
తెలంగాణలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల నేపథ్యంలో కాషాయ పార్టీకి చెందిన సీఎంలు, కేంద్ర మంత్రులు హైదరాబాద్‌కు చేరుకుంటున్నారు. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్ ముఖ‍్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ కూడా నగరానికి చేరుకున్నారు.
కాగా, సీఎం యోగి.. ఆదివారం ఉదయం చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సీఎంతో యోగితో తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్, ఎమ్మెల్యే రాజాసింగ్ సహా పలువురు బీజేపీ నేతలు ఉన్నారు. సీఎం యోగి ఆలయానికి వస్తున్న నేపథ్యంలో పోలీసులు చార్మినార్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రతీ ఒక్కరిని క్షుణ్ణంగా తనిఖీలు చేసి పంపిస్తున్నారు.
#WATCH | Telangana: Uttar Pradesh Chief Minister and BJP leader Yogi Adityanath offers prayers at Shri BhagyaLaxmi Mandir, Charminar in Hyderabad. pic.twitter.com/VskBaSBRYE
— ANI (@ANI) July 3, 2022