ఘనంగా బోనాల పండుగ
ఘనంగా బోనాల పండుగ
Published Sun, Aug 21 2016 7:04 PM | Last Updated on Mon, Oct 1 2018 6:33 PM
యాదగిరిగుట్ట: మహిళ సంప్రదాయపు కట్టుబొట్టు.. నెత్తిన బోనం.. శివసత్తుల శిగాలు.. డప్పుచప్పుల ఊరేగింపుతో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట పట్టణం, మండలంలోని వంగపల్లి ఆధ్యాత్మిక వాతావరణంలో మునిగిపోయింది. శ్రావణం మూడోవ ఆదివారంలో అత్యంత వైభవంగా కొనసాగించే బోనాల జాతరను మహిళలు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ఉదయం నుంచే గ్రామదేవతలైన పోచమ్మ, ఎల్లమ్మ, దుర్గమ్మ, మాతమ్మ అమ్మవార్ల ఆలయాల చెంత ప్రత్యేక పూజలు చేసి సాయంత్రం వేళ బోనాల ఊరేగింపుగా వెళ్లి నైవేధ్యం సమర్పించుకున్నారు. యువతుల సంప్రదాయ దుస్తులు.. యువకుల నృత్యాల మధ్య అట్టహాసంగా బోనాల పండుగ జరిగింది. గుట్టలో జరిగిన బోనాల జాతరలో జెడ్పీటీసీ కర్రె కమలమ్మ, సర్పంచులు బూడిద స్వామి, చంద్రగాని నిరోష జహంగీర్, గుట్ట ఉప సర్పంచ్ గుండ్లపల్లి భరత్‌గౌడ్, టీఆర్‌ఎస్ యాదగిరిగుట్ట పట్టణాధ్యక్షులు కాటబత్తిని ఆంజనేయులు, నాయకులు పెలిమెల్లి శ్రీధర్, సుడుగు శ్రీనివాస్‌రెడ్డి తదితరులున్నారు.
Advertisement