ఘనంగా బోనాల పండుగ
ఘనంగా బోనాల పండుగ
Published Sun, Aug 7 2016 10:32 PM | Last Updated on Mon, Oct 1 2018 6:33 PM
సూర్యాపేట
బోనాల పండుగను ఆదివారం సూర్యాపేట పట్టణంలో ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. కృష్ణటాకీస్ సమీపంలో గల ఊర ముత్యాలమ్మ గుడిలో ఉదయం నుంచే వేలాది మంది భక్తులు తరలివచ్చి బోనాలు సమర్పించారు. వివిధ పార్టీల నాయకులు పటేల్ రమేష్‌రెడ్డి, తండు శ్రీనివాస్‌యాదవ్, బైరు వెంకన్నగౌడ్, శనగాని రాంబాబుగౌడ్, పెద్దిరెడ్డి రాజా, ముశం రవికుమార్, షఫిఉల్లా, గోదల రంగారెడ్డి, బూర బాలసైదులుగౌడ్, వెలుగు వెంకన్న, పొదిల రాంబాబు, బైరు దుర్గయ్యగౌడ్, వెలుగు సంతోషి, తాహేర్‌పాషా, వల్దాసు దేవేందర్, సుష్మారాణి, అనంతుల యాదగిరి, టైసన్ శ్రీను, దేవస్థానం కమిటీ సభ్యులు సారగండ్ల రాములు, గుంటి సైదులు తదితరులు వేర్వేరుగా అమ్మవారిని దర్శించుకొని పూజలు చేశారు. సాయంత్రం పట్టణంలోని వేలాది మంది భక్తులు ఊరేగింపుగా వచ్చి బోనాలు చెల్లించారు. సూర్యాపేట డీఎస్పీ సునితామోహన్ ముత్యాలమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే బోనం ఎత్తుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పట్టణ ఇన్‌స్పెక్టర్ వై.మొగలయ్య ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. అలాగే పట్టణంలోని 1, 7, 8 వార్డుల్లోని ముత్యాలమ్మ దేవాలయాల వద్ద భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు.
కోటమైసమ్మ బజార్‌లో...
పట్టణంలోని మార్కెట్‌రోడ్డులోని కోటమైసమ్మ బజార్‌లో గల కోటమైసమ్మ దేవాలయం టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి పటేల్ రమేష్‌రెడ్డి పూజలు నిర్వహించారు. రమేష్‌రెడ్డిని వార్డు కౌన్సిలర్ వెలుగు సంతోషి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో షఫీఉల్లా, వల్దాస్ దేవేందర్, దారోజు జానకిరాములు, వెలుగు వెంకన్న, నరేడ్ల సోమయ్య, నాగభూషణం, ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు.
గౌండ్ల బజార్‌లో...
పట్టణంలోని గౌండ్ల బజార్‌లో బోనాల పండుగ సందర్భంగా పోతరాజుకు కాంగ్రెస్ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజలు చేసిన వారిలో గోపగాని వెంకటనారాయణగౌడ్, బైరు వెంకన్నగౌడ్, బైలు శైలెందర్‌గౌడ్, పరుశరాములు, నాగరాజు, మహేష్ తదితరులు ఉన్నారు.
Advertisement
Advertisement