బెజవాడ కనకదుర్గమ్మ ఆలయం బోనాల వైభవాన్ని సంతరించుకుంది.
విజయవాడ: బెజవాడ కనకదుర్గమ్మ ఆలయం బోనాల వైభవాన్ని సంతరించుకుంది. అమ్మవారికి తెలంగాణ బోనాలను భక్తులు సమర్పించారు. హైదరాబాద్ పాత బస్తీ మహంకాళీ బోనాల జాతర ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ ఆధ్వర్యంలో దుర్గమ్మకు ఆదివారం బోనం సమర్పించారు.
హరిబౌలి అక్కన్న మాదన్న మహంకాళీ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం కమిటీ ప్రతినిధులు విజయవాడకు వచ్చారు. విజయవాడలో డప్పు వాయిద్యాలు, జానపద కళాకారుల విన్యాసాల మధ్య ఊరేగింపుగా వచ్చి.. అమ్మవారికి బోనంతోపాటు పట్టువస్త్రాలు, పసుపుకుంకుమ, గాజులు సమర్పించారు. విజయవాడలో నిర్వహించిన ఈ ఊరేగింపును ఏపీ దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు ప్రారంభించారు.