సింగపూర్: కోవిడ్–19 కారణంగా సింగపూర్ నగరంలో తెలంగాణ కల్చరల్ సొసైటీ సింగపూర్(టీసీఎస్ఎస్) ఆధ్వరంలో బోనాల ఉత్సవాలు నిరాండంబరంగా జరిగాయి. సుంగేకేడుట్లోని అరసకేసరి శివన్ దేవాలయంలో సింగపూర్ ప్రభుత్వం, ఆలయ నిబంధనలకు అనుగుణంగా భౌతిక దూరం పాటిస్తూ భక్తి శ్రద్ధలతో బోనాలు సమర్పించారు.
సమస్త ప్రజలపై ఆ మహంకాళి తల్లి ఆశీస్సులు ఉండాలని, ప్రపంచాన్ని కరోనా కోరల నుండి కాపాడాలని ప్రత్యేక పూజలు చేసినట్టు సభ్యులు తెలిపారు. ఏటా జరిగే ఈ ఉత్సవాల్లో సుమారు 1000 మంది భక్తులు పాల్గొనేవారు. సంస్థకు చెందిన గర్రెపల్లి కస్తూరి శ్రీనివాస్, గొనే రజిత నరేందర్ రెడ్డి, గడప స్వాతి రమేశ్, బండ శ్రీదేవి మాధవ రెడ్డి దంపతులు బోనాలు సమర్పించారు.
సొసైటీ తరపున అధ్యక్షుడు నీలం మహేందర్, ప్రధాన కార్యదర్శి బసిక ప్రశాంత్ రెడ్డి, ఉపాధ్యక్షులు గడప రమేశ్, గర్రేపల్లి శ్రీనివాస్, కోశాధికారి నల్ల భాస్కర్ గుప్త, కార్యనిర్వాహక సభ్యులు ప్రవీణ్ కుమార్ చేన్నోజ్వాల, ప్రాంతీయ కార్యదర్శులు దుర్గ ప్రసాద్, గార్లపాటి లక్ష్మారెడ్డి, గోనె నరేందర్, గింజల సురేందర్ రెడ్డి ఇతర సభ్యులు నంగునూరి వెంకట్ రమణ, పెరుకు శివ రామ్ ప్రసాద్, అనుపురం శ్రీనివాస్, కల్వ లక్ష్మణ్ రాజు, బొండుగుల రాము, జూలూరి సంతోష్ కుమార్, నడికట్ల భాస్కర్, రోజారమణి బొడ్ల, కొల్లూరి శ్రీధర్, కరుణాకర్ గుత్తికొండ, ఆవుల శివ ప్రసాద్ తదితరులు అందరిపై ఉజ్జయనీ మహంకాళి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment