ramgopalpet
-
డెక్కన్ మాల్ కూల్చివేత షురూ.. ఆఖరు అంతస్తు నుంచి మొదలు..
రాంగోపాల్‌పేట్: మినిస్టర్ రోడ్లో ఇటీవల అగ్ని ప్రమాదం సంభవించిన రాధే ఆర్కెడ్ (డెక్కన్ భవనం) కూల్చివేతలు ఎట్టకేలకు మొదలయ్యాయి. కూల్చివేతల కాంట్రాక్ట్‌ను మొదట దక్కించుకున్న ఎస్కే మల్లు ఏజెన్సీ వద్ద సరైన మెషినరీ లేకపోవడంతో అధికారులు అదే ధరకు మాలిక్ ట్రేడింగ్ అండ్ డిమాలిషన్ అనే మరో కంపెనీకి టెండర్‌ను అప్పగించారు. జపాన్‌లో తయారైన ‘హైరిచ్ కాంబీ క్రషర్’ అధునాతన యంత్రాన్ని గురువారం సాయంత్రం ఈ భవనం వద్దకు తీసుకువచ్చి ఇన్స్టలేషన్ ప్రక్రియ మొదలు పెట్టారు. ఆరు అంతస్తులున్న భవనాన్ని ఎలా కూల్చాలనే దానిపై కసరత్తు చేశారు. చుట్టూ ఉన్న బస్తీ, అపార్ట్మెంట్లకు నష్టం వాటిల్లకుండా కూలి్చవేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. కసరత్తులన్నీ పూర్తి చేసిన తర్వాత గురువారం రాత్రి 11 గంటలకు పనులు మొదలు పెట్టారు. ఈ నెల 19న డెక్కన్ భవనంలో అగ్ని ప్రమాదం సంభవించి ముగ్గురు వ్యక్తులు గల్లంతైన విషయం తెలిసిందే. భవనం 70 శాతం దెబ్బ తిన్నదని నిట్ నిపుణుల బృందం తేల్చడంతో కూల్చివేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. శిథిలాలు నేరుగా కిందకు.. డెక్కన్ భవనాన్ని ఆరో అంతస్తు నుంచి కూల్చివేతలు మొదలు పెట్టి కింద వరకు పూర్తి చేయనున్నారు. గ్రౌండ్ నుంచి 80 అడుగుల ఎత్తులో ఉండే వాటిని కూలి్చవేయవచ్చు. ప్రస్తుతం భవనం 70 అడుగుల ఎత్తు ఉంది. పిల్లర్స్, కాలమ్స్‌ను ఈ మెషిన్ కట్ చేస్తుంది. ఆ తర్వాత వాటిని చిన్న చిన్న ముక్కలుగా చేస్తుంది. అనంతరం శిథిలాలు మొత్తం కింద ఏర్పాటు చేసిన డ్రాపింగ్ జోన్లో వచ్చి పడతాయి. ఎలాంటి శబ్దాలు, వైబ్రేషన్స్ లేకుండా కూల్చివేయడం ‘హైరిచ్ కాంబీ క్రషర్’ యంత్రం ప్రత్యేకత. భారత్‌లో ఇలాంటి యంత్రాలు కేవలం 3 మాత్రమే ఉన్నాయని అధికారులు చెప్పారు. కాగా.. అధికారులు కూల్చివేతలు మొదలు పెట్టడంతో చుట్టుపక్కల నివసించేవాళ్లలో టెన్షన్ మొదలైంది. దీన్ని ఆనుకునే కాచిబోలి బస్తీ, వెనుక వైపు ఉత్తమ్ టవర్స్, గగన్ ప్యారడైస్ అపార్ట్మెంట్ల వాసుల్లోనూ ఆందోళన మొదలైంది. భవనం సమీపంలో ఎలాంటి నష్టం వాటిల్లకుండా కూల్చివేస్తామని అధికారులు చెబుతున్నా.. స్థానికుల్లో మాత్రం భయం మాత్రం వీడలేదు. మొత్తం భవనం కూల్చిన తర్వాతే.. మిగతా వారి అవశేషాల ఆచూకీ దొరికే అవకాశముంది. ఇందుకోసం మరో నాలుగైదు రోజుల నిరీక్షణ తప్పదు. 12 నుంచి 15 రోజుల్లో.. భవనం కూలి్చవేతకు 4 నుంచి 5 రోజుల సమయం పడుతుందని, శిథిలాలు మొత్తం తరలించి క్లియర్ చేసేందుకు సుమారు 12 నుంచి 15 రోజులు పట్టవచ్చని మాలిక్ ట్రేడింగ్, డిమాలిషన్ కంపెనీ డైరెక్టర్ రెహా్మన్ ఫరూఖ్ తెలిపారు. గతంలో 70 భవనాలను తాము కూలి్చవేయగా ఇలాంటి ఎత్తైనవి 11 అంతస్తులు కూలి్చవేశామని చెప్పారు. ఇందులో వాటర్ స్ప్రింక్లర్స్ కూడా ఉంటాయని ఎక్కడైనా ఫైర్ ఉన్నా మంటలను ఆరి్పవేస్తుందన్నారు. చాలా తక్కువ మ్యాన్ పవర్‌తో కూల్చివేస్తామని ఆయన వివరించారు. -
సికింద్రాబాద్ అగ్ని ప్రమాదం.. తప్పించుకునే యత్నంలో ఇరుక్కుపోయారు
సాక్షి, హైదరాబాద్/రామ్‌గోపాల్‌పేట: సికింద్రాబాద్ మినిస్టర్స్ రోడ్‌లోని రాధా ఆర్కేడ్‌లో ఉన్న డెక్కన్ కార్పొరేట్ గోడౌన్ అగ్నిప్రమాదంలో గల్లంతైన ముగ్గురిలో ఒకరి మృతదేహానికి సంబంధించిన ఎముకలు, సగం కాలిన పుర్రెను హైదరాబాద్ క్లూస్ టీమ్ శిథిలాల నుంచి రికవరీ చేసింది. గురువారం ఈ ప్రమాదం జరగ్గా శనివారం సాయంత్రం ఇవి లభించాయి. ఈ పరిణామాల నేపథ్యంలో మిగిలిన ఇద్దరు కూడా మృతి చెందే ఉంటారని, వాళ్ల ఎముకలు స్వాధీనం చేసుకోవడం కష్టసాధ్యమని ఓ అధికారి వ్యాఖ్యానించారు. భవనంలోని పరిస్థితులు ఇప్పటికీ నేరుగా అడుగు పెట్టడానికి అనువుగా లేకపోవడంతో విక్టిమ్ లొకేషన్ కెమెరా(వీఎల్సీ)తో కూడిన డ్రోన్ల సాయంతో సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నారు. శుక్రవారం వాడిన డ్రోన్‌కు అదనంగా శనివారం మరొకటి వినియోగించగా... ఆదివారం కూడా ఈ గాలింపు ప్రక్రియ జరుగనుంది. లిఫ్ట్ వద్ద షట్టర్ మూసి ఉండటంతో... గోదాములో అగ్నిప్రమాదం జరిగి పొగలు వస్తున్న సమయంలో ఆ సంస్థ ఉద్యోగులైన జునైద్, వశీం, జహీర్ అక్కడే ఉన్నారు. అప్పటికే పోలీసులు, అగ్నిమాపక శాఖ అధికారులు పైఅంతస్తుల్లో ఇరుక్కున్న నలుగురు కూలీలను రెస్క్యూ చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ‘డెక్కన్’ యజమాని ఆదేశాల మేరకు ముగ్గురు ఉద్యోగులు మొదటి అంతస్తులో ఉన్న సరుకు తీసుకురావడానికి లోపలకు ప్రవేశించారు. ఇది జరిగిన కొద్దిసేపటికే పొగతో పాటు మంటలూ ఎక్కువ కావడం.. అవి మొదటి అంతస్తును చుట్టేయడంతో ఆ ముగ్గురూ తప్పించుకోవడానికి భవనం వెనుక వైపున ఉన్న లిఫ్ట్ వద్దకు వెళ్లే ప్రయత్నం చేశారు. అయితే మొదటి అంతస్తుకు, లిఫ్ట్‌కు మధ్య ఉండే షట్టర్ లాక్ చేసి ఉండటంతో అక్కడే ఉండిపోయి పొగ వల్ల మరణించడమో, లేదా అపస్మారక స్థితిలోకి వెళ్లి సజీవ దహనం కావడమో జరిగి ఉంటుందని అక్కడి పరిస్థితులను పరిశీలించిన అధికారులు చెబుతున్నారు. కూలిన శిథిలాల్లో మరో ఇద్దరి అవశేషాలు... ఈ భవనానికి వెనుక వైపుగా దాదాపు అన్ని ఫ్లోర్లకు సంబంధించిన శ్లాబ్స్ కూలిపోయాయి. మొదటి అంతస్తులో ఉన్న షట్టర్ వద్దా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. షట్టర్ పక్కన గోడ వద్ద ఉన్న యువకుడి మృతదేహంపై శ్లాబ్ ముక్కలు పడటంతో స్వాధీనం చేసుకున్న ఎముకలు మాత్రమే మిగిలాయని అధికారులు చెప్తున్నారు. మిగిలిన ఇద్దరూ చనిపోయే ఉంటారని, వారి ఎముకలు వంటి అవశేషాలు శకలాల్లో పడిపోయి ఉంటాయని అంచనా వేస్తున్నారు. ఆదివారం వీటి కోసం గాలించాలని భావిస్తున్నారు. ఈ అవశేషాలను బయటకు తీసుకురావడానికి క్లూస్ టీమ్‌తో పాటు డీఆర్ఎఫ్ అధికారులు తీవ్రంగా శ్రమించారు. సిటీ క్లూస్‌టీమ్ అధికారులు తమ వద్ద ఉన్న 3డీ స్కానర్‌తో భవనాన్ని విశ్లేషించారు. ఆపై భవనం ఎడమ వైపున ఉన్న సందు నుంచి వెనక్కు వెళ్లారు. అక్కడ కిటికీ సహాయంతో లోపలకు వెళ్లి సగం పడిపోయిన గ్రిల్ ఎక్కడం ద్వారా మొదటి అంతస్తునకు చేరుకున్నారు. అక్కడ శనివారం సాయంత్రానికి కూడా వేడిగానే ఉండటం గమనార్హం. డీఎన్ఏ పరీక్షలకు మాంసం, ఎముకలు.. ఈ అవశేషాలను శనివారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో క్లూస్ టీమ్ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ వెంకన్న, లాలాపేట క్లస్టర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సంజయ్ సేకరించారు. వీటిని తొలుత గాంధీ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. స్వాధీనం చేసుకున్న వాటిలో సగం కాలిన పుర్రె, కాళ్లు, చేతులకు సంబంధించిన కీలు, తొడ ఎముకలు ఉన్నాయి. తొడ ఎముక వద్ద కొంచెం కాలిన మాంసం కూడా లభించింది. దీన్ని సేకరించి డీఎన్ఏ పరీక్షలకు పంపనున్నారు. ఇప్పటికే ఆ ముగ్గురి బంధువులు నగరానికి చేరుకోవడంతో వారి నుంచి నమూనాలు తీసి ఆ మాంసంతో పోల్చనున్నారు. ఈ నివేదిక వచ్చిన తర్వాతే అది ఎవరి మృతదేహానికి సంబంధించినదో తేలుతుందని నిపుణులు చెప్తున్నారు. ‘చెల్లా చెదురుగా దొరికిన ఎముకలు తదితరాలు కూడా 80 శాతం కాలిపోయాయి. గట్టిగా పట్టుకుంటే బూడిదలా మారేలా ఉన్నాయి. ఒకటి రెండు రోజుల్లో డీఎన్ఏ నివేదిక వస్తుంది’ అని డాక్టర్ వెంకన్న తెలిపారు. భవనం లోపల ఉన్న పరిస్థితుల నేపథ్యంలో మరో ఇద్దరికి సంబంధించిన అవశేషాలైనా దొరుకుతాయా లేదా అనే సందేహాలూ నెలకొన్నాయి. -
సికింద్రాబాద్‌లో అగ్నిప్రమాదంతో హైటెన్షన్..
సాక్షి, సికింద్రాబాద్: రామ్‌గోపాల్‌పేట్‌లోని దక్కన్ స్టోర్ భవనంలో చెలరేగిన మంటలు ఇంకా అదుపులోకి రాలేదు. మంటలు భవనంలోకి రెండో అంతస్తు కూడా వ్యాప్తించాయి. ఎగిసిపడుతున్న మంటల కారణంగా భవనమంతా దట్టమైన పొగ అలుముకుంది. ఘటనా స్థలానికి చేరకున్న 10 ఫైర్ ఇంజిన్లు మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. ప్రమాద స్థలంలో దాదాపు 4 గంటలకు పైగా రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోంది. అయితే, అగ్ని ప్రమాద భవనానికి దాదాపు 100 మీటర్ల దూరంలోనే కిమ్స్ ఆసుపత్రి ఉన్నట్టు తెలుస్తోంది. దక్కన్ స్టోర్ నుంచి పొగలు ఆసుపత్రికి వరకు వెళ్తున్నట్టు సమాచారం. అగ్నిమపక సిబ్బంది భవనంలో చిక్కుకున్న ఐదుగురిని రక్షించారు. ఇదిలా ఉండగా.. దక్కన్ స్టోర్ నుంచి మంటలు పక్కనే ఉన్న మరో నాలుగు భవనాలకు వ్యాప్తి చెందాయి. తాజాగా దక్కన్ స్టోర్ బిల్డింగ్ లోపల నుంచి పేలుడు శబ్దాలు వినిపించడం ఆందోళన కలిగిస్తోంది. మంటలు ఎంతకు అదుపులోకి రాకపోవడంతో చుట్టుపక్కల ఇళ్లను అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. ఆ ప్రాంతంలో మంటలు, తీవ్రమైన పొగతో స్థానికులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. తీవ్రమైన పొగ కారణంగా ఫైర్ సిబ్బంది కూడా అస్వస్థతకు గురయ్యారు. కాగా, మంటల భయంతో స్థానికులు సురక్షిత ప్రాంతాలకు వెళ్తున్నారు. ఇక, రెస్క్యూ ఆపరేషన్ సందర్భంగా జీహెచ్ఎంసీ డీఆర్ఎఫ్ చీఫ్ విశ్వజిత్ మీడియాతో మాట్లాడారు. భవనం దగ్గరికి ఫైర్ ఇంజిన్లు వెళ్లే పరిస్థితి లేదన్నారు. అందుకే రెస్య్కూ ఆపరేషన్ ఆలస్యం అవుతుందన్నారు. ప్రాణ నష్టం జరగకుండా చుట్టుపక్కల వారిని ఖాళీ చేయిస్తున్నట్టు తెలిపారు. అవసరమైనే బిల్డింగ్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటామన్నారు. మరోవైపు.. మంటలు అదుపులోకి రాకపోతే కెమికల్స్ సాయంతో అదుపులోకి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. కాగా, మంటలు అదుపులోకి రావడానికి మరిన్ని గంటల సమయం పట్టే అవకాశం ఉంది. మంటలు ఇలాగే చెలరేగితే భవనం కూలిపోయే అవకాశం కూడా ఉందని తెలుస్తోంది. -
ఈ నెలలో ప్రతి శనివారం పాస్‌పోర్టు ప్రత్యేక డ్రైవ్
రాంగోపాల్‌పేట్: పాస్‌పోర్టు దరఖాస్తుదారుల అపాయింట్మెంట్ల కోసం సుదీర్ఘ సమయం పడుతుండటంతో డిసెంబర్ నెలలోని అన్ని శనివారాల్లో ప్రత్యేక డ్రైవ్‌ను నిర్వహిస్తున్నట్లు ప్రాంతీయ పాస్‌పోర్టు అధికారి దాసరి బాలయ్య ఒక ప్రకటనలో తెలిపారు. ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయం పరిధిలోని 5 పీఎస్కేలు, 14 పీవోపీఎస్కేల్లో ఈ డ్రైవ్‌లు కొనసాగుతాయని తెలిపారు. శనివారం నిర్వహించిన ప్రత్యేక డ్రైవ్ ద్వారా దరఖాస్తుదారులకు 3200 అపాయింట్మెంట్లు అందించినట్లు తెలిపారు. ప్రత్యేక డ్రైవ్ నిర్వహించినందుకు విదేశాంగ శాఖ అధికారులు, పోలీస్, పోస్టల్ శాఖలకు దరఖాస్తుదారులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. -
అంబులెన్స్ దొంగ అరెస్టు
రాంగోపాల్‌పేట్: కరీంనగర్ నుంచి రోగిని తీసుకుని వచ్చిన ఓ అంబులెన్స్‌ను దొంగిలించిన వ్యక్తిని చిలకలగూడ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అంబులెన్స్‌ను స్వాధీనం చేసికున్నారు. మంగళవారం ఉత్తర మండలం డీసీపీ కార్యాలయంలో అదనపు డీసీపీ వెంకటేశ్వర్లు, ఏసీపీ సుధీర్, చిలకలగూడ ఇన్స్పెక్టర్ నరేష్, డీఐ నాగేశ్వరరావులతో కలిసి డీసీపీ చందనాదీప్తి వివరాలు వెల్లడించారు. కరీంనగర్ వావిలపల్లికి చెందిన లింగంపల్లి శ్రీనివాస్ అంబులెన్స్ డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. పెద్దపల్లి జిల్లా, పాలకుర్తి మండలం, కన్నాల గ్రామానికి చెందిన రాజేందర్ పురుగుల మందు తాగి కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతడిని తీసుకుని ఈ నెల 19న శ్రీనివాస్ గాంధీ ఆస్పత్రి అత్యవసర విభాగానికి వచ్చాడు. అంబులెన్స్ తాళం చెవులు అలాగే ఉంచి రోగిని తీసుకుని ఆస్పత్రి లోపలికి వెళ్లాడు. అతను బయటికి వచ్చి చూడగా అంబులెన్స్ కనిపించ లేదు. దీంతో చిలకలగూడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా నిందితుడిని బోయిగూడ ఐడీహెచ్‌కాలనీకి చెందిన కాకి యాదగిరి అలియాస్ యాదిగా గుర్తించారు. మంగళవారం అతడి ఇంటి వద్దకు వెళ్లగా అంబులెన్స్ కూడా అక్కడే ఉంది. అతడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. -
యూ ట్యూబ్ నేర్పిన పాఠాలు
రాంగోపాల్‌పేట్: యూ ట్యూబ్ ద్వారా నకిలీ కరెన్సీ తయారీని నేర్చుకుని వాటిని ముద్రించి చెలామణి చేస్తున్న వ్యక్తిని గోపాలపురం పోలీసులు అరెస్టు చేశారు. అతడి నుంచి రూ.3.16లక్షల నకిలీ కరెన్సీని స్వాధీనం చేసికున్నారు. ఈ ఘటనలో ప్రధాన నిందితురాలైన యువతి పరారీలో ఉంది. మంగళవారం ఏసీపీ సుధీర్‌తో కలిసి డీసీపీ చందనా దీప్తి వివరాలు వెల్లడించారు. నారాయణపేట్ జిల్లా, కోస్గికి చెందిన కస్తూరి రమేష్ బాబు గత కొద్ది నెలలుగా బండ్లగూడ జాగీర్ కాళీమందిర్ ప్రాంతంలో సోదరి రామేశ్వరితో కలిసి ఉంటూ కార్ మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. గత కొంత కాలంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న అతను యూ ట్యూబ్‌లో నకిలీ కరెన్సీ ముద్రణపై తెలుసుకున్నాడు. తన సోదరి రామేశ్వరికి కంప్యూటర్ పరిజ్ఞానం ఉండటంతో ఇద్దరు కలిసి నకిలీ కరెన్సీ తయారు చేయాలని పథకం వేశారు. ఇందుకుగాను ల్యాప్‌ట్యాప్, ప్రింటర్లు, పేపర్ కట్టింగ్ మిషన్‌తో పాటు అవసరమైన సామగ్రిని కొనుగోలు చేశారు. ఇద్దరు కలిసి రూ.100, 200, 500 నోట్లను ముద్రించారు. ముద్రించిన నకిలీ కరెన్సీని కొందరు ఏజెంట్లకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. పట్టుబడిందిలా..: నాచారంలో సెక్యూరిటీ గార్డుగా పనిచేసే సాట్ల అంజయ్య తండ్రి అనారోగ్యానికి గురికావడంతో డబ్బు అవసరం కలిగింది. యూ ట్యూబ్ ద్వారా రమేష్ బాబును సంప్రదించి రూ.50వేలు చెల్లించి రూ.1.30 లక్షల విలువైన నకిలీ నోట్లను తీసుకున్నాడు. ఇందులో కొన్ని చలామణీ చేయగా మరికొంత మొత్తం మిగిలి ఉంది. వీటిని చెలామణి చేసేందుకు అంజయ్య ఈ నెల 19న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు వచ్చి రామస్వామి అనే ఫుట్‌పాత్ వ్యాపారి వద్ద పండ్లు కొనుగోలు చేసి రూ.200 నకిలీ నోటు ఇచ్చాడు. ఇది నకిలీదని గుర్తించిన అతను గోపాలపురం పోలీ సులకు సమాచారం అందించాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితున్ని అదుపులోకి తీసుకుని అదే రోజు రిమాండ్‌కు తరలించారు. అంజయ్య ఇచ్చిన సమాచారంతో రమేష్ బాబును అరెస్టు చేయగా, అతడి సోదరి రామేశ్వరి తప్పించుకుంది. వారి నుంచి ప్రింటింగ్ సామగ్రి, కారు స్వాధీనం చేసుకున్నారు. రూ.5వేల నోట్లు కూడా : నిందితులు రూ.100, 200, 500 నోట్లే కాకుండా రూ.2000, రూ.5వేల నోట్లు కూడా ముద్రించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. రూ.5వేల నోట్లను రిజర్వు బ్యాంకు ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే ముద్రిస్తుంది. వాటి నమూనాలు కూడా స్కాన్ చేసి ల్యాప్‌టాప్‌లో ఉంచుకున్నారు. దీని ఆధారంగా వాటిని కూడా ముద్రించి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. మాల్ హై హోనా క్యా.... యూ ట్యూబ్‌లో నకిలీ కరెన్సీకి సంబంధించిన అనేక వీడియోలు ఉన్నాయి. వాటి కింద నిందితులు మాల్ హై హోనా క్యా అంటూ కామెంట్ చేసి తమ ఫోన్ నంబర్ ఇచ్చేవారు. ఇలాగే ఈ కేసులో నిందితుడు కూడా వీరిని సంప్రదించాడు. వారిని హైదరాబాద్‌కు పిలిపించుకుని నకిలీ నోట్లు విక్రయించే వారు. 2021 నుంచే ముద్రణ...లక్షల్లో చెలామణి నిందితులు 2021 కరోనా తర్వాత నుంచి నకిలీ కరెన్సీని ప్రింట్ చేస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇప్పటి వరకు రూ.80లక్షల మేర నకిలీ కరెన్సీ చేతులు మారి ఉండవచ్చునని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. -
బోనాలకు ఎంతో చరిత్ర ఉంది: గవర్నర్
రాంగోపాల్‌పేట్: ఆషాఢం, శ్రావణ మాసాల్లో తెలంగాణలో నిర్వహించే బోనాల పండుగకు ఎంతో చరిత్ర ఉందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. ఉజ్జయినీ మహంకాళి అమ్మవారిని సోమవారం సాయంత్రం దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ఈవో గుత్తా మనోహర్‌రెడ్డి, అర్చకులు గవర్నర్‌కు సాదర స్వాగతం పలికారు. అనంతరం ఆమె మాట్లాడుతూ కోవిడ్‌ను అరికట్టిన తర్వాత జరుపుకొంటున్న ఈ ఏడాది బోనాల పండుగకు ప్రత్యేకత ఉందన్నారు. ఉజ్జయినీ మహంకాళి దయతో ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని, ఆమె దీవెనలు తెలంగాణ ప్రజలకు ఉండాలని కోరుకున్నానని చెప్పారు. అనంతరం.. మోండా బూరుగుశెట్టిబజార్లోని లక్ష్మీనారాయణ స్వామి దేవాలయంలో ఆమె పూజలు చేశారు. ఆర్పీరోడ్‌లోని భాగ్యనగర్ గణేష్ ఉత్స వ సమితి ఏర్పాటు చేసిన వేదిక నుంచి ప్రజలకు బోనాల శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తెలుగులో మాట్లాడిన గవర్నర్ తెలుగు ప్రజలన్నా, తెలుగు భాషన్నా తనకెంతో మక్కువన్నారు. ఈ నెల 15నుంచి ఉచితంగా వేస్తున్న బూస్టర్ డోస్‌ను అందరూ వేసుకోవాలని గవర్నర్ సూచించారు. -
ఇంటి నుంచి వెళ్లిన విద్యార్థి కిడ్నాప్.. విషయం తెలిసి తల్లిదండ్రుల షాక్
సాక్షి, రాంగోపాల్‌పేట్: ఇంటర్మీడియేట్ చదువుతున్న ఓ బాలిక కిడ్నాప్‌కు గురైంది. ఈ ఘటన గోపాలపురం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన మేరకు.. రెజిమెంటల్‌బజార్‌కు చెందిన 17 ఏళ్ల బాలిక ఇంటర్ మీడియేట్ చదువుతుంది. ఈ నెల 9వ తేదీన ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన ఆమె తిరిగి రాలేదు. తల్లిదండ్రులు తెలిసిన వారు, బంధువుల వద్ద వాకబు చేసినా ఎక్కడా కనిపించ లేదు. సాయంత్రం వేళ ఆ యువతి తన ఫోన్ నుంచి తల్లికి ఫోన్ చేసింది. తాను ఓ యువకుడిని ప్రేమిస్తున్నానని అతన్ని పెళ్లి చేసుకునేందుకు వెళుతున్నానని చెప్పి పెట్టేసి అటు తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ చేసింది. దీంతో కుటుంబ సభ్యులు గురువారం గోపాలపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: పాలిటెక్నిక్ ప్రశ్నాపత్రాలు లీక్.. ఆ రెండు పరీక్షలు రద్దు -
Hyderabad: అండగా ఉంటారనుకుంటే.. అందకుండా పోయారు..
సాక్షి, హైదరాబాద్: ఎదిగి వచ్చిన కుమారులు అండగా ఉంటారనుకున్న ఆ కుటుంబాలకు శోకమే మిగిలింది. చెట్టంత తనయులను విగతజీవులుగా చూసి భోరుమంటూ విలపించాయి. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందడంతో రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. డీసీఎం వాహనం ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు యువకుల మృతి చెందిన ఘటన శనివారం అర్ధరాత్రి రాంగోపాల్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కర్బల మైదాన్ చౌరస్తాలో జరిగింది. ఇన్స్పెక్టర్ సైదులు తెలిపిన వివరాల ప్రకారం.. న్యూ బోయిగూడకు చెందిన అరుణ్ కుమార్ కుమారుడు అఖిల్ కుమార్ (26) బీటెక్ పూర్తి చేసి అమెజాన్‌లో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు. ఓల్డ్గాస్మండికి కాలే జ్ఞానేశ్వర్ కుమారుడు రోహిత్ (26) ఈవెంట్స్ నిర్వహిస్తూ కుటుంబానికి అండగా ఉన్నాడు. చదవండి: నర్సు ఆత్మహత్య.. ఆమె చాటింగ్ పరిశీలిస్తే..! అఖిల్, రోహిత్‌లు చిన్ననాటి స్నేహితులు. రోహిత్‌కు ఈవెంట్ ఉండటంతో శనివారం రాత్రి ఇద్దరు కలిసి సామగ్రి కోసం ద్విచక్ర వాహనంపై బయటకు వెళ్లారు. నెక్లెస్‌రోడ్‌లోని పీవీ ఘాట్ మీదుగా ఇంటికి తిరిగి వస్తున్నారు. అర్ధరాత్రి 1.10 గంటల ప్రాంతంలో వీరి వాహనం నెక్లెస్ రోడ్ నుంచి కర్బల మైదాన్ చౌరస్తాకు వచ్చింది. అదే సమయంలో ట్యాంక్‌బండ్ నుంచి ప్యారడైజ్ వైపు వెళుతున్న గుర్తు తెలియని డీసీఎం వాహనం వీరి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో ద్విచక్ర వాహనం కొద్ది దూరంలో ఎగిరిపడిపోయింది. తీవ్ర గాయాలపాలైన అఖిల్, రోహిత్‌లను అంబులెన్స్‌లో కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అఖిల్ చనిపోయినట్లు వైద్యులు వెల్లడించారు. అదే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రోహిత్ ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు మరణించాడు. అఖిల్ తండ్రి అరుణ్‌కుమార్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి కారణమైన డీసీఎం వాహన డ్రైవర్ కోసం గాలింపు చేపట్టారు. చదవండి: ఇంటర్ విద్యార్థినితో పరిచయం పెంచుకొని.. పలుమార్లు అత్యాచారం. -
కరోనా భయంతో సాగర్‌లో దూకాడు
సాక్షి, హైదరాబాద్ : కరోనా లక్షణాలతో పది రోజుల నుంచి బాధపడుతున్నాడు...చికిత్స చేయాలని ఓ కార్పొరేట్ ఆస్పత్రికి వెళ్లాడు. కానీ ఆ ఆస్పత్రిలో చేర్చుకునేందుకు వారు నిరాకరించి గాంధీకి వెళ్లమన్నారు. ఊపిరి తీసుకోవడం ఇబ్బందిగా మారుతుంది. తాను ఎన్నో రోజులు బతకలేనని భావించిన ఓ వ్యక్తి హుస్సేన్ సాగర్‌లో దూకి గల్లంతయ్యాడు. ఈ ఘటన రాంగోపాల్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు, బాధితులు తెలిపిన మేరకు.. వెస్ట్ బెంగాల్‌కు చెందిన పల్టుపాన్ (34) కొద్ది సంవత్సరాల క్రితం భార్య రోమాపాన్‌తో సహా నగరానికి వచ్చి దూద్‌బౌలిలో స్థిరపడ్డారు. పల్టుపాన్ గోల్డ్‌స్మిత్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. అయితే ఆయన 10 రోజుల నుంచి జ్వరం, జలుబు, దగ్గుతో బాధపడుతున్నాడు. స్థానికంగా ఉండే ఓ క్లినిక్‌లో చికిత్స తీసుకుంటున్నా తగ్గలేదు. అయితే అక్కడి వైద్యుల సూచన మేరకు గురువారం, శుక్రవారం చికిత్స కోసం మలక్‌పేట్‌లోని యశోద ఆస్పత్రికి వెళ్లారు. ఉదయం నుంచి రాత్రి వరకు రెండు రోజుల పాటు ఆస్పత్రి చుట్టూ తిరుగుతున్నా బెడ్లు లేవని చెప్పి అతన్ని ఆస్పత్రిలో చేర్చుకునేందుకు నిరాకరించారు. తనకు శ్వాస తీసుకునేందుకు ఇబ్బంది అవుతుందని కాళ్ల వేళ్ల పడినా కనికరించకుండా గాంధీ ఆస్పత్రికి వెళ్లాలని ఉచిత సలహా ఇచ్చారు. శుక్రవారం సమస్య మరింత తీవ్రం కావడంతో పాటు శ్వాస తీసుకోవడానికి మరింత ఇబ్బంది వచ్చింది. తీవ్ర భయాందోళనకు గురైన ఆయన శుక్రవారం సాయంత్రం తన స్నేహితుడు శ్రీరాములుకు ఫోన్ చేశాడు. అతడు రాగానే తనకు శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉందని హుస్సేన్ సాగర్ వద్దకు వెళితే చల్లటి గాలి వస్తుందని అక్కడికి తీసుకుని వెళ్లాలని కోరాడు. దీంతో ఇద్దరు కలిసి రాత్రి 7.55 గంటల సమయంలో ఆటోలో ట్యాంక్‌బండ్‌కు చేరుకున్నారు. ఆటోను ట్యాంక్‌బండ్‌పై ఉండే పూజా స్టాల్ లేపాక్షి మధ్యలో నిలిపి తాను కొద్దిసేపు అలా తిరిగి వస్తానని పల్టు పాన్ ముందుకు నడుచుకుంటూ వెళ్లి హుస్సేన్ సాగర్‌లో దూకాడు. వెంటనే శ్రీరాములు దీన్ని గమనించి రాంగోపాల్‌పేట్ పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే వాళ్లు అక్కడికి చేరుకుని నీళ్లలో గాలింపు చర్యలు చేపట్టారు. కానీ అతని ఆచూకీ మాత్రం తెలియలేదు. -
భవనం పై నుంచి దూకి వివాహిత ఆత్మహత్య
హైదరాబాద్: నగరంలోని రాంగోపాల్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం వెలుగు చూసింది. ప్రేమించి పెళ్లి చేసుకొని ఏడాదిన్నర తిరగక ముందే.. భర్త మానిసిక, శారీరక వేధింపులకు గురి చేస్తుండటంతో మనస్తాపానికి గురైన యువతి భవనం పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్య చేసుకున్న యువతి నిఖిత(21)గా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
టాస్క్‌ఫోర్స్ అదుపులో రౌడీషీటర్ గొల్లకిట్టు?
రాంగోపాల్‌పేట్: ఓ హత్య కేసులో సాక్షులను బెదిరించిన కేసులో రౌడీషీటర్ గొల్లకిట్టు అలియాస్ చిన్నబోయిన కృష్ణయాదవ్‌ను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. 2012 సంవత్సరంలో గొల్లకిట్టు ..అతని అనుచరులు కలిసి శేఖర్ అనే ఆటోడ్రైవర్‌ను దారుణంగా హత్య చేశారు. ఈ కేసులో శేఖర్ తల్లి ఎం.నరసమ్మ ప్రత్యక్ష సాక్షి ఈ ఘటనలో ఆమెకు గాయాలయ్యాయి. గత కొద్ది రోజుల నుంచి నరసమ్మను కేసు వాపసు తీసుకోవాలని, రూ.10 లక్షల నగదు ఇస్తామని గొల్లకిట్టు ఒత్తిడి చేశారు. లేకపోతే మరో కుమారుడు రమేష్‌ను చంపేస్తామని బెదిరించారు. అంతేకాకుండా మే నెల 9వ తేదీన ఆమె కుమారుడు రమేష్‌ను గొల్లకిట్టు అనుచరులు మారేడుపల్లిలోని బద్రీనాథ్‌యాదవ్ కార్యాలయానికి తీసుకుని వెళ్లారు. అక్కడే గొల్లకిట్టు, బద్రీనాథ్యాదవ్తో పాటు ఈశ్వర్‌యాదవ్, సన్నీయాదవ్, శ్యాంసుందర్‌రెడ్డి తదితరులు ఉన్నారు. బలవంతంగా రమేష్‌తో సంతకాలు సేకరించారు. రమేష్ చేతిలో రూ.5 లక్షలు పెట్టి మిగతా డబ్బు కేసు వాపసు చేసుకున్న తర్వాత జాయింట్ అకౌంట్లో వేస్తామని చెప్పి బెదిరించి పంపించారు. డబ్బు తీసుకుని రమేష్ ఇంటికి వెళ్లి దాన్ని బంధువుల వద్ద దాచారు. ఆ తర్వాత నర్సమ్మ ఉత్తర మండలం డీసీపీని ఆశ్రయించడంతో 10 మంది నిందితులపై మారేడుపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. నిందితుల కోసం వేట మొదలు పెట్టారు. ఈ కేసులో ఇప్పటికే బద్రీనాథ్‌యాదవ్, సాయియాదవ్, శ్యామ్సుందరెడ్డి, రాజు యాదవ్ అలియాస్ (పురుగురాజు) పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించగా గొల్లకిట్టును అదుపులోకి తీసుకున్నారు. మిగతా నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
తలసాని తులాభారం
రాంగోపాల్‌పేట్: మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పుట్టిన రోజు సందర్భంగా అమ్మవారిని దర్శించుకున్న అనంతరం తులాభారం నిర్వహించారు. బంగారంతో (బెల్లం) తులాభారం నిర్వహించి అమ్మవారికి పూజలు చేశారు. -
ఆదాబ్..కబాబ్!
రాంగోపాల్‌పేట్: ప్యారడైజ్ హోటల్లో ఏర్పాటు చేసిన కబాబ్ ఫెస్టివల్లో వివిధ రకాల కబాబ్స్ నోరూరిస్తున్నాయి. మంగళవారం సికింద్రాబాద్ ప్యారడైజ్ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్యారడైజ్ హోటల్స్ సీఈవో గౌతమ్ గుప్త మాట్లాడుతూ సెప్టెంబర్ 30 వరకూ ఫెస్టివల్ కొనసాగుతుందన్నారు. మటన్, చికెన్, ఫిష్‌తో పాటు వెజిటేరియన్స్ కోసం ప్రత్యేక కబాబ్స్ ఏర్పాటు చేసినట్లు వివరించారు. నగరంలోని ప్యారడైజ్‌కు చెందిన 15 ఔట్లెట్స్లతో పాటు బెంగుళూరులోనూ కబాబ్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కల్మీ కబాబ్, చికెన్ టిక్కా, తందూరి చికెన్, రెష్మీ కబాబ్, గార్లిక్ కబాబ్, మటన్ కబాబ్్సలో సోలే, షీక్ కబాబ్, గులాటీ, ఫిష్‌లో ఫిష్ టిక్కా, తందూరి జింగా, కోకో ఫిష్, వెజ్‌లో పన్నీర్ టిక్కా, బూటేకే కబాబ్, చనా, ఆక్రుత్ వంటి విభిన్న రకాల టేస్ట్‌లతో అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. -
గుడికి వెళ్లిన యువతి అదృశ్యం
సికింద్రాబాద్: గుడికని ఇంట్లో చెప్పి వెళ్లిన ఓ యువతి కనిపించకుండా పోయింది. రాంగోపాల్‌పేట్ మార్కెట్ ఎస్ఐ వేణుగోపాల్ కథనం ప్రకారం... శివాజీనగర్‌కు చెందిన దిలీప్చంద్ శర్మ కుమార్తె సునయన శర్మ (25) తండ్రి చనిపోవడంతో అన్నయ్యతో కలిసి ఉంటోంది. ఈనెల 26న ఉదయం సునయన శర్మ గుడికి వెళ్తున్నానని ఇంట్లో చెప్పి వెళ్లి, సాయంత్రం అయినా తిరిగి రాలేదు. దీంతో సోదరుడు పవన్‌శర్మ బంధు, మిత్రుల ఇళ్లల్లో ఆరా తీసినా ఆచూకీ దొరక్కపోవడంతో రాత్రి మార్కెట్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. శివాజీనగర్‌లో ఉండే శ్రవన్ అనే వ్యక్తిపై తమకు అనుమానం ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సునయన శర్మ ఆచూకీ తెలిసిన వారు మార్కెట్ పోలీస్‌స్టేషన్ నంబర్ 040-27853598, 8333900083 నంబర్లకు సమాచారం అందించాలని సూచించారు. -
బండెనక బండి కట్టి...
- కోలాహలంగా ఫలహార బండ్ల ఊరేగింపు - భారీ ఎత్తున తరలివచ్చిన భక్తులు - వీఐపీలకే ప్రాధాన్యం - సామాన్య భక్తులకు అవస్థలు రాంగోపాల్‌పేట్: లష్కర్ బోనాలకు మరింత సందడిని తెచ్చే ఫలహార బండ్ల ఊరేగింపు కోలాహలంగా సాగింది. ఆదివారం తెల్లవారు జాము నుంచి రాత్రి వరకు కోలాహలం కనిపించింది. టకారాబస్తీ నుంచి ఎక్సైజ్ శాఖ మంత్రి పద్మారావు, ఓల్డ్బోయిగూడ నుంచి మాజీ కార్పొరేటర్ అత్తెల్లి మల్లికార్జున్‌గౌడ్, పాన్‌బజార్ నుంచి శీలం ప్రభాకర్‌ల ఆధ్వర్యంలో నిర్వహించిన ఫలహార బండ్ల ఊరేగింపు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కళాసీగూడ, కుమ్మరిగూడ, శివాజీనగర్, నాలాబజార్, బండిమెట్, రెజిమెంటల్ బజార్, బన్సీలాల్‌పేట్ తదితర ప్రాంతాల భక్తులు పోటీలు పడి ఫలహార బండ్ల ఊరేగింపు నిర్వహించారు. నాయకుల రాకతో భక్తులకు అసౌకర్యం ఉజ్జయినీ మహంకాళి బోనాల జాతరలో ఎప్పటిలాగే రాజకీయ నాయకుల అత్యుత్సాహం భక్తులకు ఇబ్బందులు కలిగించింది. తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు వచ్చిన సమయంలో సామాన్య భక్తులకు ఇబ్బందులు తప్పలేదు. వీరి వెంట యాభై నుంచి వంద మంది వరకు చోటా మోటా నాయకులు ఆలయంలోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించడంతో ఇబ్బందులు తలెత్తాయి. వారిని నిలువరించేందుకు పోలీసులు తంటాలు పడ్డారు. వలంటీర్లు, కొందరు నేతలు, పోలీసు అధికారులు తమ బంధుగణాన్ని, తెలిసిన వారిని నేరుగా అమ్మవారి దర్శనానికి తీసుకుని వెళ్లడం క్యూలైన్లలో ఉన్న వారి సహనానికి పరీక్ష పెట్టింది. బోనాలతో వచ్చే వారికి 20 నిమిషాల్లో దర్శనం చేయిస్తామని అధికారులు చెప్పినా.. దర్శనానికి 2 గంటలకు పైగా సమయం పట్టింది. కొంతమంది రాజకీయ నాయకులు వచ్చిన సమయంలో భక్తులు ఆగ్రహంతో వారికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పాడిపంటలతో సుఖ శాంతులతో ఉండాలని దేశవ్యాప్తంగా వర్షాలు లేక రైతు లు ఇబ్బందులు పడుతున్నారు. వర్షాలు కురిపించి కుల, మత, ప్రాంతాలకు అతీతంగా ప్రజలందరూ పాడిపంటలతో సుఖశాంతులతో ఉం డాలని అమ్మవారికి పూజలు చేశా. - మంత్రి ఈటెల వర్షాలు కురవాలని బోనం గతంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావాలని అమ్మవారిని మొక్కుకున్నా. ఇప్పుడు రాష్ట్రంలో వర్షాలు కురిసి సుభిక్షంగా ఉండాలని అమ్మవారికి బోనం సమర్పించాను. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడినందుకు మా నాన్న కేసీఆర్‌కు శుభాకాంక్షలు తెలుపుతున్నా. - కవిత,నిజామాబాద్ ఎంపీ దేశంలోనే ప్రత్యేకత తెలంగాణ ప్రజలు వైభవంగా జరుపుకునే బోనాల జాతర, బతుకమ్మ ఉత్సవాలు దేశంలోనే ప్రత్యేకత సంతరించుకున్నాయి. వర్షాలు కురిసి, గ్రామాలు సస్యశ్యామలం కావాలని మొక్కుకున్నా. - కిషన్‌రెడ్డి టీడీపీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు, మాజీ మంత్రి గీతా రెడ్డి, ఎంపీ నంది ఎల్లయ్యలు మాట్లాడుతూ వర్షాలు కురిసి రాష్ట్ర ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని మొక్కకున్నట్లు చెప్పారు. అమ్మవారి జాతరలో పాల్గొనే భక్తుల కోసం గత 25 రోజుల నుంచి కష్టపడి అన్ని శాఖల అధికారులను సమన్వయపరుస్తూ ఏర్పాట్లు పూర్తి చేసినట్లు స్థానిక ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. సైడ్‌లైట్స్ * వీఐపీల కోసం కేటాయించిన క్యూలైన్లలో అధిక సంఖ్యలో సాధారణ భక్తులు కనిపించారు. * పోలీసులే మీడియాకు పాసులు జారీ చేసినప్పటికీ.. కొన్ని చోట్ల అవి పనిచేయలేదు. కొందరు ఆలయ సిబ్బంది వాటిని చూపినా లోనికి అనుమతించలేదు. తమకు తెలిసిన వారినిమాత్రం ఎలాంటి పాసులు లేకున్నా లోనికి పంపించారు. * భక్తులు పోటెత్తడంతో గుడి లోపల, క్యూలైన్లలో పలువురు స్పృహ తప్పి పడిపోయారు. వీరిని వలంటీర్లు వైద్య శిబిరానికి తరలించి ప్రథమ చికిత్స చేయించారు. * పోలీసులు డీజేలను అధికారికంగా అనుమతించకపోయినా అనధికారికంగా ఫలహార బండ్లకు వీటిని వినియోగించారు. డీజేల హోరు..యువత కేరింతలు, డ్యాన్సులు ఉత్సవాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. * వేకువజామున 3.40 ప్రాంతంలో మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్‌రెడ్డి, కుమారుడు పురువారెడ్డితో కలిసి రాగా, మరో పది నిమిషాలకు ప్రస్తుత ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కుటుంబ సమేతంగా వచ్చారు. మాజీ, ప్రస్తుత ఎమ్మెల్యేలిద్దరూ కొద్దిసేపు ముచ్చటించుకోవడాన్ని భక్తులు ఆసక్తిగా గమనించారు. బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న మంత్రి నాయిని -
ఓవరాల్ చాంపియన్ శివ
రాంగోపాల్‌పేట్, న్యూస్‌లైన్: సికింద్రాబాద్ జీహెచ్ఎంసీ జిమ్ సీనియర్ మెంబర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గ్రేటర్ హైదరాబాద్ వెయిట్‌లిఫ్టింగ్‌లో శివ ఓవరాల్ చాంపియన్‌గా నిలిచాడు. శనివారం ఈ పోటీలను జిల్లా క్రీడాభివృద్ధి అధికారి అలీంధార్ ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రారంభించారు. 10 విభాగాల్లో జరిగిన ఈ పోటీల్లో సుమారు 100 మంది వెయిట్‌లిఫ్టర్లు ఇందులో పాల్గొన్నారు. అలాగే మహిళా వెయిట్‌లిఫ్టర్లు కూడా పాల్గొని సత్తా చాటారు. ఇటీవల జాతీయ వెయిట్‌లిఫ్టింగ్ పోటీలకు ఎన్నికైన రాహుల్ దర్శన్ 160 కేజీల విభాగంలో పాల్గొన్నాడు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో శాప్ మాజీ డెరైక్టర్ ఎల్. మోహన్‌రావు, కోచ్ ఉమేష్, లక్ష్మణ్‌యాదవ్, అసోసియేషన్ కార్యనిర్వాహక కార్యదర్శి ఎస్. రవీందర్, ప్రతినిధులు పిల్లి శ్రీనివాసరావు, ఆర్.కె.రెడ్డి, రాంపరేల్, సుందర్, శివ, ప్యాట్రిక్, రామ్ ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.