telangana farmation day
-
అబుదాబిలో.. తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలు!
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోని అబుదాబి నగరం లో తెలంగాణ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం వేకువ జామున అబుదాబిలోని BS ఈవెంట్స్ హాల్ ఆవిర్భావ ఉత్సవాలు జరిపారు. ఈ కార్యక్రమం లో మొదటగా దీప ప్రజ్వలన, గణపతి వందనతో ప్రారంభించారు.ఆ తరువాత తెలంగాణ సిద్ధాంత కర్త కీర్తి శేషులు ఆచార్య కొత్తపల్లి జయశంకర్ గారి పటానికి పూల మాల వేసి అసోసియేషన్ కార్య వర్గ సభ్యులందరు జోహార్లు అర్పించారు. కార్యక్రమాన్ని చిన్నారులు పాడిన తెలంగాణ ఉద్యమ గీతమైన జయహే జయహే తెలంగాణతో వచ్చిన వారందరిలో ఉద్యమ కాలం నాటి స్మృతులను గుర్తుకు తెస్తూ ప్రారంభించారు.ఈ కార్యక్రమానికి వచ్చిన వారిని ఉద్ద్యేశించి మాట్లాడుతూ తెలంగాణ అనేది ఒక రాష్ట్రం మాత్రమే కాదని అది ఒక స్ఫూర్తి అని, దాని మూలాలనూ ముందు తరాలకు చేరవేసే భాద్యత తల్లిదండ్రులదేనని తెలంగాణ ఫ్రెండ్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజా శ్రీనివాస రావు తెలియజేశారు. అనంతరం చిన్నారులు చేసిన తెలంగాణ ఆట పాటలు కార్యక్రమానికి వచ్చిన వారిని ఎంతో ఆకర్షించాయి.కార్యక్రమాన్ని చిన్నారుల ద్వారా ఇంత ఆకర్షితంగా చూపించడానికి సహకరించిన చిన్నారుల తల్లిదండ్రుల పాత్ర మరువలేనిదని, ఈ రకంగా ముందు తరాలకు తెలంగాణ చరిత్ర కళలు పంచిన వాళ్ళము అవుతామని ఈ కార్యక్రమానికి ప్రోగ్రాం యాంకర్ గా వ్యవహరించిన గోపినాథ్ మల్లెల గారు అన్నారు.ఈ కార్యక్రమానికి ఆహ్వానితులుగా వచ్చిన మల్లేష్ కోరేపు తనదయిన శైలిలో తెలంగాణ పాట పాడి ప్రేక్షకులను అలరించారు. ఈ సందర్బంగా జూన్ 9 నాడు దుబాయిలో స్పార్క్ మీడియా, తెలంగాణ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగనున్న దశాబ్ది ఉత్సవాల వేడుకల పోస్టర్ రిలీజ్ చేశారు. కార్య నిర్వాహకులు దశాబ్ది ఉత్సవాల గుర్తుగా కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు.ఈ కార్యక్రమంలో పాల్గొని తమ ప్రతిభ కనబరిచిన చిన్నారులకు ఎమిరేట్స్ ఎన్ బి డి బ్యాంకు వారు ఇచ్చిన బహుమతుల పంపిణి చేసారని కార్య నిర్వాహక సభ్యుడు అశోక్ గుంటక తెలియజేశారు. ఈ కార్యక్రమం లో కార్యనిర్వాహక సభ్యులు పావని శ్రీనివాస్, అర్చన వంశీ, పద్మజ గంగారెడ్డి, లతా గోపాల్, దీప్తి శ్రీనివాస్, ప్రియ వెంకట్ రెడ్డి, లక్ష్మిరెడ్డిలు పాల్గొన్నారు. -
ట్యాంక్ బండ్‌పై ఘనంగా తెలంగాణ దశాబ్ది వేడుకలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలు ఆదివారం రాత్రి ట్యాంక్‌బండ్‌పై ఘనంగా జరిగాయి. వర్షంలోనే ఆవిర్భావ ఉత్సవాలు కొనసాగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా రాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ హాజరవ్వగా, ఆయనతో కలిసి సీఎం రేవంత్‌రెడ్డి, సీఎస్ శాంతి కుమారి, మంత్రులు ట్యాంక్ బండ్‌పై ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను పరిశీలించారు.ఉత్సవాల్లో భాగంగా కళాకారుల నృత్యాలు, ఆటపాటలు ఆకట్టుకున్నాయి. ఈ వేడుకల్లో పూర్తి తెలంగాణ గీతాన్ని వినిపించారు. జయ జయహే తెలంగాణ గేయం 13.5 నిమిషాల పూర్తి వెర్షన్ విడుదల చేశారు. గేయ రచయిత అందెశ్రీ, సంగీత దర్శకుడు కీరవాణిలను ఘనంగా సత్కరించారు. సాంస్కృతిక కార్యక్రమాలు తిలకించడానికి నగరవాసులు భారీగా తరలివచ్చారు. దీంతో ట్యాంక్ బండ్ పరిసరాలు జనసంద్రంగా మారాయి. లైటింగ్, భారీ ఎల్ఈడీ స్క్రీన్స్ ఏర్పాటు చేశారు. -
సర్వాంగ సుందరంగా ట్యాంక్‌బండ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అవతరణ వేడుకలకు ట్యాంక్ బండ్‌ను ప్రభుత్వం సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతోంది. జూన్ 2న సాయంత్రం ట్యాంక్ బండ్‌పై పండుగ వాతావరణాన్ని తలపించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ట్యాంక్ బండ్ పరిసరాలను రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు, వివిధ రంగాల ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. సామాన్య ప్రజలు కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొనడానికి అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. సందర్శకులను ఆకట్టుకునే ప్రదర్శనలు, ఆట వస్తువులు, ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నారు. వివిధ జిల్లాల సాంస్కృతిక కళా బృందాలతో కార్నివాల్ ప్రదర్శనలు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధాన వేదికపై శాస్త్రీయ, జానపద, దక్కనీ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. రాష్ట్ర అధికారిక గేయం ’జయ జయహే తెలంగాణ’ పై పోలీసు సిబ్బందితో ప్రదర్శన నిర్వహించనున్నారు. బాణసంచా పేలుస్తూ ఉత్సవ అనుభూతి పొందేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ట్యాంక్ బండ్‌పై దాదాపు 80 స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నారు. వీటిలో రాష్ట్రంలోని హస్తకళలు, స్వయం సహాయక బృందాలు తయారు చేసే వస్తువులు, చేనేత ఉత్పత్తులు, నగరంలోని పలు ప్రముఖ హోటళ్ల ఫుడ్ కోర్టులు ఉండనున్నాయి. దీనికి సంబంధించిన ఏర్పాట్లను బుధవారం సాయంత్రం ఉన్నతాధికారులు పరిశీలించారు. వేదిక అలంకరణ, వేడుకలకు హాజరయ్యే అతిథులకు, పాల్గొనే ప్రజలకు సీటింగ్, పార్కింగ్, తాగునీరు, విద్యుత్ సరఫరా, పోలీస్ బందోబస్తు తదితర ఏర్పాట్లపై ఆదేశాలు జారీ చేశారు. సభా ప్రాంగణంలో ప్రత్యేక మెడికల్ క్యాంపులు, మొబైల్ టాయిలెట్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు. సమాచార పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో ఎల్ఈడీ స్క్రీన్లతో, లైవ్ ప్రసారానికి ఏర్పాట్లు చేస్తున్నారు. -
తెలంగాణ దశాబ్దిపై కేటీఆర్ ట్వీట్..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం దశాబ్ది ఉత్సవాలకు సిద్ధమవుతోంది. జూన్ నెల 2న తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేళ్లు పూర్తైన నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ‘ఎక్స్’ (ట్విట్టర్)లో ఆసక్తికర పోస్ట్ పెట్టారు. ‘ఇది తెలంగాణ దశాబ్ది’ అంటూ పేర్కొన్నారు.‘ఇది తెలంగాణ దశాబ్ది!ఆరున్నర దశాబ్దాల పోరాటం..మూడున్నర కోట్ల ప్రజల ఆకాంక్షలు..వేల బలిదానాలు, త్యాగాలు..బిగిసిన సబ్బండ వర్గాల పిడికిళ్లు..ఉద్యమ సేనాని అకుంఠిత, ఆమరణ దీక్ష..ఉద్యమం విజయతీరాలకు చేరి స్వరాష్ట్రం సాక్షాత్కారం అయ్యింది!ఉద్యమ నాయకుడే ప్రజాపాలకుడిగాస్వతంత్ర భారతదేశం ముందెన్నడూ చూడనిసమగ్ర, సమీకృత, సమ్మిళిత, సమతుల్య అభివృద్ధి నమూనా ఆవిష్కారం అయ్యింది!పల్లె, పట్నం తేడా లేకుండా ప్రగతి రథం పరుగులు తీసింది.ఆహార ధాన్యాల ఉత్పత్తి నుండిఐటి ఎగుమతుల దాకారికార్డులు బద్దలయ్యినయి.మీ అందరి మద్దతుతోనీళ్ళిచ్చి కన్నీళ్లు తుడిచినం.నిరంతర కరెంటిచ్చి వెలుగులు నింపినం.రైతన్నల, నేతన్నల, కష్టజీవుల కలత తీర్చినం.. కడుపు నింపినం.వృద్ధులకు ఆసరా అయినం..ఆడబిడ్డలకు అండగా నిలిచినం.సకల జనుల సంక్షేమానికి తెలంగాణను చిరునామా చేసినం.గుండెల నిండా జై తెలంగాణనినాదం నింపుకున్నం.మన భాషకు పట్టం గట్టినం.మన బతుకమ్మ, మన బోనంసగర్వంగా తలకెత్తుకున్నం.గంగా జమునా తెహజీబ్ కుసాక్షీభూతంగా నిలిచినం.అవమానాలుఅవహేళనలుఎదుర్కొన్న గడ్డ మీదనేతెలంగాణ ఆత్మగౌరవ పతాకాన్నిఅంబరమంత ఎత్తున ఎగరేసినం.కేసీఆర్ పాలన సాక్షిగాఇది తెలంగాణ దశాబ్ది!వెయ్యేళ్ళయినా చెక్కుచెదరని పునాది!.. జై తెలంగాణ ’ అని ట్వీట్ చేశారు. ఇది తెలంగాణ దశాబ్ది!ఆరున్నర దశాబ్దాల పోరాటం..మూడున్నర కోట్ల ప్రజల ఆకాంక్షలు..వేల బలిదానాలు, త్యాగాలు..బిగిసిన సబ్బండ వర్గాల పిడికిళ్లు..ఉద్యమ సేనాని అకుంఠిత, ఆమరణ దీక్ష..ఉద్యమం విజయతీరాలకు చేరి స్వరాష్ట్రం సాక్షాత్కారం అయ్యింది!ఉద్యమ నాయకుడే ప్రజాపాలకుడిగాస్వతంత్ర… pic.twitter.com/i7WD2IwOC2— KTR (@KTRBRS) May 21, 2024 -
కెనడా తెలంగాణ అసోసియేషన్ ధూమ్ ధామ్ వేడుకలు
తెలంగాణ కెనడా అసోసియేషన్ (టీసీఏ) ఆధ్వర్యంలో గ్రేటర్ టోరంటో నగరంలోని తెలంగాణ వాసులు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని ధూమ్ ధామ్ 2023 ఉత్సవాలు అనాపిలిస్ హాల్స్, మిస్సిసాగా, కెనడాలో ఘనంగా జరుపుకున్నారు. ఈ సంబరాలలో 1500 కు పైగా తెలంగాణవాసులు పాల్గొన్నారు. ఈ సంబరాలు కమిటీ కార్యదర్శి శంతన్ నేరళ్లపల్లి గారు ప్రారంభించగా లావణ్య ఏళ్ల, అనూష ఇమ్మడి, స్వాతి అర్గుల, రాధిక దలువాయి, శ్రీమతి రజిని తోట తదితరులు జ్యోతి ప్రజ్వలన చేసారు. ఈ సందర్బంగా ప్రెసిడెంట్ అఫ్ తెలంగాణ కెనడా అసోసియేషన్ శ్రీనివాస్ మన్నెం గారు, కార్యదర్శి శంతన్ నేరళ్లపల్లి గారు, ధర్మకర్తల మండలి చైర్మన్ నవీన్ ఆకుల గారు వ్యవస్థాపక కమిటీ చైర్మన్ అతిక్ పాషా గారు వేదికపై పాల్గొన్నారు. ఆరంభ ప్రసంగంతో అమర వీరులకు శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సంవత్సరం మునుపెన్నడు లేనట్టుగా చిన్నారులకు టాలెంట్ షో ని నిర్వహించారు. దీనికి చిన్నారుల నుంచి అనూహ్యమైన స్పందన లభించింది. చిన్నారులు సింగింగ్, డాన్సింగ్, రూబిక్స్ క్యూబ్, మెంటల్ మ్యాథ్స్ లాంటి విభాగాలలో వారి టాలెంట్ ని ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి ఉమా సలాడి, లక్ష్మీ సంధ్యా గారు, భరత్, మనస్విని తదితరులు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. దీనికి వ్యాఖ్యాతలుగా గుప్తేశ్వరి వాసుపిల్లి, మాధురి చాతరాజు వ్యవహరించారు. ఈ షోలో గెలిచిన చిన్నారులకి శ్రీ విష్ణు బోడ (రియల్టర్) బహుమతులను అందజేశారు. చిన్నారులని వారి వయసును బట్టి రెండు గ్రూపులుగా విభజించారు. తొలిస్థానంలో అనికా శ్యామల(10), సాయి స్నిగ్ధ తంగిరాల(8), రెండో స్థానంలో ఆకాంక్ష(11), శివాన్ష్ దవల(7)లు ఉండగా, జడ్జెస్ స్పెషల్ చాయిస్‌గా ఆర్యన్ పొనుగంటి(11) శ్రీతన్ పూల(10) మాన్య నాగబండి(9), శ్రీరామదాసు అరుగుల(7), విద్వాన్ష్ రాచకొండ(5) గెలిచారు. ఈ కార్యక్రమం మొత్తం నాలుగు గంటల పాటు ఉమెన్స్ కమిటీ సభ్యులు రాధికా బెజ్జంకి, మాధురి చాతరాజు ఆధ్వర్యంలో విజయవంతంగా ముగిసింది. అనంతరం సాంస్కృతిక కార్యక్రమలను ప్రహళిక మ్యాకల, రాహుల్ బాలనేని, ధాత్రి అంబటి, స్ఫూర్తి కొప్పు వ్యాఖ్యాతలుగా వ్యవహరిస్తూ ఈ వేడుక స్పాన్సర్ బెస్ట్ బ్రెయిన్ ఎడ్యుకేషన్ ట్యూటరింగ్ సంస్థలకు ప్రత్యేక అభినందనలు తెలుపుతూ ప్రారంభించారు.ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన శుభన్ క్రిషన్- కెనడా కాన్సుల్-కౌన్సిలేట్ జనరల్ ఆఫ్ ఇండియా మాట్లాడుతూ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా టీసీఏ నిర్వహిస్తున్న కార్యక్రమాలని హర్షించారు. కల్చరల్ విభాగంలో పాల్గొన్న చిన్నారులని ప్రోత్సాహించి నందుకు టీసీఏను అభినందించారు. పలు సాంస్కృతిక కార్యక్రమాల్లో పిల్లలు పెద్దలు పాల్గొని ప్రేక్షకులను అలరింపజేసారు. అనంతరం అధ్యక్షులు శ్రీనివాస్ మన్నెం మాట్లాడుతూ టీసీఏ ఈవెంట్స్ స్పాన్సర్లకి, నిర్వహకులకి ప్రత్యేక అభినందనలు తెలిపారు. టీసీఏ ఎన్నెన్నో సాంస్కృతిక కార్యక్రమాలు లోకల్ టాలెంట్‌తో కలర్ఫుల్గా ఆర్గనైజ్ చెయ్యడంతో పలువురు ప్రశంసించారు. సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు టీసీఏ లోకల్ బిజినెస్‌లని కూడా ప్రతి వేడుకల్లో ప్రోత్సహిస్తుంది. ఇందులో భాగంగా 16 విభిన్నమైన వెండర్ స్టాల్స్ ని ఈ కార్యక్రమంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా టీసీఏ తెలంగాణ ప్రామాణికమైన బిర్యాని వడ్డించటము సభికులకు ఆనందాన్ని కలుగ చేసింది. ఈ కార్యక్రమంలో కార్యనిర్వాహక మండలి అధ్యక్షుడు శ్రీనివాస్ మన్నెం, కార్యదర్శి శంతన్ నేరళ్లపల్లి, సంయుక్త సాంస్కృతిక కార్యదర్శి కుమారి ప్రహళిక మ్యాకల, కోశాధికారి వేణుగోపాల్ ఏళ్ల, సంయుక్త కోశాధికారి రాహుల్ బాలనేని, డైరెక్టర్లు నాగేశ్వరరావు దలువాయి, ప్రవీణ్ కుమార్ సామల, ప్రణీత్ పాలడుగు, శంకర్ భరద్వాజ పోపూరి, భగీరథ దాస్ అర్గుల యూత్ డైరెక్టర్ధాత్రి అంబటి, ధర్మకర్తల మండలి చైర్మన్ నవీన్ ఆకుల, బోర్డ్ ఆఫ్ ట్రస్ట్ సభ్యులు మురళి సిరినేని, మురళీధర్ కందివనం, మాధురి చాతరాజు, వ్యవస్థాపక కమిటీ చైర్మన్ అతిక్ పాషా, వ్యవస్థాపక సభ్యులు దేవేందర్ రెడ్డి గుజ్జుల, కోటేశ్వర రావు చిత్తలూరి, ప్రకాష్ చిట్యాల, శ్రీనివాస్ తిరునగరి, హరి రావుల్, కలీముద్దీన్ మొహమ్మద్, ప్రభాకర్ కంబాలపల్లి, సంతోష్ గజవాడ, విజయ్ కుమార్ తిరుమలపురం, రాజేశ్వర్ ఈధ, వేణుగోపాల్ రోకండ్ల మరియు పలువురు సంస్థ శ్రేయోభిలాషులు పాల్గొన్నారు. కెనడా తెలంగాణ అసోసియేషన్(టీసీఏ) విందు ఏర్పాట్లు ఘనంగా జరిగింది. చివరగా అధ్యక్షులు శ్రీనివాస్ మన్నెం కృతజ్ఞతా వందన సమర్పణతో తెలంగాణ ధూంధాం 2023 వేడుకలు కెనడా టొరంటోలో ఘనంగా ముగిసింది. (చదవండి: అట్లాంటా వేదికగా సెప్టెంబర్ లో "ఆప్తా" కన్వెన్షన్..!) -
మలేషియాలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ధి వేడుకలు
తెలంగాణ రాష్ట్రం అవతరించి తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకొని పదవ సంవత్సరంలోకి అడుగుపడుతున్న వేళ ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు మలేషియా భారత రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర అవతరణ ఉత్సవాలు ఘనంగా జరుపుకున్నారు. మలేషియా ఎన్నారై శాఖ అధ్యక్షులు చిరుత చిట్టిబాబు గారు మాట్లాడుతూ.. నీళ్లు, నిధులు, నియామకాలు నినాదంతో మలిదశ ఉద్యమం మొదలయి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం అవతరించి నేడు సాధించిన అభివృద్ధిని నాడు మనం అనుభవించిన కష్టాలను గుర్తు చేసుకున్నారు. రాష్ట్ర సాధనకై అమరుల ప్రాణత్యాగాలను ఎన్నడూ మరవలేమని వారికి నివాళులు అర్పించి, కార్యక్రమం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో చిన్నారులు ఆటపాటలతో అలరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని స్ఫూర్తిగా తీసుకుని భవిష్యత్తులో కేంద్రంలో కూడా భారత రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చి అన్నిరంగాల్లో అభివృద్ధిని సాధించాలని తన ప్రసంగంలో పేర్కొన్నారు ఉపాధ్యక్షులు మారుతి కుర్మ. ఈ కార్యక్రమంలో అతిథులు మైటా డిప్యూటీ ప్రసిడెంట్ సత్య, మైటా ఉపాధ్యక్షులు మోహన్ రెడ్డి పాల్గొన్నారు. మరియు భారాస ఉపాధ్యక్షులు మారుతి కుర్మ, కార్యదర్శి సందీప్ కుమార్ లగిశెట్టి, కోర్ కమిటీ సభ్యులు మునిగల అరుణ్, బొడ్డు తిరుపతి,గద్దె జీవన్ కుమార్, రమేష్ గౌరు, సత్యనారాయణరావ్ నడిపెల్లి, హరీష్ గుడిపాటి, సంపత్ రెడ్డి ,రవిందర్ రెడ్డి మరియు ఇతర సభ్యులు శ్యామ్, పూర్ణ చందర్ రావు, నవీన్ గౌడ్ పంజాల, కిషోర్, క్రాంతి , గౌతమ్ రెడ్డి పాల్గొనడం జరిగింది. (చదవండి: సింగపూర్‌లో తెలంగాణ బలగం అలయ్ బలయ్) -
తెలంగాణ మంత్రి హరీశ్‌రావు ఎమోషనల్ ట్వీట్
సాక్షి, మునిపల్లి: తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సంగారెడ్డి జిల్లా చిన్న చల్మెడలో సంగమేశ్వర ఎత్తిపోత పథకానికి మంత్రి హరీశ్‌రావు భూమిపూజ చేశారు. రూ.2,653కోట్లతో దీన్ని నిర్మించనున్నారు. ఈ పథకం పూర్తయితే సంగారెడ్డి, ఆందోల్, జహీరాబాద్ నియోజకవర్గాల్లోని 2.19లక్షల ఎకరాలను సాగునీరు అందనుంది. ఈ ఎత్తిపోతల పథకానికి కాళేశ్వరం నుంచి 12 టీఎంసీల నీటిని ప్రభుత్వం కేటాయించింది. మరోవైపు తెలంగాణ దశాబ్ధి ఉత్సవాల నేపథ్యంలో ట్విట్టర్ వేదికగా మంత్రి హరీశ్‌రావు కీలక వ్యాఖ్యలు చేశారు. ‘నాడు ఎటు చూసినా తడారిన నేలలు.. నేడు ఎటు చూసినా పరవళ్ళు తొక్కుతున్న గోదారి. నాడు ఎటుచూసినా నోళ్లు తెరచిన బీళ్లు.. నేడు తలలూపుతున్న ఆకుపచ్చని పైర్లు. ఇది తెలంగాణ జలవిజయం.. కేసీఆర్ సాధించిన ఘన విజయం. మండుటెండల్లో తడలు గొడుతున్న చెరువులు.. ఊటలు జాలువారుతున్న వాగులు.. పాతళగంగమ్మ పైపైకి ఎగదన్నుతున్న జలదృశ్యాలు. ఇది కదా జల తెలంగాణ.. ఇది కదా కోటి రతనాల మాగాణ. దశాబ్ది ఉత్సవాల సందర్భంగా హృదయ పూర్వక శుభాకాంక్షలు.’ అంటూ పోస్టు చేశారు. నాడు ఎటు చూసినా తడారిన నేలలు.. నేడు ఎటు చూసినా పరవళ్ళు తొక్కుతున్న గోదారి. నాడు ఎటుచూసినా నోళ్లు తెరచిన బీళ్లు.. నేడు తలలూపుతున్న ఆకుపచ్చని పైర్లు. ఇది తెలంగాణ జలవిజయం.. కేసీఆర్ సాధించిన ఘన విజయం. మండుటెండల్లో తడలు గొడుతున్న చెరువులు.. ఊటలు జాలువారుతున్న వాగులు.. పాతళగంగమ్మ… pic.twitter.com/R94ozLdR8A — Harish Rao Thanneeru (@BRSHarish) June 7, 2023 ఇది కూడా చదవండి: అటు కాంగ్రెస్.. ఇటు బీజేపీ! -
పదేళ్లలో ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశాం: కేటీఆర్
సాక్షి, సిరిసిల్ల: తెలంగాణవ్యాప్తంగా నేడు రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మంత్రి కేటీఆర్ సిరిసిల్లలో ఆవిర్బావ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలీసుల గౌరవవందనం స్వీకరించారు. అనంతరం, కేటీఆర్ జాతీయ జెండా ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడుతూ.. ‘పదేళ్లలో ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశాం. మిషన్ భగీరథతో ప్రతీ ఇంటికీ తాగునీరు అందించాం. దేశంలో ఏ రాష్ట్రంలోనూ హరితహారం కార్యక్రమం ఈ స్థాయిలో లేదు’ అని అన్నారు. సిద్దిపేట జిల్లాలో కలెక్టరేట్లో జరిగిన దశాబ్ది ఉత్సవాల్లో మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. పోలీసుల గౌరవవందనం స్వీకరించారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం రైతులకు అండగా నిలిచిందని చెప్పారు. గతంలో చెరువులు ఎండిపోయి ఉండేవని.. ఇప్పుడు నిండుగా మండుటెండల్లోనూ నిండుగా ఉన్నాయని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో తాగునీటి కోసం యుద్ధాలు జరిగేవని.. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదన్నారు. అంతకుముందు సిద్దిపేట పట్టణంలోని తన క్యాంపు కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురవేశారు. రంగదాంపల్లిలో అమరవీరుల స్థూపం వద్ద పూలమాలవేసి నివాళులర్పించారు. ముస్తాబాద్ సర్కిల్లోని ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. ఇది కూడా చదవండి: ‘తెలంగాణ కోసం సుష్మాస్వరాజ్ పోరాడారు’ -
ఒక్క వ్యక్తి, కుటుంబం ద్వారానో తెలంగాణ రాలేదు: కిషన్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: నేడు తెలంగాణ అవతరణ దినోత్సవం. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో గోల్కోండ కోటలో అవతరణ దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు. కేంద్ర సాంస్కృతిక శాఖ ఉత్సవాలు జరుపుతోంది. ఈ సందర్బంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమ సమయంలో సుష్మాస్వరాజ్ పార్లమెంట్లో పోరాడారు. ఏ ఒక్క వ్యక్తి, కుటుంబం ద్వారానో తెలంగాణ రాలేదు. తెలంగాణ ప్రజల పోరాటంతోనే తెలంగాణ వచ్చింది. తెలంగాణ బిల్లు పెట్టించడంలో బీజేపీ కీలక పాత్ర పోషించింది అని అన్నారు. తెలంగాణ సాధన కోసం ఎందరో ప్రాణత్యాగం చేశారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న అందరికీ వందనాలు. తెలంగాణ ఉద్యమంలో సకల జనుల సమ్మె చారిత్రాత్మక ఘట్టం. నీళ్లు, నిధులు, నియామకాల కోసం ఉద్యమం సాగింది. తెలంగాణ ఉద్యమం ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. ఎందరో త్యాగాలతో ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నాం. తెలంగాణ సాధన కోసం 1200 మంది అమరులయ్యారు. అమరవీరుల కుటుంబాలకు అండగా నిలబడాలి. ఇది కూడా చదవండి: ప్రతి తెలంగాణ బిడ్డ గర్వించాల్సిన సందర్భం ఇది: సీఎం కేసీఆర్ -
ప్రతి తెలంగాణ బిడ్డ గర్వించాల్సిన సందర్భం ఇది: సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: తొమ్మిదేళ్ల క్రితం దేశంలో 29వ రాష్ట్రంగా అవతరించిన తెలంగాణ.. అన్ని అనుమానాలను పటాపంచలు చేస్తూ, బాలారిష్టాలను దాటుకుంటూ, ప్రత్యర్థుల కుయుక్తులను తిప్పికొడుతూ నిలదొక్కుకోవడం అద్భుతమని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. ఒకనాడు వెనుకబాటుకు గురైన తెలంగాణ నేడు సమస్త రంగాల్లో దేశాన్ని ముందుకు తీసుకుపోతోందని చెప్పారు. తెలంగాణ స్వయం పాలన తొమ్మిదేళ్లు పూర్తి చేసుకుని పదో వసంతంలోకి అడుగిడుతున్న సందర్భంగా రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాం.. రాష్ట్ర ప్రభుత్వ కృషి, ప్రజలందరి భాగస్వామ్యంతో తొమ్మిదేళ్లలో తెలంగాణ సాధించిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని సీఎం కేసీఆర్ సంతృప్తి వ్యక్తం చేశారు. ముందెన్నడూ ఎరుగని రీతిలో ‘తెలంగాణ మోడల్’పాలన దేశ ప్రజలకు అందుబాటులోకి వచ్చిందన్నారు. తెలంగాణ వంటి పాలన కావాలని అన్ని రాష్ట్రాల ప్రజలు కోరుతున్నారని.. ఇది తెలంగాణ ప్రజలు సాధించిన ఘన విజయమని, ప్రతి తెలంగాణ బిడ్డ గర్వించాల్సిన గొప్ప సందర్భమని చెప్పారు. వ్యవసాయం, సాగునీరు, విద్యుత్, విద్య, వైద్యం, సంక్షేమం, ఆర్థిక రంగం సహా సమస్త రంగాలలో గుణాత్మక అభివృద్ధి సాధిస్తూ, మహోజ్వల స్థితికి చేరుకుంటున్న తెలంగాణ ప్రగతి ప్రస్థానాన్ని మూడు వారాల పాటు అంగరంగ వైభవంగా జరుపుకొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఫలాలను ఆస్వాదిస్తున్న ఆనందకర సమయంలో ప్రభుత్వం నిర్వహిస్తున్న దశాబ్ధి ఉత్సవాల్లో రాష్ట్ర ప్రజలంతా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఎన్నో కష్టనష్టాలు, అవమానాలను అధిగమించి.. తెలంగాణ కోసం ఆరు దశాబ్ధాల పాటు వివిధ దశల్లో సాగిన పోరాటాలు, ఉద్యమాలు, త్యాగాలను సీఎం కేసీఆర్ స్మరించుకున్నారు. రాష్ట్ర ఏర్పాటు దిశగా భావజాలాన్ని వ్యాప్తి చేస్తూ, ప్రజలను మమేకం చేస్తూ.. మలిదశ ఉద్యమాన్ని పార్లమెంటరీ పంథాలో, ప్రజాస్వామ్య పోరాటం దిశగా మలిపిన తీరును గుర్తు చేసుకున్నారు. రాష్ట్ర సాధన క్రమంలో తాను ఎదుర్కొన్న కష్టాలు, అవమానాలను, అధిగమించిన అడ్డంకులను.. ‘బోధించు, సమీకరించు, పోరాడు’అనే పంథా ద్వారా రాష్ట్రంలో సకల జనులను సమీకరించి, అందరి భాగస్వామ్యంతో తెలంగాణ సాధించామని యాది చేసుకున్నారు. ఇది కూడా చదవండి: పండుగ వాతావ‘రణం’ -
తెలంగాణ దశాబ్ది ఉత్సవాల లోగో ఆవిష్కరణ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించిన నేపథ్యంలో పదేళ్ల తెలంగాణ రాష్ట్ర ప్రగతి ప్రస్థానాన్ని, తెలంగాణ అస్తిత్వాన్ని ప్రతిబింబించే విధంగా రూపొందించిన లోగోను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆవిష్కరించారు. సెక్రటేరియట్ లోని తన చాంబర్లో సోమవారం మంత్రులు హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ తదితరులతో కలిసి ఈ లోగోను కేసీఆర్ ఆవిష్కరించారు. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు ప్రాజెక్టులను ఈ లోగోలో పొందుపరిచారు. కాళేశ్వరం తదితర సాగునీటి ప్రాజెక్టులు, యాదాద్రి వంటి ఆధ్యా త్మిక పుణ్యక్షేత్రాలు, విద్యుత్ వ్యవసాయం, మిషన్ భగీరథ, మెట్రో రైలు, టీ–హబ్, డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ సచివాలయం, 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం చిహ్నాలను సీఎం ఆదేశాల మేరకు లోగోలో చోటు కల్పించారు. వీటితో పాటు తెలంగాణ తల్లి, బతుకమ్మ, , బోనాలు, పాలపిట్ట, అమరవీరుల స్మారకంతో కూడిన తెలంగాణ అస్తిత్వ చిహ్నాలతో తెలంగాణ ఖ్యాతి ఇనుమడించేలా లోగోలో చోటిచ్చారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, దేశ పతి శ్రీనివాస్, పాడి కౌశిక్ రెడ్డి, ఎమ్మెల్యేలు ఆశన్నగారి జీవన్ రెడ్డి, బాల్క సుమన్, సీఎస్ శాంతి కుమారి, సీఎం ప్రధాన సలహాదారు సోమేశ్ కుమార్, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మ, ఆర్ధికశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ కోలేటి దామోదర్ గుప్తా తదితరులు పాల్గొన్నారు. -
తెలంగాణ అవతరణ దినోత్సవం.. ఎనిమిదేళ్ల అసంతృప్తి
సబ్బండ వర్ణాల పోరాటం, ఉద్యమాల ఫలితంగా సాధించుకున్న తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఎనిమిదేళ్ల కాలాన్ని పూర్తి చేసుకుంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీకి మొదటిసారి జిల్లా ప్రజాపరిషత్ విజయాన్ని అందించి నిజామాబాద్ జిల్లా ఊపిరిలూదింది. ఇలాంటి జిల్లా వ్యవసాయంలో అగ్రభాగంలో ఉండి తలమానికంగా నిలుస్తోండగా.. అనుబంధ పరిశ్రమలు, యూనిట్ల ఏర్పాటు ముందుకు కదలడం లేదు. ఉన్న ప్రాజెక్టులను పట్టాలెక్కించే అవకాశాలున్నప్పటికీ ఆ దిశగా అడుగులు పడడం లేదు. జిల్లాలో ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు కనిపించడం లేదు. దీంతో జిల్లా ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సాక్షి, నిజామాబాద్: ప్రసిద్ధి గాంచిన బోధన్‌లోని నిజాంషుగర్స్ ఫ్యాక్టరీ జిల్లాలో ఎకానమీకి గతంలో మంచి ఊతం ఇస్తూ వచ్చింది. అయితే 2015లో ఫ్యాక్టరీ మూతపడింది. దీన్ని ఇప్పటి వరకు తెరిపించడం లేదు. దీంతో గతంలో 60వేల ఎకరాల్లో చెరుకు సాగు చేసిన రైతులు అనివార్యంగా వరి పంట వేయాల్సి వస్తోంది. వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పించే ఫ్యాక్టరీని తెరిపించాలని అన్నివర్గాల నుంచి డిమాండ్లు వస్తున్నాయి. దీంతో పాటు సారంగాపూర్ సహకార చక్కెర ఫ్యాక్టరీని సైతం తెరవాలని కోరుతున్నారు. ప్రస్తుతం ఇథనాల్‌కు డిమాండ్ ఉన్న నేపథ్యంలో వాటిని తెరిపిస్తే మేలంటున్నారు. ఉమ్మెడ వంతెనకు అప్రోచ్ రోడ్ ఎప్పుడో.. నిర్మలౖ–నిజామాబాద్ జిల్లాలను కలిపే మహారాష్ట్ర వెళ్లే రహదారిపై నందిపేట మండలం ఉమ్మెడ–పంచగుడ మధ్య గోదావరిపై వంతెన నిర్మించారు. అయితే వంతెనకు అటువైపు డబులై రోడ్డు పూర్తయి ఏళ్లు గడుస్తున్నాయి. గత ఐదేళ్లుగా ఇటువైపు నందిపేట మండలంలో వంతెన పైకి వెళ్లే అప్రోచ్∙రోడ్డు పనులు నిలిపోయాయి. దీంతో ఇబ్బందులు తప్పడం లేదు. ఈ కొద్దిమేర రోడ్డు పూర్తయితే లక్కంపల్లి సైతం మరింత ఊతం లభిస్తుంది. రాకపోకలు పెరిగి ఈ ప్రాంతంలో వ్యాపారాలు పెరిగే అవకాశాలున్నాయి. శ్రీరాంసాగర్ జలాశయం పునరుజ్జీవం అటకెక్కింది. గతంలో 120 టీఎంసీల సామర్థ్యం కలిగిన జలాశయం ప్రస్తుతం 80 టీఎంసీల లోపునకు పడిపోయింది. మరోవైపు శ్రీరాంసాగర్ బ్యాక్ వాటర్ నుంచి నందిపేట మండలంలోని గ్రామాల వద్ద కాటేజీలు నిర్మించడంతో పాటు, బాసర వరకు బోటింగ్ సౌకర్యం కల్పించాలనే ప్రతిపాదనలు అటకెక్కాయి. అంచనాలు పెంచడమేనా.. నిజామాబాద్ నగరం విషయానికి వస్తే ఇక్కడ రూ. వందల కోట్ల పనులు సా..గుతూనే ఉన్నాయి. రూ.240 కోట్ల విలువైన అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ పనులు ఏళ్లతరబడి నత్తనడకను తలపిస్తున్నాయి. రూ.4 కోట్ల నుంచి రూ.22 కోట్లకు అంచనాలు పెంచుతూ వచ్చిన బొడ్డెమ్మ చెరువు పనులు ఇప్పటివరకు పూర్తి కాలేదు. హైదరాబాద్ రోడ్డులో కీలకమైన మాధవనగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు ఇప్పటివరకు ప్రారంభం కాలేదు. జక్రాఉ పల్లి వద్ద విమానాశ్రయం కోసం కేంద్రం నుంచి అనుమతులు వచ్చినపటికీ దాని ఊసే లేదు. ఇదిలా ఉండగా నగరంలో వరద నీరు వెళ్లేందుకు సహజసిద్ధంగా ఏర్పడిన పులాంగ్ వాగును అధికార పార్టీ నేతలే అనేక చోట్ల కబ్జాలు చేయడంతో అది కాస్తా పిల్లకాలు వలాగా మారిపోయింది. దీంతో నగరం భవిష్యత్తులో వరద ముంపునకు మరింత గురయ్యే అవకాశాలున్నట్లు పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లెదర్ పార్క్ భవనంతో సరి.. ఆర్మూర్ యానంగుట్ట వద్ద లెదర్ పార్క్ కోసం గతంలో జిల్లా నుంచి మండవ వెంకటేశ్వరరావు మంత్రిగా ఉన్న సమయంలో 24 ఎకరాలు కేటాయిం^éరు. భవనం కట్టి వదిలేశారు. మరోవైపు వేల్పూరు మండలం పడగల్ వద్ద స్పైసెస్ పార్క్ కోసం సేకరింన 70 ఎకరాల భూమిలో ప్రహరీ కట్టి వదిలేశారు. ఆ తరువాత ఇది అటకెక్కింది. ధర్పల్లిలో 2008లో పసుపు పరిశోధన కేంద్రం పేరిట కట్టిన భవనం అలాగే వదిలేశారు. ఇక భీమ్ గల్లో గతంలో ఉన్న బస్ డిపో ఎత్తేశారు. ● క్కంపల్లి సెజ్‌లో.. నందిపేట మండలం లక్కంపల్లి వద్ద దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ హయాంలో 378 ఎకరాల్లో సెజ్ ఏర్పాటు చేశారు. ఇక్కడ అనేక పరిశ్రమ లకు అవకాశాలున్నప్పటికీ ఆ దిశగా ప్రయత్నాలు జరుగలేదు. కనీసం వ్యవసాయ అనుబంధ పరిశ్రమలకు సైతం అవకాశాలు రాలేదు. దీంతోయువతకు ఉపాధి అవకాశాలు దక్కడం లేదు. -
తెలంగాణ అన్ని రంగాల్లో దూసుకుపోతోంది
-
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం
-
బంగారు తెలంగాణ
-
ఆరేళ్లలో రాష్ట్రంలో వినూత్న అభివృద్ధి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా.. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. దేశ చరిత్రలో ఎన్నడూ చూడ ని శాంతియుత ప్రజా ఉద్యమం ద్వారా 2014 లో 29వ రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడిందన్నారు. గత ఆరేళ్లలో రాష్ట్రం వినూత్న అభివృద్ధి కార్యక్రమాలతో దేశానికే ఆదర్శంగా నిలిచిందని గవర్నర్ స్పష్టంచేశారు. ‘బంగారు తెలంగాణ’లక్ష్యాన్ని త్వరలోనే అందుకోగల మని ధీమా వ్యక్తం చేశారు. కోవిడ్– 19తో ఏర్పడిన క్లిష్ట పరిస్థితిని ఎదుర్కోవటానికి తెలంగాణ ప్రజలు ధైర్యంగా పోరాడుతున్నార ని కొనియాడారు. తెలంగాణ ‘సంపన్న, ఆరోగ్యకరమైన రాష్ట్రం‘అని నిరూపిస్తూ విజయవంతంగా బయటకు వస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. ‘‘మై స్టేట్ – మై ప్రైడ్’’అనే అనుభూతితో రాష్ట్ర ప్రజలు గర్వపడే స్థాయిలో రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతోందన్నారు. -
10 వేల మెగావాట్ల విద్యుదుత్పత్తి
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రాన్ని మిగులు విద్యుత్ రాష్ట్రంగా మార్చాలనే లక్ష్యానికి అనుగుణంగా అడుగులు వడవడిగా పడుతున్నాయి. విభజన చట్టంలో ఇచ్చిన హామీ నెరవేర్చాలని కేంద్రంపై ఒత్తిడి తెచ్చి రామగుండం ఎన్టీపీసీలో 4 వేల మెగావాట్ల విద్యుత్ కేంద్రానికి ఆమోదం తీసుకుంది. ఇప్పటికే మొదటి దశలో 1,600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి యూనిట్ల నిర్మాణాన్ని ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించారు. 4 వేల మెగావాట్ల యాదాద్రి విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నిర్మాణ పనులు పూర్తవుతాయి. సింగరేణి నుంచి మరో 800, సీజీఎస్ ద్వారా మరో 809, సోలార్ ద్వారా 1,584, హైడల్ ద్వారా 90 మెగావాట్లు అందుబాటులోకి రానుంది. దీంతో మూడేళ్లలో 10 వేల మెగావాట్లకు పైగా అదనపు విద్యుత్ వచ్చి చేరుతుంది. అప్పుడు తెలంగాణ మిగులు విద్యుత్ రాష్ట్రంగా మారనుంది. దీనివల్ల విద్యుత్ సంస్థలు ఆర్థికంగా బలోపేతం అవుతాయి. అవసరం ఉన్న వర్గాలకు మరిన్ని రాయితీలు ఇచ్చుకునే వెసులుబాటు ఉంటుంది. తెలంగాణ ఏర్పడే నాటికి తీవ్ర విద్యుత్ సంక్షోభం ఉంది. హైదరాబాద్‌లో రోజు 2 నుంచి 4 గంటలు, పట్టణాల్లో 6 గంటలు, గ్రామాల్లో 12 గంటలు విద్యుత్ కోతలు అమలయ్యేవి. తెలంగాణ ఏర్పడ్డాక విద్యుత్ సంక్షోభం నుంచి గట్టెక్కే సవాల్‌ను సీఎం కేసీఆర్ మొదటగా స్వీకరించారు. ప్రభుత్వ ప్రయత్నాలు ఫలించి, రాష్ట్రం ఏర్పడిన 6వ నెల (2014 నవంబర్ 20) నుంచే కోతల్లేని విద్యుత్ ప్రజలకు అందుతోంది. గృహావసరాలకు, పరిశ్రమలకు, వాణిజ్య అవసరాలకు 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తున్నారు. వ్యవసాయానికి 2018 జనవరి 1 నుంచి రైతులకు 24 గంటల కరెంటు అందిస్తోంది. రాష్ట్రంలోని మొత్తం 24.16 లక్షల వ్యవసాయ పంపుసెట్లకు 24 గంటల పాటు నిరంతర ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ కొత్త చరిత్రను లిఖించింది. రాష్ట్రంలోని 30 శాతం కరెంటు ఉచిత విద్యుత్ కోసమే వినియోగిస్తున్నారు. వంద శాతం పెరిగిన సామర్థ్యం.. 2014లో స్థాపిత విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 7,778 మెగావాట్లు కాగా, ఫిబ్రవరి 2020 నాటికి వంద శాతానికి పైగా పెరిగి 15,980 మెగావాట్లు అందుబాటులోకి వచ్చింది. ఇందులో 3,681 మెగావాట్ల సోలార్ విద్యుత్ కూడా ఉంది. 27.77 వేల కోట్ల వ్యయంతో పంపిణీ, సరఫరా వ్యవస్థలను పటిష్టం చేసి విద్యుత్ ఉత్పత్తి చేయడంతో పాటు సరఫరా వ్యవస్థను మెరుగుపర్చడంలో తెలంగాణ విద్యుత్ సంస్థలు ప్రగతి సాధించాయి. 99.9 శాతం ట్రాన్స్ మిషన్ అవెయిలబిలిటీతో దేశ సగటును మించింది. ఇందుకు రూ.27,770 కోట్ల వ్యయంతో సబ్ స్టేషన్ల నిర్మాణం, ట్రాన్స్ ఫార్మర్ల ఏర్పాటు, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ ఫార్మర్లు, కొత్త లైన్ల నిర్మాణం చేపట్టింది. దేశ సగటును మించి ప్రగతి సూచికలుగా గుర్తించే అంశాల్లో తలసరి విద్యుత్ వినియోగం ఒకటి. ఈ అంశంలో తెలంగాణ దేశ సగటును మించింది. 2018–19 సంవత్సరంలో దేశవ్యాప్తంగా సగటు తలసరి విద్యుత్ వినియోగం 1,181 యూనిట్లు కాగా, తెలంగాణలో ప్రస్తుతం 1,896 యూనిట్లు. తెలంగాణ ఏర్పడే నాటికి రాష్ట్రంలో తలసరి విద్యుత్ వినియోగం 1,356 యూనిట్లుంటే, ఆరేళ్లలో 39.82 శాతం పెరిగింది. ఏడాదికి వెయ్యి యూనిట్లకు పైగా తలసరి విద్యుత్ వినియోగం జరిగే రాష్ట్రాల్లో తెలంగాణ అత్యధికంగా 10 శాతం వృద్ధి రేటు సాధించి ప్రథమ స్థానంలో నిలిచింది. 2017–18 సంవత్సరంలో తెలంగాణలో తలసరి విద్యుత్ వినియోగం 1,727 యూనిట్లుంటే, 2018–19 నాటికి 1,896కి చేరింది. ఇదే సమయంలో దేశవ్యాప్తంగా తలసరి విద్యుత్ వినియోగం 2.7 శాతం మాత్రమే వృద్ధి సాధించడం విశేషం. 2017–18లో దేశ సగటు తలసరి విద్యుత్ వినియోగం 1,149 యూనిట్లుంటే, 2018–19లో 1,181 యూనిట్లు నమోదైంది. ఔట్ సోర్సింగ్ క్రమబద్ధీకరణ రాష్ట్రంలోని విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ సంస్థలైన ట్రాన్స్ కో, జెన్ కో, ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్లలో ఔట్సోర్సింగ్ విధానంలో విధులు నిర్వర్తిస్తున్న 23,667 మంది తాత్కాలిక ఉద్యోగుల (ఆర్టి జన్ల) సర్వీసును ప్రభుత్వం క్రమబద్ధీకరించింది. -
టొరొంటోలో తెలంగాణ ఆవిర్బావ వేడుకలు
టొరొంటో : తెలంగాణ కెనడా సంఘం ఆధ్వర్యంలో గ్రేటర్ టొరొంటోలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. మిస్సిసౌగాలోని గ్లెన్ ఫారెస్ట్ పాఠశాల ఆడిటోరియంలో జరిగిన ఈ వేడుకలకు 600 మందికి పైగా ప్రవాస తెలంగాణా వాసులు హాజరయ్యారు. ఈ ఉత్సవాలు తెలంగాణ కెనడా అసోసియేషన్ అధ్యక్షులు రమేశ్ మునుకుంట్ల ఆధ్వర్యంలో జరిగాయి. కవిత తిరుమలాపురం, రజని మాధి, విధాత, విశాల, సంధ్య కుంచంలు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. రమేశ్ మునుకుంట్ల తెలంగాణ ఉద్యమంలో ఆశువులు బాసిన అమరులకు శ్రద్దాంజలి ఘటిస్తూ సభికులందరితో మౌనం పాటింపచేశారు. తెలంగాణ కెనడా అసోసియేషన్ ట్రుస్టీ బోర్డు అధ్యక్షులు హరి రావుల్, ఉపాధ్యక్షులు విజయకుమార్ తిరుమలాపురం, కార్యదర్షి శ్రీనివాస్ మన్నెం, కోషాధికారి దామోదర్ రెడ్డి మాది, సాంస్కృతిక కార్యదర్షి దీప గజవాడ, డైరెక్టర్లు మనోహర్ భొగా, శ్రీనివాస్ చంద్ర, మంగ వాసం, మూర్తి కలగోని, గణేశ్ తెరాల, ట్రస్టీలు సురేశ్ కైరోజు, వేనుగోపాల్ రెడ్డి ఏళ్ల , నవీన్ ఆకుల, ఫౌండర్లు కోటేశ్వరరావు చిత్తలూరి, చంద్ర స్వర్గం, దేవేందర్ రెడ్డి గుజ్జుల, రాజేశ్వర్ ఈద, అథీక్ పాష, ప్రభాకర్ కంబాలపల్లి, కలీముద్దిన్ మొహమ్మద్, అఖిలేశ్ బెజ్జంకి, సంతోష్ గజవాడ, నవీన్ సూదిరెడ్డి, ప్రకాశ్ రెడ్డి చిట్యాలలు ఈ కార్యక్రమం విజయవంతం చేయడంలో తమవంతు కృషి చేశారు. సాంస్కృతిక కార్యదర్షి దీప గజవాడ, ఉపాధ్యక్షులు విజయకుమార్ తిరుమలాపురం ఆధ్వర్యంలో మూడు గంటలపాటు చక్కటి దూంధాం సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ ఉత్సవాలలో తెలంగాణ ఫుడ్ కమీషన్ అధ్యక్షులు తిరుమల్ రెడ్డి కొమ్ముల ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ ఉత్సవాలలో తెలంగాణ కెనడా సంఘం అత్యంత రుచికరమైన భోజనాలను ఏర్పాటు చేసింది. చివరగా ఉపాధ్యక్షులు విజయకుమార్ తిరుమలాపురం వందన సమర్పణతో ఉత్సవాలు ముగిశాయి. -
మలేషియాలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు
కౌలాలంపూర్ : మలేషియా తెలంగాణ అసోసియేషన్ (మైటా) ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఆరవ అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కౌలాలంపూర్‌లో బ్రిక్ ఫీల్డ్స్‌లోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇండియన్ కల్చరల్ సెంటర్ ఈ వేడుకలు ఘనంగా జరిగాయి. తెలంగాణ రాష్ట్ర గీతంతో కార్యక్రమం ప్రారంభించి అనంతరం తెలంగాణ అమర వీరులకు నివాళులర్పించారు. తెలంగాణ సంస్కృతి వెల్లివిరిసేలా పలు సాంస్కృతిక కార్యక్రమాలు, చిన్నారుల ఆట పాటలు ప్రేక్షకులను అలరించాయి. భారీ సంఖ్యలో తెలంగాణ ప్రవాసులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మైటా సుభ్యులందరికి ఫ్యామిలీ స్పోర్ట్స్ డే నిర్వహించారు. దీనిలో భాగంగా మైటా బ్యాడ్మింటన్ స్మాష్ టోర్నమెంట్లను, పిల్లలకు పెద్దలకు పలు ఆటలను ఆడించి ముఖ్య అతిథులుగా హాజరైన తెలుగు ఫౌండేషన్ ప్రెసిడెంట్ దాతో కాంతారావు, టీఆర్ఎస్ మలేషియా ప్రెసిడెంట్ చిట్టి బాబు, ముఖ్య కార్య వర్గ సభ్యుల చేతుల మీదుగా బహుమతులను అందజేశారు. మైటా ప్రెసిడెంట్ సైదం తిరుపతి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ సైదం తిరుపతి, డిప్యూటీ ప్రెసిడెంట్ చొప్పరి సత్య, వైస్ ప్రెసిడెంట్ నరేంద్రనాథ్, జనరల్ సెక్రటరీ రవి చంద్ర, ఉమెన్ వింగ్ ప్రెసిడెంట్ కిరణ్మయి, యూత్ ప్రెసిడెంట్ కార్తీక్, ముఖ్య కార్యవర్గ సభ్యులు సందీప్, మారుతీ, చందు, సందీప్, కిరణ్, ప్రతీక్, రవితేజ, సందీప్ నరేందర్, సంతోష్, స్వప్న, అశ్విత, సాహితి సాయిచరని, అనూష తదితరులు పాల్గొన్నారు. -
టీసీఎస్ఎస్ ఆధ్వర్యంలో ఫ్యామిలీ డే
సింగపూర్ : తెలంగాణ కల్చరల్ సొసైటీ సింగపూర్ (టీసీఎస్ఎస్) ఆధ్వర్యంలో తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిపారు. సింగపూర్ పుంగ్గోల్ పార్క్‌లో జూన్2న ఫ్యామిలీ డే నిర్వహించారు. ఈ ఫ్యామిలీ డే లో భారీగా తెలంగాణ వాసులు పాల్గొన్నారు. తెలంగాణ సంస్కృతిని భావి తరాలకు అందించడానికి టీసీఎస్ఎస్ సభ్యులు వివిధ రకాల సంప్రదాయ ఆటలైన సంచి దుంకుడు, చిర్ర గోనె, చార్ పత్తా మొదలగు ఆటలు ఆడించి బహుమతులు అందజేశారు. అలాగే, తెలంగాణ వంటల పోటీలు నిర్వహించి బహుమతులు అందించారు. ఈ సందర్భంగా టీసీఎస్ఎస్ అధ్యక్షులు నీలం మహేందర్, ప్రధాన కార్యదర్శి బసిక ప్రశాంత్ రెడ్డి, ఉపాధ్యక్షులు, గడప రమేశ్, గర్రేపల్లి శ్రీనివాస్, కోశాధికారి భాస్కర్ గుప్త నల్ల, కార్యనిర్వాహక సభ్యులు ప్రవీణ్ కుమార్ చేన్నోజ్వాల, ప్రాంతీయ కార్యదర్శులు దుర్గ ప్రసాద్. ఎమ్, గార్లపాటి లక్ష్మారెడ్డి, గోనె నరేందర్, గింజల సురేందర్ రెడ్డి, ఇతర కమిటీ సభ్యులు నంగునూరి వెంకట్ రమణ, పెరుకు శివ రామ్ ప్రసాద్, అనుపురం శ్రీనివాస్, కల్వ లక్ష్మణ్ రాజు, బొండుగుల రాము, జూలూరి సంతోష్ కుమార్, నడికట్ల భాస్కర్, రోజారమణి బొడ్ల, కొల్లూరి శ్రీధర్, కరుణాకర్ గుత్తికొండ, ఆవుల శివ ప్రసాద్‌లు మాట్లాడుతూ.. సొసైటీకి సహాయ సహకారాలు అందిస్తున్న సింగపూర్‌లో ఉన్న తెలంగాణ వాసులకు, అందరూ తెలుగు వారికి స్పాన్సర్స్‌కు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి సమన్వయ కర్తలుగా గర్రేపల్లి కస్తూరి, బసిక అనిత రెడ్డి, గోనె నరేందర్, అనుపురం శ్రీనివాస్, ఫణిభూషణ్, విక్రమ్ సంకిరెడ్డిపల్లి, పట్టూరి కిరణ్ కుమార్, టి. రవీందర్‌లు వ్యవహరించారు. -
దేశానికే ఆదర్శం తెలంగాణ
సాక్షి, హైదరాబాద్ : ఐదు ప్రగతి వసంతాలు విజయవంతంగా పూర్తి చేసుకున్న తెలంగాణ రాష్ట్రం, ఆరో వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా ప్రజలకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. మహోద్యమాన్ని సాగించి, సాధించుకున్న తెలంగాణ ప్రగతిపథంలో పరుగులు పెడుతోందని, అన్ని రంగాల్లో దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని సంతోషం వ్యక్తం చేశారు. తొలి ఐదేళ్ల కాలంలో బంగారు తెలంగాణ నిర్మాణానికి బలమైన అడుగులు పడ్డాయన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు, పారదర్శక పాలన అందించడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో చేస్తున్న ప్రయత్నాలలో భాగస్వామ్యం కావాల ని ప్రజలకు పిలుపునిచ్చారు. సంఘటిత శక్తిని ప్రదర్శించి, ఫలితాలు సాధించుకున్న స్వీయానుభవం కలిగిన తెలంగాణ సమాజం, అదే స్ఫూర్తితో నిర్ధేశిత లక్ష్యాలను సాధించగలుగుతుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. స్వరాష్ట్రం కోసం తమ ప్రాణాలను బలిపెట్టిన అమరవీరులకు సీఎం నివాళులు అర్పించారు. -
అవతరణ వేడుకలకు ఏర్పాట్లు షురూ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఆవిర్భవ దినోత్సవ వేడుకలకు రాష్ట్రం ముస్తాబవుతోంది. జూన్ 2న రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాలు జరుగనున్న విషయం తెలిసిందే. దీని కోసం రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ నేతృత్వంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం పబ్లిక్ గార్డెన్‌లోని జూబ్లీహాల్ ఎదురుగా ఉన్న గార్డెన్‌ను మంత్రి పరిశీలించారు. అవతరణ వేడుకల ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఆంద్రప్రదేశ్ ఏర్పడి నాడు ఎక్కడైతే వేడుకలు జరిగాయో అక్కడే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలు జరగాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. ‘‘ చరిత్రలో నిచిపోయే విధంగా ఆవిర్భావ వేడుకలు జరపాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఆనాటి ఆంద్రప్రదేశ్ ఏర్పడిన నాడు జూబ్లీహిల్స్ పరిసరాల్లో ఉత్సవాలు జరిపారు. ఆనాటి నిజాం తెలంగాణ ప్రజల చెమట రక్తంతో కట్టిన ఆనవాళ్ళు జూబ్లీహాల్ పరిసరాల్లో ఉన్నాయి. వాటన్నింటిని మర్చిపోయే విధంగా వేడుకలు జరగాలి. కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులు తెలంగాణ ప్రజలకు అందబోతున్నాయి. అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రజలు అందుతున్నాయి.. ప్రతి ఆవిర్భావం దినోత్సవానికి అనేక పథకాలను ప్రజలకు చేరుస్తున్నాం.’’ అని వ్యాఖ్యానించారు. -
న్యూజిల్యాండ్‌లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు
ఆక్లాండ్ : తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ న్యూజిల్యాండ్(టీఏఎన్జెడ్) ఆధ్వర్యంలో ఆక్లాండ్‌లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముఖ్య అతిథిగా హాజరైన కాన్సుల్ ఆఫ్ ఇండియా భాన్ ధిలాన్ తెలంగాణ వాసులకు రాష్ట్ర ఆవిర్భావదినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. వివిధ రాష్ట్రాలకు చెందిన వారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం భిన్నత్వంలో ఏకత్వానికి నిదర్శనమని, ఇదే భారతదేశ ప్రత్యేకత అని చెప్పారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం, భాష, యాస, సంస్కృతులకు తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ న్యూజిల్యాండ్ వేదిక అని టీఏఎన్జెడ్ ప్రెసిడెంట్ కళ్యాణ్ రావు కాసుగంటి తెలిపారు. ఎన్నో కష్టాలు పడి తెచ్చుకున్న తెలంగాణను బంగారు తెలంగాణగా రూపుదిద్దాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని టీఏఎన్జెడ్ వైస్ ప్రెసిడెంట్ ఉమా సల్వాజి పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో కవులు, కళాకారులు తమ ఉత్తేజకరమైన రచనలు, పాటలతో ప్రజలను చైతన్యవంతులను చేసి ఉద్యమానికి ఊపిరి పోసారన్నారు. ఈ కార్యక్రమంలో రూబి దిలాన్, టీఏఎన్జెడ్ వైస్ ప్రెసిడెంట్ రామ్మోహన్ దంతాల, జనరల్ సెక్రటరీ సురేందర్ రెడ్డి అడవల్లి, ట్రెజరర్ వినోద్ రావు ఎర్రబెల్లి, జాయింట్ సెక్రటరీ విజేతారావు యాచమనేని, ఎగ్జిక్యూటివ్ అండ్ అడ్వైజరీ కమిటీ సభ్యులు ప్రసన్న కుమార్, లక్ష్మణ్ రెడ్డి కలకుంట్ల, రాంరెడ్డి తాటిపర్తి, శ్రీహరి రావు బండ, లక్ష్మినర్సింహరావు పట్లోరి, జగన్ రెడ్డి వడ్నాల, వెంకట నర్సింహారావు పుప్పాల, నరేందర్ రెడ్డి పట్లోల, రామారావు రాచకొండ, శ్రీనివాస్ పానుగంటి, అరుణ్ ప్రకాశ్ గంగాపురి, సుశాంతి, కృష్ణా రెడ్డి ఆరెపల్లి, రమా సల్వాజి, రాధిక పల్లె, సువర్ణా కాసుగంటి, లక్ష్మీ కాసుగంటి, డా. సరళ, డా. ప్రీతమ్, డా. మోహన్ రెడ్డి బీరపు, మురళీ రంగు, సునీతా కొస్న, విజయ్ కొన్న, అభిలాష్ యాచమనేని, కిరణ్, కీర్తన, వర్ష, గ్రీష్మ, అతిర, రాధిక, అవంతిక శ్రీజలతో పాటూ పెద్దమొత్తంలో ఎన్ఆర్ఐలు హజరయ్యారు. -
డెన్మార్క్‌లో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు
కొపెన్‌హెగెన్ : తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ డెన్మార్క్ (టాడ్) ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలను తెలంగాణ సాంస్కృతిక సంబరాల పేరిట ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముందుగా తెలంగాణ అమరవీరులకు ఘనంగా నివాళులు అర్పించారు. సంస్కృతిక కార్యక్రమాలతో పాటూ బోర్డు సభ్యులు చేసిన నాటిక అందరిని ఆకట్టుకుంది. డెన్మార్క్‌లోని ప్రముఖ గాయని నబనిత పాడిన పాటలు అతిథులను అలరించాయి. తెలంగాణ ఆవిర్భావ వేడుకలను ప్రతి సంవత్సరం నిర్వహించే ఏకైక అసోసియేషన్ టాడ్ అని అధ్యక్షుడు సామ సతీష్ రెడ్డి కొనియాడారు. తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ డెన్మార్క్ తెలంగాణ పండగలతో పాటూ, డెన్మార్క్‌లోని భారతీయులు ఎదుర్కొంటున్న ఇమిగ్రేషన్ సమస్యలపై నిత్యం స్పందిస్తూ అందరి ఆదరణ పొందిందన్నారు. ఈ కార్యక్రమంలో టాడ్ బోర్డు సభ్యులు సంగమేశ్వర్ రెడ్డి, రమేష్ పగిల్ల, జయచందర్ రెడ్డి, వెంకటేష్, రాజారెడ్డి, దాము లట్టుపల్లి, రంజిత్, జగదీష్, ఉపేందర్, శివ సాగర్, రఘు, కరుణాకర్, రాజు ముచంతుల, వాసు, నర్మద, ఉష, ప్రీమియం సభ్యుల సహకారంతో నిర్వహించారు. -
మలేషియాలో తెలంగాణా అవతరణ దినోత్సవ వేడుకలు
కౌలాలంపూర్ : తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు కౌలాలంపూర్‌లో లిటిల్ ఇండియాలోని ఎస్ఎమ్కే లా సల్లే స్కూల్ బ్రిక్ ఫీల్డ్స్‌లో మలేషియా తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. తెలంగాణ అమర వీరులకు నివాళులర్పించి తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో తెలంగాణ వాసులు పాల్గొన్నారు. తెలంగాణ సంస్కృతి వెల్లివిరిసేలా పలు సాంస్కృతిక కార్యక్రమాలు, చిన్నారుల ఆటా పాటలు ప్రేక్షకులను అలరించాయి. ఈ కార్యక్రమంలో భాగంగా మలేషియా తెలంగాణ అసోసియేషన్ సుభ్యులందరికి ఫ్యామిలీ స్పోర్ట్స్ డే నిర్వహించారు . ఈ స్పోర్ట్స్ డే లో పిల్లలను, పెద్దలను పలు ఆటలు ఆడించి బహుమతులను ముఖ్య అతిథులుగా హాజరయిన టీఏఎం ప్రెసిడెంట్ డా. అచ్చయ్య కుమార్, కాంతారావు చేతుల మీదుగా అందజేశారు. ఈ సారి రాష్ట అవతరణ దినోత్సవం రంజాన్ మాసములో వచ్చిన సందర్బంగా మతాలకు అతీతంగా ముస్లిం సోదరులకు ప్రత్యేకంగా ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. మలేషియా తెలంగాణ అసోసియేషన్ ప్రెసిడెంట్ సైదం తిరుపతి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన కమిటీ సభ్యులందరికి, తెలంగాణ సంస్కృతి వెల్లివిరిసేలా అడి పాడిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఇఫ్తార్ వింధులో పాల్గొన్న ముస్లిం సోదరులందరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసారు. ఈ విందు హిందూ ముస్లిం ల మధ్య ఐక్యతను మరింత పెంచుతుందని అయన అన్నారు. ఈ కార్యక్రమం లో మలేషియా తెలంగాణ అసోసియేషన్ ప్రెసిడెంట్ సైదం తిరుపతి, వైస్ ప్రెసిడెంట్ సోపరి సత్య, ముఖ్య కార్య వర్గ సభ్యులు కనుమూరి రవి వర్మ, చిట్టి బాబు చిరుత, బూరెడ్డి మోహన్ రెడ్డి, గడ్డం రవీందర్ రెడ్డి, రమణ, రవి చంద్ర, కృష్ణ ముత్తినేని, కిరణ్మయి, మారుతీ కుర్మ, రవి ప్రసాద్ రెడ్డి, వీరవెల్లి నరేంద్ర, సత్యనారాయ రావు, అశోక్ మార్క, రాములు, అజయ్ కుమార్ గోలి, చందు, కిరణ్ గౌడ్, కార్తీక్, వెంకటేష్, నరేందర్, రవితేజ, సంతోష్,రాజీవ్ తదితరులు పాల్గొన్నారు.