Bonalu celebrations
-
నల్గొండ జిల్లాలో అంగరంగ వైభవంగా పాతనగర బోనాల ఉత్సవాలు (ఫొటోలు)
-
న్యూజెర్సీలో ఘనంగా TTA బోనాల జాతర
-
ఖైరతాబాద్ నియోజకవర్గంలో బోనాల సందడి దృశ్యాలు
-
హోరెత్తిన బోనాలు.. ఈరోజు రంగం
-
భాగ్యలక్ష్మి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి కోమటిరెడ్డి
-
పాతబస్తీలో బోనాల సందడి
-
అమ్మవారి ఆశీస్సులతో ప్రజలు సుభిక్షంగా ఉండాలి: మంత్రి కోమటిరెడ్డి
సాక్షి, హైదరాబాద్: భాగ్యలక్ష్మి అమ్మవారి ఆశీస్సులతో తెలంగాణ ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఆయన చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి బోనాల కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున కుటుంబ సమేతంగా పాల్గొని.. అమ్మవారికి అధికారికంగా పట్టువస్త్రాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.‘‘ కరోనా వంటి మహమ్మరులు రాకుండా అమ్మవారు ప్రజలందరిని కాపాడలని కోరుకున్నాను. గత సంవత్సరం వర్షాలు లేక రైతులంతా ఇబ్బంది పడ్డారు. ఈసారి అమ్మవారి ఆశీస్సులతో సమృద్ధిగా వర్షాలు పడాలి. పాడి పంటలతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలి. అఖిలపక్ష నిర్ణయానికి అనుగుణంగా పాత డెజైన్‌తో కొత్త ఉస్మానియా దవాఖాన నిర్మిస్తాం. ... హైదరాబాద్‌తో పాటు వివిధ జిల్లాల ప్రజల ఆరోగ్యాలను దెబ్బతిస్తున్న మూసి నదిని ప్రక్షాళన చేస్తున్నాం. పాత బస్తీ స్థితిగతులను మార్చేందుకు మెట్రోను విస్తరిస్తున్నాం. హైదరాబాద్ అభివృద్ధికి భారీగా నిధులు కేటాయించాం. మేడిగడ్డ బ్యారేజి కుంగడంలో కుట్ర ఉందన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలపై స్పందించాలని అడిగిన విలేకర్ల ప్రశ్నకు.. దేవాలయం దగ్గర రాజకీయాలు మాట్లాడటం భావ్యం కాదు’’ అని అన్నారు. -
Bonalu: పాతబస్తీకి పండగొచ్చింది
చార్మినార్/చాంద్రాయణగుట్ట: పాతబస్తీకి ఉత్సవ కళ వచ్చింది. బోనాల పండగతో ఉత్సాహం ఉట్టిపడుతోంది. ఆషాఢమాసం బోనాల జాతరలో భాగంగా ఆదివారం లాల్‌దర్వాజా సింహవాహిని అమ్మవారికి భక్తులు బోనాలు సమరి్పంచనున్నారు. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. పోలీసులు గట్టి బందోబస్తు చేపట్టారు. బోనాల ఉత్సవాలను పురస్కరించుకుని పాతబస్తీలోని లాల్‌దర్వాజా సింహవాహిని మహంకాళి దేవాలయం, మీరాలంమండి శ్రీ మహంకాళేశ్వర అమ్మవారి దేవాలయం సహా అన్ని ప్రధాన ఆలయాలను అందంగా ముస్తాబు చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, జూపల్లి కృష్ణారావు తదితరులు అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమరి్పంచి పూజలు చేస్తారని ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ చైర్మన్ గాజుల అంజయ్య తెలిపారు. భక్తులకు వసతులు కల్పించాలి: ఆమ్రపాలి లక్డీకాపూల్: బోనాల ఉత్సవాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి అధికారులను ఆదేశించారు. శనివారం జోనల్, డిప్యూటీ కమిషనర్లతో నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్‌లో ఆమె మాట్లాడారు. నగరంలోని ఆయా ప్రాంతాల్లో ఆదివారం జరగనున్న బోనాల ఉత్సవాలు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో గ్రేటర్లో పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. నేడు, రేపు మద్యం దుకాణాలు బంద్ సాక్షి, సిటీబ్యూరో: నగరంలో బోనాల ఉత్సవాల సందర్భంగా ఆది, సోమవారాల్లో మద్యం దుకాణాలు, బార్లు మూసివేయనున్నట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. ఈ నెల 30వ తేదీ మంగళవారం వైన్స్ యథావిధిగా తిరిగి తెరుచుకుంటాయని పేర్కొన్నారు. -
Bonalu: బోనాల్లో డ్యాన్స్ వేసేవాణ్ని
‘నేను పెరిగింది హైదరాబాద్ పాతబస్తీలో. చిన్నప్పటి నుంచి లాల్ దర్వాజా బోనాలు చూస్తూ పెరిగాను. పోతరాజు వేషంలో డ్యాన్స్ చేసేవాళ్లని చూస్తుంటే సంతోషంగా ఉంటుంది. డ్రమ్స్, మ్యూజిక్, డ్యాన్స్ చూస్తుంటే బాడీలో ఒక వైబ్రేషన్ వస్తుంటుంది. ఇప్పుడు సినిమాల్లోకి వచ్చాక డైరెక్టుగా బోనాల్లో పాల్గొనలేకపోతున్నాను గాని.. లాల్ దర్వాజా, సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి, బల్కంపేట ఎల్లమ్మ.. ఇలా అమ్మవార్ల బోనాల ఉత్సవాలను టీవీలో చూస్తుంటాను.. చాలా సంతోషంగా ఉంటుంది’ అని సినీ నటుడు ప్రియదర్శి అన్నారు. సహాయ, కామెడీ పాత్రలతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రియదర్శి.. నగరంలో బోనాల పండగ జోరుగా జరుగుతున్న సందర్భంగా ‘సాక్షి’తో తన అనుభవాలను ఇలా పంచుకున్నారు.‘నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను గమనిస్తున్నది ఏంటంటే.. బోనాల తర్వాత మనకు తప్పకుండా వర్షం వస్తుంది. ఈ విషయాన్ని నేను ఏళ్ల తరబడి చూస్తున్నాను. బోనాల సమయంలో తప్పనిసరిగా వర్షం రావడం మంచిగా అనిపిస్తుంది. హైదరాబాద్‌లో అన్ని కులాలు, మతాల వారు బోనాల ఉత్సవాలను ఎంతో సంబరంగా జరుపుకోవడం సంతోషంగా ఉంటుంది. నేను చిన్నప్పుడు బోనాల్లో డ్యాన్స్ చేసేవాణ్ని. పోతరాజు వేషధారణల మధ్య డ్యాన్స్ చేయడమంటే నాకు చాలా ఇష్టం. అలాగే హైదరాబాద్‌లో యాదవ సోదరులు సదర్ ఉత్సవాలని ఎంతో ఘనంగా నిర్వహిస్తుంటారు. అవి కూడా నాకెంతో ఇష్టం.. నేను పాల్గొనేవాణ్ని. ‘సేవ్ ద టైగర్స్’ వెబ్ సిరీస్‌లో నేను ఘంటా రవి పాత్ర చేస్తున్నప్పుడు ఇలాంటివన్నీ బాగా రిఫరెన్స్‌గా వాడుకున్నా. సెలబ్రిటీ అయ్యాక బోనాలు, సదర్ ఉత్సవాల్లో డైరెక్టుగా పాల్గొనలేకపోతున్నాను. తప్పదు.. కొన్నింటిని త్యాగం చేయాల్సిందే. సంక్రాంతి పండగను ఆంధ్రప్రదేశ్‌లో ఎంత ఘనంగా జరుపుకుంటారో హైదరాబాద్‌లోనూ అంతే గ్రాండ్‌గా జరుపుకొంటారు. తెలంగాణలో సమ్మక్క– సారక్క, కొండగట్టు అంజన్న, యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి, మల్లన్న జాతర.. ఇలాంటివన్నీ సంస్కృతికి నిదర్శనం’. హిందువుల పండగలనే కాదు... నాకు అన్ని పండగలూ ఇష్టమే. ప్రత్యేకించి రంజాన్, బక్రీద్ సమయంలో ముస్లిం స్నేహితులని కలవడం.. వారు పెట్టే ఖీర్ (పాయసం) తినడం చాలా హ్యాపీగా ఉండేది’ అన్నారు ప్రియదర్శి. -
మహబూబ్‌నగర్ : ఘనంగా పోచమ్మ అమ్మవారి బోనాలు (ఫొటోలు)
-
వైభవంగా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి రంగం ఊరేగింపు (ఫొటోలు)
-
జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడిలో శాకాంబరి ఉత్సవాలు (ఫొటోలు)
-
తెలంగాణభవన్‌లో వేడుకలు.. బంగారు బోనమెత్తిన గవర్నర్ సీపీ రాధాకృష్ణన్
సాక్షి, ఢిల్లీ: ఢిల్లీలోని తెలంగాణభవన్‌లో లాల్ దర్వాజా బోనాల ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో తెలంగాణ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ అమ్మవారికి సమర్పించారు.కాగా, తెలంగాణభవన్‌లో జరిగిన బోనాల ఉత్సవాల్లో గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ పాల్గొన్నారు. ఈ క్రమంలో లాల్ దర్వాజ బోనాల కమిటీ సభ్యులు గవర్నర్‌కు స్వాగతం పలికారు. ఇక, వేడుకల్లో భాగంగా ఆయన బంగారు బోనం ఎత్తుకుని అమ్మవారికి సమర్పించారు.అనంతరం, రాధాకృష్ణన్ మాట్లాడుతూ.. దేవుడు ఒక్కడే. భిన్న రూపాల్లో మనం దేవుడికి కొలుస్తాము. అదే సెక్యులరిజానికి నిజమైన నిర్వచనం. బోనాల ఉత్సావాల్లో ఈ సంస్కృతి కనిపిస్తుంది అని కామెంట్స్ చేశారు. -
వైభవంగా సోమాజిగూడ శ్రీ రేణుక మహాలక్ష్మి ఎల్లమ్మ కళ్యాణం దృశ్యాలు..
