సాక్షి, హైదరాబాద్: భాగ్యలక్ష్మి అమ్మవారి ఆశీస్సులతో తెలంగాణ ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఆయన చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి బోనాల కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున కుటుంబ సమేతంగా పాల్గొని.. అమ్మవారికి అధికారికంగా పట్టువస్త్రాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
‘‘ కరోనా వంటి మహమ్మరులు రాకుండా అమ్మవారు ప్రజలందరిని కాపాడలని కోరుకున్నాను. గత సంవత్సరం వర్షాలు లేక రైతులంతా ఇబ్బంది పడ్డారు. ఈసారి అమ్మవారి ఆశీస్సులతో సమృద్ధిగా వర్షాలు పడాలి. పాడి పంటలతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలి. అఖిలపక్ష నిర్ణయానికి అనుగుణంగా పాత డెజైన్‌తో కొత్త ఉస్మానియా దవాఖాన నిర్మిస్తాం.
... హైదరాబాద్‌తో పాటు వివిధ జిల్లాల ప్రజల ఆరోగ్యాలను దెబ్బతిస్తున్న మూసి నదిని ప్రక్షాళన చేస్తున్నాం. పాత బస్తీ స్థితిగతులను మార్చేందుకు మెట్రోను విస్తరిస్తున్నాం. హైదరాబాద్ అభివృద్ధికి భారీగా నిధులు కేటాయించాం. మేడిగడ్డ బ్యారేజి కుంగడంలో కుట్ర ఉందన్న బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలపై స్పందించాలని అడిగిన విలేకర్ల ప్రశ్నకు.. దేవాలయం దగ్గర రాజకీయాలు మాట్లాడటం భావ్యం కాదు’’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment