సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నిక కోసం బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌కు ముడుపులు అందాయన్న ఈటల రాజేందర్ కామెంట్లతో తెలంగాణలో పొలిటికల్ హీట్ పెరిగింది. దేవుడి మీద ప్రమాణం చేద్దామంటూ రేవంత్ రెడ్డి పాతబస్తీ భాగ్యలక్ష్మి ఆలయం వద్దకు చేరుకున్నారు. ఈ క్రమంలో..
ఇంట్లోనే ఉండిపోయిన ఈటల.. శనివారం సాయంత్రం బయట మీడియాతో మాట్లాడారు. ‘‘నేను వ్యక్తిగతంగా ఏం మాట్లాడలేదు. ఆత్మసాక్షిగానే చెప్పా. నేను ఎవరినీ కించపరిచే వ్యక్తిని.. గాయపరిచే వ్యక్తిని కాను. నేను వ్యక్తుల కోసం మాట్లాడలేదు.. ప్రజల కోసం, ధర్మం కోసం మాట్లాడా’’ అని పేర్కొన్నారు ఈటల. సంపూర్ణంగా అందరూ మాట్లాడిన తర్వాత నేను మాట్లాడ్తా. రేపు(ఆదివారం) మాట్లాడతా.. అందరికీ సమాధానం చెప్తా.
ఓ పొలిటికల్ లీడర్ కు కావాల్సింది కాన్ఫిడెంట్. నీ మీద నీకు నమ్మకం లేకపోతే కదా దేవుడిపై విశ్వాసం. గుళ్లకు వెళ్లి అమ్మతోడు.. అయ్యతోడు అనడం ఇదేమి కల్చర్?. ఇప్పుడున్న రాజకీయాలపై మాట్లాడిన. ఎవరెన్ని మాట్లాడినా.. ప్రజల కోసం ఈటల రాజేందర్ మాట్లాడతాడు. వ్యక్తిగతంగా నేనేం మాట్లాడలేదు అని తెలిపారాయన.
కేసీఆర్ వ్యతిరేకంగా రేవంత్ పోరాడడం లేదని నేను అనలేదు. తాటాకు చప్పుళ్లకు భయపడే రకం ఈటల కాదు. నిజమెంతో, అబద్ధ ఏంటో ప్రజలే తేలుస్తారు. నా ఆత్మ సాక్షి ప్రకారమే నేను మాట్లాడా అని ఈటల తెలిపారు. ఎంత మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కేసీఆర్ ప్రాపకంతో బతుకుతున్నారో తెలియదా? అంటూ రేవంత్ సవాల్‌లో పాల్గొనకుండానే బదులిచ్చారు ఈటల.
Comments
Please login to add a commentAdd a comment