bhagyalakshmi temple
-
చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో ఘనమైన పూజలు (ఫోటోలు)
-
అమ్మవారి ఆశీస్సులతో ప్రజలు సుభిక్షంగా ఉండాలి: మంత్రి కోమటిరెడ్డి
సాక్షి, హైదరాబాద్: భాగ్యలక్ష్మి అమ్మవారి ఆశీస్సులతో తెలంగాణ ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఆయన చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి బోనాల కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున కుటుంబ సమేతంగా పాల్గొని.. అమ్మవారికి అధికారికంగా పట్టువస్త్రాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.‘‘ కరోనా వంటి మహమ్మరులు రాకుండా అమ్మవారు ప్రజలందరిని కాపాడలని కోరుకున్నాను. గత సంవత్సరం వర్షాలు లేక రైతులంతా ఇబ్బంది పడ్డారు. ఈసారి అమ్మవారి ఆశీస్సులతో సమృద్ధిగా వర్షాలు పడాలి. పాడి పంటలతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలి. అఖిలపక్ష నిర్ణయానికి అనుగుణంగా పాత డెజైన్‌తో కొత్త ఉస్మానియా దవాఖాన నిర్మిస్తాం. ... హైదరాబాద్‌తో పాటు వివిధ జిల్లాల ప్రజల ఆరోగ్యాలను దెబ్బతిస్తున్న మూసి నదిని ప్రక్షాళన చేస్తున్నాం. పాత బస్తీ స్థితిగతులను మార్చేందుకు మెట్రోను విస్తరిస్తున్నాం. హైదరాబాద్ అభివృద్ధికి భారీగా నిధులు కేటాయించాం. మేడిగడ్డ బ్యారేజి కుంగడంలో కుట్ర ఉందన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలపై స్పందించాలని అడిగిన విలేకర్ల ప్రశ్నకు.. దేవాలయం దగ్గర రాజకీయాలు మాట్లాడటం భావ్యం కాదు’’ అని అన్నారు. -
మరి బండి సంజయ్‌కు ఆత్మసాక్షి లేదా?.. కాంగ్రెస్ స్ట్రాంగ్ కౌంటర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం వేదికగా మరోసారి పొలిటికల్ వాతావరణం హీటెక్కింది. ఈ నేపథ్యంలో బీజేపీ నేతలు ఈటల రాజేందర్, బండి సంజయ్‌పై కాంగ్రెస్ నేత మల్లు రవి సీరియస్ కామెంట్స్ చేశారు. ఈటల రాజేందర్ మాట్లాడిన తీరు అభ్యంతరకరమని ఆయన అన్నారు. కాగా, మల్లు రవి ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. భాగ్యలక్ష్మీ దేవాలయాన్ని రాజకీయ వేదిక చేసి గుడి చుట్టూ రాజకీయాలు నడిపింది బీజేపీ కాదా?. యాదగిరిగుట్టలో తడిబట్టలతో ప్రమాణం చేసినప్పుడు బండి సంజయ్‌కు ఆత్మసాక్షి లేదా?. కాంగ్రెస్‌పై చేసే ఆరోపణలకు ఆధారాలు ఉండవు. రాజకీయం కోసం అబద్ధాలతో గడుపుతున్నారు. బీజేపీ నేతలు చేసే ప్రతీ ప్రకటన అబద్ధాలతో కూడుకున్నది. బీజేపీ, బీఆర్ఎస్ కుమ్మక్కు రాజకీయాలు గత పదేళ్లుగా నడుస్తున్నవే అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉండగా, అంతకు ముందు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు ఈటల రాజేందర్ కౌంటర్ ఇచ్చారు. ఈటల మాట్లాడుతూ.. ధీరుడు ఎప్పుడూ కన్నీళ్లు పెట్టుకోడని సెటైర్లు వేశారు. అసలు రేవంత్‌తో తనకు పోలికేంటి అని వ్యాఖ్యానించారు. ఓటు నోటు కేసులో మీరు జైలుకెళ్లారు.. మీతో నాకు పోలికా? ప్రజల కోసం రేవంత్ ఎప్పుడూ జైలుకెళ్లలేదు. నేను విద్యార్థి దశ నుంచే ఎన్నో పోరాటాలు చేశాను. రేవంత్ ప్రమాణం చేస్తే ఎవరూ నమ్మరు.' అని ఈటల ఫైర్ అయ్యారు. కాగా, మునుగోడు ఉపఎన్నికలకో కాంగ్రెస్‌కు సీఎం కేసీఆర్ రూ.25 కోట్లు ఇచ్చారని ఈటల ఆరోపించిన విషయం తెలిసిందే. -
ప్రజల కోసం, ధర్మం కోసం మాట్లాడా: ఈటల
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నిక కోసం బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌కు ముడుపులు అందాయన్న ఈటల రాజేందర్ కామెంట్లతో తెలంగాణలో పొలిటికల్ హీట్ పెరిగింది. దేవుడి మీద ప్రమాణం చేద్దామంటూ రేవంత్ రెడ్డి పాతబస్తీ భాగ్యలక్ష్మి ఆలయం వద్దకు చేరుకున్నారు. ఈ క్రమంలో.. ఇంట్లోనే ఉండిపోయిన ఈటల.. శనివారం సాయంత్రం బయట మీడియాతో మాట్లాడారు. ‘‘నేను వ్యక్తిగతంగా ఏం మాట్లాడలేదు. ఆత్మసాక్షిగానే చెప్పా. నేను ఎవరినీ కించపరిచే వ్యక్తిని.. గాయపరిచే వ్యక్తిని కాను. నేను వ్యక్తుల కోసం మాట్లాడలేదు.. ప్రజల కోసం, ధర్మం కోసం మాట్లాడా’’ అని పేర్కొన్నారు ఈటల. సంపూర్ణంగా అందరూ మాట్లాడిన తర్వాత నేను మాట్లాడ్తా. రేపు(ఆదివారం) మాట్లాడతా.. అందరికీ సమాధానం చెప్తా. ఓ పొలిటికల్ లీడర్ కు కావాల్సింది కాన్ఫిడెంట్. నీ మీద నీకు నమ్మకం లేకపోతే కదా దేవుడిపై విశ్వాసం. గుళ్లకు వెళ్లి అమ్మతోడు.. అయ్యతోడు అనడం ఇదేమి కల్చర్?. ఇప్పుడున్న రాజకీయాలపై మాట్లాడిన. ఎవరెన్ని మాట్లాడినా.. ప్రజల కోసం ఈటల రాజేందర్ మాట్లాడతాడు. వ్యక్తిగతంగా నేనేం మాట్లాడలేదు అని తెలిపారాయన. కేసీఆర్ వ్యతిరేకంగా రేవంత్ పోరాడడం లేదని నేను అనలేదు. తాటాకు చప్పుళ్లకు భయపడే రకం ఈటల కాదు. నిజమెంతో, అబద్ధ ఏంటో ప్రజలే తేలుస్తారు. నా ఆత్మ సాక్షి ప్రకారమే నేను మాట్లాడా అని ఈటల తెలిపారు. ఎంత మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కేసీఆర్ ప్రాపకంతో బతుకుతున్నారో తెలియదా? అంటూ రేవంత్ సవాల్లో పాల్గొనకుండానే బదులిచ్చారు ఈటల. -
‘ఓటుకు నోటు వ్యవహారంపై రేవంత్ ప్రమాణం చేస్తారా?’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఒక్కసారిగా పొలిటికల్ హీట్ పెరిగింది. బీజేపీ, కాంగ్రెస్ నేతలు ఒకరిపై ఒకరు సవాల్ విసురుకుంటున్నారు. కాగా, మునుగోడు ఎన్నికల్లో సీఎం కేసీఆర్.. కాంగ్రెస్‌కు రూ. 25కోట్లు ఇచ్చారని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆరోపణలు చేశారు. దీంతో, ఈటల తన ఆరోపణలు నిరూపించుకోవాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. ఈ నేపథ్యంలో చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మీ ఆలయం వద్ద ప్రమాణానికి రేవంత్ సిద్దమయ్యారు. కాగా, భాగ్యలక్ష్మి ఆలయానికి ఈటల రావాలని రేవంత్ డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో బీజేపీ నేత డీకే అరుణ స్పందించారు. తాజాగా డీకే అరుణ మాట్లాడుతూ.. ఓటుకు నోటు వ్యవహారంపై రేవంత్ ప్రమాణం చేస్తారా?. ఈటల రాజేందర్ చెప్పింది నూటికి నూరు శాతం నిజం. మునుగోడు ఎన్నికల్లో కాంగ్రెస్‌కు బీఆర్ఎస్ సహకరించింది. దుబ్బాక ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒక్కటైన మాజ నిజం కాదా? వాస్తవం చెబితే రేవంత్‌కు ఎందకంత ఉలికిపాటు అంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఇక, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్.. భాగ్యలక్ష్మి గుడికి రావొద్దని ఫైర్ అయ్యారు. రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. రేవంత్ గత చరిత్ర ప్రజలందరికీ తెలిసిందే. పబ్లిక్‌లో రేవంత్‌కు బ్లాక్ మెయిలర్ అనే పేరుంది. రాజకీయాల్లోకి వచ్చాక పదవులను అడ్డం పెట్టుకుని బ్లాక్ మెయిల్ చేసి వేల కోట్లు దోచుకున్న రేవంత్ ఇప్పుడు భాగ్యలక్ష్మి గుడి వద్ద ప్రమాణాలంటే నమ్మేదెవరు?. లెక్కలేనన్ని తప్పుడు పనులు చేస్తున్న రేవంత్ భాగ్యలక్షి గుడిలో అడుగు పెడితే, ఆ దేవాలయం అపవిత్రం అవుతుందనేది భక్తుల భావన. ఈటల రాజేందర్, నేను ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి పార్టీ మారామే కానీ నీ మాదిరిగా ఒక పార్టీ ద్వారా వచ్చిన ఎమ్మెల్యే పదవితో మరో పార్టీలో చేరలేదని తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ హైకమాండ్ పెద్దలకు డబ్బులు ఇచ్చి పీసీసీ అధ్యక్ష పదవిని కొనుకున్నాడు. కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కవితతో కలిసి వ్యాపార లావాదేవీలు చేసింది వాస్తవం కాదా?. ఆమెతో నీకు వ్యాపార భాగస్వామ్యం లేదా, ఓటుకు నోటు కేసులో లక్షల రూపాయల నోట్ల కట్టలతో రెడ్ హ్యాండెడ్‌గా దొరికి జైలుకు వెళ్లిన చరిత్ర రేవంత్‌ది అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మరోవైపు, బీజేపీ నేతల ఆరోపణలపై కాంగ్రెస్ నేత పాల్వాయి స్రవంతి స్పందించారు. తాజాగా స్రవంతి మాట్లాడుతూ.. కేంద్ర దర్యాప్తు సంస్థలు బీజేపీ చేతిలోనే ఉన్నాయి. కాంగ్రెస్‌కు బీఆర్ఎస్ రూ.25 కోట్లు ఇస్తే ఏం చేస్తున్నారు?. బీజేపీలోకి చేరికలు లేకపోవడంతో ఈటల రాజేందర్ ఆవేదనలో ఉన్నారు అంటూ ఘాటుగా విమర్శలు చేశారు. -
భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న అస్సోం సీఎం
చార్మినార్: తెలంగాణ రాష్ట్రంలో కేవలం ఒకే కుటుంబం మాత్రమే బాగుపడుతోందని..ఇది సరైన పద్ధతి కాదని అస్సోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా అన్నారు. శుక్రవారం చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి దేవాలయాన్ని సందర్శించిన ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించి సామూహిక హారతిలో పాల్గొన్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో అన్ని కుటుంబాలు బాగుపడితేనే ఆర్థిక అభివృద్ధి సాధ్యమన్నారు. ప్రస్తుతం ఇక్కడ కేవలం ఒక కుటుంబం మాత్రమే బాగుపడుతోందని....ఇది సరైంది కాదని ఆయన పేర్కొన్నారు. -
భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న సీఎం యోగి
తెలంగాణలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల నేపథ్యంలో కాషాయ పార్టీకి చెందిన సీఎంలు, కేంద్ర మంత్రులు హైదరాబాద్‌కు చేరుకుంటున్నారు. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ కూడా నగరానికి చేరుకున్నారు. కాగా, సీఎం యోగి.. ఆదివారం ఉదయం చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సీఎంతో యోగితో తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్, ఎమ్మెల్యే రాజాసింగ్ సహా పలువురు బీజేపీ నేతలు ఉన్నారు. సీఎం యోగి ఆలయానికి వస్తున్న నేపథ్యంలో పోలీసులు చార్మినార్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రతీ ఒక్కరిని క్షుణ్ణంగా తనిఖీలు చేసి పంపిస్తున్నారు. #WATCH | Telangana: Uttar Pradesh Chief Minister and BJP leader Yogi Adityanath offers prayers at Shri BhagyaLaxmi Mandir, Charminar in Hyderabad. pic.twitter.com/VskBaSBRYE — ANI (@ANI) July 3, 2022 -
సీఎం యోగి.. భాగ్యలక్ష్మి టెంపుల్ పర్యటనలో మార్పు
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు ఆ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా వివిధ శాఖల మంత్రులు, పార్టీ ప్రతినిధులు శుక్రవారం నగరానికి చేరుకున్నారు. కాగా, శనివారం ప్రధాని నరేంద్ర మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ సహా మరికొందరు నేతలు భాగ్య నగరానికి రానున్నారు. ఇదిలా ఉండగా.. హైదరాబాద్ పర్యటనలో భాగంగా షెడ్యూల్ ప్రకారం యూపీ సీఎం యోగి.. నేడు(శనివారం) చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకోవాల్సి ఉంది. కానీ, కొన్ని అనివార్య కారణాల కారణంగా యోగి ఆదిత్యానాథ్.. రేపు(ఆదివారం) భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకోకున్నారు. ఇది కూడా చదవండి: కమలోత్సాహం! భాగ్యనగరం కాషాయమయం.. -
బండి సంజయ్.. భాగ్యలక్ష్మి గుడి దగ్గర ముక్కు నేలకు రాయి
సాక్షి, హైదరాబాద్: రైతులను రెచ్చగొట్టి పక్కకు తప్పుకున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలం గాణ రైతాంగానికి క్షమాపణ చెప్పి భాగ్యలక్ష్మి గుడి దగ్గర ముక్కు నేలకు రాయాలని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి డిమాండ్ చేశారు. యాసంగి వడ్లను కొనిపించే బాధ్యత తనదని, రైతులు వరి వేయాలని కోరిన బండి సంజయ్.. ఆ తరువాత మొహం చాటేశారన్నారు. ఆయన ఇప్పుడు సీఎం కేసీఆర్‌కు లేఖ రాయడం చూస్తుంటే నవ్విపోదురు గాక నాకేంటి సిగ్గు అన్నట్లుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం మద్దతు ధరలు ప్రకటించిన 14 పంటల్లో పొద్దు తిరుగుడు మినహా మరే పంట సాగు చేసినా రైతులకు గిట్టుబాటు కాదని విమర్శించారు. చదవండి👉🏼 ఆరు నెలల్లో తెలంగాణ అసెంబ్లీ రద్దు! బండి సంజయ్‌కు చేతనైతే గతంలో ప్రధాని మోదీ ఇచ్చిన వాగ్దానం మేరకు స్వామినాథన్ కమిటీ సిఫారసుల ప్రకారం సీ+50 ప్రకారం పంటలకు మద్దతు ధరలు ప్రకటించాలని.. లేకుంటే నోరు మూసుకొని కూర్చోవాలని హితవు పలికారు. హైదరాబాద్ కార్పొరే టర్లతో ఢిల్లీకి వెళ్లి ప్రధానిని కలిసిన కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లు హైదరాబాద్ అభివృద్ధి కోసం పావలా అయినా తీసుకొచ్చారా? అని నిలదీశారు. చదవండి👉🏼 అడుగడుగునా ట్రాఫికర్.. నలుదిక్కులా దిగ్బంధనం -
చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయంలో టీ కాంగ్రెస్ పూజలు
సాక్షి, హైదరాబాద్: పాత బస్తీలోని చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయ అమ్మవారికి తెలంగాణ కాంగ్రెస్ నేతలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉద్రిక్తత నడుమ శుక్రవారం ఉదయమే భట్టి , వీహెచ్ , సీతక్క, అంజనీయాదవ్.. తదితర నేతలు ఆలయానికి చేరుకున్నారు. బండి సంజయ్ సవాల్ నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు భాగ్యలక్ష్మి అమ్మవారిని సందర్శించుకోవడం విశేషం. అదే సమయంలో.. పార్టీ అధినేత్రి సోనియా గాంధీ కరోనా త్వరగా కోలుకోవాలని ప్రత్యేక పూజలు చేయించారు కాంగ్రెస్ నేతలు. కాంగ్రెస్ పార్టీకి దమ్ముంటే భాగ్యలక్ష్మి దేవాలయం మీద చేయి వేయాలంటూ.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సవాల్ విసిరారు. బండికి రాసి ఇవ్వలేదు తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చిన మా అధినేత్రి సోనియా గాంధీకి కొవిడ్ వచ్చింది. ఆమె త్వరగా కోలుకోవాలని పూజ చేశాం. అమ్మవారిని పూజించడం ఎప్పటి నుంచో ఉంది. బండి సంజయ్ పుట్టిన తర్వాతే పూజలు చేయడం లేదు. ఇదేం బండి సంజయ్‌కి రాసి ఇవ్వలేదు. కాంగ్రెస్ భావజాలం తెలిసిన వాళ్ళు అలా మాట్లాడరు అంటూ సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క పేర్కొన్నారు. అమ్మవారు అందరికీ దేవత. హిందువులు అసహ్యించుకునేలా ఉంది బీజేపీ నేతల ప్రవర్తన. రెచ్చగొట్టి రాజకీయంగా లబ్ధిపొందాలని బీజేపీ ప్రయత్నిస్తోంది అంటూ విమర్శించారాయన. -
చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయానికి పోటెత్తిన భక్తులు ఫొటోలు
-
సంజయ్ పాదయాత్ర చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం నుంచి షురూ
-
నేటి నుంచే బీజేపీ ప్రజా సంగ్రామ యాత్ర
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పార్టీ బలోపేతం లక్ష్యంగా బీజేపీ చేపడుతున్న ‘ప్రజా సంగ్రామ యాత్ర’ శనివారం నుంచి మొదలవుతోంది. భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ శనివారం ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించి.. పాదయాత్ర మొదలుపెట్టనున్నారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఇన్చార్జి తరుణ్‌చుగ్, ఇతర ముఖ్య నేతలు జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారం భించనున్నారు. తొలిరోజు కళాబృందాలు, సాం స్కృతిక కార్యక్రమాల ద్వారా పాదయాత్ర లక్ష్యా లు, ఉద్దేశాలను వివరించనున్నారు. ఇందుకోసం కరీంనగర్ నుంచి డోలు వాయిద్యాలు, డప్పు నృత్యాలు, అశ్వదళాల ప్రదర్శన, యుద్ధసైనికుల అలంకారాల్లో బీజేపీ కార్యకర్తలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. అక్టోబర్ 2వ తేదీ వరకు 36 రోజుల పాటు పాదయాత్ర సాగనుంది. రోజుకు 10–15 కిలోమీటర్లు.. ‘ప్రజా సంగ్రామ యాత్ర’లో భాగంగా బండి సంజయ్ రోజూ పది, పదిహేను కిలోమీటర్లు నడుస్తూ ప్రజలను కలవనున్నారు. ఒక్కో జిల్లాలో రెండు, మూడురోజులు యాత్ర సాగేలా.. రోజూ ఒకట్రెండు సభల్లో ప్రసంగాలు ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. యాత్ర పొడవునా సంజయ్ వెంట 300 వరకు ఉంటారని.. వారికితోడుగా పాదయాత్ర కొనసాగుతున్న జిల్లాలకు చెందిన వెయ్యి మంది కార్యకర్తలు, అదనంగా ఎక్కడికక్కడ స్థానిక కార్యకర్తలు బృందం వెంట నడుస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. మొత్తంగా ప్రతీరోజు రెండువేల మందితో యాత్ర సాగేలా ఏర్పాట్లు చేసినట్టు వెల్లడించాయి. సంజయ్ వెంట ఉండే బృందం రోజూ రాత్రి గుడారాలు ఏర్పాటు చేసుకుని బసచేస్తుందని తెలిపాయి. 17న అమిత్‌షా.. ముగింపు రోజున నడ్డా.. సెప్టెంబర్ 17న హైదరాబాద్ విమోచన దినోత్సవం సందర్భంగా నిజామాబాద్‌లో ఏర్పాటు చేసే బహిరంగసభలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా పాల్గొంటారని బీజేపీ వర్గాలు తెలిపాయి. అక్టోబర్ 2న యాత్ర ముగింపు కార్యక్రమానికి పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరవుతారని వెల్లడించాయి. ఇక హుజూరాబాద్ ఉప ఎన్నిక నోటిఫికేషన్ వెలువడిన వెంటనే.. పాదయాత్ర హుజూరాబాద్‌కు చేరుకునేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. తొలిరోజు యాత్ర ఇదీ.. శనివారం ఉదయం 9.30 సమయంలో బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకుంటారు. వేములవాడ రాజన్న ఆలయ వేద పండితుల ఆశీస్సులు తీసుకుని.. చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి వస్తారు. అక్కడ ప్రత్యేక పూజలు చేస్తారు. సమీపంలోనే ఏర్పాటు చేసిన సభలో ›‘ప్రజా సంగ్రామ యాత్ర’ సమర శంఖం పూరిస్తారు. తొలిరోజున భాగ్యలక్ష్మి ఆలయం వద్ద మొదలయ్యే పాదయాత్ర.. మదీనా, బేగంబజార్ల మీదుగా ఎగ్జిబిషన్ గ్రౌండ్‌కు చేరుకుంటుంది. అక్కడ మధ్యాహ్న భోజనం చేశాక నాంపల్లి మీదుగా అసెంబ్లీ వద్దకు చేరుతుంది. గన్‌పార్క్‌లోని అమరవీరుల స్తూపం వద్ద, సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ విగ్రహానికి, అసెంబ్లీ ఆవరణలోని మహాత్మాగాంధీ, అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళి అర్పిస్తారు. తర్వాత లక్డీకాపూల్, మాసబ్‌ట్యాంక్ మీదుగా మెహిదీపట్నం చేరుకుని రాత్రి బస చేస్తారు. తొలిరోజు కార్యక్రమంలో ఎంపీలు అరవింద్, బాపురావు, ఎమ్మెల్యేలు రాజాసింగ్, రఘునందన్‌రావు, సీనియర్ నేతలు డీకే అరుణ, కె.లక్ష్మణ్, మురళీధర్‌రావు, విజయశాంతి, పొంగులేటి సుధాకర్‌రెడ్డి పాల్గొననున్నారు. -
కేసీఆర్ జైలుకు వెళ్లటం ఖాయం
-
హైదరాబాద్‌లో అమిత్‌షా పర్యటన
-
ఫోర్జరీ లేఖపై సీఎం స్పందిస్తారనుకున్నాం
-
భాగ్యలక్ష్మీ ఆలయానికి చేరుకున్న బండి సంజయ్
-
భాగ్యలక్ష్మీ ఆలయానికి ఎవరైనా వెళ్లొచ్చు
-
భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రధాని సతీమణి పూజలు
హైదరాబాద్: నగరంలోని చార్మినార్ వద్ద ఉన్న చారిత్రాత్మక భాగ్యలక్ష్మి ఆలయాన్ని ప్రధాని నరేంద్రమోదీ సతీమణి జశోద బేన్ సందర్శించారు. శనివారం ఉదయం ఆలయానికి విచ్చేసిన ఆమె అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. -
ఉగ్రవాదుల టార్గెట్‌లో భాగ్యలక్ష్మి ఆలయం: డీసీపీ
చార్మినార్ వద్ద గల భాగ్యలక్ష్మి ఆలయం చాలా కాలంగా ఉగ్రవాదుల టార్గెట్‌లో ఉందని, అందువల్ల ఈ ఆలయం చుట్టూ సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటుచేశామని హైదరాబాద్ దక్షిణ మండలం డీసీపీ సత్యనారాయణ తెలిపారు. రంజాన్ మాసంలోని చివరి శుక్రవారం కావడంతో నగరంలోని పాతబస్తీ ప్రాంతంలో పటిష్ఠమైన బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. ఒక ఐజీ స్థాయి అధికారితో 2 వేల మంది పోలీసులతో బందోబస్తు ఉందని తెలిపారు. ఈ సందర్భంగా భాగ్యలక్ష్మి ఆలయం, మక్కా మసీదులలో భద్రతను ఆయన సమీక్షించారు. నెట్ చాటింగ్, మొబైల్ సంభాషణలను ట్రాక్ చేయడం ద్వారానే ఉగ్రవాదుల అరెస్టు సాధ్యమైందని డీసీసీ సత్యనారాయణ వెల్లడించారు. ఇంటర్నెట్ కార్యకాలాపాలపై నిఘా పెంచామని, సున్నితమైన ప్రాంతాలలో భద్రతను మరింత పెంచామని ఆయన చెప్పారు.