ఆలయంలో తమిళిసై..
రాంగోపాల్‌పేట్: ఆషాఢం, శ్రావణ మాసాల్లో తెలంగాణలో నిర్వహించే బోనాల పండుగకు ఎంతో చరిత్ర ఉందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. ఉజ్జయినీ మహంకాళి అమ్మవారిని సోమవారం సాయంత్రం దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ఈవో గుత్తా మనోహర్‌రెడ్డి, అర్చకులు గవర్నర్‌కు సాదర స్వాగతం పలికారు. అనంతరం ఆమె మాట్లాడుతూ కోవిడ్‌ను అరికట్టిన తర్వాత జరుపుకొంటున్న ఈ ఏడాది బోనాల పండుగకు ప్రత్యేకత ఉందన్నారు.
ఉజ్జయినీ మహంకాళి దయతో ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని, ఆమె దీవెనలు తెలంగాణ ప్రజలకు ఉండాలని కోరుకున్నానని చెప్పారు. అనంతరం.. మోండా బూరుగుశెట్టిబజార్‌లోని లక్ష్మీనారాయణ స్వామి దేవాలయంలో ఆమె పూజలు చేశారు. ఆర్పీరోడ్‌లోని భాగ్యనగర్ గణేష్ ఉత్స వ సమితి ఏర్పాటు చేసిన వేదిక నుంచి ప్రజలకు బోనాల శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తెలుగులో మాట్లాడిన గవర్నర్ తెలుగు ప్రజలన్నా, తెలుగు భాషన్నా తనకెంతో మక్కువన్నారు. ఈ నెల 15నుంచి ఉచితంగా వేస్తున్న బూస్టర్ డోస్‌ను అందరూ వేసుకోవాలని గవర్నర్ సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment