం, లాల్ దర్వాజ సింహవాహిని అమ్మవారి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఢిల్లీలో బోనాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అమ్మవారి ఘట్టాన్ని నిన్న (బుధవారం) ఇండియా గేట్ నుంచి తెలంగాణ భవన్ వరకూ ఊరేగింపుగా తీసుకొచ్చి ప్రతిష్టించారు. వేడుకల్లో టీఆర్ఎస్ ఎంపీలు నామా నాగేశ్వరరావు, రాములు, ప్రకాశ్, లింగయ్య, ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి రామచంద్రు పాల్గొన్నారు. -
జగదాంబిక ఆలయంలో తొలి పూజలు
-
జంట నగరాల్లో బోనాల సందడి
-
బోనమెత్తిన పాతబస్తీ
చార్మినార్/చాంద్రాయణగుట్ట: పాతబస్తీ బోనమెత్తింది. భక్త జనంతో కిటకిటలాడింది. ఆదివారం తెల్లవారుజాము నుంచే బోనాలను సమర్పించేందుకు భక్తులు క్యూ కట్టారు. అమ్మ దర్శన భాగ్యం కోసం తరలివచ్చారు. తెల్లవారుజామున 5 గంటలకు టీడీపీ నేత, మాజీ ఎంపీ దేవేందర్ గౌడ్ కుటుంబ సభ్యుల చేతుల మీదుగా లాల్‌దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారికి మహాభిషేకం నిర్వహించారు. ఉదయం 7కి ప్రారంభమైన బోనాల సమర్పణ సాయంత్రం వరకు కొనసాగింది. ఉదయం భక్తుల రద్దీ స్వల్పంగా ఉండటంతో బోనాల సమర్పణ వేగంగా సాగింది. పది గంటల అనంతరం భక్తుల తీవ్రత పెరగడంతో నెమ్మగించింది. అంతలోనే వీఐపీల రాక మొదలవడంతో బోనాల సమ ర్పణ మందగించింది. పోలీసులు, ఆలయ కమిటీ ప్రతినిధులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వం తరఫున మంత్రులు పాతబస్తీలోని ప్రధాన దేవాలయాల్లో అమ్మ వార్లకు పట్టు వస్త్రాలు అందజేశారు. పాతబస్తీలో భక్తుల కోలాహలం పాతబస్తీలో ఏ వీధి చూసినా సందడిగా కనిపించింది. సింహవాహిని మహంకాళి దేవాలయంతోపాటు మీరాలంమండి శ్రీ మహాంకాళేశ్వర దేవాలయం, ఉప్పుగూడ మహంకాళి దేవాలయం, గౌలిపురా మహంకాళి దేవాలయం, సుల్తాన్షాహి జగదాంబ దేవాలయం, మేకల బండ నల్ల పోచమ్మ దేవాలయం, హరిబౌలిలోని అక్కన్న మాదన్న దేవాలయం, బేలా ముత్యాలమ్మ దేవాలయం, హరిబౌలి బంగారు మైసమ్మ దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన చర్యలు తీసుకున్నామని భాగ్యనగర్ శ్రీమహంకాళి జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ అధ్యక్షుడు గాజుల అంజయ్య తెలిపారు. ప్రజలంతా సుభిక్షంగా ఉండాలి అమ్మవారి ఆశీర్వాదంతో రాష్ట్ర ప్రజలంతా సుభిక్షంగా ఉండాలి. వర్షాలు విరివిగా కురవాలి. రైతన్నలు సుఖంగా ఉన్నప్పుడే దేశం సుఖంగా ఉంటుంది. పాడి, పంటలతో వారు వర్ధిల్లాలి. – ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, టీపీసీసీ చీఫ్ రాష్ట్రంలో బోనాలే పెద్ద పండుగ తెలంగాణ రాష్ట్రంలో బోనాలే అతి పెద్ద పండుగ. రాష్ట్ర పండుగగా గుర్తించిన తర్వాత బోనాల విశిష్టత మరింత పెరిగింది. ఢిల్లీ, విజయవాడతోపాటు అమెరికాలో కూడా నేడు తెలుగు ప్రజలు బోనాలు నిర్వహిస్తున్నారు. అందరూ బాగుండాలి. బంగారు తెలంగాణ సాధ్యం కావాలని అమ్మవారిని వేడుకున్నా. – ఇంద్రకరణ్ రెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి మరిన్ని సదుపాయాలు కల్పించాలి ప్రజలంతా సంతోషంగా ఉండాలని అమ్మవారిని కోరుకున్నా. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా బోనాల ఉత్సవాలు సాగుతున్నాయి. అమ్మవారి దయతో రాష్ట్రంలో మంచి వర్షాలు కురవాలి. రైతులు పాడి, పంటలతో విరజిల్లాలి. బోనాలను రాష్ట్ర పండుగగా గుర్తించినా.. ఆలయాల వద్ద మరిన్ని సదుపాయాలు కల్పించాలి. –కె.లక్ష్మణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అమ్మ దీవెనతోనే తెలంగాణ వచ్చింది అమ్మవారి దీవెనతోనే తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. ఉద్యమ సమయంలో ఆత్మహత్యలు చేసుకోకుండా తెలంగాణ బిడ్డలకు మనోసంకల్పం ఇవ్వాలని అమ్మవారిని కోరుకున్నా. ప్రొఫెసర్ జయశంకర్ చెప్పినట్లుగా తెలంగాణ వచ్చేంత వరకే ఉద్యమాలు జరగాలి. వచ్చాక తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి దిశగా అడుగులేసుకుందాం. – ప్రొఫెసర్ కోదండరాం, టీజేఎస్ అధ్యక్షుడు -
ఘనంగా బోనాలు.. క్యూ కట్టిన ప్రముఖులు!
సాక్షి, హైదరాబాద్ : నగరంలో బోనాల సందడి వెల్లివిరుస్తోంది. బోనాల శోభతో జంటనగరాలు కళకళలాడుతున్నాయి. లాల్‌దర్వాజ మహంకాళి అమ్మవారి బోనాలు వైభవంగా జరుగుతున్నాయి. పాతబస్తీలోని లాల్‌దర్వాజ మహంకాళి అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. ఉదయం నుంచే ఆలయం వద్ద భక్తజనం బారులు తీరారు. అమ్మకు బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్ తెలంగాణ ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. అన్ని శాఖల సమన్వయంతో బోనాలు నిర్విఘ్నంగా కొనసాగుతున్నాయని మంత్రి తలసాని తెలిపారు. రేపు ఊరేగింపు కోసం ఘనంగా ఏర్పాట్లు చేశామని చెప్పారు. క్యూ కట్టిన ప్రముఖులు.. హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ, బీజేపీ ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కె. లక్ష్మణ్, ప్రతిపక్ష నేత జానారెడ్డి, మాజీ మంత్రి దానం నాగేందర్, తెలంగాణ జనసమితి వ్యవస్థాపకుడు కోదండరామ్, మాజీ ఎంపీ విజయశాంతి తదితరులు లాల్‌దర్వాజ మహంకాళి అమ్మవారిని దర్శించి.. మొక్కులు చెల్లించారు. ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరుకున్నానని నాయిని తెలిపారు. తెలంగాణ అభివృద్ధి చెందాలి, ఫలాలు అందరికీ అందాలని అమ్మను వేడుకున్నట్టు ప్రొఫెసర్ కోదండరాం తెలిపారు. తెలంగాణలో నిర్వహించే బోనాల పండుగల్లో. లాల్‌దర్వాజ బోనాలు విశిష్ఠమైనవి. ఆషాడ మాసం చివరివారంలో పాతబస్తీలో జరిగే లాల్‌దర్వాజ బోనాలకు 104 ఏళ్ల చరిత్ర ఉంది. మూసీ నది ఉప్పొంగి హైదరాబాద్‌ను ముంచెత్తుతున్న సమయంలో నిజాం నవాబు సింహవాహని మహంకాళి అమ్మవారికి మొక్కుకున్నారని.. ఆపద గట్టెకిస్తే.. గుడికట్టిస్తానని వేడుకున్నారని చెబుతారు. అప్పటినుంచి లాల్‌దర్వాజ బోనాల ఆనవాయితీ కొనసాగుతుందంటారు భక్తులు. బోనం ఎత్తుకుని..అమ్మను దర్శించుకుంటే సకల పాపాలు పోతాయని, కోరిన కోర్కెలు నెరవేరుతాయన్నది భక్తుల విశ్వాసం. -
‘శ్యామల చెప్పింది నిజమైతది’
సాక్షి, హైదరాబాద్: ఉజ్జయిని అమ్మవారి బోనాల ఏర్పాట్లలో ప్రభుత్వం, పోలీసు శాఖ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన జోగిని శ్యామలకు కాంగ్రెస్ మాజీ ఎంపీ వి. హన్మంతరావు మద్దతు తెలిపారు. శ్యామల చెప్పింది నిజమైతదని, తెలంగాణలో కేసీఆర్ నియంతృత్వపాలన ముగియక తప్పదని జోస్యం చెప్పారు. తెలంగాణలో సర్పంచులకు అధికారాలు ఇవ్వకుండా, నిధులు ఇవ్వకుండా కేసీఆర్ అన్యాయం చేశారని దుయ్యబట్టారు. ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలు కావాలనే నిర్వహించడంలేదని వీహెచ్ అభిప్రాయపడ్డారు. గ్రామాలకు ప్రత్యేక అధికారుల వస్తే తరిమి కొట్టండని వీహెచ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో డిక్టేకర్ రాజ్యం నడుస్తోందని, ప్రజలు ఈ ప్రభుత్వంపైన తిరగబడితే కాంగ్రెస్ పార్టీ మీ వెంట ఉంటుందని వీహెచ్ స్పష్టం చేశారు. కేసీఆర్ పాలనలో బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీలను టీఆర్ఎస్ ప్రభుత్వం అనగదొక్కాలనే ప్రయత్నం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీలకు తాయిలాలే తప్ప రాజకీయంగా న్యాయం చేయడం లేదని మండిపడ్డారు. సమగ్ర కుటుంబ సర్వేలో బీసీల సంఖ్య చెప్పి, ఇప్పుడు మళ్లీ బీసీల గణన అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రచార కమిటీ చైర్మన్ పదవిని త్వరగా ప్రకటించాలని కాంగ్రెస్ అధిష్టానాన్ని వీహెచ్ కోరారు. కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి అభ్యర్థిని అధిష్టానమే నిర్ణయించే ఆనవాయితీ ఉందని తెలిపారు. ప్రజల్లో తిరిగే ఓపిక ఇంకా ఉందని, కాంగ్రెస్ కోసం ఒక కార్యకర్తలా పనిచేస్తానని పేర్కొన్నారు. -
శ్యామల ఫైర్.. స్పందించిన తలసాని
సాక్షి, హైదరాబాద్ : బోనాల పండుగ ఘనంగా జరిగిందని, విదేశీయులు సైతం ఈ సంబరాలకు హాజరయ్యారని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూలిపోతుందంటూ కొందరు కామెంట్ చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. సోమవారం జరిగిన రంగం కార్యక్రమం అనంతరం తలసాని మీడియాతో మాట్లాడారు. జోగిని శ్యామల కాస్త ఇబ్బంది పడ్డారని విన్నట్లు తెలిపారు. భక్తుల సౌకర్యార్థం కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయని చెప్పారు. లక్షల మంది వచ్చినప్పుడు జరిగిన అసౌకర్యాన్ని ఆమె అర్థం చేసుకోవాలంటూ శ్యామలకు మంత్రి తలసాని సూచించారు. ‘చిన్న చిన్న అసౌకర్యాలు జరిగాయి. స్థలం తక్కువగా ఉండటం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురైన మాట వాస్తవమే. వీఐపీల తాకిడి ఎక్కువగా ఉండటం వల్ల కూడా ఇబ్బందులు ఎదురయ్యాయి. స్వచ్ఛంద సంస్థలు బాగా సహకరించాయి. అయితే జోగిని శ్యామలకు ఆలయ పరిస్థితులు పూర్తిగా తెలుసు. ప్రభుత్వంపై ఆమె కామెంట్ చేయడం సరికాదు. వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలు పండి పిల్లాపాపలతో సుఖసంతోషాలతో ఉండాలని’ మంత్రి తలసాని ఆకాంక్షించారు. తెలంగాణ ప్రభుత్వంపై జోగిని ఫైర్ -
ఉజ్జయిని మహంకాళి జాతరలో కీలక ఘట్టం
-
బంగారు బోనం సమర్పించిన ఎంపీ కవిత
-
అమ్మవారికి బంగారు బోనం
హైదరాబాద్ : సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి బోనాల జాతర అంగరంగ వైభవంగా మొదలైంది. లక్షల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆదివారం తెల్లవారు జామున 2 గంటల నుంచి భక్తుల రద్దీ మొదలైంది. ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబంతో సహా వచ్చి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, నాయిని నరసింహారెడ్డి, శ్రీనివాస్‌యాదవ్, శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, మండలి చైర్మన్ స్వామిగౌడ్, బీజేపీ శాసన సభ పక్ష నేత కిషన్‌రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ, ఎంపీలు కల్వకుంట్ల కవిత, మల్లారెడ్డి, గరికపాటి మోహన్‌రావు, ఎమ్మెల్యేలు సాయన్న, ఎన్వీఎస్ ప్రభాకర్, శ్రీనివాస్‌గౌడ్, మేయర్ బొంతు రామ్మోహన్, తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం, టీటీడీ బోర్డు చైర్మన్ పుట్టా సుధాకర్‌యాదవ్, మాజీ ఎంపీలు నంది ఎల్లయ్య, వి.హనుమంతరావు, సర్వే సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్‌రెడ్డి, దానం నాగేందర్, ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, వివిధ పార్టీల నేతలు పెద్దిరెడ్డి, రావుల చంద్రశేఖర్‌రెడ్డి, బద్దం బాల్‌రెడ్డి, మాజీ మేయర్ కార్తీకరెడ్డి, బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ అండ్రూ ఫ్లెమింగ్, శక్తి పీఠాధిపతి జగద్గురు భగవతి మహరాజ్ తదితరులు అమ్మవారిని దర్శించుకున్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ అభిమానులతో వచ్చి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. కలెక్టర్ యోగితారాణి, ఐజీ మురళీకృష్ణ తదితర అ«ధికారులు అమ్మవారిని దర్శించుకున్న వారిలో ఉన్నారు. బంగారు బోనమెత్తిన ఎంపీ కవిత ఆలయం తరఫున 3 కిలోల బంగారంతో తయారు చేయించిన బోనాన్ని నిజామాబాద్ ఎంపీ కవిత శ్రీ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారికి సమర్పించారు. ఆదయ్యనగర్ నుంచి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నేతృత్వంలో 2వేల బోనాలు అమ్మవారి ఆలయానికి భారీ ఊరేగింపుగా వచ్చాయి. మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఈ ఊరేగింపును ప్రారంభించారు. డప్పుల దరువు.. కళాకారుల నృత్యాల నడుమ కవిత బంగారు బోనాన్ని తలపై మోస్తూ.. సిటీలైట్, కింగ్స్ వే, సుభాశ్ రోడ్ మీదుగా ఉజ్జయినీ మహంకాళి ఆలయానికి చేరుకున్నారు. బాటా వరకు ఊరేగింపు చేరుకోగానే మంత్రి తలసాని ఉత్సాహంగా నృత్యం చేశారు. ఊరేగింపులో ఆలయ కార్యనిర్వహణాధికారి ఎస్.అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారు. సాంస్కృతిక శాఖ «ఆధ్వర్యంలో దేవత.. రాక్షసులు.. పులి.. సింహాల వంటి వేషధారులు, లంబాడీల నృత్యాలు, కోలాటాలు ఊరేగింపులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఉదయం 9.20కి బయలుదేరిన బంగారు బోనం 11.20కి ఆలయానికి చేరుకుంది. ప్రజలంతా సుఖంగా ఉండాలి: మధుసూదనాచారి రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని కోరుకున్నా. ప్రకృతి మాత ఎంతో శక్తివంతమైంది. తెలంగాణ సంస్కృతికి ప్రతీక: స్వామిగౌడ్ మహంకాళి బోనాలు తెలంగాణ సంస్కృతికి సంప్రదాయాలకు ప్రతీక. రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసి రాష్ట్ర ప్రజలు పాడి పంటలతో సుఖంగా ఉండాలని కోరుకున్నా. జాతరలో అనేక స్వచ్ఛంద సంస్థలు చేస్తున్న కృషి అభినందనీయం. దేశంలో నంబర్ వన్ చేయాలి: నాయిని అభివృద్ధి, సంక్షేమంలో దేశంలో ఇప్పటికే రాష్ట్రం నంబర్ వన్ స్థానానికి చేరుకుంది. అన్నింటిలో నంబర్ వన్‌కు తీసుకుని రావాలని అమ్మవారిని మొక్కుకున్నా. రాష్ట్రంలో బాగా వర్షాలు కురిసి ప్రజలందరూ సుఖంగా ఉండాలి. 4 ఏళ్ల కాలంలో హోం శాఖ ఆధ్వర్యంలో పోలీసులు సమర్థవంతంగా శాంతిభద్రతలు పర్యవేక్షిస్తున్నారు. ఇలాగే ఎప్పటికీ శాంతి సామరస్యాలతో ఉండాలని కోరుకున్నా. అచ్చమైన తెలంగాణ పండుగ: కిషన్‌రెడ్డి అచ్చమైన తెలంగాణ పండుగ బోనాల జాతర. భక్తి, శక్తికి ప్రతీకగా బోనాల పండుగ నిలుస్తుంది. వర్షాలు సమృద్ధిగా కురవాలని, మోదీకి మళ్లీ ప్రధాని అయ్యే శక్తిని ప్రసాదించాలని అమ్మవారిని మొక్కుకున్నా. 3 వేల మందితో బందోబస్తు: సిటీ కమిషనర్ అంజనీకుమార్ బోనాల జాతర సందర్భంగా లక్షల మంది భక్తులు పాల్గొంటారనే ఉద్దేశంతో 3 వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాట్లు చేశాం. 70 మంది సీనియర్ అధికారులు, 60 షీటీమ్స్ ఇందులో పాల్గొన్నాయి. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టాం. ఏర్పాట్లు భేష్: ఇంద్రకరణ్‌రెడ్డి లక్షల మంది భక్తులు పాల్గొనే ఉజ్జయినీ మహంకాళి బోనాల జాతరలో భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా అన్ని ఏర్పాట్లు చేశాం. ఈ బోనాలకు ప్రభుత్వం రూ.15 కోట్లు కేటాయించింది. అమ్మవారికి బంగారు బోనం సమర్పించి ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నాం. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి: తలసాని రాష్ట్ర ప్రజలందరూ పాడి పంటలు, సుఖ శాంతులతో ఉండాలని కోరుతూ అమ్మవారికి పూజలు చేశాం. లక్షల మంది భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పించి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని మొక్కు చెల్లించుకుంటున్నారు. లక్షల మంది భక్తులు పాల్గొనే ఈ జాతరలో అసౌకర్యాలు కలిగితే పెద్ద మనసుతో వాటిని అర్థం చేసుకుని మన్నించాలి. అమ్మవారిని దర్శించుకోవడం అదృష్టం: ఉత్తమ్ లక్షల మంది ఇలవేల్పు అయిన అమ్మవారిని దర్శించుకునే అవకాశం రావడం నా అదృష్టం. భక్తులందరికీ బోనాల శుభాకాంక్షలు. -
పోలీసుల తీరుపై జోగిని శ్యామల ఫైర్
-
తెలంగాణ ప్రభుత్వంపై జోగిని ఫైర్
సాక్షి, హైదరాబాద్ : ఉజ్జయిని అమ్మవారి బోనాల ఏర్పాట్లలో ప్రభుత్వం, పోలీసు శాఖ విఫలం అయ్యాయని జోగిని శ్యామల ఫైర్ అయ్యారు. ఏర్పాట్ల లోపం వల్ల సామాన్య భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. బోనం ఎత్తుకొని వెళ్లే క్యూ లైన్లో పోలీసులు ఇతర భక్తలను పంపారని అన్నారు. మరోవైపు గంటల తరబడి బోనం ఎత్తుకుని లైన్లలో మహిళలు వేచి చూడాల్సివచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బోనాలు ఉత్సవంలో పోలీసుల అత్యుత్సహం ప్రదర్శించారు. ఉజ్జయిని మహంకాళి డ్యూటీలో ఉన్న ఓ చానెల్ రిపోర్టర్‌పై పోలీసు అధికారి చేయి చేసుకున్నారు. దీంతో పోలీసుల తీరుపై మీడియా పాయింట్ వద్ద రిపోర్టర్లు, కెమెరామెన్లు నిరసన వ్యక్తం చేశారు. -
బోనమెత్తిన భాగ్యనగరి
సాక్షి, హైదరాబాద్: గోల్కొండ కోట జనసంద్రమైంది. ఆదివారం ప్రారంభమైన శ్రీ జగదాంబిక మహంకాళి అమ్మవారి ఆషాఢ బోనాలకు జనం వేలాదిగా తరలి వచ్చారు. అశేష జనవాహిని మధ్య లంగర్‌హౌస్ నుంచి ప్రారంభమైన అమ్మవారి తొట్టెల ఊరేగింపు ఫతే దర్వాజా, చోటా బజార్, బడా బజార్, గోల్కొండ చౌరస్తాల గుండా కోటకు చేరుకుంది. భారీ తొట్టెల కోట ప్రధాన ద్వారం నుంచి అమ్మవారి ఆలయం వరకు ముందుకు సాగగా.. భక్తులు వెంట వెళ్లారు. మరోవైపు గోల్కొండ బంజార దర్వాజ నుంచి పటేలమ్మ మొదటి బోనం ఊరేగింపు కఠోర గంజ్, మొహల్లాగంజ్‌ల గుండా కోటకు చేరుకుంది. ఈ సందర్భంగా నగీనా బాగ్‌లోని నాగదేవత ఆలయం వద్ద భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావుగౌడ్, ఇంద్రకరణ్‌రెడ్డి.. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ కూడా బోనాల ప్రారంభానికి విచ్చేశారు. ఆలయాలకు రూ.15 కోట్ల నిధులు: ఇంద్రకరణ్ గోల్కొండ జగదాంబిక అమ్మవారికి తొలిపూజతో ప్రారంభమయ్యే ఈ ఉత్సవాలను ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ వినోద్ ఆధ్వర్యంలో మంత్రులు లంగర్‌హౌస్‌లో ప్రారంభించారు. ఆ తర్వాత అమ్మవారికి బోనాల ర్యాలీ ప్రారంభమైంది. ఈ ఏడాది వర్షాలు విస్తారంగా కురవాలని, అందరూ సంతోషంగా ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టామని చెప్పారు. బోనాల సందర్భంగా ఆలయాల అభివృద్ధి కోసం విడుదల చేసిన రూ.15 కోట్ల నిధులు కేవలం జంటనగరాల కోసమేనని చెప్పారు. మిగిలిన జిల్లాలకు కూడా ప్రత్యేక నిధులు మంజూరు చేయనున్నామని వెల్లడించారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. మొదటి రోజు ఉత్సవాలతోనే అధికారులు చేతులు దులుపుకోవద్దని, గోల్కొండలో జరిగే తొమ్మిది వారాల పూజలకు ప్రతి శాఖ అధికారి భక్తులకు అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలిగినా అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. గోల్కొండ బోనాల ఉత్సవాలను తాను స్వయంగా పర్యవేక్షిస్తున్నానని చెప్పారు. మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత బద్దం బాల్‌రెడ్డి మాట్లాడుతూ బంగారు తెలంగాణ కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న కార్యక్రమాలు అభినందనీయమన్నారు. ఆలయాల అభివృద్ధికి సీఎం పెద్దపీట వేశారని, కేవలం ప్రధాన ఆలయాలకే పరిమితం కాకుండా గల్లీల్లోని చిన్న దేవాలయాలను కూడా అభివృద్ధి చేయాలని నిర్ణయాలు తీసుకోవడం హర్షణీయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ, ఎమ్మెల్యే కిషన్ రెడ్డి, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ పాల్గొన్నారు. -
లంగర్‌హౌజ్ నుంచి ఫ్రారంభమైన తొట్టెల ఊరేగింపు
-
గోల్కొండలో వైభవంగా ప్రారంభమైన బోనాలు
-
బోన భాగ్యాలు
ఆషాఢమాసమంటే వర్షాకాలం. అంటే అంటువ్యాధులు వ్యాపించడానికి ఆలవాలమైన మాసం. కలరా, ప్లేగు, మశూచి, క్షయ, తట్టు్ట, పొంగు, అమ్మవారు వంటి అంటువ్యాధుల బారిన పడకుండా గ్రామదేవతలు గ్రామాలను చల్లగా చూసేందుకే బోనాలు సమర్పిస్తారు. పసుపు నీళ్లు, వేపాకులతో సాకలు పెట్టి, ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశాక అమ్మవారికి సమర్పించగా మిగిలిన పదార్థాలను ప్రసాదాలుగా స్వీకరిస్తారు. భోజనము అనే శబ్దానికి గ్రామ్యరూపమే బోనము. మశూచి, ప్లేగు, కలరా, మలేరియా వంటి అంటువ్యాధులు ప్రబలకుండా, సకాలంలో మంచి వర్షాలు పడి, పంటలు బాగా పండి అందరూ సుఖసంతోషాలతో పదికాలాలపాటు పచ్చగా ఉండాలనే సంకల్పంతో తెలంగాణ ప్రజలు ముఖ్యంగా భాగ్యనగర వాసులు పెద్దమ్మ, పోచమ్మ, మైసమ్మ, గండిమైసమ్మ, నల్లపోచమ్మ, ఎల్లమ్మ, పోలేరమ్మ, మాంకాళమ్మ తదితర గ్రామ దేవతలను ఆడపడచులుగా భావించి వారికి ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో పసుపు కుంకుమలు పెట్టి, భోజన నైవేద్యాలను సమర్పించి చీరసారెలతో, మంగళ వాయిద్యాలతో ఘనంగా వేడుక జరుపుతారు. ఈ పండుగకే బోనాలపండుగ అని పేరు. ఆంధ్రాప్రాంతంలో కూడా ఈ విధమైన పండుగలు ఉంటాయి కాని వీటికి వివిధ ప్రదేశాలలో వివిధ పేర్లున్నాయి. తొలి, తుదిబోనాలు గోల్కొండ జగదాంబికదే! మొదట వేడుకలు గోల్కొండ∙జగదాంబిక ఆలయంలో ఆరంభమవడం ఆచారం. ఈ మేరకు నేడు అమ్మ తొలిబోనం అందుకోనుంది. తర్వాత ఉజ్జయినీ మహంకాళి ఆలయంలోనూ, ఆ తర్వాత లాల్దర్వాజలోనూ, అనంతరం అన్నిచోట్లా బోనాల సంబురాలు జరుపుతారు. తుదిబోనం కూడా గోల్కొండ జగదాంబికకే సమర్పించి, బోనాల పండుగకు వీడ్కోలు పలుకుతారు. పరమాత్మలో చేరే జీవాత్మ బోనాలు సమర్పించడాన్ని జీవాత్మను పరమాత్మలో ఐక్యం చేయడంగా కూడా ఆధ్యాత్మికవేత్తలు చెబుతారు. విజ్ఞాన శాస్త్రపరంగా చూస్తే వేపాకు, పసుపు, నేలపైనా, గాలిలోనూ ఉండే సూక్ష్మజీవులను నాశనం చేసి, వాతావరణాన్ని క్రిమిరహితం చేయడానికి దోహదపడతాయి. నృత్య విన్యాసాలు, బోనాల సంబురాలు ప్రజలందరినీ ఒక్కతాటిమీద నడిపిస్తాయి. ఇటువంటి వేడుకలను జరుపుకోవడం తామరాకుమీద నీటి బొట్టులా ఉండే పట్టణ వాసులకు ఎంతో అవసరం. -
అమ్మకు బోనం
-
ఇదిగో ఆషాడం..అదిగో బోనం
-
బోనం.. తెలంగాణ ప్రాణం
హైరేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో నమోదు హైదరాబాద్: తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాల ప్రతీక బోనం ప్రపంచ రికార్డుకెక్కింది. పోతు రాజుల విన్యాసాలు, డప్పు వాయిద్యాల మధ్య దాదాపు 2,650 మంది మహిళలు బోనాలు ఎత్తుకున్నారు. ఈ అపూర్వ సన్నివేశం సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో ఆదివారం చోటు చేసుకుంది. నెహ్రూ యువ కేంద్ర సంఘటన్, తనిష్ నీలిమ డ్యాన్స్ అకాడమి, వాసవి మహిళా సమాఖ్య, తెలంగాణ కలల వేదిక, కైరా ఫౌండేషన్, మయూరి రూరల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ సంయుక్తంగా ‘బోనం.. తెలంగాణ ప్రాణం’ పేరిట ప్రపంచ రికార్డ్ స్థాయిలో బోనాల ప్రదర్శన నిర్వహించారు. బోనాల వైభవాన్ని ప్రపంచానికి తెలియజేయడానికి ఈ కార్యక్రమం చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమానికి కేంద్ర మంత్రి దత్తాత్రేయ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాలని దత్తాత్రేయ సూచించారు. కార్యక్రమంలో హైరేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధి జయంత్‌రెడ్డి, సంఘటన్ జాతీయ ఉపాధ్యక్షుడు పేరాల శేఖర్జీ, లక్ష్మీదేవి, ఉప్పల రాజ్య లక్ష్మి, స్వరూపరాణి, ఉమా మహేశ్వరి, వన్‌పల్లి శ్రీనివాస్‌రెడ్డి, ప్రతాప్, బండి దీక్షిత్, నర్సింహారెడ్డి, సతీశ్‌గౌడ్ పాల్గొన్నారు. -
టాంజ్ ఆధ్వర్యంలో బోనాల పండుగ సంబరాలు
ఆక్లాండ్: తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ న్యూజిలాండ్(టాంజ) ఆధ్వర్యంలో ఆక్లాండ్ లో రాష్ట్ర పండుగైనా బోనాల ఉత్సవాలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. పూజారి చంద్రు అమ్మవారికి ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. న్యూజిలాండ్ లో ఉండి కూడా బోనాల పండుగను జరుపుకోవడం తెలంగాణ ప్రజల సంస్కృతి, ఆచారాలు, భక్తికి నిదర్శనమని అన్నారు. అమ్మవారి అనుగ్రహం రాష్ట్ర ప్రజలకు ఎప్పటికి ఉండాలని ఆయన ఆశీర్వదించారు. మహిళలు చాలా భక్తిగా అమ్మవారికి చీరెలు, ఒడి బియ్యం, బోనాలు వివిధ నైవేద్యాలు సమర్పించారు. బాలికలు ఎంతో ఉత్సాహంగ బోనాలు ఎత్తి అమ్మవారికి సమర్పించారు. ఈ కార్యక్రమంలో పానుగంటి శ్రీనివాస్, పోతురాజు వేషం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. టాంజ్ ఏర్పాటు చేసిన నోరూరించే తెలంగాణ వంటకాలు, అమ్మవారి నైవేద్యాలతో అందరూ తృప్తిగా భోజనాలు చేశారు. మైమరిపించే తెలంగాణ బోనాల వాతావరణాన్ని పిల్లపాపలతో కలిసి అందరూ ఎంజాయ్ చేశారు. చివరిగా మహిళలు పసుపు కుంకుమలు పంచుకుని కార్యక్రమాన్ని ముగించారు. ఈ కార్యక్రమంలో టాంజ్ కమిటీ సభ్యులతో పాటు ఆక్లాండ్ లోని తెలంగాణ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. -
జజ్జెనకర జాతర