చార్మినార్: తెలంగాణ రాష్ట్రంలో కేవలం ఒకే కుటుంబం మాత్రమే బాగుపడుతోందని..ఇది సరైన పద్ధతి కాదని అస్సోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా అన్నారు. శుక్రవారం చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి దేవాలయాన్ని సందర్శించిన ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించి సామూహిక హారతిలో పాల్గొన్నారు.
అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో అన్ని కుటుంబాలు బాగుపడితేనే ఆర్థిక అభివృద్ధి సాధ్యమన్నారు. ప్రస్తుతం ఇక్కడ కేవలం ఒక కుటుంబం మాత్రమే బాగుపడుతోందని....ఇది సరైంది కాదని ఆయన పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment