సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో బోనాల పండుగని శ్రీ అరసకేసరి శివన్ ఆలయంలో భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. భక్తిగీతాలు, అత్యద్భుతమైన సాంస్కృతిక ప్రదర్శనలు, డప్పు వాయిద్యాల నడుమ, అమ్మవారి నామస్మరణలతో కార్యక్రమం హోరెత్తింది. పలువురు మహిళలు కుటుంబ సభ్యులతో భక్తి శ్రద్ధలతో అమ్మవారికి బోనాలు సమర్పించారు.
బోనం ఆ జగన్మాతకు ఆషాడ మాసంలో సమర్పించే నైవేద్యం. అరకేసరి దేవాలయంలో మహిళలు బోనాలు సమర్పించారు. డప్పు వాయిద్యాలు, పోతురాజు ప్రదర్శన ఆకర్షణగా నిలిచింది. పలువురు తెలుగువాళ్లు ఆ వేడుకలో పాల్గొన్నారు. కాగా ఈ సందర్భంగా సింగపూర్ తెలుగు సమాజం అధ్యక్షులు బొమ్మారెడ్డి శ్రీనివాసులు రెడ్డి అందరికీ బోనాల శుభాకాంక్షలు తెలియజేశారు.
బోనాలు పండగ మన తెలుగు వారి గొప్ప సాంప్రదాయక పండగని,దీన్ని ప్రతీ సంవత్సరం జరపాలని తమ కార్యవర్గం నిర్ణయించినట్లు తెలిపారు. బోనాలు సమర్పించిన మహిళలల్ని, కార్యక్రమ నిర్వాహకులను ఆయన అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment