
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు ఆ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా వివిధ శాఖల మంత్రులు, పార్టీ ప్రతినిధులు శుక్రవారం నగరానికి చేరుకున్నారు. కాగా, శనివారం ప్రధాని నరేంద్ర మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ సహా మరికొందరు నేతలు భాగ్య నగరానికి రానున్నారు.
ఇదిలా ఉండగా.. హైదరాబాద్ పర్యటనలో భాగంగా షెడ్యూల్ ప్రకారం యూపీ సీఎం యోగి.. నేడు(శనివారం) చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకోవాల్సి ఉంది. కానీ, కొన్ని అనివార్య కారణాల కారణంగా యోగి ఆదిత్యానాథ్.. రేపు(ఆదివారం) భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకోకున్నారు.
ఇది కూడా చదవండి: కమలోత్సాహం! భాగ్యనగరం కాషాయమయం..