తెలంగాణ కల్చరల్ సొసైటీ, సింగపూర్ ఆధ్వర్యంలో ఘనంగా శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది వేడుకలు మరియు పంచాంగ శ్రవణం తెలంగాణ కల్చరల్ సొసైటీ, సింగపూర్ (TCSS) ఆధ్వర్యంలో శుభకృత్ నామ సంవత్సర ఉగాది వేడుకలు ఇక్కడి సెంగ్ కాంగ్ లోని శ్రీ అరుళ్ముగు వేలు మురుగన్ జ్ఞానమునీశ్వర్ ఆలయంలో లో మర్చి 22న ఘనంగా జరిగాయి.
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం లో అందరికి మంచి జరగాలని ఉగాది పర్వ దినా న సొసైటీ సభ్యులు ప్రత్యేక పూజలు చేయడం జరిగింది. వేడుకల్లో బాగంగా పంచాంగ శ్రవణ కార్యక్రమంతో పాటు సింగపూర్‌లో తొలిసారి స్థానిక కాలమాన ప్రకారం ప్రత్యేక గంటల పంచాంగాన్ని సభ్యులకు అందించారు. జోతిష పండితులు పంచాంగకర్తలు కప్పగన్తు సుబ్బరామ సోమయాజులు , మార్తి శివరామ యజ్ఞనారాయణ శర్మ దీన్ని రూపొందించారు.
ఈ వేడుకల్లో సుమారు 200-250 మంది ప్రవాసి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వాసులతో పాటు కర్ణాటక తదితర రాష్ట్రాల వారు పాల్గొన్నారు. వేడుకల్లో పాల్గొన్న వారందరికి సాంప్రదాయ ఉగాది పచ్చడి, భక్షాలు, పులిహోర ప్రసాదం పంపిణి చేశారు. ఎలాంటి లాభాపేక్ష లేకుండా తెలంగాణ కల్చరల్ సొసైటీ నిర్వహిస్తున్నపలు భక్తి, స్వచ్చంద సేవా కార్యక్రమాలు అభినందనీయమని భక్తులు కొనియాడారు. సాంస్కృతిక నృత్యాలు భక్తులను అలరించాయి.
ఈ కార్యక్రమానికి సమన్వయ కర్తలుగా శశిధర్ రెడ్డి, నంగునూరి వెంకట రమణ, కాసర్ల శ్రీనివాస్, గోనె నరేందర్ రెడ్డి, విజయ మోహన్ వెంగళ, ప్రవీణ్ మామిడాల మరియు సతీష్ పెసరు వ్యవరించారు. ఉగాది వేడుకలు విజయవంతంగా జరుగుటకు మరియు ప్రసాదానికి సహాయం అందించిన దాత లకు, స్పాన్సర్స్ కు సంబరాల్లో పాల్గొన్న ప్రతీ ఒక్కరికి TCSS అధ్యక్షులు గడప రమేష్ బాబు, ప్రధాన కార్యదర్శి బసిక ప్రశాంత్ రెడ్డి , కోశాధికారి జూలూరి సంతోష్ కుమార్, సొసైటీ ఉపాధ్యక్షులు దుర్గ ప్రసాద్, భాస్కర్ గుప్త నల్ల, ఉపాధ్యక్షురాలు మిర్యాల సునీత రెడ్డి,కార్యవర్గ సభ్యులు రోజా రమణి, రాధికా రెడ్డి నల్లా, నడికట్ల భాస్కర్, అనుపురం శ్రీనివాస్, శివ ప్రసాద్ ఆవుల, పెరుకు శివ రామ్ ప్రసాద్, రవి కృష్ణ విజాపూర్, సదానందం అందె, రవి చైతన్య మైసా, భాస్కర్ రావు, సంతోష్ వర్మ మాదారపు తదితరులు ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యం గా ఈ వేడుకలకు ఘనంగా జరగడానికి చేయూతనందించిన అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment