TPCC Chief Revanth Reddy Challenge Etela Rajender Over BRS Bribe Allegations - Sakshi
Sakshi News home page

కేసీఆర్‌ నుంచి పైసలు తీస్కునే ఖర్మ నాకేందీ?.. దేవుడి మీద ఒట్టేద్దాం.. ఈటలకు రేవంత్‌రెడ్డి సవాల్‌

Published Fri, Apr 21 2023 5:55 PM | Last Updated on Fri, Apr 21 2023 6:06 PM

Revanth Reddy Challenge Etela Rajender Over BRS Bribe Allegations - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి, బీజేపీ హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ వ్యాఖ్యలపై మండిపడ్డారు. బీఆర్‌ఎస్‌ నుంచి రేవంత్‌ డబ్బులు తీసుకున్నారన్న ఈటల ఆరోపణలపై స్పందిస్తూ.. రేవంత్‌ సవాల్‌ విసిరారు. 

రేపు(శనివారం, ఏప్రిల్‌ 22) సాయంత్రం ఆరు గంటలకు భాగ్యలక్ష్మి టెంపుల్‌ దగ్గరకు వస్తా. బీఆర్‌ఎస్‌ నుంచి డబ్బులు తీసుకోలేదని ప్రమాణం చేస్తా. ఈటల కూడా వచ్చి ప్రమాణం చేయాలి. ఈ విషయంలో ఈటల దిగజారి మాట్లాడుతున్నారు అంటూ రేవంత్‌ మండిపడ్డారు. భాగ్యలక్ష్మి టెంపుల్‌ వద్దంటే.. నువ్వు చెప్పిన గుడి వద్దకే వస్తా. నేను డబ్బులు తీసుకోలేదని దేవుడిపై ఒట్టేసి చెప్తా. నా సవాల్‌ స్వీకరించి గుడికి వచ్చి ఈటల ప్రమాణం చేయాలి అని రేవంత్‌రెడ్డి సవాల్‌ విసిరారు.

‘‘ఆరు నెలలు అయితే రాష్ట్రమే గుంజుకుంటాం..కేసీఆర్ దగ్గర రూ. 25 కోట్లు తీసుకుంటమా?. విచక్షణ మరచిపోయి మాట్లాడితే ఎలా?. రేవంత్ రెడ్డి అంటే ఈటల ఏమనుకుంటున్నాడు?. కేసీఆర్‌కు వ్యతిరేకంగా రేవంత్‌రెడ్డి కాకుండా ఇంకెవరు కొట్లాడారు. నాపైన ఈటల చేసిన ఆరోపణకు తెలంగాణ సమాజానికి స్పష్టత ఇవ్వదలుచుకున్నా’’ అని రేవంత్‌ పేర్కొన్నారు.  నా పోరాటాన్ని ఈటల కించపరిచారు. రేపు సాయంత్రం 6 గంటలకు చార్మినార్  భాగ్యలక్ష్మి ఆలయం దగ్గర సిద్దంగా ఉండు. అగ్నిపరీక్షకు నేను సిద్ధంగా ఉన్నా. ఈటల తాత్కాలిక దిగజారుడు రాజకీయాలు చేయడం దుర్మార్గం అని పేర్కొన్నారాయన. 

అంతకు ముందు మీడియాతో చిట్‌చాట్‌ సందర్భంగా రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పార్టీలో ఉన్న పెద్దవాళ్ల కంటే ఎస్సీ, ఎస్టీ‌‌ , బీసీ నాయకులే మునుగోడు ఎన్నికలకు సహాయం చేసారు. ఆ టైంలో పార్టీలో ఉన్న ముఖ్య నాయకులందరినీ సహాయం చేయాలని అడిగా. కానీ, ఉన్నత వర్గాల వారు ఎవరు సహాయం చేయలేదు అని పేర్కొన్నారాయన.

ఇదీ చదవండి: నోరు జారిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement