![Bonalu Festival Celebrations Australia Melbourne - Sakshi](/styles/webp/s3/article_images/2023/07/10/Bonalu%20Festival%20Celebrations%20Australia%20Melbourne.jpg.webp?itok=o5twgIis)
మెల్‌బోర్న్ నగరంలో రాక్‌బ్యాంక్ దుర్గామాత టెంపుల్ వద్ద ఘనంగా బోనాల జాతర జరిగింది. ఈ వేడుకలు మెల్‌బోర్న్ తెలంగాణ బోనాలు సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో పాల్గొన్న తెలంగాణ మహిళలు అమ్మ వారికి బోనాలు, తొట్టెలు సమర్పించుకుని తమ మొక్కును చెల్లించుకున్నారు. పోతురాజుల ఆట, పాటలు, యువకుల నృత్యాలతో దుర్గా మాత ఆలయం ఒక్కసారిగా సందడిగా మారింది.
బోనాల పాటలకు చేసిన నృత్యాలకు భారత దేశానికి చెందిన వివిధ రాష్ట్రాల ప్రజలు కూడా నాట్యం చేయడం ప్రత్యేక ఆకర్షణ గా నిలిచాయి. తెలంగాణలో ఎంతో ఘనంగా నిర్వహిస్తున్న ఈ వేడుకలను అదే స్థాయిలో గత పది సంవత్సరాలుగ నిర్వహిస్తున్న మెల్‌బోర్న్ తెలంగాణ బోనాలు సంస్థ నిర్వాహకులు తెలంగాణ మధు , రాజు వేముల , ప్రజీత్ రెడ్డి కోతి , దీపక్ గద్దెలను ఈ వేడుకలకు హాజరైన వివిధ సంఘాల నాయకులు, ప్రజలు అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment