సాక్షి, సిటీబ్యూరో: నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఆది–సోమవారాల్లో బోనాల ఉత్సవాలు జరుగనున్నాయి. లోయర్ ట్యాంక్‌బండ్‌లోని కట్టమైసమ్మ దేవాలయం, అంబర్‌పేటలోని మహంకాళి దేవాలయం వద్ద జరిగే ఉత్సవాల నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ కొత్వాల్ మహేందర్‌రెడ్డి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. లోయర్ ట్యాంక్ బండ్ వద్ద ఆదివారం ఉదయం 7 నుంచి రాత్రి 10 వరకు, సోమవారం సాయంత్రం 4 నుంచి రాత్రి 10 వరకు ఆంక్షలు అమలులో ఉంటాయి.
♦ ఇక్బాల్ మినార్ నుంచి తెలుగుతల్లి ఫ్లైఓవర్ వైపు వచ్చే వాహనాలను లోయర్ ట్యాంక్‌బండ్ మీదుగా మళ్లిస్తారు.
♦ డీబీఆర్ మిల్స్, కవాడిగూడ వైపు నుంచి వచ్చే వాహనాలను తహశీల్దార్ కార్యాలయం మీదుగా పంపిస్తారు.
♦ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వైపు నుంచి వచ్చే వాహనాలను దోమలగూడ, హిమాయత్‌నగర్, ఇందిరాపార్క్, డీబీఆర్ మిల్స్ మీదుగా పంపుతారు.
♦ ఉప్పల్ నుంచి అంబర్‌పేట వైపు వచ్చే ఇతర జిల్లాలు, రాష్ట్రాల బస్సుల్ని తార్నాక, అడిక్‌మెట్, విద్యానగర్, ఫీవర్ హాస్పిటల్, ఏవై మండలి, నింబోలీఅడ్డా, చాదర్‌ఘాట్ మీదుగా మళ్లిస్తారు.
♦ ఇదే మార్గంలో వచ్చే సిటీ బస్సుల్ని గాంధీ స్టాట్యూ, సీపీఎల్ అంబర్‌పేట, అంబర్‌పేట ‘టి’ జంక్షన్, ఛే నంబర్ మీదుగా పంపిస్తారు.
♦ సోమవారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి అర్ధరాత్రి వరకు దిల్‌సుఖ్‌నగర్ వైపు నుంచి సికింద్రాబాద్ వైపు వెళ్ళే సిటీ బస్సుల్ని అలీ కేఫ్, జిందా తిలిస్మాత్, తిలక్‌నగర్ మీదుగా పంపిస్తారు.
♦ ఉప్పల్ వైపు నుంచి అంబర్‌పేట వైపు వెళ్ళే సాధారణ ట్రాఫిక్‌ను రాయల్ జ్యూస్ కార్నర్ నుంచి డీడీ కాలనీ, సిండికేట్ బ్యాంక్ మీదుగా పంపిస్తారు.
బోనాల నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు
Published Fri, Jul 29 2016 9:19 PM | Last Updated on Tue, Sep 4 2018 5:21 PM
Advertisement
Advertisement