ఉగ్రవాదుల టార్గెట్లో భాగ్యలక్ష్మి ఆలయం: డీసీపీ
చార్మినార్ వద్ద గల భాగ్యలక్ష్మి ఆలయం చాలా కాలంగా ఉగ్రవాదుల టార్గెట్లో ఉందని, అందువల్ల ఈ ఆలయం చుట్టూ సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటుచేశామని హైదరాబాద్ దక్షిణ మండలం డీసీపీ సత్యనారాయణ తెలిపారు. రంజాన్ మాసంలోని చివరి శుక్రవారం కావడంతో నగరంలోని పాతబస్తీ ప్రాంతంలో పటిష్ఠమైన బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. ఒక ఐజీ స్థాయి అధికారితో 2 వేల మంది పోలీసులతో బందోబస్తు ఉందని తెలిపారు. ఈ సందర్భంగా భాగ్యలక్ష్మి ఆలయం, మక్కా మసీదులలో భద్రతను ఆయన సమీక్షించారు.
నెట్ చాటింగ్, మొబైల్ సంభాషణలను ట్రాక్ చేయడం ద్వారానే ఉగ్రవాదుల అరెస్టు సాధ్యమైందని డీసీసీ సత్యనారాయణ వెల్లడించారు. ఇంటర్నెట్ కార్యకాలాపాలపై నిఘా పెంచామని, సున్నితమైన ప్రాంతాలలో భద్రతను మరింత పెంచామని ఆయన చెప్పారు.