-
రేపట్నుంచే ఆషాడ బోనాల జాతర.. గోల్కొండతో షురూ (ఫొటోలు)
-
హైదరాబాద్‌లో లాల్‌దర్వాజ బోనాల సందడి.. పట్టు వస్త్రాలు సమర్పించిన తలసాని
సాక్షి, హైదరాబాద్: నగరంలోని లాల్‌దర్వాజలో బోనాల సందడి నెలకొంది. ఆలయాల దగ్గర బోనాలతో మహిళలు బారులుతీరారు. లాల్ దర్వాజ సింహవాహిని మహంకాళి అమ్మవారికి ప్రభుత్వం తరపున మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను చాటి చెప్పే విధంగా బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. గోల్కొండలో ప్రారంభమైన బోనాలు యావత్ రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందన్నారు. ‘‘రాజకీయాలకు అతీతంగా బోనాల జాతర జరుగుతుంది. తెలంగాణ ప్రభుత్వం బోనాలకు ప్రత్యేక నిధులు కేటాయించింది. ఢిల్లీలో కూడా బోనాలు చేసి మన సంప్రదాయాన్ని చాటి చెప్పారు. కుల మతాలకు అతీతంగా ఐక్యత తో బోనాల ఉత్సవాలు చేసుకోవాలి. ప్రశాంతంగా బోనాలు ఉత్సవాలు జరుపుకోవాలని కోరుకుంటున్నా’’ అని మంత్రి తలసాని పేర్కొన్నారు. చదవండి: నేడు,రేపు పాతబస్తీలో ట్రాఫిక్ ఆంక్షలు మాజీ క్రికెటర్ మిథాలిరాజ్, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, బీజేపీ రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్.. మహంకాళి అమ్మవారికి బోనం సమర్పించారు. పాతబస్తీతో సిటీ వ్యాప్తంగా బోనాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. డప్పు చప్పుళ్లు.. బ్యాండ్ మేళాలు.. పోతరాజుల విన్యాసాలు.. శివసత్తుల పూనకాలు.. భక్తుల భావోద్వేగాల మధ్య బోనాల జాతర ఆద్యంతం ఆధ్యాత్మిక వైభవాన్ని చాటుకుంటున్నాయి. గత నెల 22న గోల్కొండ జగదాంబ అమ్మవారికి సమర్పించిన బోనంతో ఆషాఢ మాసం బోనాల జాతర ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా ఈ నెల 7న పాతబస్తీలోని చారిత్రాత్మక పురాతన దేవాలయాల అమ్మవార్లకు కలశ స్థాపన, అభిషేకం, అలంకరణ, నైవేద్యం, తీర్థ ప్రసాదాలతో బోనాల జాతర ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 9న అమ్మవారి ఘటస్థాపన సామూహిక ఊరేగింపు కార్యక్రమాన్ని కన్నుల పండువగా నిర్వహించారు. ఘటస్థాపన అనంతరం వరుసగా ప్రతిరోజూ పూజలు నిర్వహించిన భక్తులు.. ఈ రోజు అమ్మవారికి పెద్ద ఎత్తున బోనాలు సమర్పిస్తున్నారు. సోమవారం పాతబస్తీ ప్రధాన వీధుల్లో అమ్మవారి సామూహిక ఘటాల ఊరేగింపు కన్నుల పండువగా జరగనుంది. -
Hyderabad Bonalu: నేడు,రేపు పాతబస్తీలో ట్రాఫిక్ ఆంక్షలు
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 16,17 తేదీల్లో పాతబస్తీలో నిర్వహించే బోనాల జాతర ఉత్సవాలు, సామూహిక ఘటాల ఊరేగింపు సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతాయని నగర ట్రాఫిక్ అడిషనల్ పోలీస్ కమిషనర్ ఒక ప్రకటనలో తెలిపారు. దక్షిణ మండలంలోని ఫలక్‌నుమా, చార్మినార్, మీర్‌చౌక్, బహదూర్‌పురా ట్రాఫిక్ పోలస్స్టేషన్ల పరిధిలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగనున్నందున వాహనాలను ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా మళ్లింపు ఉంటుందన్నారు. ఈ నెల 16 నుంచి 17వ తేదీ రాత్రి 11 గంటల వరకు దారి మళ్లింపులు ఉంటాయన్నారు. చదవండి: తెలంగాణ ఆర్టీసీ బంపర్ ఆఫర్ ఆషాఢ మాసం బోనాలకు భాగ్యనగరం ముస్తాబైంది. పాతబస్తీతో సిటీ వ్యాప్తంగా సంబరాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. డప్పు చప్పుళ్లు.. బ్యాండ్ మేళాలు.. పోతరాజుల విన్యాసాలు.. శివసత్తుల పూనకాలు.. భక్తుల భావోద్వేగాల మధ్య బోనాల జాతర ఆద్యంతం ఆధ్యాత్మిక వైభవాన్ని చాటుకుంటోంది. గత నెల 22న గోల్కొండ జగదాంబ అమ్మవారికి సమర్పించిన బోనంతో ఆషాఢ మాసం బోనాల జాతర ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా ఈ నెల 7న పాతబస్తీలోని చారిత్రాత్మక పురాతన దేవాలయాల అమ్మవార్లకు కలశ స్థాపన, అభిషేకం, అలంకరణ, నైవేద్యం, తీర్థ ప్రసాదాలతో బోనాల జాతర ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 9న అమ్మవారి ఘటస్థాపన సామూహిక ఊరేగింపు కార్యక్రమాన్ని కన్నుల పండువగా నిర్వహించారు. ఘటస్థాపన అనంతరం వరుసగా ప్రతిరోజూ పూజలు నిర్వహించిన భక్తులు.. నేడు అమ్మవారికి పెద్ద ఎత్తున బోనాలు సమర్పిస్తున్నారు. సోమవారం పాతబస్తీ ప్రధాన వీధుల్లో అమ్మవారి సామూహిక ఘటాల ఊరేగింపు కన్నుల పండువగా జరగనుంది. -
సింగపూర్‌లో ఘనంగా బోనాల పండగ
సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో బోనాల పండుగని శ్రీ అరసకేసరి శివన్ ఆలయంలో భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. భక్తిగీతాలు, అత్యద్భుతమైన సాంస్కృతిక ప్రదర్శనలు, డప్పు వాయిద్యాల నడుమ, అమ్మవారి నామస్మరణలతో కార్యక్రమం హోరెత్తింది. పలువురు మహిళలు కుటుంబ సభ్యులతో భక్తి శ్రద్ధలతో అమ్మవారికి బోనాలు సమర్పించారు. బోనం ఆ జగన్మాతకు ఆషాడ మాసంలో సమర్పించే నైవేద్యం. అరకేసరి దేవాలయంలో మహిళలు బోనాలు సమర్పించారు. డప్పు వాయిద్యాలు, పోతురాజు ప్రదర్శన ఆకర్షణగా నిలిచింది. పలువురు తెలుగువాళ్లు ఆ వేడుకలో పాల్గొన్నారు. కాగా ఈ సందర్భంగా సింగపూర్ తెలుగు సమాజం అధ్యక్షులు బొమ్మారెడ్డి శ్రీనివాసులు రెడ్డి అందరికీ బోనాల శుభాకాంక్షలు తెలియజేశారు. బోనాలు పండగ మన తెలుగు వారి గొప్ప సాంప్రదాయక పండగని,దీన్ని ప్రతీ సంవత్సరం జరపాలని తమ కార్యవర్గం నిర్ణయించినట్లు తెలిపారు. బోనాలు సమర్పించిన మహిళలల్ని, కార్యక్రమ నిర్వాహకులను ఆయన అభినందించారు. -
ఆస్ట్రేలియాలో ఘనంగా బోనాలు
-
ఆస్ట్రేలియాలో ఘనంగా బోనాల జాతర
మెల్బోర్న్ నగరంలో రాక్బ్యాంక్ దుర్గామాత టెంపుల్ వద్ద ఘనంగా బోనాల జాతర జరిగింది. ఈ వేడుకలు మెల్బోర్న్ తెలంగాణ బోనాలు సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో పాల్గొన్న తెలంగాణ మహిళలు అమ్మ వారికి బోనాలు, తొట్టెలు సమర్పించుకుని తమ మొక్కును చెల్లించుకున్నారు. పోతురాజుల ఆట, పాటలు, యువకుల నృత్యాలతో దుర్గా మాత ఆలయం ఒక్కసారిగా సందడిగా మారింది. బోనాల పాటలకు చేసిన నృత్యాలకు భారత దేశానికి చెందిన వివిధ రాష్ట్రాల ప్రజలు కూడా నాట్యం చేయడం ప్రత్యేక ఆకర్షణ గా నిలిచాయి. తెలంగాణలో ఎంతో ఘనంగా నిర్వహిస్తున్న ఈ వేడుకలను అదే స్థాయిలో గత పది సంవత్సరాలుగ నిర్వహిస్తున్న మెల్బోర్న్ తెలంగాణ బోనాలు సంస్థ నిర్వాహకులు తెలంగాణ మధు , రాజు వేముల , ప్రజీత్ రెడ్డి కోతి , దీపక్ గద్దెలను ఈ వేడుకలకు హాజరైన వివిధ సంఘాల నాయకులు, ప్రజలు అభినందించారు. (చదవండి: కువైట్‌లో ఘనంగా రాజన్న 74 వ జయంతి వేడుకలు) -
వైభవంగా ఉజ్జయిని మహంకాళి బోనాలు
-
వైభవంగా సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి బోనాలు..
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి బోనాలు అంగరంగా వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలి పూజల అనంతరం ఉదయం 3.30 గంటలకు ప్రభుత్వం తరఫున మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అమ్మవారికి పట్టు వస్త్రాలతోపాటు బోనం సమర్పించారు. కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. కాగా ఆదివారం తెల్లవారుజాము నుంచే మహంకాళి అమ్మవారిని దర్శించుకునేందుకు ఆలయానికి భక్తులు క్యూ కట్టారు. మహంకాళి అమ్మవారికి బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఉదయం 9.30 గంటలకు ఎమ్మెల్సీ కవిత మహంకాళి అమ్మవారికి బోనం సమర్పించనున్నారు. ఇక ఆషాఢమాస జాతరలో భాగంగా ఆదివారం బోనాలు, సోమవారం రంగం కార్యక్రమం జరగనున్నాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జీహెచ్ఎంసీ, విద్యుత్, జలమండలి, ఆర్అండ్బీ తదితర శాఖల అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా మహంకాళి దేవాలయాన్ని విద్యుద్దీపాలు, పూలు, పండ్లతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఆషాడ బోనాల సందర్భంగా సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయినీ మహాకాళి అమ్మవారికి కుటుంబసభ్యులతో కలిసి బంగారు బోనం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. #LashkarBonalu #SecunderabadBonalu #Bonalu pic.twitter.com/zf1zbzl0WY — Talasani Srinivas Yadav (@YadavTalasani) July 9, 2023 -
లండన్‌లో ఘనంగా బోనాల జాతర
లండన్: తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) ఆధ్వర్యంలో లండన్‌లో బోనాల జాతరను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు యుకే నలుమూలల నుంచి సుమారు 1200కి పైగా తెలుగు, ఇతర ప్రవాస భారతీయులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి హౌంస్లౌ నగర మేయర్ ఆఫ్ఝల్ కియానీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్వదేశంలో జరుపుకున్నట్లుగా సాంప్రదాయబద్దంగా పూజలు నిర్వహించి, లండన్ వీధుల్లో తొట్టెల ఊరేగింపు, పోతురాజు ఆటలు స్థానికులను ఆకట్టుకున్నాయి. ప్రవాస తెలంగాణ విద్యార్ధి అక్షయ్ మల్చేలం, వారి వంశ వృత్తిని మర్చిపోకుండా పోతురాజు వేషదారని ధరించి, బోనాలు ఊరేగింపులో పాల్గొని వేడుకలకు సరికొత్త శోభను తీసుకొచ్చారు. ప్రముఖ నృత్య కళాకారిణి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ గ్రహీత, రాగసుధా వింజమూరి చేసిన మహా శక్తి నృత్యం వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. విదేశాల్లో ఉన్నపటికీ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలని ప్రపంచానికి చాటి చెప్తున్న తీరు చాలా గొప్పగా ఉందని హౌంస్లౌ నగర మేయర్ ఆఫ్ఝల్ కియానీ అన్నారు. తెలంగాణ రాష్ట్ర పండుగ బోనాల వేడుకల్ని ఎంతో ఘనంగా నిర్వహించడమే కాకుండా,ముఖ్యంగా లండన్ వీధుల్లో నిర్వహించిన తొట్టెల ఊరేగింపు లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. తెలంగాణ సంస్కృతిని ప్రతి ఒక్కరికి తెలిసేలా టాక్ సంస్థ చేపడుతున్న కార్యక్రమాలు ఎందరికో ఆదర్శంగా ఉన్నాయన్నారు. అనంతరం బోనం చేసి వేడుకల్లో పాల్గొన్న మహిళలందరిని ప్రత్యేకంగా సత్కరించి బహుమతులు అందజేశారు. -
Golconda Bonalu Photos: గోల్కొండ జగదాంబిక అమ్మవారి బోనాలు (ఫొటోలు)
-
హైదరాబాద్ : వైభవంగా బల్కంపేట ఎల్లమ్మ రథోత్సవం (ఫొటోలు)
-
ఘనంగా బల్కంపేట ఎల్లమ్మ కల్యాణ మహోత్సవం (ఫొటోలు)
-
ఘనంగా లాల్ దర్వాజ బోనాల ఉత్సవం
-
బోనాలకు ఎంతో చరిత్ర ఉంది: గవర్నర్
రాంగోపాల్‌పేట్: ఆషాఢం, శ్రావణ మాసాల్లో తెలంగాణలో నిర్వహించే బోనాల పండుగకు ఎంతో చరిత్ర ఉందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. ఉజ్జయినీ మహంకాళి అమ్మవారిని సోమవారం సాయంత్రం దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ఈవో గుత్తా మనోహర్‌రెడ్డి, అర్చకులు గవర్నర్‌కు సాదర స్వాగతం పలికారు. అనంతరం ఆమె మాట్లాడుతూ కోవిడ్‌ను అరికట్టిన తర్వాత జరుపుకొంటున్న ఈ ఏడాది బోనాల పండుగకు ప్రత్యేకత ఉందన్నారు. ఉజ్జయినీ మహంకాళి దయతో ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని, ఆమె దీవెనలు తెలంగాణ ప్రజలకు ఉండాలని కోరుకున్నానని చెప్పారు. అనంతరం.. మోండా బూరుగుశెట్టిబజార్లోని లక్ష్మీనారాయణ స్వామి దేవాలయంలో ఆమె పూజలు చేశారు. ఆర్పీరోడ్‌లోని భాగ్యనగర్ గణేష్ ఉత్స వ సమితి ఏర్పాటు చేసిన వేదిక నుంచి ప్రజలకు బోనాల శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తెలుగులో మాట్లాడిన గవర్నర్ తెలుగు ప్రజలన్నా, తెలుగు భాషన్నా తనకెంతో మక్కువన్నారు. ఈ నెల 15నుంచి ఉచితంగా వేస్తున్న బూస్టర్ డోస్‌ను అందరూ వేసుకోవాలని గవర్నర్ సూచించారు. -
అమ్మవారికి బోనం సమర్పించిన కిషన్ రెడ్డి దంపతులు
-
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు
-
నగరంలో ఆధ్యాత్మిక వాతావరణం
గోల్కొండ: నగరంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొందని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ అన్నారు. ఆదివారం ఆయన గోల్కొండ కోటకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన పోలీస్ అధికారులతో కలిసి బోనాల బందోబస్తును పర్యవేక్షించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో టీఆర్ఎస్ కార్వాన్ నియోజకవర్గ ఇంచార్జ్ టి.జీవన్ సింగ్ ఆయనకు శాలువా కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... వివిధ వర్గాల పండుగలు ఒకే రోజు రావడంతో నగరంలో ఆధ్యాత్మిక వాతావరణం పరిఢవిల్లిందని ఆయన అన్నారు. వివిధ వర్గాల ప్రజలు ఒకరినొకరు అభినందించుకుంటూ స్నేహపూరితమైన వాతావరణంలో పండుగలు నిర్వహించుకుంటున్నారు. కోట బోనాలకు గతంలో ఎన్నడూ లేని విధంగా బందోబస్తును ఏర్పాటు చేశామన్నారు. ఆయన వెంట పశ్చిమ మండలం డీసీపీ జోయల్ డేవిస్, నగర అదనపు కమిషనర్ ఎ.ఆర్. శ్రీనివాస్, టీఆర్ఎస్ నాయకులు గోవింద్ రాజ్, మైత్రి కమిటీ సభ్యులు ఆబెద్, ఇలియాస్ అక్బర్, జంగయ్య తదితరులున్నారు. -
టీటా ఆధ్వర్యంలో బోనాలు
మాదాపూర్: ప్రపంచంలోనే అతిపెద్ద ఆవిష్కరణల కేంద్రమైన టీహబ్ 2లో తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే బోనాల పండుగను తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ (టీటా) ఆదివారం బోనాల ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించింది. ఈ సందర్బంగా టీటా గ్లోబల్ అధ్యక్షుడు సందీప్‌కుమార్ మక్తాల మట్లాడుతూ దేశీయ, విదేశీ పెట్టుబడులకు తెలంగాణ రాష్ట్రం కేరాఫ్ అడ్రస్‌గా నిలవాలని ఆకాంక్షిస్తూ 21 బోనాలను మాదాపూర్‌లోని చిన్నపెద్దమ్మ తల్లి దేవాలయం వద్ద సమర్పించినట్లు తెలిపారు. పోతురాజుల నృత్యాలు, తొట్టెల ఊరేగింపు, కోలాటాల మధ్య బోనాలను అమ్మవారికి సమర్పించినట్టు తెలిపారు. టీహబ్2 నుండి సైబర్ వద్ద ఉన్న దేవాలయం వరకు వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ శాంతతౌటం, టీహబ్ చైర్మన్ శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
గోల్కొండ కోటలో బోనాల సందడి (ఫొటోలు)
-
బోనాల సందడి షురూ
సాక్షి,చార్మినార్(హైదరాబాద్): హైదరాబాద్ నగరంలో ఆషాఢ మాస బోనాల ఉత్సవాల సందడి మొదలైంది. ఈసారి జరిగే బోనాల జాతర ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన బోనాల జాతర నిర్వాహణ,ఏర్పాట్లపై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బోనాల జాతర ఉత్సవాల కోసం ప్రభుత్వం రూ.15 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. అంతేకాకుండా సికింద్రాబాద్ ఉజ్జయినీ మహాంకాళి అమ్మవారి బోనాల జాతర ఉత్సవాల ఏర్పాట్లపై కూడా మంత్రి తలసాని సమావేశం నిర్వహించారు. ఇక పాతబస్తీలో ఈసారి బోనాల పండుగను ఘనంగా నిర్వహించడానికి భాగ్యనగర్ శ్రీ మహంకాళి జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ ఇప్పటికే సర్వసభ్య సమావేశం నిర్వహించింది. ఈఏడాది బోనాల జాతర ఉత్సవాలను కన్నుల పండువగా నిర్వహించడానికి తగిన ఏర్పాట్లు చేస్తున్నామని కమిటి చైర్మన్ రాకేశ్ తివారి తెలిపారు. ఉత్సవాలు ఈనెల 30వ తేదీన గోల్కొండ అమ్మవారి బోనాలతో ప్రారంభమవుతున్నాయి. ఇతర రాష్ట్రాల కళాకారులకు ఉపాధి.. బోనాల జాతర ఉత్సవాల్లో కళాకారుల నృత్య ప్రదర్శనలు హైలెట్‌గా నిలుస్తాయి. తెలంగాణ రాష్ట్రంలో జరిగే బోనాల జాతర ఉత్సవాల్లో ఆంధ్రప్రదేశ్‌తో పాటు కేరళ, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన కళాకారులు ఎక్కువగా పాల్గొంటారు. నగరంలో బోనాల ఉత్సవాల్లో కళాకారులు, వినూత్న తరహా సెట్టింగ్స్ కోసం నిర్వాహకులు పెద్ద ఎత్తున ఖర్చు చేస్తారు. ప్రస్తుతం కళాకారుల నృత్య ప్రదర్శనలకు ఆర్డర్లు ఇస్తున్నారు. రెండు నెలలకు ముందుగానే అడ్వాన్స్‌లు చెల్లిస్తున్నారు. మంత్రముగ్ధుల్ని చేసే కళాకారుల నృత్యాలు.. బోనాల ఉత్సవాల సందర్భంగా నిర్వహించే అమ్మవారి ఘటాల ఊరేగింపులో కళాకారులు ప్రదర్శించే వివిధ రకాల నృత్యాలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటాయి. వివిధ నృత్య భంగిమల్లో వారు ప్రదర్శించే హావభావాలు దారి పొడవునా ప్రజలను మంత్ర ముగ్ధుల్ని చేస్తాయి. అమ్మవారి ఘటాల ఊరేగింపులో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల కళాకారులే కాకుండా కేరళ, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన పలువురు కళాకారులు పాల్గొని భక్తులను ఉత్తేజ పరుస్తారు. ఘటాల సామూహిక ఊరేగింపు.. బోనాల సమర్పణ మరుసటి రోజు పాతబస్తీలోని దేవాలయాల నుంచి అమ్మవారి ఘటాలతో సామూహిక ఊరేగింపు నిర్వహిస్తారు. అంగరంగ వైభవంగా నిర్వహించే ఈ ఊరేగింపు ఉప్పుగూడ, బేలా, గౌలిపురా, శాలిబండ, కోట్ల అలీజా, మీరాలంమండి, కసరట్ట తదితర ప్రాంతాల నుంచి చార్మినార్ ద్వారా నయా పూల్‌లోని మూసీ వరకు కొనసాగుతుంది. ఆకట్టుకునే నృత్యాలు.. బోనాల ఉరేగింపు కేరళ పులికళి, భేరీ నృత్యం, గరిగెలు, బేతాళ నృత్యం, ఒగ్గోళ్ల నృత్యం, బోనాలు, కాళికాదేవి, లక్ష్మీదేవి, వెంకటేశ్వర స్వామి, పొట్టి పోతరాజులు, సింహరథం, డప్పులోళ్లు, హనుమంతునిలో రాముడు, తయ్యం, దేవ నృత్యం, ఉరుములు, కొమ్ముకొయ్య, జడల కోలాటం తదితర కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటాయి. చదవండి: జూబ్లీహిల్స్ సామూహిక అత్యాచారం: దారుణాలకు ఆ వాహనాలే కారణమా? -
పెద్దింట్లమ్మ బోనాలకు సర్వసన్నద్ధం
కైకలూరు: తెలంగాణ బోనాల సంప్రదాయం కొల్లేరు సరస్సుకు ప్రవహిస్తోంది. కృష్ణా జిల్లా కొల్లేటికోట పెద్దింట్లమ్మ జాతరలో రెండేళ్ల క్రితం ప్రారంభమైన బోనాల సమర్పణకు ఏటా మహిళా భక్తులు పెరుగుతున్నారు. ఈ ఏడాది నుంచి కొల్లేరు సరస్సులో సహజ సిద్ధంగా లభించే కలువ పువ్వులతో బోనాలు సమర్పించాలని పెద్దలు నిర్ణయించారు. మార్చి 3 నుంచి 18వ తేదీ వరకు వేడుకగా జరిగే ఈ జాతరకు కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల కొల్లేరు పరీవాహక ప్రాంత గ్రామాల భక్తులు పెద్ద ఎత్తున విచ్చేస్తున్నారు. బోనాలకు సంబంధించిన సామగ్రిని ఇప్పటి నుంచే గ్రామస్తులు సిద్ధం చేస్తున్నారు. నీటి మధ్యలో ద్వీపకల్పం పద్మాసన భంగిమలో ఆశీనులైన పెద్దింట్లమ్మ తల్లి.. వేంగిరాజుల కాలంలో నిర్మించిన పురాతన దేవాలయం.. కొల్లేటి గ్రామాల ప్రజలకు ఆరాధ్యదైవం. దేవాలయంలో అనేక విశేషాలున్నాయి. అమ్మకు ఏటా జాతర (తీర్థం) నిర్వహిస్తారు. ఆ సమయంలో కొల్లేటికోట పెద్ద జనారణ్యంగా మారుతుంది. జాతరలో ప్రధాన ఘట్టమైన జలదుర్గాగోకర్ణేశ్వరస్వామి కల్యాణం రోజున ప్రభల ఊరేగింపు, బోనాల సమర్పణ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. బోనాల సమయంలో అమ్మవారి రూపాలు బోనం ఇలా సమర్పిస్తారు.. భోజనం అని అర్థం కలిగిన బోనం దేవికి సమర్పించే నైవేద్యం. తెలంగాణలో ఉజ్జయిని మహంకాళి, మైసమ్మ, పోచమ్మ, పెద్దమ్మ, మారెమ్మలకు జూలై నెలలో బోనాలు సమర్పిస్తారు. అదే విధంగా 2020 నుంచి కొల్లేటికోట పెద్దింట్లమ్మకు బోనాలు సమర్పిస్తున్నారు. మొదటి ఏడాది 60 మంది బోనాలు సమర్పిస్తే, రెండో ఏడాది ఆ సంఖ్య 200కు చేరింది. మహిళలు మూడు మట్టి కుండలను ఒకదానిపై ఒకటి ఉంచి వాటిలో పానకం, పిండి వంట, వడపప్పు, చలివిడి నింపి చివర కుండపై నెయ్యితో నిండిన దీపాన్ని ఉంచుతారు. బోనాలకు ముందు వరసలో 7 కావిళ్లలో పసుపు, కుంకుమ, నెయ్యి, వేప రొట్టలు, నిమ్మకాయలు, పానకం, కల్లు, అమ్మవారి ప్రతిరూపాలుగా భక్తులు మోసుకెళ్తారు. అమ్మకు ఇష్టం కలువ బోనాలు.. ఈ ఏడాది నుంచి కొల్లేరు సరస్సులో లభించే కలువ పువ్వుల బోనాలను సమర్పించాలని నిర్ణయించారు. అమ్మవారి దేవస్థానానికి 2 కిలోమీటర్ల దూరంలోని పందిరిపల్లిగూడెం నుంచి ప్రభల ఊరేగింపుతో పాటు బోనాలను ఎత్తుకుని మహిళలు ప్రారంభమవుతారు. పూర్వం అమ్మవారికి కొల్లేరు సరస్సులో లభించే కలువ పువ్వులతో పూజలు చేసేవారు. పెద్దింట్లమ్మకు ఈ పువ్వులంటే ఇష్టమని భక్తులు భావిస్తారు. దేవాలయం మరింత అభివృద్ధి కొల్లేరు మధ్యలో ఉన్న పెద్దింట్లమ్మ దేవాలయం వద్ద దేవదాయ శాఖ, ఎమ్మెల్యే డీఎన్నార్ కృషితో అభివృద్థి కార్యక్రమాలు చేపడుతున్నాం. మార్చి 15న జల దుర్గాగోకర్ణేశ్వర స్వామి కల్యాణం, 18న తెప్పోత్సవం నిర్వహిస్తాం. మహిళా భక్తులు ఏటేటా పెరుగుతుండటం శుభపరిణామం. – కె.వి.గోపాలరావు, పెద్దింట్లమ్మ దేవస్థానం ఈవో -
అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన ఇంద్రకరణ్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: పాతబస్తీలో బోనాల సందడి ప్రారంభమైంది. 113వ లాల్‌దర్వాజ సింహవాహిని అమ్మవారి వార్షికోత్సవ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆషాడం బోనాల ఉత్సవాలు చివరి అంకానికి చేరుకున్నాయి. లాల్‌దర్వాజ సింహవాహిని అమ్మవారి దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. భక్తుల దర్శనార్థం రెండు లైన్ల ఏర్పాటు చేశారు. బోనాలు తీసుకువచ్చే మహిళలకు ప్రత్యేక క్యూలైన్ ఏర్పాటు చేశారు. లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారికి దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆషాడ మాస బోనలు ఘనంగా జరుగుతున్నాయని, నేడు లాల్ దర్వాజ బోనాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయని తెలిపారు. సోమవారం రంగం కార్యక్రమంతో పాటు, ఊరేగింపు కార్యక్రమం ఉంటుందని చెప్పారు. ఉమ్మడి దేవాలయాల కమిటీ ఆధ్వర్యంలో లాల్ దర్వాజ బోనాలు జరుగుతున్నాయని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత బోనాల పండగను ప్రభుత్వం అధికారికంగా గుర్తించిందని పేర్కొన్నారు. ప్రభుత్వమే బోనాలకు ప్రత్యేక నిధులు కేటాయిస్తుందని చెప్పారు. ప్రభుత్వం తరుపున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించామని, కరోనను పారద్రోలి అందరూ సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని మొక్కుకున్నట్లు తెలిపారు. ఈసారి కురిసిన మంచి వర్షాలకు కృష్ణ, గోదావరి నదులపై ఉన్న ప్రాజెక్టులు నిండిపోయాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, హోంమంత్రి మహమూద్ అలీ పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ భక్తులు దర్శనము చేసుకోవాలని ఆలయ నిర్వాహకులు సూచిస్తున్నారు. ఆలయం వద్ద పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారికి బీజేపీ నేత విజయశాంతి బోనం సమర్పించి, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఏడేళ్ల క్రితం బంగారు బోనం ఎత్తుకుంటానన్న మొక్కును బోనం సమర్పించి తీర్చుకున్నట్లు తెలిపారు. కరోన తగ్గాలని, అందరిని కాపాడాలని అమ్మవారిని కోరుకున్నట్లు చెప్పారు. మంచి పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని, రాబోయే ఎన్నికల్లో బీజేపీని అధికారంలోకి తీసుకువస్తే బంగారు బోనం సమర్పిస్తా అని మొక్కుకున్నట్లు తెలిపారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి దర్శించుకున్నారు. ఆనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాస్వామ్య తెలంగాణ రావాలని విజయశాంతి మొక్కుకున్నారని చెప్పారు. అమ్మవారు చాలా శక్తి వంతమైనవారని ఎక్కడ చూసిన పండగ వాతావరణం కనిపిస్తోందని పేర్కొన్నారు.కరోనా మహమ్మరిని నుంచి దేశ ప్రజలను కాపాడాలని అమ్మవారిని కోరుకున్నానని తెలిపారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి లాల్ దర్వాజ సింహవాహిని అమ్మవారి దర్శించుకొని, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. లాల్ దర్వాజ బోనాలకు విచ్చేసిన అందరికి ధన్యవాదాలు తెలిపారు. తను హైదరాబాద్‌లోనే డాక్టర్‌గా పని చేశానని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ అధికార ప్రతినిధిగా ఇక్కడికి వచ్చినట్లు తెలిపారు. కరోనా మహమ్మారి నుంచి మనమంతా బయటపడాలని అమ్మవారికి పట్టు వస్త్రాలు, బంగారు బోనం సమర్పించినట్లు పేర్కొన్నారు. -
హైదరాబాద్ అంతా ఒకే రోజు బోనాల ఉత్సవం
సాక్షి, సిటీబ్యూరో(హైదరాబాద్): భాగ్యనగరమంతా ఆదివారం బోనమెత్తనుంది. గ్రేటర్ హైదరాబాద్‌లోని అమ్మవారి ఆలయాలను సర్వాంగసుందరంగా ముస్తాబు చేశారు. సాధారణంగా గోల్కొండ, సికింద్రాబాద్ బోనాల అనంతరం పాతబస్తీతో పాటు కొన్ని చోట్ల బోనాలు నిర్వహిస్తారు. నగరంలోని ఇతర ప్రాంతాల్లో చాలా వరకు శ్రావణమాసంలో బోనాల వేడుకలు జరుగుతాయి. పైగా ఒక్కో ఆదివారం ఒక్కో ప్రాంతంలో వేడుకలను నిర్వహిస్తారు. కానీ ఈ ఆదివారం మొదటిసారి హైదరాబాద్ అంతా ఒకే రోజు బోనాల ఉత్సవం నిర్వహించడం గమనార్హం. లాల్‌దర్వాజ సింహవాహిని అమ్మవారి జాతరతో పాటు మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో అన్ని చోట్లా వేడుకలు జరగనున్నాయి. బోనాల ఉత్సవాలకు పాతబస్తీలో నాటుకోళ్ల విక్రయాలు ఎందుకంటే.. ఆషాఢమాసం బోనాల అనంతరం శ్రావణమాసంలో వచ్చే మొదటి ఆదివారం నగరంలోని మిగతా చోట్ల పండుగ చేస్తారు. పైగా ఒక్కో ఆదివారం ఒక్కో ప్రాంతంలో స్థానిక నమ్మకాలకు అనుగుణంగా ఈ వేడుకలు ఉంటాయి. కానీ శ్రావణమాసంలో వచ్చే ఆదివారం ఆగస్టు 8న అమావాస్య, ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం కావడంతో ముందస్తుగానే బోనాల పండగ నిర్వహించనున్నారు. -
గోల్కొండ కోటలో బోనాల సందడి
-
ఢిల్లీలో ఘనంగా బోనాల ఉత్సవాలు; హాజరైన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
ఢిల్లీ: ఢిల్లీలోని తెలంగాణ భవన్లో లాల్‌దర్వాజ సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలు బుధవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కేంద్ర పర్యాటక, సాంస్కృతిక మంత్రి కిషన్‌రెడ్డి ఉత్సవాలకు హాజరై అమ్మవారికి పట్టువస్రాలు సమర్పించారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఢిల్లీలో బోనాల ఉత్సవాలు నిర్వహించారు. కాగా ఏడు సంవత్సరాలుగా ఢిల్లీలోని తెలంగాణ భవన్లో మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలను ఆలయ కమిటీ నిర్వహిస్తూ వస్తుంది. బోనాలు పండుగను కేంద్ర ప్రభుత్వ ప్రముఖ పండుగల జాబితాలో చేర్చేలా కృషి చేస్తాను. కరోనా మహమ్మారి నుంచి విముక్తి లభించాలని, కరోనాపై పోరులో ప్రతి ఒక్కరూ ఐక్యంగా ఉండాలని అమ్మవారిని ప్రార్ధిస్తున్నాను అంటూ పేర్కొన్నారు. -
బోనం ఎత్తుదాం.. నేటి నుంచి మహా సంబురం
సాక్షి, సిటీబ్యూరో/చార్మినార్/లంగర్‌హౌస్: ‘అమ్మా బైలెల్లినాదో...నాయనా తల్లీ బైలెల్లినాదో...’ ప్రతి ఆషాఢ మాసం ఆదివారం రోజున భాగ్యనగరాన్ని పులకింపజేసే మహాద్భుత గానమది. ఆ పాటతో నగరం ఆధ్యాత్మిక కాంతులను అద్దుకుంటుంది. భక్తులు పరవశించిపోతారు. నాలుగు శతాబ్దాలుగా నగరంలోని అన్ని వర్గాలను, విభిన్న సంస్కృతులను ఏకం చేసే మహోన్నత చారిత్రక, సాంస్కృతిక, సామూహిక ఉత్సవం బోనాల పండుగకు నగరం మరోసారి సర్వసన్నద్ధమైంది. ఆదివారం ఆరంభం కానున్న గోల్కొండ శ్రీజగదాంబిక మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. గతేడాది కోవిడ్ కారణంగా నిరాడంబరంగా జరిగిన వేడుకలను ఈసారి ఘనంగా నిర్వహించనున్నారు. తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబించే బోనాల ఉత్సవాలకు చారిత్రాత్మక గోల్కొండ కోట సన్నద్ధమైంది. అలాగే ఉజ్జయిని మహంకాళి ఘటోత్సవం కూడా ఆదివారమేప్రారంభమవుతుంది. ఎంతో వైభవంగా జరిగే గోల్కొండ బోనాల ఉత్సవాలతోనే నగరంలో వేడుకలు ప్రారంభమవుతాయి. ప్రతి ఘట్టం భక్తి పూరితంగా, భావోద్వేగభరితంగా ఉంటుంది. కోటపై కొలువు దీరిన అమ్మవారిని చోటాబజార్‌లోని ఆలయ పూజారి ఇంటికి తీసుకెళ్లి అక్కడ అమ్మవారిని అలంకరించుకొని భారీ ఊరేగింపు నడుమ ఆదివారం కోటపైకి తీసుకెళ్లి ప్రతిష్టిస్తారు. పోతరాజుల నృత్యాలు, బ్యాండు మేళాలు, భక్తకోటి కోలాహలం, తొట్టెల ఊరేగింపు కన్నుల పండువగా సాగిపోతాయి. కోట పైకి అమ్మవారి ఊరేగింపు కాలినడకన చేరుకోవడంతో కోట మొత్తం పెద్ద జాతరనే తలపిస్తుంది. సువిశాలమైన గోల్కొండ కోట భక్తులతో నిండి కిటకిటలాడుతుంది. నగీనాబాగ్ నుంచి భక్త రామదాసు బందీఖానా మీదుగా అమ్మవార్ల ఆలయానికి మెట్లపై వెళ్లే మార్గంలో బారులు తీరిన భక్తులను చూసేందుకు రెండు కళ్లు చాలవు. నజర్ బోనం..భారీ తొట్టెలు మొదటి పూజలో అమ్మవారికి మొదటి నజర్ బోనం సమర్పించనున్నారు. 32 అడుగుల ఎత్తైన భారీ తొట్టెలను కూడా మొదటి పూజలో సమర్పించనున్నారు. నేడు లంగర్‌హౌస్ చౌరస్తా నుండి ఊరేగింపుతో గోల్కొండ కోటకు నజర్ బోనం, తొట్టెల తీసుకెళ్లనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రారంభమయ్యే ఊరేగింపు రాత్రి 8 గంటలకు కోటపై ఉన్న అమ్మవారి ఆలయానికి చేరుకోనుంది. ప్రభుత్వం తరుపున పట్టు వస్త్రాల సమర్పణ లంగర్‌హౌస్‌లో ప్రారంభమ్యే ఊరేగింపులో మంత్రులు, ప్రముఖులు పాల్గొననున్నారు. ప్రభుత్వం తరుపున అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పిస్తారు. చోటాబజార్‌లోని ప్రధాన పూజారి ఇంట్లో పూజలు నిర్వహించి అక్కడి నుండి బోనాలతో అమ్మవారిని పల్లకిలో ఊరేగించి కోటపై కొలువుదీరిన అమ్మవారి ఆలయంలో ప్రతిష్టించడంతో మొదటి పూజ ముగియనుంది. చోటాబజార్‌లోని ప్రధాన పూజారి ఇంట్లో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అక్కడి నుండి అమ్మవారిని, నగలతో పాటు పల్లకిలో ఊరేగింపుగా కోటపైకి తీసుకెళతారు. అమ్మవారిని నగలతో అలంకరించి, తొలిబోనం సమర్పిస్తారు. సామూహిక బోనాల సమర్పణ.. మొదటి బోనం తరువాత భక్తులు లక్షల సంఖ్యలో తరలివచ్చి అమ్మవారికి బోనాలు సమర్పించే రోజుకు మరో ప్రత్యేకత ఉంది. ఈ నెల 18 న సామూహిక బోనాల ఊరేగింపు నిర్వహించను న్నారు. నగరంలోని ప్రధాన దేవాలయాలైన సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి, మీరాలం మండి అమ్మవారు, లాల్ దర్వాజ అమ్మవార్లతో పాటు వి విధ దేవాలయాల నుండి దాదాపు 100కు పైగా తొ ట్టెల సామూహిక ఊరేగింపు నిర్వహించనున్నారు. తొలి బోనం విశిష్టత.. లంగర్‌హౌస్ ప్రాంతాన్ని గతంలో లంగర్ఖానా అనేవారు. ఆ రోజుల్లో ఇక్కడ వంట గదులు ఉండేవి. ఆహార ధాన్యాలను ఇక్కడి బాండాగారాల్లో దాచి పెట్టి రాజులకు, సైనికులకు లంగర్హౌస్లోనే భోజనాలు సిద్ధం చేసి పంపించేవారు. అమ్మవారి నైవేద్యాన్ని కూడా ఇక్కడి నుండే వండి పంపించడంతో బోనాలను లంగర్హౌస్వాసులు నిర్వహించే ఆనవాయితీ కొనసాగుతోంది. ఎలాంటి లోటు లేకుండా ఏర్పాట్లు గతంలో బోనాల ఉత్సవాలు నిర్వహించిన అనుభవంతో మాకు తలెత్తిన సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లాం. అందరు కుల వృత్తుల వారికి ప్రాధాన్యతను ఇస్తూ వారి చేతుల మీదుగా బోనాలు నిర్వహించనున్నాం. శానిటైజర్‌తో పాటు, మాస్కులు అందుబాటులో ఉంచాం. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా దర్శనం కోసం వరుసలు, మంచి నీరు, టాయిలెట్లు కూడా కోట కింద నుండి పైన వరకు వివిధ మార్గాల్లో అందుబాటులో ఉంచాం. – కోయల్కర్ గోవింద్రాజ్, ఆలయ అభివృద్ధి కమిటీ ప్రధాన సభ్యులు హిందూ ముస్లింల ఐక్యతకు ప్రతీక.. తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే బోనాల ఉత్సవాలు లంగర్‌హౌస్, గోల్కొండలో ప్రారంభమై ముగియడం ఒక ప్రత్యేకత. ఇక్కడ జరిగే బోనాల ఉత్సవాలకు మరో ప్రత్యేకత ఉంది. ఎక్కడ లేని విధంగా గోల్కొండ బోనాల ఉత్సవాల్లో అత్యధిక శాతం ముస్లిం సోదరులు, సోదరీమణులు పాల్గొని సేవలు అందిస్తూ వారి చేతుల మీదుగా బోనాలను వైభవంగా నిర్వహిస్తూ వారి లౌకిక, ఐక్యతా భావాన్ని చాటుకుంటున్నారు. దారి పొడవున బోనాల ఊరేగింపులకు స్వాగత వేదికలు ఏర్పాటు చేస్తున్నారు. ఏ రోజు.. ఏమిటి? నేడు గోల్కొండ జగదాంబిక అమ్మవారి బోనాలు ప్రారంభం గోల్కొండ బోనాలు.. తొమ్మిది పూజలు ► మొదటి పూజ– 11వ తేదీ ఆదివారం ► రెండవ పూజ–15న గురువారం ► మూడవ పూజ–18న ఆదివారం ► నాల్గవ పూజ– 22న గురువారం ► ఐదవ పూజ–25న ఆదివారం ► ఆరవ పూజ–29న గురువారం ► ఏడవ పూజ–1 ఆగస్టు ఆదివారం ► ఎనిమిదవ పూజ–5 ఆగస్టు గురువారం ► తొమ్మిదవ చివరి పూజ–8 ఆగస్టు ఆదివారం ఈ వేడుకలతో బోనాలు ముగుస్తాయి. ► నేడు సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఘటాల ఎదుర్కోలు వేడుకలు ► 12వ తేదీ నుంచి 23వ తేదీ వరకు అమ్మవారి ఘటం ఒక్కో రోజు ఒక ప్రాంతంలో తిరుగుతుంది. ఇంటింటికి వెళ్లి భక్తుల పూజలు అందుకుంటుంది. ► 23వ తేదీ బోయిగూడ ప్రాంతానికి వెళ్లి 24వ తేదీ రాత్రి 7గంటలకు దేవాలయానికి తిరిగి వస్తుంది. ► 25న సికింద్రాబాద్ ఉజ్జయినీ మహాంకాళి అమ్మవారికి బోనాల సమర్పణ కార్యక్రమాలుంటాయి. ► 26వ తేదీన రంగం కార్యక్రమం. ► పాతబస్తీలో ఈ నెల 23న కలశ స్థాపనతో బోనాల జాతర ఉత్సవాలు ప్రారంభం. ► 25న పాతబస్తీలో ఘట స్థాపన ఊరేగింపు, ఆగస్టు 1న బోనాల సమర్పణ. 2న పాతబస్తీలో అమ్మవారి ఘటాల సామూహిక ఊరేగింపు. ► ఆగస్టు 3వ తేదీన అమ్మవారికి సమర్పించే మారు బోనంతో ఈసారి బోనాల జాతర ఉత్సవాలు ముగుస్తాయి. తొమ్మిది రోజులు.. తొమ్మిది పూజలు ఆషాఢ మాసంలో మొత్తం తొమ్మిది పూజలు అందుకునే అమ్మవార్లకు తెలంగాణ నలుమూలల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు వచ్చి మొక్కులు తీర్చుకుంటారు. చల్లగా చూడు తల్లీ అంటూ.. మహిళలు సంప్రదాయ దుస్తుల్లో నెత్తిన బోనంతో కోటపైన కొలువుదీరిన అమ్మవారిని కాలినడకన వచ్చి దర్శించుకుంటారు. ప్రత్యేకంగా అలంకరించిన తొట్టెలను ఊరేగింపుగా తెచ్చి అమ్మవారికి సమర్పిస్తారు. ఈ ఉత్సవాల నిర్వహణలో 27 కుల వృత్తుల వారు అమ్మవారికి వివిధ రకాల సేవలు అందిస్తారు. అమ్మవారి అలంకరణ, పూజ నిర్వహణ ఏర్పాట్లు మొత్తం శతాబ్దాలుగా కులవృత్తుల వారే నిర్వహిస్తూ వస్తున్నారు. మొదటి పూజ ఆదివారం మొదలై 9వ పూజ ఆగస్టు 8వ తేదీ ఆదివారంతో ఈ వేడుకలు ముగియనున్నాయి. పాతబస్తీ నుంచి బంగారు బోనం.. మొదటి బోనంతో పాటు పాతబస్తీ నుంచి భక్తులు బంగారు పాత్రలో బోనంతోపాటు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. భాగ్యనగర్ శ్రీ మహాంకాళి జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ ఆధ్వర్యంలో గోల్కొండ అమ్మవారి దేవాలయానికి చేరుకుని బంగారు బోనంతో పాటు పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. లంగర్‌హౌజ్ చౌరస్తా వద్ద బంగారు బోనానికి మంత్రులు స్వాగతం పలికి దీపం వెలిగించి పూజలు నిర్వహిస్తారు. సప్త మాత్రుకల సప్త బంగారు బోనం కార్యక్రమంలో భాగంగా ఆదివారం ఉదయం 9 గంటలకు లాల్‌దర్వాజ సింహవాహిని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భాజా భజంత్రీలతో పోతురాజుల వీరంగంతో బంగారు బోనం తీసుకుని గోల్కొండ జగదాంబ అమ్మవారి దేవాలయానికి చేరుకుంటారు. -
నిరాడంబరంగా బోనాల పండుగ
సింగపూర్: కోవిడ్–19 కారణంగా సింగపూర్ నగరంలో తెలంగాణ కల్చరల్ సొసైటీ సింగపూర్(టీసీఎస్ఎస్) ఆధ్వరంలో బోనాల ఉత్సవాలు నిరాండంబరంగా జరిగాయి. సుంగేకేడుట్లోని అరసకేసరి శివన్ దేవాలయంలో సింగపూర్ ప్రభుత్వం, ఆలయ నిబంధనలకు అనుగుణంగా భౌతిక దూరం పాటిస్తూ భక్తి శ్రద్ధలతో బోనాలు సమర్పించారు. సమస్త ప్రజలపై ఆ మహంకాళి తల్లి ఆశీస్సులు ఉండాలని, ప్రపంచాన్ని కరోనా కోరల నుండి కాపాడాలని ప్రత్యేక పూజలు చేసినట్టు సభ్యులు తెలిపారు. ఏటా జరిగే ఈ ఉత్సవాల్లో సుమారు 1000 మంది భక్తులు పాల్గొనేవారు. సంస్థకు చెందిన గర్రెపల్లి కస్తూరి శ్రీనివాస్, గొనే రజిత నరేందర్ రెడ్డి, గడప స్వాతి రమేశ్, బండ శ్రీదేవి మాధవ రెడ్డి దంపతులు బోనాలు సమర్పించారు. సొసైటీ తరపున అధ్యక్షుడు నీలం మహేందర్, ప్రధాన కార్యదర్శి బసిక ప్రశాంత్ రెడ్డి, ఉపాధ్యక్షులు గడప రమేశ్, గర్రేపల్లి శ్రీనివాస్, కోశాధికారి నల్ల భాస్కర్ గుప్త, కార్యనిర్వాహక సభ్యులు ప్రవీణ్ కుమార్ చేన్నోజ్వాల, ప్రాంతీయ కార్యదర్శులు దుర్గ ప్రసాద్, గార్లపాటి లక్ష్మారెడ్డి, గోనె నరేందర్, గింజల సురేందర్ రెడ్డి ఇతర సభ్యులు నంగునూరి వెంకట్ రమణ, పెరుకు శివ రామ్ ప్రసాద్, అనుపురం శ్రీనివాస్, కల్వ లక్ష్మణ్ రాజు, బొండుగుల రాము, జూలూరి సంతోష్ కుమార్, నడికట్ల భాస్కర్, రోజారమణి బొడ్ల, కొల్లూరి శ్రీధర్, కరుణాకర్ గుత్తికొండ, ఆవుల శివ ప్రసాద్ తదితరులు అందరిపై ఉజ్జయనీ మహంకాళి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. -
వైభవంగా బోనాల ఉత్సవాలు
-
ఆషాఢ మాసం.. అమ్మకు బోనం..
-
26 నుంచి ఆషాఢ బోనాలు ప్రారంభం
సాక్షి, యాకుత్‌పురా : ఆషాఢ మాసం బోనాల ఉత్సవాలను కోవిడ్ నిబంధనలు పాటిస్తూ యథావిధిగా ఈ నెల 26వ తేదీ నుంచి ప్రారంభిస్తున్నామని హరిబౌలి శ్రీ అక్కన్న మాదన్న మహంకాళి దేవాలయం కమిటీ అధ్యక్షుడు జి.రాజారత్నం తెలిపారు. ఆలయ 72వ వార్షిక బోనాల నేపథ్యంలో సోమవారం ఆలయ ప్రార్థనా మందిరంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... చారిత్రాత్మకమైన ఈ దేవాలయాన్ని 77 రోజుల లాక్డౌన్ అనంతరం సోమవారం తెరిచామన్నారు. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా భౌతిక దూరాన్ని పాటిస్తూ అమ్మవారిని దర్శించుకునేందుకు వీలు కల్పించామన్నారు. బోనాల పండగ నిర్వహించే 11 రోజులు అన్ని పూజలు నిర్వహించి కరోనా మహమ్మారి నుంచి ప్రజలను రక్షించమని వేడుకుంటామన్నారు. ఈ నెల 26 నుంచి ఐదు శుక్రవారాల పాటు బోనాల వేడుకలు నిర్వహించనున్నామన్నారు. కుంకుమార్చనను ఈ నెల 26న, జూలై 3, 10, 17, 24వ తేదీలతో నిర్వహిస్తామన్నారు. జూలై 10న అమ్మవారి కలశ స్థాపన, మహాభిషేకం నిర్వహించి ధ్వజారోహణతో 11 రోజుల పాటు నిర్వహించే బోనాల జాతరను ప్రారంభిస్తామన్నారు. జూలై 11 నుంచి 18వ తేదీ వరకు అమ్మవారికి వివిధ పూజలు, 19న బోనాల పండగ సందర్భంగా అమ్మవారికి బోనాల సమర్పణ, శాంతి కల్యాణం నిర్వహిస్తామన్నారు. 20న పోతురాజుల స్వాగతం, రంగం, భవిష్యవాణి నిర్వహించి మధ్యాహ్నం 3 గంటలకు అమ్మవారి ఘటాన్ని ఏనుగు అంబారీపై ఊరేగింపు నిర్వహిస్తామన్నారు. ప్రస్తుతం పరిస్థితుల దృష్ట్యా బోనాల పండగ రోజున జిల్లాల నుంచి భక్తులు రావొద్దని విజ్ఞప్తి చేశారు. జూలై 10 నుంచి 17వ తేదీ వరకు భౌతిక దురాన్ని పాటిస్తూ అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులకు వీలు కల్పిస్తున్నామన్నారు. బోనాల ఉత్సవాలకు ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరించాలని... ఇప్పటికే రాష్ట్ర మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, అటవీ, పర్యావరణ శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ రజత్ కుమార్, ఫారెస్ట్ కన్జర్వేటర్ శోభ, దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్‌లకు విజ్ఞప్తి పత్రాలను అందజేశామన్నారు. ఆలయ కమిటీ కార్యదర్శి కె.దత్తాత్రేయ, కోశాధికారి ఎ.సతీష్, సంయుక్త కార్యదర్శి చేతన్ సూరి, కార్య నిర్వాహక కార్యదర్శి ఎస్.పి.క్రాంతి కుమార్, సభ్యులు ఎం.వినోద్, ఎం.ముఖేశ్‌లు పాల్గొన్నారు. -
బోనమెత్తిన భాగ్యనగరం
సాక్షి, హైదరాబాద్ : భాగ్యనగరం బోనమెత్తింది. బోనాల ఉత్సవాల్లో భాగంగా లంగర్‌హౌస్‌లో తొట్టెల ఊరేగింపును రాష్ట్ర మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇంద్రకరణ్‌రెడ్డి ప్రారంభించారు. గోల్కొండ కోటపై కొలువుదీరిన శ్రీ జగదాంబిక అమ్మవారు తొలి పూజ అందుకున్నారు. మంత్రులు అమ్మవారికి బంగారు, వెండి బోనాలు, పట్టు వస్త్రాలు సమర్పించారు. అమ్మవారికి పెద్ద ఎత్తున భక్తులు పూజలు చేస్తున్నారు. మహిళల ప్రత్యేక పూజలు, పోతురాజుల విన్యాసాలు, ఘటాల ఊరేగింపుతో నగరంలో సందడి వాతావరణం నెలకొంది. చారిత్రక ఉత్సవంగా పేరొందిన బోనాల పండగను వైభవంగా నిర్వహించేందుకు అటు ప్రభుత్వం..ఇటు ఆయా ఆలయాల కమిటీలు ఘనంగా ఏర్పాట్లు చేశాయి. గోల్కొండలో నెలరోజులపాటు ప్రతి గురు, ఆదివారాల్లో జగదాంబిక అమ్మవారు 9 పూజలు అందుకోనున్నారు. ఈ సందర్భంగా ఇంద్రకరణ్‌రెడ్డి మాట్లాడుతూ.. బోనాల సందర్భంగా 2,845 దేవాలయాలకు ప్రభుత్వం తరఫున 15 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్టు తెలిపారు. గోల్కొండ దేవాలయానికి 10 లక్షల రూపాయలు కేటాయించామన్నారు. 2 వేల మంది పోలీసులు బందోబస్తులో ఉన్నారని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురవాలని, పంటలు బాగా పడాలని, అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని అన్నారు. -
బోనమెత్తిన పల్లెలు
స్టేషన్‌ఘన్‌పూర్ : జనగామ జిల్లాలోని పలు ప్రాంతా ల్లో బుధవారం పోచమ్మ, పెద్దమ్మ తల్లి బోనాలను ఘనంగా నిర్వహించారు. పోచమ్మ తల్లి గుడి వద్ద మొక్కులు చెల్లించి ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం మహిళలందరూ సామూహికంగా డప్పు చప్పుళ్లతో పోచమ్మ గుడి వద్దకు సంప్రదాయబద్ధంగా బోనాలతో వెళ్లి మొక్కులు సమర్పించారు. స్టేషన్‌ఘన్‌పూర్ మండలంలోని ఛాగల్లులో పోచమ్మ గుడి చుట్టూ ఎడ్లబండ్లను ఆనవాయితీ ప్రకారం తిప్పారు. డప్పు చప్పుళ్లు, డీజే పాటలు, శివసత్తుల పూనకాలు, బోనాలతో గ్రామాల్లో సందడి వాతావరణం నెలకొంది. -
అమ్మకు బోనం.. ఆనంద పరవశం
-
నేడు లాల్‌దర్వాజ అమ్మవారి బోనాలు
-
ఫ్లోరిడాలో ఘనంగా బోనాల సంబరాలు
ఫ్లోరిడా : తెలంగాణా అసోసియేషన్ అఫ్ ఫ్లోరిడా ఆధ్వర్యంలో బోనాల ఉత్సవాలను మియామీ సీబీ స్మిత్ పార్క్‌లో ఘనంగా నిర్వహించారు. వేదపండితులు పూజలు జరిపి కార్యక్రమాన్ని మొదలు పెట్టారు. గుమ్మకొండా రెడ్డి ఫౌండేషన్ ఫౌండర్ శేఖర్ రెడ్డి, శైలజ రెడ్డిలు వందలాది మంది స్థానికుల సహకారంతో మేళ తాళాలు, తీన్మార్ డాన్సులతో అత్యంత వైభవంగా బోనాలను ఊరేగించారు. పిల్లల కోసం నిర్వాహకులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పోనీ రైడ్స్ కార్యక్రమం ఆకర్షణగా నిలిచింది. బోనాలు పండుగ జీవ వైవిధ్యాన్ని సూచిస్తుందని అధ్యక్షులు చందు తాళ్ల పేర్కొన్నారు. తెలంగాణా సంస్కృతికి ప్రతీకగా నిలుస్తుందని, ప్రపంచంలో తెలుగు ప్రజలు ఎక్కడున్నా కలుసుకోవడానికి తోడ్పడుతుందన్నారు. అంతే కాకుండా మహిళా సాధికారతకు కూడా బోనాలు పండుగ అనేది చిహ్నంగ ఉపయోగపడుతుందని తెలిపారు. స్థానిక ఎగ్జిక్యూటివ్ కమిటి మెంబెర్ మోహిత్ కర్పూరం ఈ కార్యక్రమానికి అధ్యక్షతవహించగా, సాంసృతిక కార్యక్రమాలు స్వాతి జలగం ఆధ్వర్యంలో జరిగాయి. రాజు భాషబోయిన, ప్రతిభ రాజు ప్రాంగణాన్ని అత్యంత సుందరంగా అలంకరించారు. కార్యక్రమానికి తెలంగాణ అసోసియేషన్ అఫ్ ఫ్లోరిడా అధ్యక్షులు చందు తాళ్ల, మోహిత్ కర్పూరం, శేఖర్ రెడ్డి, శైలజ రెడ్డి, డా.రాజేందర్ రెడ్డి చెరుకు, దేశిక చెరుకు,శశి గుడాల, నిరుపమా రెడ్డి, శరత్ కొత్తకాపు ,శ్యామా మార్గని, వీణ తల్లా, శ్వేతా, సునీల్, రాజేందర్ రెడ్డి బెక్కరి, రాజ్ సారెడ్డి, అనిల్ ఆది, రవి అండపల్లి, లక్ష్మి కాంత్ కళ్ళం, షర్మిల, ఉపాధ్యక్షులు అవినాష్ రామ, స్వాతి జలగం, రవి వుమ్మగోని, అనిల్ బండారం, శ్రీనివాస్ గడ్డం, అశోక్ వర్ధన్, లతా రెడ్డి, సంతోష్ గూడూరు, డా. శ్రీనివాస్ దొంతినేని, నరేందర్ కొమ్మ, శ్రీనివాస్ముతినేని, వెంకట్ కంచర్ల, శ్రీకాంత్ జలగం పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి లతా రెడ్డి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. -
బోనాల పండగలో మంత్రి తలసాని సెప్పులు
-
సింగపూర్‌లో ఘనంఘా బోనాలు
-
బోనమెత్తిన సింగపూర్
సింగపూర్ : నగరంలో బోనాల పండుగ ఘనంగా జరిగింది. తెలంగాణ కల్చరల్ సొసైటీ సింగపూర్ ఆధ్వర్యంలో సింగపూర్ రెండోసారి బోనమెత్తింది. స్థానిక సుంగే కేడుట్‌లోని శ్రీ అరస కేసరి శివన్ టెంపుల్లో ఆదివారం ఎంతో కన్నుల పండుగగా జరుపుకున్నారు. తెలంగాణ మహిళలు భక్తి శ్రద్ధలతో దుర్గాదేవికి బోనాలు సమర్పించారు. బోనాల ఊరేగింపులో పోతరాజు వేషాలు, తొట్టెలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ వేడుకలో సుమారు 500 మంది భక్తులు పాల్గొన్నారు. బోనాల పండుగను గత ఏడాది కూడా టీసీఎస్ఎస్ ఘనంగా నిర్వహించింది. రెండో ఏడాది కూడా విజయవంతంగా బోనాల పండుగను నిర్వహించడం సొసైటీకి దక్కిన అదృష్టంగా భావిస్తున్నామని కార్యవర్గ సభ్యులు తెలియ చేశారు. ప్రజలందరిపై ఆ మహంకాళి తల్లి ఆశిస్సులు ఉండాలని సభ్యులు ప్రత్యేక పూజలు చేసి బోనాలు సమర్పించారు. బోనాల పండుగలో పాల్గొని అత్యంత వైభవంగా, కన్నుల పండుగగా జరుపుకునేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి సొసైటి అధ్యక్షులు నీలం మహేందర్, ఉపాధ్యక్షులు రమేష్ బాబు, శివ రామ్ ప్రసాద్, గర్రెపల్లి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి ప్రశాంత్ రెడ్డి, కోశాధికారి నల్ల భాస్కర్, ప్రాంతీయ కార్యదర్శులు మంగలి దుర్గా ప్రసాద్, సంస్థాగత కార్యదర్శి చేన్నోజ్వాల ప్రవీణ్, ఇతర సభ్యులు నడికట్ల భాస్కర్, జూలూరి సంతోష్, అనుపురం శ్రీనివాస్, కల్వ రాజులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ వేడుకలకు సమన్వయ కర్తలుగా లక్ష్మా రెడ్డి, గోనె నరేందర్, గింజల సురేందర్, బొండుగుల రాము, జుట్టు ఉమేందర్, జూలూరి పద్మజ, నడికట్ల కళ్యాణి, వెంగళ సృజన వ్యవహరించారు. -
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు
-
అమ్మవారిని దర్శించుకున్న సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్ : సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల సంబురాలు అంబరాన్నంటాయి. సీఎం కేసీఆర్ దంపతులు అమ్మవారిని దర్శించుకోని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి ఎంపీ కవిత బంగారు బోనం సమర్పించారు. కవితకు తోడుగా 1008 బోనాలతో మహిళలు ఆదయ్య నగర్ నుంచి ఆలయం వరకు ఊరేగింపుగా కదిలారు. మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, పద్మాదేవేందర్‌రెడ్డి, శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్, ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్‌లు అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులు సైతం అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు. ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
లండన్‌లో ఘనంగా బోనాల జాతర
లండన్ : తెలంగాణ ఎన్నారైఫోరం (టీఈఎన్ఎఫ్) ఆధ్వర్యంలో లండన్‌లోని క్రాన్ఫోర్డ్ కాలేజీలో బోనాల పండుగను వైభవంగా నిర్వహించారు. ఈ సంబరాలకు బ్రిటన్ నలుమూలల నుండి సుమారు 700ల మందికి పైగా ప్రవాసులు హాజరయ్యారు. ఈ వేడుకలకు తెలంగాణ నుండి కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి, లండన్ ఎంపీ వీరేంద్రశర్మ, సీమ మల్హోత్రా, ఏఎస్ రాజన్ ( మినిస్టర్ కోఆర్డినేషన్, ఇండియన్ హై కమిషన్), లండన్ బారౌ మేయర్ సమియా చౌదరి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి మాట్లాడుతూ భారతీయ సంస్కృతి ప్రచారంలో తెలంగాణ బిడ్డలు ముందు వరుసలో ఉన్నారని కొనియాడారు. మహిళా సాధికారత మాటల్లో కాకుండా ఇంటి నుండే వ్యక్తి నుండే మొదలవ్వాలని లింగ బేధం, ఆధిపత్యం లేకుండా భార్యా భర్తలు కలిసి మెలిసి సమాన నిష్పత్తిలో పని చేసినప్పుడే మహిళా సాధికారత సాధిస్తామన్నారు. లండన్ ఎంపీలు వీరేంద్ర శర్మ, సీమా మల్హోత్రాలు మాట్లాడుతూ లండన్‌లో భారతీయ పండుగలు అంటే బోనాలు, బతుకమ్మ, దీపావళిగా పేరు సంపాదించుకున్నాయని తెలిపారు. తెలంగాణ ఎన్నారై ఫోరమ్ అధ్యక్షులు ప్రమోద్ అంతటి అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. ఈ ఏడాది అన్ని తెలంగాణ, తెలుగు సంఘాల ఆధ్వర్యంలో బోనాలు చేసుకొని తెలంగాణ ఐక్యత ను చాటామని తెలిపారు. తెలంగాణ ఎన్నారైఫోరాన్ని ఆధరిస్తున్న అందరికీ ఫౌండర్ చైర్మన్ గంప వేణుగోపాల్ ధన్యవాదాలు తెలిపారు. రాజకీయ, వివిధ రంగాలకు అతీతంగా సంస్థ పని చేస్తుందని ప్రధాన కార్యదర్శి సుధాకర్ గౌడ్ తెలిపారు. భారతీయ సంస్కృతి ప్రచారంలో నిరంతరంగా శ్రమించాలని కార్యదర్శి భాస్కర్ పిట్ల ప్రవాసులను కోరారు. స్థానిక లక్ష్మీ నారాయణ గుడిలో దుర్గా మాతకు బోనం సమర్పించి, లండన్ పుర విధుల్లో 'తొట్టెలు' ఊరేగింపు చేశారు. లండన్‌లో స్థిరపడి వివిధ రంగాల్లో అగ్రగామి సాధించిన వారికి జయశంకర్ అవార్డులు ఇచ్చారు. సాంస్కృతిక కార్యక్రమాలు, భరత నాట్యం, గీతాలాపన, నృత్యాలు, చిన్నారుల చేత నాట్య ప్రదర్శన, ఆధ్యాత్మిక ప్రవచనాలతో కార్యక్రమం సాగింది. ఈ కార్యక్రమంలో రంగు వెంకట్, నరేష్ మర్యాల, ప్రవీణ్ రెడ్డి, మహేష్ జమ్ముల, స్వామి ఆశ, స్వామి ఆకుల, మహేష్ చిట్టె, బాల కృష్ణ రెడ్డి, శేషు అల్లా, వర్మ, సంతోష్, సాయి మార్గ్, మీనాక్షి అంతటి, వాణి అనసూరి, శ్రీవాణీ, సుచరిత, శిరీష, సవిత, రామా, ప్రియాంక, మంజుల, సీతలు ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడంలో తమ వంతు సహకరించారు. -
లండన్‌లో ఘనంగా 'టాక్ బోనాల జాతర'
లండన్ : తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్(టాక్) ఆధ్వర్యంలో లండన్‌లో బోనాల జాతరను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు స్థానిక ఎంపీలు వీరేంద్ర శర్మ, సీమ మల్హోత్రా, ఫస్ట్ సెక్రటరీ అఫ్ ఇండియన్ హైకమిషన్ అనిమా భరద్వాజ్‌లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. లష్కర్ బోనాలకు ఏ మాత్రం తీసిపోకుండా స్వదేశంలో జరుపుకున్నట్టే అన్ని సంప్రదాయాలను పాటిస్తూ పూజలు నిర్వహించి, లండన్ వీధుల్లో తొట్టెల ఊరేగింపు నిర్వహించారు. బోనాల ఊరేగింపు తరువాత ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని ముఖ్య అతిథులతో జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. సంస్థ ఉపాధ్యక్షురాలు స్వాతి బుడగం స్వాగతోపన్యాసం చేయగా, కార్యదర్శి రవి రేతినేని కార్యక్రమానికి వక్తగా వ్యవహరించారు. ఈ వేడుకలకు యూకే నలుమూలల నుండి సుమారు 800మందికి పైగా ప్రవాసులు హాజరయ్యారు. భారత సంతతికి చెందిన స్థానిక ఎంపీ వీరేంద్ర శర్మ మాట్లాడుతూ.. యూకేలో నివసిస్తున్న తెలంగాణ ఎన్నారైలంతా సమాజ సేవలో ఎంతో క్రియాశీలకంగా పాల్గొంటారని, వీరి స్ఫూర్తి చాలా గొప్పదని తెలిపారు. స్థానిక ఎంపీ సీమా మల్హోత్రా మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర పండుగ "బోనాల" వేడుకల్ని ఎంతో ఘనంగా నిర్వహించడమే కాకుండా, సంప్రదాయ బద్దంగా పూజలు నిర్వహించి, ముఖ్యంగా లండన్ వీధుల్లో నిర్వహించిన తొట్టెల ఊరేగింపు లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. అమ్మవారికి బోనం సమర్పించడానికి పెద్ద ఎత్తున మహిళలు బోనం నెత్తిన ఎత్తుకొని లండన్ వీధుల్లో రావడం చూస్తుంటే, ఒక మహిళగా ఎంతో గర్వంగా అనిపించిందని, తెలంగాణ సంస్కృతిని ప్రతి ఒక్కరికి తెలిసేలా టాక్ సంస్థ చేపడుతున్న కార్యక్రమాలు ఎందరికో ఆదర్శంగా ఉన్నాయని తెలిపారు. ఇండియన్ హై కమీషన్ ప్రతినిధి అనిమా భరద్వాజ్ మాట్లాడుతూ బోనాలు వేడుకల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని, తెలంగాణా సంస్కృతిని ప్రపంచానికి చాటిచెప్తున్న తీరుని ప్రశంసించారు. టాక్ సంస్థ ఇటు జాతీయ పండుగలు రాష్ట్ర పండుగలు ఎంతో ఘనంగా నిర్వహిస్తు భారత జాతి గౌరవాన్ని విదేశీ గడ్డ పై ముందుకు తీసుకెళ్తూ ఎందరికో స్ఫూర్తినిస్తుందని తెలిపారు. సంస్థ అద్యక్షురాలు పవిత్ర రెడ్డి కంది మాట్లాడుతూ.. టాక్ సంస్థ ద్వారా జరుపుతున్న బోనాల వేడుకలకు విచ్చేసిన అతిథులకు, స్థానిక ప్రవాసులకు కృతఙ్ఞతలు తెలిపారు. టాక్ చేస్తున్న కార్యక్రమాల గురించి అలాగే భవిష్యత్తులో చేయబోయే కార్యక్రమాల గురించి సభకు వివరించారు. టాక్ సంస్థని, అలాగే బోనాల జాతర వేడుకల పోస్టర్ ఆవిష్కరించడమే కాకుండా అన్ని సందర్భాల్లో సూచనలు సలహాలు ఇస్తూ ముందుకు నడిపిస్తున్న నిజామాబాదు ఎంపీ కవితకి కృతఙ్ఞతలు తెలిపారు. తెలంగాణ ప్రజలందిరికీ టాక్ వ్యవస్థాపకుడు, ఎన్నారై టీఆర్ఎస్ మాజీ అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు. లండన్ లో తెలంగాణ రాష్ట్ర పండుగను ఇంత ఘనంగా నిర్వహించుకోవడం గర్వాంగా ఉందని, ఒక నాడు పండుగలంటే కేవలం సంక్రాంతి - ఉగాది మాత్రమేనని, ప్రవాస తెలంగాణ సంఘాలు ఏర్పడ్డాక బోనాలు - బతుకమ్మ వేడుకల్ని ప్రపంచవ్యాప్తంగా ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నారని తెలిపారు. ఎన్నారైలలో ఇంతటి స్ఫూర్తి నింపి, ముఖ్యంగా టాక్ సంస్థని ప్రోత్సహిస్తున్న ఎంపీ కవితకి కృతఙ్ఞతలు తెలిపారు. మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చినట్టు మనంతా కూడా ఒక రోజు చేనేత దుస్తులు ధరించి వారిని ప్రోత్సహించాలని కోరారు. ప్రముఖ నృత్య కళాకారిణి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ గ్రహీత, రాగసుధా వింజమూరి చేసిన మహేశ్వరి మహా కాళీ నృత్యం, అలాగే రాగసుధా పర్యవేక్షణలో తెలంగాణలో మాత్రమే ప్రాముఖ్యత కలిగిన మథుర, కోయా లంబడా సంప్రదాయ నృత్యాలు వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. బోనం చేసి వేడుకల్లో పాల్గొన్న మహిళలందరిని ప్రత్యేకంగా సత్కరించి, బహుమతులందజేశారు. సంప్రదాయ తెలంగాణా వంటకాలతో పండగ భోజనం సొంత ఇంటిని తలిపించిందని హాజరైన వారు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన ఎంపీ వీరేంద్ర శర్మ, ఎంపీ సీమా మల్హోత్రా, ఇండియన్ హై కమీషన్ ప్రతినిధి అనిమా భరద్వాజ్లని ఘనంగా సన్మానించి, జ్ఞాపికను అందజేశారు. అలాగే సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని సంస్థ ఎగ్జిక్యూటివ్ టీం జ్ఞాపికలతో ప్రశంసించారు. టాక్ సభ్యులు అశోక్ దూసరి, నవీన్ రెడ్డి ,రత్నాకర్ కడుదుల, సేరు సంజయ్, సుప్రజ పులుసు, విక్రమ్ రెడ్డి రేకుల, వెంకట్ రెడ్డి దొంతుల, శ్రీకాంత్ పెద్దిరాజు, శ్రీకాంత్ జిల్లా ఆధ్వర్యంలో జరిగిన బోనాల జాతర ఇంతటివిజయం సాధించడం సంతోషంగా ఉందని కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవస్థాపకుడు అనిల్ కూర్మాచలం, అధ్యక్షురాలు పవిత్ర రెడ్డి కంది, ఎన్ఆర్ఐ టీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి, టాక్ అడ్వైజరీ ఛైర్మన్ గోపాల్ మేకల, ఉపాధ్యక్షులు స్వాతి బుడగం, ప్రధాన కార్యదర్శి విక్రమ్ రెడ్డి రేకుల, జాతీయ కన్వీనర్ శ్రీకాంత్ పెద్దిరాజు, సభ్యులు, నవీన్ రెడ్డి, రత్నాకర్ కడుదుల , శ్రీధర్ రావు, శ్రీకాంత్ జెల్ల, సత్య పింగిళి, సత్య చిలుముల, సత్యం కంది, హరి నవపేట్, శ్రీనివాస్ మేకల, సుమ దేవి, సుప్రజ, శుషుమ్న రెడ్డి, వీర ప్రవీణ్ కుమార్, సురేష్ బుడగం, వెంకట్ రెడ్డి, వేణు రెడ్డి నక్కిరెడ్డి, ప్రియాంక, క్రాంతి, మమతా జక్కి, శ్రీనివాస్, భరత్, రాజేష్ వాకా, వెంకీ, రవికిరణ్, గణేష్, హరి, హరిదీప్, మధుసూదన్ రెడ్డి, మల్ రెడ్డి, మట్టా రెడ్డి, రాజేష్ వర్మ, రాకేష్ పటేల్, రంజిత్, రవి ప్రదీప్, రవి రతినేని, నరేందర్, నవీన్ భువనగిరి, నవీన్ మాది రెడ్డి తదితరులు పాల్గొన్న వారిలో ఉన్నారు. -
అంబరాన్నంటిన బోనాల సంబరాలు
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో బోనాల సంబరాలు అంబరాన్నంటాయి. తెలంగాణ భవన్లో జరుగుతున్న బోనాల ఉత్సవాల్లో భాగంగా అమ్మవారి ఘట్టం ఊరేగింపు మహోత్సవం మంగళవారం ఘనంగా జరిగింది. ఇండియా గేట్ నుంచి తెలంగాణ భవన్ వరకు బాజాభజంత్రీల మధ్య అమ్మవారి ఘట్టాన్ని ఊరేగించారు. అనంతరం అమ్మవారి ఘట్టాన్ని భవన్లో ప్రతిష్టించారు. పోతురాజుల నృత్యం, సంప్రదాయ వేషధారణలో కళాకారుల కోలాహలం మధ్య ఊరేగింపు ఘనంగా జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం, లాల్‌దర్వాజా సింహవాహిని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలను మూడు రోజులపాటు నిర్వహిస్తున్నారు. కార్యక్రమంలో ఢిల్లీలో ప్రభుత్వ ప్రతినిధులు వేణుగోపాలాచారి, రామచంద్ర తెజావత్, మందా జగన్నాథం ఆలయ కమిటీ చైర్మన్ కైలాశ్, ఉపాధ్యక్షుడు వెంకటేశ్, స్థానికంగా ఉన్న తెలుగు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. -
బోనమెత్తిన భాగ్యనగరి
-
బోనాలకు ముస్తాబైన ఆలయాలు
రహమత్‌నగర్: తెలంగాణ ప్రజలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే బోనాల ఉత్సవాలు ఆదివారంతో ముగియనున్నాయి. ఈ ఉత్సవాలకు నగరంలోని అమ్మవార్ల ఆలయాలు ముస్తాబవుతున్నాయి. ఆయా ఆలయ కమిటీ సభ్యులు, బస్తీల నాయకులు ఉత్సవాల కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. ఆలయాలకు రంగురంగుల విద్యుత్తు దీపాలు అలంకరించి, దేవాలయాలు ప్రాంతాల్లో రహదారులు మరమ్మతులు చేపట్టారు. అమ్మవారి ఘటాల ఊరేగింపు కోసం యువకులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. శివసత్తులు, పోతురాజులకు డిమాండ్ పెరిగింది. డప్పుల అద్దెలు భారీగా పెరిగాయి. బోనాలకు ఉపయోగించే సామగ్రి, కుండలకు భలే గిరాకీ పెరిగింది. పోతురాజులు, పోటాపోటీగా నేతలకు ఆహ్వానం.... తమ బస్తీల్లో జరుగుతున్న బోనాల ఉత్పవాలకు వివిధ పార్టీల నాయకులకు, ప్రజా ప్రతినిధులకు ఆహ్వానాలు పలకడంలో యువకులు పోటీపడుతున్నారు. ఆయా పార్టీలకు చెందిన నేతలకు బస్తీలకు చెందిన యువకులు ఇప్పటికే ఆహ్వానాలు అందించారు. ఫ్లెక్సీల కోసం క్యూ.. బోనాల జాతరలో పాల్గొనేందుకు వస్తున్న నాయకులకు, భక్తులకు ఆహ్వానం పలికేందుకు ఏర్పాటు చేయనున్న ఫ్లెక్సీలకు యమ గిరాకీ ఉంది. రహమత్‌నగర్, క్రిష్ణానగర్, ఎస్.ఆర్ నగర్, దిల్షుక్నగర్, అమీర్‌పేట్ తదితర ప్రాంతాల్లో ఫ్లెక్సీ తయారీ కేంద్రాల వద్ద యువకులు క్యూ కట్టారు. -
వైభవంగా మహాంకాళి బోనాలు
-
ఆషాఢ మాసం అమ్మకు బోనం
-
ఘనంగా దర్బార్ మైసమ్మ బోనాలు
హైదరాబాద్ సిటీ: బర్కత్‌పురలోని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) ప్రాంతీయ కార్యాలయంలో మంగళవారం బోనాల ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ ఉత్సవాల్లో సెంట్రల్ పీఎఫ్ అడిషనల్ కమిషనర్ సర్వేశ్వరన్, ఈపీఎఫ్ ప్రాంతీయ కమిషనర్ -1 ఎం.శ్రీకృష్ణలతో పాటు పలువురు అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా ఉద్యోగులు, స్థానిక మహిళలు అమ్మవారికి తొట్టెలు, బోనాలు సమర్పించుకున్నారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. -
బోనమెత్తనున్న భాగ్యనగరం
-
బోనమెత్తనున్న భాగ్యనగరం
* వైభవంగా లాల్‌దర్వాజ బోనాలు * హాజరుకానున్న సీఎం అమ్మవారికి స్వర్ణ కిరీటం * అక్కన్న, మాదన్న దేవాలయంలో ఘనంగా వేడుకలు సాక్షి,హైదరాబాద్: బోనాల వేడుకలతో హైదరాబాద్‌లో ఆధ్యాత్మిక వాతావ రణం నెలకొంది. ఆదివారం జరగనున్న ఉత్సవాలకు నగరంలోని అమ్మవార్ల ఆలయాలు అంగరంగ వైభవంగా ముస్తాబయ్యాయి. రంగు రంగుల విద్యుద్దీపాలతో అందంగా అలంకరించారు. తెలంగాణ సంస్కృతి, ఆచార వ్యవహారాలను ప్రతిబింబించే పాతబస్తీ ఆషాఢమాసం బోనాల జాతర ఉత్సవాలు ప్రతి ఏటా కన్నుల పండువగా జరుగుతాయి. లాల్‌దర్వాజ సింహవాహిని కాళికాదేవి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దా రు. ఈ ఏడాది 72 తులాలతో రూపొందించిన బంగారు కిరీటాన్ని కాళికాదేవికి భక్తులు సమర్పించనున్నారు. సీఎం కేసీఆర్ లాల్‌దర్వాజ బోనాలకు హాజరుకానున్నారు. దేవాదాయ శాఖ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించనుంది. నిజాం కాలం నుంచి ఈ దేవాలయంలో బోనాల వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. అక్కన్న , మాదన్న ఆలయానికి కొత్త భవనం ఎంతో ప్రతిష్టాత్మకమైన దేవాలయంగా పేరు ప్రఖ్యాతలున్న హరిబౌలి శ్రీ అక్కన్న, మాదన్న దేవాలయం కాంతులీనుతోంది. ఆలయానికి ఆనుకొని ఈ ఏడాది అతి పెద్ద సమావేశ మందిరాన్ని నిర్మించారు. ఈ సారి ఈ నూతన భవనం ప్రత్యేక ఆకర్షణ కానుంది. గోల్కొండ రాజు తానీషా మంత్రివర్గంలో కమాండర్ ఇన్ చీఫ్‌గా కొనసాగిన అక్కన్న, ప్రధాన మంత్రిగా పని చేసిన ఆయన సోదరుడు మాదన్న విధి నిర్వహణలో భాగంగా ప్రతిరోజూ గోల్కొండ కోటకు వెళ్లే ముందు హరిబౌలిలోని అమ్మవారికి పూజలు నిర్వహించేవారు. వారి మరణానంతరం 1948లో ఆర్యసమాజ్ నాయకులు ఈ ఆలయాన్ని తిరిగి వెలుగులోకి తెచ్చారు. ప్రతి ఆషాఢ మాసంలో అమ్మవారిని దర్శించుకొని బోనాలు సమర్పించడం ప్రారంభించారు. పాతబస్తీలోని అన్ని ఆలయాలతో పాటు నగరమంతటా అమ్మవార్ల ఆలయాలు ఆదివారం నాటి వేడుకలకు అందంగా ముస్తాబయ్యాయి. నేడు నగరంలో జరగనున్న బోనాల వేడుకలకు పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. -
బోనాలతో బారులు తీరిన భక్తులు
-
బోనాలకు సర్వం సిద్ధం : మంత్రి తలసాని
హైదరాబాద్ : తెలంగాణలో అతి పెద్ద పండుగ అయిన బోనాల ఉత్సవాలను ప్రభుత్వ పరంగా ఘనంగా నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేస్తున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ తెలిపారు. సికింద్రాబాద్‌లోని ఉజ్జయినీ మహంకాళి ఆలయానికి సీఎం కేసీఆర్ కుటుంబ సమేతంగా హాజరై అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నట్లు తెలిపారు. సోమవారం సచివాలయంలో మంత్రి తలసాని వివిధ శాఖలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... వచ్చే నెల 2,3 తేదీల నుంచి హైదరాబాద్, సికింద్రాబాద్‌లలో జరిగే బోనాల ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తవుతున్నాయన్నారు. తెలంగాణ రాష్ట్ర పండుగగా గుర్తించిన బోనాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తామన్నారు. ఈసారి కొత్తగా సాంస్కృతికశాఖ తరఫున అక్కడక్కడా ప్రత్యేక స్టేజ్‌లను ఏర్పాటు చేసి కార్యక్రమాలను చేపడుతున్నట్లు వివరించారు. ఈ వేడుకల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు.