సింగపూర్ : తెలంగాణ కల్చరల్ సొసైటీ సింగపూర్ (టీసీఎస్‌ఎస్) ఆధ్వర్యంలో తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిపారు. సింగపూర్ పుంగ్గోల్ పార్క్‌లో జూన్2న ఫ్యామిలీ డే నిర్వహించారు. ఈ ఫ్యామిలీ డే లో భారీగా తెలంగాణ వాసులు పాల్గొన్నారు. తెలంగాణ సంస్కృతిని భావి తరాలకు అందించడానికి టీసీఎస్‌ఎస్ సభ్యులు వివిధ రకాల సంప్రదాయ ఆటలైన సంచి దుంకుడు, చిర్ర గోనె, చార్ పత్తా మొదలగు ఆటలు ఆడించి బహుమతులు అందజేశారు. అలాగే, తెలంగాణ వంటల పోటీలు నిర్వహించి బహుమతులు అందించారు.
ఈ సందర్భంగా టీసీఎస్‌ఎస్ అధ్యక్షులు నీలం మహేందర్, ప్రధాన కార్యదర్శి బసిక ప్రశాంత్ రెడ్డి, ఉపాధ్యక్షులు, గడప రమేశ్, గర్రేపల్లి శ్రీనివాస్, కోశాధికారి భాస్కర్ గుప్త నల్ల, కార్యనిర్వాహక సభ్యులు ప్రవీణ్ కుమార్ చేన్నోజ్వాల, ప్రాంతీయ కార్యదర్శులు దుర్గ ప్రసాద్. ఎమ్, గార్లపాటి లక్ష్మారెడ్డి, గోనె నరేందర్, గింజల సురేందర్ రెడ్డి, ఇతర కమిటీ సభ్యులు నంగునూరి వెంకట్ రమణ, పెరుకు శివ రామ్ ప్రసాద్, అనుపురం శ్రీనివాస్, కల్వ లక్ష్మణ్ రాజు, బొండుగుల రాము, జూలూరి సంతోష్ కుమార్, నడికట్ల భాస్కర్, రోజారమణి బొడ్ల, కొల్లూరి శ్రీధర్, కరుణాకర్ గుత్తికొండ, ఆవుల శివ ప్రసాద్‌లు మాట్లాడుతూ.. సొసైటీకి సహాయ సహకారాలు అందిస్తున్న సింగపూర్‌లో ఉన్న తెలంగాణ వాసులకు, అందరూ తెలుగు వారికి స్పాన్సర్స్‌కు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి సమన్వయ కర్తలుగా గర్రేపల్లి కస్తూరి, బసిక అనిత రెడ్డి, గోనె నరేందర్, అనుపురం శ్రీనివాస్, ఫణిభూషణ్, విక్రమ్ సంకిరెడ్డిపల్లి, పట్టూరి కిరణ్ కుమార్, టి. రవీందర్లు వ్యవహరించారు.
Comments
Please login to add a commentAdd a comment