![BJP MP Etela Rajender Political Counter To CM Revanth](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2024/08/16/etela1.jpg.webp?itok=BJ0q2mXk)
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ చేస్తున్న తప్పులపై చిట్టాపద్దు సిద్ధం చేస్తున్నామన్నారు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్. కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతున్న రుణమాఫీ పెద్ద బోగస్ అంటూ ఘాటు విమర్శలు చేశారు.
కాగా, మాల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్ తప్పులను అవసరం వచ్చినప్పుడు ప్రజల ముందు లెక్కలతో సహా బయటపెడతాం. రాష్ట్ర ప్రభుత్వం రైతు రుణమాఫీ బోగస్. రుణ మాఫీ చేయని రైతులకు ఎందుకు ఇవ్వడం లేదో చెప్పాలి. రుణమాఫీ ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారు. హైదరాబాద్‌లో కూల్చివేతలను వ్యతిరేకిస్తున్నాను. ఎఫ్‌టీఎల్ భూములు ప్రభుత్వ భూములు కావు.
హైడ్రా పేరుతో చేస్తున్న ప్రభుత్వ హైడ్రామా చేస్తోంది. కట్టిన ఇళ్లను ఎందుకు కూల్చివేస్తున్నారు. ఎఫ్‌టీఎల్‌లో భూములున్న వారికి ప్రత్యామ్నాయ భూములు ఇవ్వాలి. బీజేపీలో స్తబ్ధత లేదు.. ఎన్నికల సమయంలో చూపించాల్సిన దూకుడు చూపిస్తాం. సంస్థాగత ఎన్నికల్లో బీజేపీ సత్తా చూపిస్తుంది. బీజేపీలో బీఆర్‌ఎస్ విలీనం పెద్ద అబద్ధం. ఇదంతా తప్పుడు ప్రచారం. బీజేపీలో అలాంటి చర్చ జరగలేదు’ అంటూ కామెంట్స్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment